పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఆమె నవ్వు గురించి కొట్టం రామకృష్ణారెడ్డి అభిప్రాయం:

    12/17/2020 7:40 pm

    చాలా రోజులయ్యింది మంచి కథలు చదివి. ‘పూర్ణ’ ఆ లోటు తీర్చింది. లోతైన కథని ఇంకో రెండుమూడు సార్లు చదివితేనే అనిల్‍కు అర్థమవుతుంది.

  2. మాయలాంటి మనం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/17/2020 7:28 pm

    కుమిలిపోయే తల్లిగుండె, జన్మలే నిజమైతే అన్న అనాది ఆశ. బావుంది అనడం సముచితం కాదు కదా.

  3. లీలా లీలా… గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/17/2020 7:24 pm

    దగ్గరివాళ్ళు దూరం సుదూరం అయితే గుండె గుండెల్లోంచి వచ్చే వేదన… దానికి సముచిత వ్యక్తీకరణ.

  4. కిక్ గురించి Veeren అభిప్రాయం:

    12/16/2020 10:20 pm

    Good. Would have been great if edited by 50%. Argument about Instant justice is excellent.

  5. కిక్ గురించి మోహన్ బాబు అభిప్రాయం:

    12/16/2020 9:24 pm

    ఇంస్టాన్ట్ట్ జస్టిస్ ల కాలం లోకి వచ్చేసాం. దీని పర్యవసానాలు మాములుగా ఉండవు. కమ్ముకున్న తుఫాన్ లు విధ్వంసం చేయక మానవు.

  6. కవిత్వం: దోహదక్రియలు గురించి Lyla yerneni అభిప్రాయం:

    12/13/2020 11:11 am

    ఈ వ్యాసం చదువుకోవటం ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. ఇందులోని పద్యాలు సుందరతలో ఒకటిని మించి ఒకటి ఉన్నాయి.
    వ్యాసం లోని విషయం చదివాక – నేను పూర్వం వ్రాసిన క్రింది పదాలలో ఒకటి కాదు, రెండు ‘దోహద క్రియలు’ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ప్రాచీన సాహితీవేత్తలచే ఆమోదింపబడిన కవితా ప్రక్రియలు ఉన్నాక, నేను రచించింది కవిత్వమే కదా! కాకపోవటం ఎలా?

    Temptress

    గులాబిని చుంబించి
    ఆఘ్రాణించి
    దీర్ఘ నిశ్వాసం విడిస్తే,
    ఒక చుట్టు రేకులు విప్పింది
    ఆశ్చర్యంతో
    మళ్లీ వాసన పీల్చి వదిలాను
    మరో వరస రేకులు విప్పింది
    ప్రతి సారీ అంతటి అందమైన
    ప్రతిచర్యలకు
    చకితనై, పులకితనై
    అర్ధనిమీలిత నేత్రనై
    ఓహో! స్వైరిణీ! అని
    నడిబొడ్డున ముద్దిచ్చి
    చేతిలో పువ్వుతో
    నూర్జహాన్ లా నిలిచాను.

    Have a nice day! -Lyla

  7. తెరుచుకోవు గురించి G Madhu Babu అభిప్రాయం:

    12/10/2020 9:55 am

    Very nice Padma. All the best, keep it up.

  8. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Prasad Palakurthi అభిప్రాయం:

    12/10/2020 4:21 am

    మీ పక్కనే ఉండి దుబాయ్ చూస్తున్న ఫీలింగ్.
    మీ రచన ఆద్యంతం చదివించేలా ఉంది. పైసా ఖర్చు లేకుండానే దుబాయ్ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. మిగతా భాగాలు తొందర్లోనే చదవాలి, థాంక్ యు సార్.

  9. గడినుడి – 49 సమాధానాలు గురించి Bondada Mani Nagendra Rao అభిప్రాయం:

    12/09/2020 10:03 pm

    నేను పంపిన సమాధానాల్లో ఒకటే తప్పు వున్నదనుకుంటాను. నేను 43 నిలువు లో ‘రామ్మా’ అని రాశాను. మీరు ‘అమ్మా’ అన్నారు. సరైనదే. కానీ నాకు వచ్చిన రిప్లై లో 5 కంటే ఎక్కువ తప్పులున్నట్టుగా చెప్పారు. నాకు అర్ధం కాలేదు. ఒకే తప్పు వుంది అనివుంటే మరో ప్రయత్నం చేసివుండును. క్విజ్ మాత్రం చాలా బాగుంది.

    [మీ సమాధానాల్లో చాలా దీర్ఘాలు పోయాయి. చుట్టూపక్కల- అన్న పాటకు మీరు చుట్టుపక్కల అని రాసారు. మీరు నవంబర్ 8న పంపిన సమాధానంలో ఎనమిది గడుల్లో తప్పులు ఉన్నాయని చూపుతోంది. — సం. ]

  10. తెరుచుకోవు గురించి D Venkata sujatha అభిప్రాయం:

    12/08/2020 10:09 am

    Very nice . Always some personal issues can not share to anybody. Inside our heart only. Very neatly expressed in above Kavitha.