పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. A Solemn Vedic Wedding గురించి desikachary అభిప్రాయం:

    01/01/2021 8:11 pm

    దోషభూయిష్ఠంగా పేర్కొన్న మంత్రాలతో, సంస్కృతజ్ఞానం లేకుండా వ్రాసిన నిరర్థకమైన వ్రాత.

  2. అ దృశ్యం గురించి Dheeraj Vemuganti అభిప్రాయం:

    01/01/2021 11:41 am

    ‘వ్యూహాత్మక దుర్మార్గం’ – చాలా నచ్చింది ఈ వాడుక.

    ‘నా నేపథ్యం తెలిస్తే నన్ను అర్థం చేసుకోగలవా? మనిషి లోపలి పొరల్లో ఏమి జరుగుతుందో నీకెలా తెలుస్తుంది?’ – ఎలా పట్టారు దీనిని? how true!

    ‘నాకు దేనిపైన అభ్యంతరం లేదు, అలాంటి చిన్న ఉత్సాహాల కోసం అతనితో జీవితాంతం ఉండడం కష్టం’ – such an intimate look into the character!

    ఇంకా చాలా నచ్చాయ్. మొత్తం నచ్చింది.

    Thanks for writing!

  3. నలభై గురించి v.srinivasarao అభిప్రాయం:

    01/01/2021 10:25 am

    భలే బాగా వ్రాస్తారండీ మీరు, ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తోంది.

  4. దేవగిరి గురించి Dr. M Ramesh Babu అభిప్రాయం:

    12/31/2020 10:26 am

    కథనం బాగుంది, దేవగిరి కోట ఇప్పటికీ ప్రాభవాన్ని కోల్పోలేదని విన్నాం.

  5. ఆమె నవ్వు గురించి sudha అభిప్రాయం:

    12/29/2020 4:17 pm

    ధన్యవాదాలు రామయ్య గారు మీ అమూల్యమైన అభిప్రాయానికి ….

  6. అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ గురించి వీరభద్రం అభిప్రాయం:

    12/29/2020 1:21 am

    ఇలాంటి వ్యాసం చదవగలగటం నా అదృష్టం.పోతన భాగవతంలోని ఒక యాభై పద్యాలనెంచి,వాటికి చక్కని వ్యాఖ్యను “మందార మకరందాల”ను పేర,సినారె గారు వ్రాసారు కదా!.అలాంటి ప్రయత్నం ఆంధ్రభారతం మీద జరిగిందో,లేదో నాకు తెలియదు. మీబోటి వారు కవిత్రయం వారి భారత సంహిత నుంచి ఇలాగే చక్కటి పద్యాలనెన్నుకుని వాటికి మీ వ్యాఖ్య జోడించి వ్రాస్తే, చదువరులకు ఉపయోగకరంగా ఉంటుంది.

  7. ఆమె నవ్వు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/27/2020 6:02 am

    ఆమె ( మరణించిన అనిల్ భార్య ), వంట మనిషిగా “ఆమె” ఇంటచేర్చిన ఓ అనామకురాలు చిన్నవయసు పూర్ణ, నలభై ఏళ్ల అనిల్, పూర్ణ ఇల్లు వదిలివెళ్లిపోతే తిండి కూడా తినకుండా విశ్వాసం ప్రకటిస్తూ కాలు కాలిన పిల్లిలా తిరిగే రామం ( పిల్లి )…

    తనతో బతికే మనిషిని ( భార్యని కానీ, వంటమనిషి పూర్ణని కాని ) సాటి మనిషిగా పట్టించుకోని నిర్లక్ష్యం …
    తన ప్రవర్తనని ప్రశ్నిస్తున్నట్టుగా ఆమె చూసే సూటిచూపు భయపెట్టడం… ఆమెని (భార్యని) తక్కువ చేసి చూడాలనే ప్రతి ప్రయత్నంలో తను పాతాళంలో ఉన్నట్లు అనిపించటం…

    ద్వేషం, ప్రేమ, బాధ, భక్తి ఏదో ఒకటి ఆమెని చుట్టుకొని ఉంటాయెందుకో? మళ్ళీ తిరిగిరాలేనంత దూరం ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా బాధ పడటానికి అహమే అడ్డొస్తుంది…

    ఆమె ( మరణించిన భార్య ) ఇవ్వలేనిది, పూడ్చలేనిది… పూర్ణ, రామం చేసినా వాళ్ళని తనవాళ్లనుకొనేదానికి అనిల్ మనసు ఒప్పుకోదు. వాళ్ళకి దిక్కులేక వచ్చారనే అనిల్ అహం తొలుస్తుంటుంది; అహమే అన్నిటికి యజమాని అనుకుంటూ.

    ఎక్కడెక్కడో తిరిగి దిక్కులేక నిండు గర్భిణీ స్త్రీగా తిరిగి వచ్చిన వంట మనిషి పూర్ణకి మళ్లీ ఆశ్రయం ఇచ్చి, లోకం ఏమనుకుంటుందో ఏమో అని వెరవకుండా ఆశ్రయం ఇచ్చి, పూర్ణ అడుగులతో ఇల్లు ఇల్లులా ఉంటున్నది.. ఖాళీతనమంతా దేనితోనో నిండుతున్నట్లుగా భావించడం అనిల్ మానసిక పరివర్తనకి సూచిక.

    పూర్ణ ప్రసవించిన పాప విచ్చుకున్న గుప్పిళ్లు, చికిలించి వెలుగుని చూస్తున్న కళ్లు, లేత పెదాలపై ఉదయిస్తున్న రహస్య భాష నవ్వు లో ఆమెని (భార్య ) చూడగలిగిన అనిల్ … హాస్పిటల్ లోని పురుళ్ల వార్డ్ నర్స్ అడిగిన మీదట… పాప పుట్టుక, తల్లిదండ్రుల వివరాలు ఫామ్‌లో ( బర్త్ సర్టిఫికేట్ ‌లో ) రాస్తూ ( తల్లిగా పూర్ణ, తండ్రిగా తన పేరు రాస్తూ ) ఇలాంటి నిర్ణయాలను కేవలం సమయం మాత్రమే నిర్ణయిస్తుంది అనుకోవడం అనిల్ మానసిక పరిణితికి సూచిక.

    అధికారం, కనికరించడం, కొంచెం గర్వం చూపిస్తూ… తనవారి పట్ల విశ్వాసహీనుడినా అనే సందేహాలు… ఏదో తృప్తి, ఎందుకో చాలా అసంతృప్తి. సుఖమెంత దుఃఖమో అనే విరక్తి… లోపలింత శూన్యతెందుకు అనే నైరాశ్యం లాంటి మానసిక రుగ్మతలు, వైకల్యాల నుండి విముక్తుడై ‘నిన్ను కనిపెట్టుకొని తోడుగా ఉండే మనిషికన్నా ఇప్పడు నీకేమి కావాలి? అన్న భార్య హితవుని అర్ధం చేసుకుని జీవితంలో ఉత్తమోత్తమమైన స్థాయికి అనిల్ చేరుకునేలా చెయ్యడమే చనిపోయిన భార్య “ఆమె నవ్వు”… లేత పెదాలపై ఉదయిస్తున్న రహస్య భాష లాంటి అప్పుడే పుట్టిన “పాప నవ్వు” సాధించిన విజయం.

  8. లీలా లీలా… గురించి Srinivas Banda అభిప్రాయం:

    12/22/2020 8:26 am

    సరిగ్గా అర్థం చేసుకున్నారు. ధన్యవాదాలు!

  9. ఆమె నవ్వు గురించి sudha అభిప్రాయం:

    12/20/2020 4:19 pm

    ధన్యవాదాలు Ramakrishna Reddy గారు

  10. ప్రస్తుత తెలుగు కథ – ఒక జీవన కఠోర వాస్తవం గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    12/20/2020 3:34 pm

    వద్దు వద్దు ఈ కధలు చదవనే వద్దు. చదివితే హృదయమున్న ప్రతి జీవి రోజుల తరబడి దుఃఖంతో కుమిలి పోతాడు. అయ్యో ఇన్నాళ్లు వీటిని పట్టించుకోకుండా కుక్కబతుకు బతుకుతున్నానే అని కుమిలిపోతాడు. తనను తాను చెప్పుతో కొట్టుకుంటాడు. ఈ వ్యవస్థని మార్చలేను అని క్రోధం తెచ్చుకుంటాడు. చివరకి చాలామంది పైసామే పరమాత్మహై అని వేదాంతం చెప్పుకుని మళ్ళీ డబ్బు సంపాదనలో పడిపోతారు అంతే అంటే మరంతే. ఇది ఆధునికపు దుష్ట చరిత్ర.