పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మంటో కథలు: వంకర గీత గురించి Srinivas Banda అభిప్రాయం:

    01/15/2021 9:12 am

    ‘అనువాదం అంటే ఇలా ఉండాలి’ అనిపించింది చాలావరకూ. అక్కడక్కడ కొంచెం deviate అయినట్లున్నప్పటికీ! మంటో కథల్లో ఉండే ఆత్మని చాలా వరకూ చెదరకుండా పట్టుకోగలిగారు! Thank you!

  2. ఒక అల్ట్రా ఫిజూల్ కథ గురించి Srinivas Banda అభిప్రాయం:

    01/15/2021 8:26 am

    పైగా కథని క్రికెట్ పిచ్ మీద ఆడించడం ఆషామాషీ అంతకంటే కాదు!

  3. A Solemn Vedic Wedding గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    01/11/2021 2:56 pm

    నేను రాసిన Vedic Wedding పై శ్రీ కృష్ణదేశికాచారిగారు పెట్టిన మొట్టమొదటి కామెంటుకి నేను సంజాయిషీ ఇచ్చాను. ఆతరువాత ఆయన, నేను రాసిన మంత్రాలలో, శ్లోకాలలో దొర్లిన తప్పులు క్రోడికరిస్తూ శ్రీ కొలిచాల సురేశ్‌కి టపా పంపించారు. శ్రీ సురేశ్‌ ఆ టపా ఉన్నదున్నట్టుగా, యథాతథంగా నాకు పంపారు. అందుకు కృతజ్ఞుణ్ణి. ఆ టపా చూడగానే, మొట్టమొదట నా గుండె ఆగినంత పని అయ్యింది. నా వ్యాసంలో “తప్పులు” ఎర్ర రంగులో ఉండబట్టి నాకు లెక్కపెట్టడం తేలికయ్యింది. మొత్తం మీద డెబ్బది పైచిలుకు “తప్పులు” లెక్కించాను. నిజం చెప్పద్దూ! కించిత్ భయం కూడా వేసింది. ఈ రొంపిలోకి నేనెందుకు దిగానురా అనిపించింది. (అయినా, నాలో రాక్షసాంశ మస్తుగా వుంది కాబట్టి తేరుకొని సరిపెట్టుకున్నాను!)

    కొంచెం జాగ్రత్తగా చూసిన తరువాత, ఆ తప్పులు, కేవలం మకార అనుస్వరాలకు సంబంధించినవి, అవి రెండు వ్యాకరణ సూత్రాలకు పరిమితమైనవి, అని తెలిసి కుదుటపడ్డాను. నేను శ్రీ దేశికాచారిగారితో ఈ విషయంపై సుమారు రెండు గంటలు మాట్లాడాను. ఆయన ఎంతో ఓపికగా నాకు సమాధానాలు ఇచ్చారు. అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

    ఆ రెండు వ్యాకరణ సూత్రాలూ కింద ఇస్తున్నాను. (ఇవి శ్రీ దేశికాచారిగారి టపానుంచి కాపీ చేస్తున్నాను.)

    1. పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును.

    2. అపదాంతములైన నకార, మకారములకు ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ తప్ప ఇతరహల్లులు పరమైనపుడు అనుస్వారము (సున్నా) వచ్చును.

    మొదటి సూత్రం: ఒక మాట చివర మకారమునకు హల్లు పరమైతే, ఆ మకారము సున్నా గారాయాలి. వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.

    రెండవ సూత్రం: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది.

    ఉదాహరణకి, నేను రాసిన ఉపనిషత్తు మంత్రం చూడండి. అందులో తమీశ్వరాణామ్ అని నేను రాసిన (మొదటి ప్రార్థనలో) ణామ్‌ వ్యాకరణం ప్రకారం తప్పు. దానిని ణాం అని రాయాలి. అదే మంత్రంలో, రెండవలైనులో, పరమం చ దైవతమ్‌ అని ఉన్నది. ఇది వాక్యాంతం కాబట్టి, ఇక్కడ మకారము సున్నా కాదు.

    అయితే ఒక్క విషయం. ఈ మంత్రం వల్లించేటప్పుడు, ఈ మకార, అనుస్వరాలలో తేడాలు తెలుస్తాయా, కనిపిస్తాయా అని సహృదయులైన నవీన పాఠకులు ప్రశ్నించవచ్చు. అట్లా ప్రశ్నించడం సమంజసమో కాదో నాకు తెలియదు. నామటుకు నాకు, వ్యాకరణంతప్పయినా, కరణం తప్పయినా తప్పు తప్పే! period. ఈమాట సంపాదకులు నాకు preview పంపినప్పుడు, రోమను స్క్రిప్ట్‌ చూసి అంతా బాగానే వుంది; అడక్కండానే రోమను స్క్రిప్ట్ లోకి కూడా మార్చారని గొప్పగా సంతోషించాను కాని, ఒళ్ళు దగ్గిరపెట్టుకొని నేను పంపిన ప్రతితో పోల్చి చూడలేదు. బద్ధకం. అది నా తప్పు. ఈ వ్యాకరణం తప్పులు ఎలా దొర్లాయి అని తర్జన భర్జన చేశాం. ఇవి బహుశా, రోమను స్క్రిప్ట్‌ నుంచి మళ్ళీ తెలుగులోకి రాయటంవలన వచ్చి వుండవచ్చునేమోనని సర్దుకున్నాను.

    పోతే, శ్రీ దేశికాచారిగారు కొన్ని అచ్చుతప్పులు కూడా సవరించిన ప్రతి నాకు పంపించారు. దానిని సురేశ్‌ గారికి, మాధవ్‌ గారికీ పంపిస్తున్నాను. దయచేసి, వ్యాకరణ దోషాల సవరణ తోపాటు, అచ్చు తప్పులుకూడా సరి చేయమని వారిని కోరుతున్నాను.

    Begin Side Bar:

    I have to tell a story in regard to మ్‌ and సున్న. I have written about this in 1997 (Telusaa), 2006 (Racchabanda), and in 2017 in the Facebook.

    భవభూతి రాసిన ఉత్తరరామచరిత నాటకంలోని ఈ కింది శ్లోకం సంప్రదాయ సంస్కృత సాహిత్యంలో అతి చక్కని ప్రేమ కవిత అని అటు తూర్పున, ఇటుపడమరనా సాహితీ వేత్తలందరూ చెప్పుతారు.

    కిమపి కిమపి మందం మందమాసక్తియోగా-
    దవిరలితకపోలం జల్పతోరక్రమేణా |
    అశిథిల పరిరంభ వ్యాప్రతైకైకదోషనో—
    రవిదితగతయామా రాతిర్‌ ఏవ వ్యరంసీత్ | I.27

    భవభూతి (బహుశా ఎనిమిదవ శతాబ్దం) తన ఉత్తర రామ చరిత కావ్యాన్ని కాళిదాసుకి (బహుశా నాలుగవ శతాబ్దం) ఒక దూత ద్వారా వినిపించాడట! (ఇది చాటు కథ!)ఆ సమయంలో కాళిదాసు చదరంగం ఆడుతున్నాడట. ఆ దూత భవభూతి దగ్గిరకి తిరిగి రాగానే భవభూతి, ‘కాళిదాసు ఏమన్నాడు?’ అని ఆతృతగా అడిగాడట. ‘ఏమీ అనలేదు,’ అని దూత సమాధానం. ‘మొత్తం కావ్యం అంతా విని ఏమీ అనలేదా?’ అని భవభూతి రెట్టించి మరీ అడిగాడట.

    దానికి దూత సమాధానం: ‘కాళిదాసుగారు చదరంగం ఆడుతున్నారు. ఆ చదరంగం ఆట మధ్యలో ఒక పరిచారిక కాళిదాసుకి తమలపాకులు, వక్క, సున్నం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ తాంబూలం వేసికొని, హుఁ! సున్నం ఎక్కువయ్యింది! అన్నాడు, అంతే!’

    భవభూతి ఈ పై శ్లోకంలో ఆఖరి పాదంలో ‘ ఏవం వ్యరంసీత్‌’ అని రాసి ఉండాలి. వెంటనే ఏవం లో సున్న (nasal) తీసిపారేసి ‘ఏవ వ్యరంసీత్‌’ అని మార్చాడట.

    తమాషా ఏమిటంటే, తెలుగులో సున్న, సంస్కృతంలో మకారప్పొల్లు. ఇక్కడ కాళిదాసుగారిని, భవభూతిగారినీ పదహారణాల తెలుగు వాళ్ళని చేసుకున్నాం. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట ఈ శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్టుగా భవభూతికి అర్థం అయ్యింది.

    Merwin, Massonలు Sanskrit Love Poetry అన్న సంకలనంలో చెప్పిన కథలో భవభూతే కాళిదాసుకి ఉత్తరరామచరిత అంతా చదివి వినిపించాడని, కాళిదాసు అంతా విని, మొత్తం కావ్యంలో ఒకే ఒక్క శ్లోకంలో ఒక్క మకారపు పొల్లు ఎక్కువయ్యింది అన్నాడని ఉంది.

    ఒక్క మాట కవితార్థాన్ని ఎంత పల్చబడేట్టు చెయ్యగలదో, సంస్కృతం క్షుణ్ణంగా వచ్చిన వాళ్ళకి తెలియచ్చు. రాతిర్‌ ఏవమ్‌ వ్యరంసీత్, అంటే the night has passed in this way అని అర్థం. దాని బదులు రాతిర్‌ ఏవ వ్యరంసీత్, అంటే, only the night disappeared, (but the rest of it continued) అని భావం.

    End Side Bar.

    ఆఖరిగా నా సంజాయిషీ:

    కవిత్వభాషలో ఒక్క అక్షరం అర్థం, అలంకారం మార్చివేయచ్చు. రాసిన మంత్రాలు వల్లించడంలో ఆ తేడా కనిపిస్తుందా? నేను క్లుప్తంగా రాసిన వేదసంప్రదాయ వివాహ పద్ధతి, పాశ్చాత్యదేశాల్లో (ముఖ్యంగా అమెరికా ఖండంలో) స్థిరపడ్డ మన వాళ్ళకోసం. అందుకని, సాధ్యమైనంతవరకూ, ఇంగ్లీషులో భావం ఇవ్వడం జరిగింది. తెలుగులో ప్రతిపదార్థాలు, తాత్పర్యాలూ, వ్యాఖ్యలూ కావాలనుకుంటే, ఉపనిషత్తు మంత్రాలకి, శ్రీ నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు గారి ఉపనిషద్దర్శనం – 4, పెళ్ళి మంత్రాలకి, శ్రీ చల్లా లక్ష్మీ నరసింహశాస్త్రి గారి పుస్తకం లోనూ చూడవచ్చు.

    భవదీయుడు,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  4. భరతఖండం: పలకలపై పయనం గురించి Arif అభిప్రాయం:

    01/11/2021 10:12 am

    చాల అద్భుతమైన వ్యాసం. ప్రింట్ తీయించి పదే పదే చదవాలని అనిపిస్తుంది. ధన్యవాదాలు.

  5. నలభై గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    01/11/2021 8:19 am

    Sri Raji Reddi:

    It ain’t what you say; it’s how you say makes a world of difference. Anything you pen is adorable. That is the difference between you and a lot of us! Keep telling your autobiography. If I can, I would like to ape you.

    Best wishes.

    Veluri Venkateswara Rao

  6. నాకు నచ్చిన పద్యం: పినవీరుని పద్యరచనలో గుబాళింపు గురించి ఉష అభిప్రాయం:

    01/10/2021 8:51 pm

    అతి చక్కని వివరణ ఇచ్చారు

  7. A Solemn Vedic Wedding గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    01/10/2021 8:05 am

    సంస్కృత శ్లోకాలను తెలుగు లిపిలో వ్రాయడం మినహా అంతా ఇంగ్లీషులోనే ఉంది. వాటికి అర్థాలను తెలుగులో ఎందుకు ఇవ్వలేదో?

  8. దోసిట్లో నక్షత్రాలు గురించి ప్రసన్న మద్దిరాల అభిప్రాయం:

    01/10/2021 3:33 am

    అప్పటికే ప్రేమ అప్పటికే ఒంటరితనం… మనసు లోతులు బాగా కొలిచారు. ధన్యవాదాలు సుబ్రమణ్యం గారు. యాత్రికంగా అన్ని పెద్ద చదువులు చదుతూ… ఇంత హృద్యంగా ఎలా సాధ్యమైంది మీకు?

  9. ఒక అల్ట్రా ఫిజూల్ కథ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    01/09/2021 8:44 pm

    ‘రాదు కాదు లేదు అంటూ కథంతా చెప్పడం మాటలు కాదు’.

  10. A Solemn Vedic Wedding గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/09/2021 10:35 am

    హిందూ వివాహం, వైదిక సాంప్రదాయ పెళ్లి మంత్రాలు గురించి తమ అనుభవాన్ని మనతో పంచుకున్న పెద్దలు శ్రీ వేలూరి వేంకటేశ్వర రావుగారికి నమస్సులు.

    డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు గారి పూర్వప్రయోగచంద్రిక పుస్తకం ఎమెస్కో బుక్స్ వారి వద్ద లభ్యం.