పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. అ సత్యం గురించి sudha అభిప్రాయం:

    02/08/2021 9:24 pm

    ధన్యవాదాలు అమరేంద్ర దాసరి గారు, భాస్కర్ గారు, ఉమ గారు కథ మీద మీ అభిప్రాయాలు చాల విలువైనవి …

  2. చక్కని తండ్రికి చాంగుభళా! గురించి Vijaya Karra అభిప్రాయం:

    02/07/2021 5:13 pm

    Sri, BVMK, Satyanarayanamma గారు – మీ అందరికీ కథ నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు!

  3. అ సత్యం గురించి uma అభిప్రాయం:

    02/07/2021 5:02 pm

    భాష మొత్తం ఒక ప్రవాహంలా సాగింది. మంచి ఎడిటింగ్. కథలో పాత్రలను పరిచయం లేకుండా పాఠకులకు వదిలేయడం బావుంది. ఈ కథ పజిల్‍ని సాల్వ్ చేయడంలా ఉంది. అది పాఠకులని కథలోపలికి తీసుకెళ్లేందుకు ఉపకరిస్తుంది. గాంధీగారి సత్య శోధన తీసుకోవడం ధైర్యంగా పరిగణనలోకి తీసుకున్న విషయం. పార్వతమ్మ పాత్ర సమాజాన్ని ప్రశ్నిస్తుందా, సత్యాన్ని అసత్యంతో శోధించలేమా? అన్న ఆలోచింపచేసే ప్రశ్నగా వదిలేయడం, కొంత భయంగొలిపే విషయం…

    మొత్తానికి ఈ కథ నాకు చాలా నచ్చింది. రచయిత సుధకి అభినందనలు.

  4. డివైన్ కామెడీ: దాన్తె అలిగ్యేరి గురించి B satyanarayana అభిప్రాయం:

    02/07/2021 5:25 am

    అయ్యా, ఈ వ్యాసం “ఇంకా ఉంది” అనుకొంటున్నాను.

  5. కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    02/07/2021 2:10 am

    కేతన ఆంధ్రభాషాభూషణంపై వ్యాసపరంపరకు మంచి ప్రారంభం. రెండు మూడు విషయాలు:

    1. “అందువల్ల తెలుగు భాషకు సహజంగా లేని ఏకవచన ప్రత్యయాలంటూ భాషావ్యవహారంలో ఈ మూడు ప్రత్యయాలు చేరాయి.”

      ఇది సరికాదు. తద్భవాలలోనూ, దేశ్యపదాలలోనూ కూడా ‘డు’, ‘ము’ ప్రథమా ప్రత్యయాలు కనిపిస్తాయి కదా?

      డు:
      తమ్ముడు, అల్లుడు వంటి బంధువాచక శబ్దాలలోనే కాక – బాపడు వంటి తద్భవాలలోను, పోరడు, బుడుతడు వంటి దేశ్యాలలోను ‘డు’ ప్రత్యయం ఉన్నది. తిన్నడు, ఎల్లడు వంటి పేర్లలో ఉన్నది కూడా ప్రథమావిభక్తి ‘డు’ ప్రత్యయమే కదా. వాడు, వీడు అన్న సర్వనామాలలో ఉన్న ‘డు’ ప్రథమా విభక్తి ప్రత్యయమే. మహద్వాచకాలకు తెలుగులో సహజంగా ఉన్న ప్రత్యయం ‘డు’. ‘కాడు’ (వేటగాడు, విలుకాడు) మొదలైన ఇతర ప్రత్యయాలుకూడా దాని ఆధారంగా ఏర్పడినవే.

      ము:
      అమహత్తులకు ‘ము’ ప్రత్యయంకూడా తద్భవ దేశ్యపదాలలో ఉన్నదే.
      తద్భవాలు – జన్నము, పున్నెము
      దేశ్యాలు – అల్లము, బెల్లము, చొళ్లెము

      వు:
      అనువు, కొలువు, నిలువు, చదువు. ఇది ప్రథమా విభక్తి ప్రత్యయం కాకపోవచ్చును కానీ ఉకారాంత పదాలకు ‘వు’కారం చేరడం తెలుగుభాషకు సహజమే.

      అందువల్ల డు, ము, వు, లు తత్సమ శబ్దాలను ఏర్పరచడానికి కృత్రిమంగా సృష్టించబడ్డ ప్రత్యయాలు కావు. తెలుగుకు సహజంగా ఉన్నవే.

    2. “అలాంటి మొదటి వ్యాకరణం గురించి ఎందువల్లనో గానీ తెలుగువారు గుర్తింపు ఇవ్వక పోవడం విచారకరం”, “తెలుగు సమాజం అతన్ని, అతని వ్యాకరణాన్ని తగిన విధంగా ఆదరించలేదని చరిత్ర సాక్ష్యం చెప్తుంది.”

      ఇలాంటి వాక్యాలకు సరైన సమర్థన/వివరణ ఇస్తే బాగుంటుంది, లేకపోతే వాటికి విలువలేదు. ఒకవేళ ఆదరణ లేదనుకుంటే దానికి సరైన కారణాలు కూడా విశ్లేషిస్తే బాగుంటుంది.

    3. భాషావ్యాకరణ సంబంధమైన వ్యాసాలు కాబట్టి, చిన్న భాషాదోషం ప్రస్తావిస్తున్నాను. “పర్యావలోకనం” నాకు తెలిసి సరైన పదం కాదు. “పర్యాలోకనం” (పరి+ఆలోకనం) లేదా “పర్యవలోకనం” (పరి+అవలోకనం) సరైన పదాలు.
  6. Question గురించి Kishore Karnam అభిప్రాయం:

    02/06/2021 8:30 pm

    Simple lucid language and comparisons. Beautiful.

  7. అ సత్యం గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    02/06/2021 7:07 am

    చదవగానే అనేక సందేహాలు వచ్చాయి. ఆలోచించేకొద్ది కొన్ని కొత్తదారులు తెరుచుకున్నాయి. రెగ్యులర్ పాట్రన్ కథలకు అలవాటుపడినందువలనేమో ఇలాంటి స్పేస్ ఉండే కథలు పాఠకుడ్ని కొంత కష్టపెడతాయనుకుంటా. ఈ కథ ఇప్పటివరకు మీరు రాస్తూ వస్తున్న సరళికి కొంత భిన్నంగా కనిపించింది. ముందుగా ఆమెకు డబ్బులు ఎందుకు,ఏం చేస్తుందనే ఆలోచన, కాసేపటేకే నవ్వు. మనం కూడా వెంకూ దగ్గరే ఆగిపోతున్నామని. నిజానికి ఈ కథ డబ్బుకి సంబంధించింది కాదు అని స్పష్టంగా తెలుస్తున్నా ఆలోచన అక్కడే ఆగిపోవడం ఆశ్చర్యమనిపించింది. నిజానికి ఆమె మానసిక స్థితికి ఆ డబ్బు కారులో వదిలేసైనా దిగిపోగలదేమో. మీవి రీడర్ ప్రెండ్లీ కథలండి. ఆలోచించుకోవడానికి, ఊహించుకోవడానికి వాళ్ల స్థాయిని బట్టి అనేక అవకాశాలను ఇస్తూ వస్తారు. పాతకాంక్ష అనేది బుర్రలో ఓ పెద్ద కథనే సృష్టించగల అవకాశం ఉన్న పదం. ఒక్కోసారి ఆ ఊహలోనే స్టక్ అయిపోతాం కూడా. మీ కథలు కొన్ని సార్లు ఓ ఫజిల్లా అనిపిస్తాయి. కాని దాదాపు ప్రతి చోట హింట్ ఇస్తూనే ఉంటారు. ఆమె చుట్టూ ఉన్న అనేక విశ్వాసాలను, భయాలను దాటే ప్రయత్నంలో వచ్చే గిల్ట్ ను ఓవర్ కమ్ చేసేందుకు లేదా అసత్యంతో ఆమె ప్రయోగాన్నో శోధననో సమర్దించుకునే ప్రయత్నంలోనే బహుశా ఆమె గాందీ సహాయాన్ని బలంగా తీసుకుందేమో అనిపించింది. అనేక ఫ్లాష్ బాక్ లేయర్స్ లోంచి వచ్చిన ఒక బలమైన ఎమోషనల్ స్పాంటేనియస్ డెసిషన్ పై చివరివరకు నిలబడటమే పార్వతమ్మ తనదైన సత్యాసత్యాలతో చేసిన స్నేహశోధనేమో ఈ కథ. గోడమీద పిల్లబుద్ధుడు ఫోటో అనేదే కొంచెం రియాలిటీకీ దూరం జరిగిందనిపించింది. మనదేశంలో పిల్లబుద్ధుడు ఫోటోలు దాదాపు ఎవరి ఇళ్లలో కనబడటం నేను చూడలేదు. అక్కడ బుద్ధుడు వాడి, చివరలో పిల్లబుద్ధుడు అంటే సరిపోయేదేమో. మొత్తంమ్మీద ఒక సింపుల్ ప్లాట్ తో వైవిధ్యమైన మంచి కథ. అభినందనలు సుధగారు.

  8. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/05/2021 10:27 pm

    మినీ కవిత లాంటి మీ స్పందనకు థాంక్స్ వంశీ

  9. అ సత్యం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/05/2021 7:40 pm

    ఆవును. అసత్యంతో సత్యసాధన శోధన సాధ్యమే.

  10. ప్రయాణం గురించి Bvmk అభిప్రాయం:

    02/05/2021 6:58 pm

    కథ చాలా బావుంది.