చాలా సమగ్రంగా ఉంది మీ వ్యాసం. ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి, ట్రావెల్ బ్లాగులు రాసేవాళ్ళకి, మార్గదర్శకంగా ఉంది. మళ్ళీ ఈ 2021 ప్రయాణం చేయాలనుకుంటూన్న మీ కోరిక నెరవేరాలని కోరుతున్నాను.
నా ఒంటికి గగుర్పొడిచే గుణం కుంచెం ఎక్కువే గానీ ఈ గుణాన్ని ప్రకోపింపచెయ్యడానికి మామూలుగా అయితే మంచి దృశ్యం, సంగీతం అవసరం. ఇది చదివేక మంచి రాత కూడానని తెలిసింది.
ఒకోసారి అసలు యాత్ర కన్నా ఆ యాత్ర గురించి రాయడమే బావుంటుంది. గల్ఫ్ గీత రచన అలాంటి అరుదైన సందర్భం… రాద్దామా వొద్దా అని తటపటాయిస్తూ ఉన్న సమయంలో ‘కర్చీఫ్ వేసేశా’ అని అగ్నిహోత్రాధానుల ముని మనమరాల్లా ప్రకటించేశారు సుధామయి . ఆ కర్చీఫ్ లేకపోతే ఈ రచన లేదు – కనీసం ఇంత తొందరగా వచ్చేది కాదు. గల్ఫ్ దేశాలు వెళ్ళడానికి మూలకారకులు రాజేష్-భార్గవి. ఎంతో ఆదరం చూపించినవారు ప్రవీణ-సతీశ్. కనీసం fb స్నేహం అయినా లేకపోయినప్పటికీ నాకు సలాలాతో గొప్ప అనుబంధం కలిగించిన మనిషి హరికృష్ణ. వీళ్ళందరి మనోధర్మ సంగీతమే ఈ గల్ఫ్ గీతం. ఈమాటలో రచన రావడం అంటే ఏ రచయితకు అయినా నాణ్యతా ప్రమాణాలు దృష్ట్యా ఒక మెట్టు ఎక్కినట్టే. రచయితలది కన్నప్రేమ అయితే ఈమాట సంపాదకులది వాటిని పెంచి పోషించే పెంచిన ప్రేమ. ఈ నా గీతాలాపన పాఠకులను చేరింది. ఇష్టపడ్డాం అంటూ ఎంతోమంది వ్యక్తపరిచారు. ఎంతో సంతోషం. ఆ ఆదరణ కలిగిస్తున్న స్ఫూర్తి మరో రాగాలాపనకు దోహదం చేస్తోంది. అందరికీ వందనాలు.
కవులకీ, రచయితలకీ ఇతరులెలా రాస్తారనే ఆసక్తి వుంటుంది. స్వీయనైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఏమన్నా దోహదపడుతుందేమోనని కూడా. కనుక ఈయనెవరు నుండి అవసరం లేదు అనిపించింది. అది మినహా వ్యాసం చాలా నచ్చింది. ముఖ్యంగా మీ వాక్యాల్లోని మిమ్మల్ని మీరు నిరపేక్షంగా గమనించుకొనే నైర్మల్యం, వ్యక్తపరచుకొనే నిజాయితీ సంతోషాన్నిచ్చాయి.
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Sunitha Pothuri అభిప్రాయం:
03/03/2021 1:23 am
చాలా సమగ్రంగా ఉంది మీ వ్యాసం. ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి, ట్రావెల్ బ్లాగులు రాసేవాళ్ళకి, మార్గదర్శకంగా ఉంది. మళ్ళీ ఈ 2021 ప్రయాణం చేయాలనుకుంటూన్న మీ కోరిక నెరవేరాలని కోరుతున్నాను.
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Amarendra Dasari అభిప్రాయం:
03/03/2021 12:06 am
శ్రీనివాస్, మీలాంటి వారి నిరంతర ఆత్మీయ స్పందన ఏ రచయితకు అయినా చాలా స్ఫూర్తి కలిగిస్తుంది..many thanks
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Amarendra Dasari అభిప్రాయం:
03/03/2021 12:03 am
శ్రీరామ్, మీ గగుర్పాటు నాకూ అందించారు..చాలా సంతోషం !!
జనరల్ కంపార్ట్‌మెంట్ గురించి భాస్కర్ కె అభిప్రాయం:
03/02/2021 10:54 pm
అనేక పాత్రలు సన్నని గీతలో ఎక్కడా చెదరకుండా సాగిన బరువైన కథ. టిపికల్ నారేషన్, కొన్ని జీవితాలను ఓ బోగీలో కుదించి చాలా జనరల్ గా చెప్పగలిగారు.
అభినందనలు
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Sriram Bhamidipati అభిప్రాయం:
03/02/2021 8:54 pm
నా ఒంటికి గగుర్పొడిచే గుణం కుంచెం ఎక్కువే గానీ ఈ గుణాన్ని ప్రకోపింపచెయ్యడానికి మామూలుగా అయితే మంచి దృశ్యం, సంగీతం అవసరం. ఇది చదివేక మంచి రాత కూడానని తెలిసింది.
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Amarendra Dasari అభిప్రాయం:
03/02/2021 11:54 am
ఒకోసారి అసలు యాత్ర కన్నా ఆ యాత్ర గురించి రాయడమే బావుంటుంది. గల్ఫ్ గీత రచన అలాంటి అరుదైన సందర్భం… రాద్దామా వొద్దా అని తటపటాయిస్తూ ఉన్న సమయంలో ‘కర్చీఫ్ వేసేశా’ అని అగ్నిహోత్రాధానుల ముని మనమరాల్లా ప్రకటించేశారు సుధామయి . ఆ కర్చీఫ్ లేకపోతే ఈ రచన లేదు – కనీసం ఇంత తొందరగా వచ్చేది కాదు. గల్ఫ్ దేశాలు వెళ్ళడానికి మూలకారకులు రాజేష్-భార్గవి. ఎంతో ఆదరం చూపించినవారు ప్రవీణ-సతీశ్. కనీసం fb స్నేహం అయినా లేకపోయినప్పటికీ నాకు సలాలాతో గొప్ప అనుబంధం కలిగించిన మనిషి హరికృష్ణ. వీళ్ళందరి మనోధర్మ సంగీతమే ఈ గల్ఫ్ గీతం. ఈమాటలో రచన రావడం అంటే ఏ రచయితకు అయినా నాణ్యతా ప్రమాణాలు దృష్ట్యా ఒక మెట్టు ఎక్కినట్టే. రచయితలది కన్నప్రేమ అయితే ఈమాట సంపాదకులది వాటిని పెంచి పోషించే పెంచిన ప్రేమ. ఈ నా గీతాలాపన పాఠకులను చేరింది. ఇష్టపడ్డాం అంటూ ఎంతోమంది వ్యక్తపరిచారు. ఎంతో సంతోషం. ఆ ఆదరణ కలిగిస్తున్న స్ఫూర్తి మరో రాగాలాపనకు దోహదం చేస్తోంది. అందరికీ వందనాలు.
అమరేంద్ర
3 మార్చి 2021.
నేనెలా రాస్తాను? గురించి బివివి ప్రసాద్ అభిప్రాయం:
03/02/2021 9:50 am
కవులకీ, రచయితలకీ ఇతరులెలా రాస్తారనే ఆసక్తి వుంటుంది. స్వీయనైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఏమన్నా దోహదపడుతుందేమోనని కూడా. కనుక ఈయనెవరు నుండి అవసరం లేదు అనిపించింది. అది మినహా వ్యాసం చాలా నచ్చింది. ముఖ్యంగా మీ వాక్యాల్లోని మిమ్మల్ని మీరు నిరపేక్షంగా గమనించుకొనే నైర్మల్యం, వ్యక్తపరచుకొనే నిజాయితీ సంతోషాన్నిచ్చాయి.
ఉత్సాహానికి దూరంగా… గురించి బివివి ప్రసాద్ అభిప్రాయం:
03/02/2021 9:07 am
‘అలవోక పదాలు’ ధన్యవాదాలు అమరేంద్ర గారూ..
ధన్యవాదాలు ప్రసాద్ గారు..
ప్రాచీన తెలుగు కొలమానం గురించి KANAKARAJU CHELLUBOINA అభిప్రాయం:
03/01/2021 10:14 pm
బరువులు బారువ అంటే కిలోలలో ఎంత బరువు, మణుగు అంటే ఎంత బరువు, కిలోలలో వివరించి ఉంటే ఈ తరం పిల్లలకు ఈజీగా అర్థం అవుతుంది అని నా అభిప్రాయం.
జనరల్ కంపార్ట్‌మెంట్ గురించి Amarendra Dasari అభిప్రాయం:
03/01/2021 7:32 pm
రైలు పెట్టెలు మినీ ప్రపంచాలు – సంపూర్ణం, మహా సంక్లిష్టం