ఈ రచయిత మొత్తం రచన ఒకసారే ఇవ్వలేదా సంపాదకులకు? ఈ కాలంలో అన్ని ఆడియో విస్యుయల్ మీడియమ్‍లు -మొత్తం కొత్త కథను/మెటీరియల్ను ఒకసారే అందించి, పాఠకులను వారి తీరుబాటు, వారి పఠనాసక్తిని బట్టి చదువుకోటం చూడటం చెయ్యనిస్తున్నారు. కథలో వెనక్కీ ముందుకూ వెడుతూ, నచ్చినవీ నచ్చనివీ మిత్రులతో విమర్శించుకుంటూ, బింజ్ వాచింగ్, బింజ్ రీడింగ్ అలవాటున్నవారెంతమందో.
మరి, ఈమాట పత్రిక, ఇప్పటి రచనలకు ఈ అనవసరపు సీరియలైజేషన్ విధానం ఎందుకు అవలంబిస్తున్నట్టు! డికెన్స్ కాలంలోనో, డాస్టోయెవ్స్కీ కాలంలోనో లేము కదా! ఈ పద్ధతి, చిన్న పిల్లలను కట్టడి చేసినట్టు, ఎంజాయ్మెంట్ రేషన్ చేసినట్టు, విసుగు కలిగిస్తున్నది.
Eemaata magazine was stuck for years, publishing routine sentimental Telugu “Nivali” writings. Thank God! The magazine moved away from resorting to publishing ‘easy way out’ material. It was a relief. Recently, the magazine is slipping into another sleepy, easy way out – i.e. serializing the writings. Is there any valid reason a reader should wait out – four months, six months to read a complete manuscript? Even though the writers had already written out all the material, and submitted it? Is the magazine worried there will be a Telugu literary overload?
The other current inhibiting factor in reading this magazine is now a days, a writer or two, being way too much in the face of readers.
పాడిందే పాటరా అన్నట్టు, ప్రతి సంచిక రిలీజ్‍కి వచ్చి పాఠకుల అభిప్రాయాల వేదిక మీద మకాం వేసి, ఒకరిద్దరు రచయితలు, తమ ధన్యవాదాలు, కృతజ్ఞతలతో, పాఠకులను ముంచెత్తటం పదే పదే జరుగుతున్నప్పుడు, లైబ్రరీలలో – రైటర్ బుక్ సైనింగ్ ఈవెంట్స్ లాగా – it is quite distracting and disturbing to readers. Not conducive to reading. When the writer contributes way little to literature, literary discussion and socializes way more in a literary magazine, it turns off a reader.
ఈ రచన బాగుండే ఉంటుంది. నాకు చదవాలని ఉంది. రచయితలు మేగజీన్ తలుపుల దగ్గర్నించి దయచేసి తప్పుకుంటే, పాఠకులకు లోపలికి వచ్చి, ఎన్నో మంచి రచనలుంటాయి చదువుకుంటానికి వీలవుతుంది. That will be real politeness and good manners.
Thanks.
-Lyla
మార్చ్ 2021
గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
03/12/2021
10:08 am
ఈ సారి చాలా ఆలస్యంగా ఈమాట చదివాను. అది క్షమించరాని నేరం. అయితే సాహిత్యపరంగా నేను చేసిన క్షమించరాని నేరాలతో పోలిస్తే ఇది చాలా చిన్ననేరం.
ఈ నెల మీరు రాసిన సంపాదకీయం నిజంగా ఒక మణిపూస.
నేనూ సంపాదకీయాలు రాశాను; అవి వ్యాసాల్లా ఉన్నాయని తిట్టిన వాళ్ళు లేకపోలేదు. నేను రాసిన వ్యాసాలని చదివి, ఇవి ’సంపాదకీయాలు’గా రాసి ఉంటే బాగుండును అన్నవాళ్ళూ లేకపోలేదు. ఈమాటతో నాకున్న ప్రత్యేక సంబంధం ఈ స్వోత్కర్షకి కారణం. క్షమార్హుణ్ణి.
మన తెలుగు సాహిత్యరంగంలో ఉన్న ’కుళ్ళు’ని మీరు అతి చాకచక్యంగా బయటికి తెచ్చారు. రచయితనీ, రచననీ వేరుచేసి చూడటం, చదవటం, విమర్శించడం, మనకి ఇంకా అబ్బలేదు. అది ఎప్పటికైనా సాధ్యమా అని నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటాను.
అచ్చులో వచ్చే పత్రికలలో ‘విమర్శల’నీ, ముఖపుస్తకంలో ఎదురయ్యే ‘మెప్పు’లనీ, వ్యాఖ్యానాలనీ వచ్చిన కొద్దిక్షణాల తరువాత పూర్తిగా మరిచిపోవచ్చు. ఇవేవీ కలకాలం నిలవవని అందరికీ తెలిసిన విషయమే. అయినా మన ప్రస్తుత సాహితీ సంస్కృతి ఈ రెంటితో పెనవేసుకొని పోవటం ఆశ్చర్యకరమో, గర్హనీయమో నాకు తెలియదు.
‘విప్లవాత్మక సాహిత్య ప్రతిపాదనలతో ఏకీభవించగలమా లేదా అన్నది సమస్య కాదు, కాని వాటిని విస్తృతంగా అధ్యయనం చేసి విశ్లేషించవలసిన అవసరాన్ని తెలుగు సాహిత్యలోకం ప్రయత్నపూర్వకంగానే విస్మరించడం సాహిత్యనేరం,’ అని మీరు సంపాదకీయంలో రాసినప్పుడు, అమ్మయ్య! కుండబద్దలుగొట్టి నిజం చెప్పారు, ఇప్పటికన్నా పాత్రికేయులు (అచ్చేసే వాళ్ళు, అంతర్జాలం వాళ్ళూ), సాహితీవేత్తలూ, చవకబారు రాజకీయాలకి స్వస్తి చెప్పి, కళ్ళు తెరుస్తారని ఆశించడం నేరం కాదనుకుంటాను.
చాలా బాగుందండీ. చివరన మీరు రాసిన వాక్యాలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. అవును మీరు మళ్ళీ గల్ఫ్ వెళతారు. అయితే ఈసారి మీ దృష్టి వేరుగా ఉంటుంది. అది చదవడానికి మేము సిద్ధమయ్యిపోయాము.
రావణ మరియు బలి చక్రవర్తిల యొక్క భేటీ ఉందన్న విషయం నాకు మీ ఈ విశ్లేషణ ద్వారా తెలియడం జరిగింది. మీకు నమస్సులు. నారాయణుడు “భక్త పాలన కళారంభకుడూ ఆ తర్వాతే దానవోద్రేక స్థంభకుడూనూ” ఈ విషయం మీ విశ్లేషణ బాగుంది.
నమస్కారములు 🙏🙏
ఉప్పులూరి సత్య కృష్ణ బ్రహ్మాజీ రావు
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Lyla yerneni అభిప్రాయం:
03/12/2021 12:53 pm
An opinion.

మార్చ్ 2021 గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
03/12/2021 10:08 am
ఈ సారి చాలా ఆలస్యంగా ఈమాట చదివాను. అది క్షమించరాని నేరం. అయితే సాహిత్యపరంగా నేను చేసిన క్షమించరాని నేరాలతో పోలిస్తే ఇది చాలా చిన్ననేరం.
ఈ నెల మీరు రాసిన సంపాదకీయం నిజంగా ఒక మణిపూస.
నేనూ సంపాదకీయాలు రాశాను; అవి వ్యాసాల్లా ఉన్నాయని తిట్టిన వాళ్ళు లేకపోలేదు. నేను రాసిన వ్యాసాలని చదివి, ఇవి ’సంపాదకీయాలు’గా రాసి ఉంటే బాగుండును అన్నవాళ్ళూ లేకపోలేదు. ఈమాటతో నాకున్న ప్రత్యేక సంబంధం ఈ స్వోత్కర్షకి కారణం. క్షమార్హుణ్ణి.
మన తెలుగు సాహిత్యరంగంలో ఉన్న ’కుళ్ళు’ని మీరు అతి చాకచక్యంగా బయటికి తెచ్చారు. రచయితనీ, రచననీ వేరుచేసి చూడటం, చదవటం, విమర్శించడం, మనకి ఇంకా అబ్బలేదు. అది ఎప్పటికైనా సాధ్యమా అని నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటాను.
అచ్చులో వచ్చే పత్రికలలో ‘విమర్శల’నీ, ముఖపుస్తకంలో ఎదురయ్యే ‘మెప్పు’లనీ, వ్యాఖ్యానాలనీ వచ్చిన కొద్దిక్షణాల తరువాత పూర్తిగా మరిచిపోవచ్చు. ఇవేవీ కలకాలం నిలవవని అందరికీ తెలిసిన విషయమే. అయినా మన ప్రస్తుత సాహితీ సంస్కృతి ఈ రెంటితో పెనవేసుకొని పోవటం ఆశ్చర్యకరమో, గర్హనీయమో నాకు తెలియదు.
‘విప్లవాత్మక సాహిత్య ప్రతిపాదనలతో ఏకీభవించగలమా లేదా అన్నది సమస్య కాదు, కాని వాటిని విస్తృతంగా అధ్యయనం చేసి విశ్లేషించవలసిన అవసరాన్ని తెలుగు సాహిత్యలోకం ప్రయత్నపూర్వకంగానే విస్మరించడం సాహిత్యనేరం,’ అని మీరు సంపాదకీయంలో రాసినప్పుడు, అమ్మయ్య! కుండబద్దలుగొట్టి నిజం చెప్పారు, ఇప్పటికన్నా పాత్రికేయులు (అచ్చేసే వాళ్ళు, అంతర్జాలం వాళ్ళూ), సాహితీవేత్తలూ, చవకబారు రాజకీయాలకి స్వస్తి చెప్పి, కళ్ళు తెరుస్తారని ఆశించడం నేరం కాదనుకుంటాను.
విధేయుడు
వేలూరి వేంకటేశ్వర రావు.
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Amarendra Dasari అభిప్రాయం:
03/11/2021 10:11 pm
హమ్మో! రాయకముందే వేయడానికి పబ్లిషర్స్ ముందుకు రావడం విన్నాం. ప్రసూన గారూ, పాఠకులు రెడీ అవడం – ఇది గొప్ప ముందడుగు!
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Prasuna balantrapu అభిప్రాయం:
03/11/2021 11:12 am
చాలా బాగుందండీ. చివరన మీరు రాసిన వాక్యాలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. అవును మీరు మళ్ళీ గల్ఫ్ వెళతారు. అయితే ఈసారి మీ దృష్టి వేరుగా ఉంటుంది. అది చదవడానికి మేము సిద్ధమయ్యిపోయాము.
విశ్వమహిళానవల: 7అ. దె స్టాఎల్ ‘కొరీన్’ గురించి Prasuna balantrapu అభిప్రాయం:
03/11/2021 10:57 am
ప్రపంచ రచయిత్రులను మాకు పరిచయం చేస్తున్నందుకు మృణాళినిగారికి కృతజ్ఞతలు. ఈ రెండు రచనలు మాకు లభ్యము అవుతాయా? అనేది తెలియజేయగలరు.
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Kumar Utukuri అభిప్రాయం:
03/11/2021 10:53 am
“వాక్యం రసాత్మకం కావ్యం”. మామూలు యాత్రా విశేషాలను కూడా రసవత్తరంగా వివరించడంలో అమరేంద్ర సిద్ధహస్తుడు.
దానవోద్రేక స్తంభకుడు గురించి ఉప్పులూరి సత్య కృష్ణ బ్రహ్మాజీ రావు అభిప్రాయం:
03/10/2021 10:26 am
రావణ మరియు బలి చక్రవర్తిల యొక్క భేటీ ఉందన్న విషయం నాకు మీ ఈ విశ్లేషణ ద్వారా తెలియడం జరిగింది. మీకు నమస్సులు. నారాయణుడు “భక్త పాలన కళారంభకుడూ ఆ తర్వాతే దానవోద్రేక స్థంభకుడూనూ” ఈ విషయం మీ విశ్లేషణ బాగుంది.
నమస్కారములు 🙏🙏
ఉప్పులూరి సత్య కృష్ణ బ్రహ్మాజీ రావు
జనరల్ కంపార్ట్‌మెంట్ గురించి Sudha అభిప్రాయం:
03/07/2021 9:56 pm
ధన్యవాదాలు అమరేంద్ర గారు, భాస్కర్ గారు
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Amarendra Dasari అభిప్రాయం:
03/06/2021 5:49 pm
హెచ్చార్కే గారు, రవి శేఖర్ గారు, పలమనేరు బాలాజీ గారు, బివివి ప్రసాద్ గారు మీ అందరి స్పందనలు నాకు అయాచితంగా అందిన అద్భుత వరాలు..ధన్యవాదాలు
గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి బివివి ప్రసాద్ అభిప్రాయం:
03/06/2021 5:24 am
బావుందండి.. కొన్నిచోట్ల ఆర్ద్రంగా రాసారు..