పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మేనక గురించి Lyla yerneni అభిప్రాయం:

    03/30/2021 10:05 pm

    మేనక అను ఈ ఆపెరా ఈకోవలో నేను చేసిన ఏడవరచన. ఇది ఫ్రెంచిభాషలో గల సుప్రసిద్ధమైన మనోఁ (Manon) అను ఆపెరాను భారతసంస్కృతికి అన్వయించుకొనుటకై అనేకమగు మార్పులు, చేర్పులు చేసి చేసిన అనుసృజన.”
    “గమనిక: పై ఇతివృత్తమంతయు నేనీ రూపకంలో వ్రాసిన విధంగా పేర్కొన్నాను. ఇది మసెనే ఆపెరాకంటె అనేకవిషయములలో భిన్నముగా నున్నది. ఇతివృత్తమును భారతసంస్కృతికి అన్వయించుచు వ్రాయుటకై ఈభిన్నత్వ మవసరమైనది. తృతీయచతుర్థాంకములు చాలావఱకు అమూలకములే!

    ఈ రచన చదివాను. బెవర్లీ సిల్స్ నాయికగా నటించిన ‘Manon’ ఆపెరా యూ ట్యూబ్ లో చూసాను. రెండూ నాకు నచ్చాయి. న్యూయార్కర్ లకు బెవర్లీ సిల్స్, బర్న్ స్టైన్ లపై, అభిమానం తప్పనిసరి.

    ‘మేనక’ రచనలో ముందుమాటగా, భారతీయ సంస్కృతికి తగినట్టుగా,( భారతీయ పాఠకులకు నచ్చేట్టుగా??) ఈ ఆపెరాలో మార్పులు చేసినట్టు చెప్పారు. ఇంతకు ముందు ఆపెరాల తర్జుమాలలోనూ, కొన్నిసార్లు ఇలాగే చెపుతూ, వీరి తెలుగు రచనలను అనుసృజనలు అనుకోమన్నారు. అలానే అనుకోవచ్చు. ఐతే, ఈ Manon, మేనక రెండిటి కథా లక్షణాలలో పెద్ద తేడాలేమీ నాకు తెలియలేదు. దేశికాచార్యులు గారు, భావించే ఈ భారతీయ సంస్కృతి ఎట్టిది? ఎలా ఇటాలియన్, ఫ్రెంచ్ సంస్కృతి, సంప్రదాయాలతో విభేదిస్తుంది, ఎక్కడెక్కడ ఈ మార్పులు ఈ తెలుగు రూపకం లో గమనించాలి? అన్న విషయాలు రచయిత నుండి వివరంగా వినాలని ఉంది.

    ఆ మధ్య ‘శ్రీహర్షుని గ్రంథ గ్రంథులు’ అన్న వ్యాసం ఈ మేగజీన్ లో చదివినపుడు, అభిప్రాయాల శీర్షికలో అక్కిరాజు ఉమాకాన్తమ్ గారి ‘నైషధతత్త్వజిజ్ఞాస’ అన్న రచన చదవమని చేసిన సూచన మేరకు, నేను చదివాను. శ్రీ హర్షుని నైషధం ఏ కారణాల వల్ల ఆయనకు నచ్చలేదో ఆ వ్యాసంలో ఉంది. భారతీయ సంస్కృతి, భారతీయ శృంగారం, భారతీయ సాహిత్యం సంబంధాలు చర్చించే- ఈ వ్యాసాన్ని కూడా దేశికాచార్యులు ఈ సందర్భంగా కొంతలో కొంత స్పృశిస్తారని నేను ఆశిస్తున్నాను.
    ఉమాకాన్తమ్ గారి ఉద్దేశంలో –భారతీయ సాహిత్య పతనం -భారత దేశంలో ఇతర దేశాల వారొచ్చి జేరటంతో జరిగిందని. శ్రీ హర్షుని నైషధం నచ్చకపోటానికి ఉమాకాన్తమ్ చేసిన ఒక అభియోగం; విదేశీయుల డబ్బు, కామం, వ్యామోహం శ్రీ హర్షుడికి అంటుకుందనీ, అందువల్లే వ్యాసుడి బంగరు రెక్కల హంసను, పూర్తి బంగారు హంసను చేసాడని, కాళిదాసు పార్వతీ పరమేశ్వరుల లాగా ఉదాత్త ప్రణయం చూపించవలసిన నల దమయంతులను, కేవలం కాముకులుగా మార్చివేసాడనీ, ఆ మార్పుల మూలాన భారతీయ ప్రణయం, శృంగారం శ్రీ హర్షుని చేతిలో పతన మయ్యాయని.
    (పనిలో పనిగా, ఆ వ్యాసం మాత్రమే కాక, ‘సాహితీ వైజయంతి’(సుప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి, సం. అక్కిరాజు రమాపతిరావు) పుస్తకం లోని ఇతర రచనలూ చదివాను. చాలా నచ్చాయి. పూర్వం తెలుగు వాళ్లు తెలుగులో ఎంత మంచి వ్యాసాలు రాసారని సంతోషం కలిగింది.)

    అలాటిదే ఇంకో సంకలనం – నా లైబ్రరీలో ఉన్న ‘శత వసంత సాహితీ మంజీరాలు’ అన్న పుస్తకం. విజయవాడ రేడియో స్టేషన్లో అంతకు ముందు వరసగా ప్రసారం చేసిన -తెలుగునాట ప్రసిద్ధి గాంచిన తెలుగు రచనలపై విశ్లేషణలను 2002 లో- పుస్తక రూపంలోకి తెచ్చారు. బాగున్నాయీ విశ్లేషణలు. ఈ పుస్తకంలో, ఉమాకాన్తమ్ గారు ‘నేటి కాలపు కవిత్వం’ అని ఒక గ్రంథం రాసారనీ, అది తెలుగు సాహిత్య విమర్శనే ఒక గొప్ప మలుపు తిప్పిన పుస్తకం అని -తన భాషణలో కోవెల సంపత్కుమారాచార్య చెప్పారు. ‘నేటి కాలపు కవిత్వం’ అన్న ఆ గ్రంథం దొరికితే చదవాలని ఉంది.
    (చిత్రంగా, ‘విమర్శ’ అనేది ఎప్పుడు ప్రారంభమయిందో, కవిత్వ పతనం, అప్పుడే మొదలయిందని, ఉమాకాన్తమ్ గారి మరో ఉద్దేశం. మరి, ఆయన ‘విమర్శ’ ను కవులెంతో గౌరవించారట!)

    దేశికాచార్యులు గారు, భారతీయ సంస్కృతికి సూటబుల్ గా ఈ ఆపెరాలను అనుసృజన చేస్తున్నాను అంటున్నప్పుడు – ఎన్నో విషయాలలో పాండితి కలిగిన ఆయన, తమ ఆలోచనలు ఇంకొంత వివరంగా చెపుతారేమో అని నాకు ఆశ. అందువలన రాస్తున్నాను. మరికొందరు చర్చిస్తే మరింత ఆనందం.

    Thanks.
    Lyla

  2. వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి p r harinath అభిప్రాయం:

    03/30/2021 4:56 am

    చాలా అందమైన ముఖాముఖి. రావుగారి కథలను ఎన్నిసార్లు చదివినా కూడా తనివి తీరదు. ఏదో ఒక మైకం ఉంది వాటిలో. తెలుగు సాహిత్యంలో అపురూప రచయిత ఆయన.

  3. తెలుగు నిఘంటువు గురించి… గురించి mission bharathi అభిప్రాయం:

    03/27/2021 5:03 am

    సంపుటం అని మొదటి ముద్రణకి వాడుతున్నారా లేక ఎనిమిది భాగాలా?

  4. జనరల్ కంపార్ట్‌మెంట్ గురించి srisudha అభిప్రాయం:

    03/24/2021 5:42 am

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు

  5. కొక్కొండ: నూతన వృత్తములు – పట్టిక 3 గురించి వీరవెంకట సత్యనారాయణ.మంత్రవాది అభిప్రాయం:

    03/24/2021 4:49 am

    పెద్దలు శ్రీ మోహనరావుగారికి నమస్సులు. కొక్కొండవారికి ముందు అంటే 17వ శతాబ్దంలో వేరే గణములతో డిండిమ వృత్తము ఉన్నదని కొందరు ఉటంకించారు. ఒకవేళ మీ వద్ద ఉన్నచో తెలుప(వివరింప) ప్రార్థన.🙏🙏🙏

  6. ఉత్సాహానికి దూరంగా… గురించి ఎ. యస్. రవి అభిప్రాయం:

    03/21/2021 7:21 pm

    నిరాశ గురించి నిర్వేదం గురించీ ఇంత అందంగా ఆకర్షణీయంగా రాశారే అయ్యో అనుకుంటూండగా
    జీవితం పట్ల ఉండాల్సిన ప్రీతిని గురించి వాత్సల్యాన్ని గురించీ అంతకన్నా హృద్యంగా, ఆర్ద్రంగా రాశారు.
    అల్పాక్షరాల్లో, అద్భుతంగా, మళ్ళీ మళ్ళీ చదువుకునేలా.
    Thank you.

  7. బహుముఖాలు గురించి చరణ్ పరిమి అభిప్రాయం:

    03/21/2021 10:49 am

    Thank you. పాణిని గారు, అవును, ఆ మాటలోనే ఉంది కథలోని విషయం, గాఢత అంతా. నాక్కూడా నచ్చిన డైలాగ్ అది.

  8. జనరల్ కంపార్ట్‌మెంట్ గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    03/20/2021 8:31 am

    వైరుధ్యాల్లో కలిసి ఉంటూ అవే వైరుధ్యాలని ప్రశ్నించడం మీ కథల్లో చూస్తుంటాను. సంబంధం లేని, ఉండబోని నలుగురైదుగురి గురించి అంత నిశితంగా పరిశీలించడం ఎలా సాధ్యం? చిమామండా అదీచీ చెప్పిన “Danger of Single stories” గుర్తొస్తోంది. ప్రపంచంలో మనం దర్శించగలిగేది మన ప్రతిబింబాల్ని మాత్రమే కదా? బహుశా ఆ సత్యాన్ని చెప్పడానికేనేమో, “ఓహ్, యూ ఆర్ సో సినికల్” అనిపించారు కథలోని ముఖ్యపాత్రచేత. బాగుందండి కథ!

  9. సోర్సరస్ గురించి sridevi అభిప్రాయం:

    03/19/2021 6:07 pm

    మీ కథలు నాకు మృగతృష్ణ లాంటివి. They give me break from my lowest point(s) in life. Let me know how can I talk to you over phone. Please send me what is good way to contact and talk to you.

  10. బహుముఖాలు గురించి పాణిని అభిప్రాయం:

    03/14/2021 7:16 am

    చాలా బాగా రాసారు చరణ్ గారూ. పాయిగ్నంట్ స్టోరీలైన్, మీ కథనం బాగా నడిచాయి. “ప్రేమకి ప్రేమే విరోధి” – అద్భుతం. ఇలాంటివే ఇంకొన్ని.