ఈ వ్యాస రచయిత చెప్పినట్లు అప్రయత్నంగా శివాలయంలో ఉండి శివదీక్షామంత్రాలు విని కైవల్యము పొందటమవేది ఆహేతుకమే కాక, అనైతిక ప్రవర్తనలను ప్రోత్సహించడము కూడా. (ఇక్కడ విషయాన్నే ఎత్తి చూపుతున్నాను కానీ కలి దోషమని కాదు). ఇలాంటి రచన (ప్రధానోద్దేశ్యము దుర్మార్గులను కూడా భక్తిదిశగా మళ్లించటమైననూ) వల్ల నిజమైన దీక్షాపరులు,భక్తులు (తాము కష్టాలు పాలైనప్పుడు, ఇతరుల వల్ల గానీ, పరిస్థితుల వల్లన కానీ) దుర్భర స్థితులు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు (మన నిత్య జీవితంలో చాలా మందినే చూసి ఉంటాము) పూర్తి అసందిగ్ధతకు, భద్రతారాహిత్యానికి లోనవుతారు.
మనోజ్ఞమైన కావ్యాన్ని చదివే సౌభాగ్యాన్ని కలిగించినందుకు నమస్సుమాంజలులు. కరోన కఠిన కాలమందు కమనీయమైన కావ్య పఠన నా college days మనోహర స్మ్రతులు గుర్తుకు తెచ్చినై. ఈ కావ్యాన్ని ఆ రోజుల్లో మాకు బళ్ళారిలో మునిసిపల్ కాలేజ్ లో వర్ణించి వివరించిన ఉపాధ్యాయులైన శ్రీ నారాయణస్వామికి నా మనహ్పూర్వక వందనములు ఈ ద్వారా తెలుపుకొంటాను.
అన్వర్,
చంద్ర గారిని మొదటి సారీ ఆఖరి సారీ కలుసుకున్నది San Antonoioలో Texas Telugu Association వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో. గడిపింది కొద్దిగంటలే అయినా, అతను కొద్ది క్షణాల్లోనే ఎన్నాళ్లనుండో పరిచయమున్న మిత్రుడిలా దగ్గరయ్యాడు. మరిచిపోలేని మిత్రుడయ్యాడు. చాలా మంచి విషయాలు మాటాడేడు. దురదృష్టవశాత్తూ అతని నెంబరు పోగొట్టుకున్నా. అతనితో తీసుకున్న సెల్ఫీ కూడా పోగొట్టుకున్నా సెల్ ఫోనుతో పాటే. ఆయన ఇండియా రాననో, రాలేననో చెప్పినట్టు గుర్తు. అతనొక చెరగని జ్ఞాపకపు ముద్ర.
అన్వర్, మీకు మీ జ్ఞాపకాలని మంచి కుతూహలం రేకెత్తించే కథలుగా చెప్పగలిగే నేర్పు ఉంది. మీతోబాటు చెయ్యిపట్టుకుని తీసుకుపోతారు. అభినందనలు.
‘అడవి పుస్తకం’ గురించి క్రిందపొందుపరిచిన సోమ భూపాల్ గారి వ్యాఖ్యానం దయచేసి చూడండోసారి.
ఫేస్బుక్లో జయతి లోహితాక్షన్ గారి పోస్ట్‌లు; వారు తీసిన అడవి, అడవి బిడ్డల అరుదైన ఫొటోలు చూడండి. దాసరి అమరేంద్ర గారు, కాకినాడ అక్కయ్య డా. వాడ్రేవు వీరలక్ష్మి, వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఇంకా ఎందరెందరికో మల్లే తను మీకూ మరింత దగ్గరిగా పరిచయమవుతారు. మీ అభిమానానానికి పాత్రులవుతారు.
అడవి మాట పక్కన పెట్టి జయతికి తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాల పట్ల ఉన్న ఉత్తమ అభిరుచిని చూడండి. మీరు కనెక్ట్ అవుతారు.
________________________________________
అనంత చీకట్లో ఒక్కటే పాక, దాని ముందు చలిమంట, ఆ మంట ముందు మేము ముగ్గురం
( జయతి, లోహితాక్షన్, వైటీ.)
ఎక్కడో పుస్తకం మధ్యలో వస్తుంది ఈ మాట.నేను మెల్లగా కూరుకుపోతూ ఉన్నాను ఆ భావనలో.యజ్ఞం కాక మరేమిటి అది.యజ్ఞమే.అన్వేషనా యజ్ఞం.కాసేపు పుస్తకం కనపడలేదు నాకు.చీకటి,ముందు మంట.. అనంతమైన ఆకాశం…చేతికందే పాలపుంత.ఆమె ఇది కవిత్వంగా రాయలేదు.ఆ గాఢమైన అడవిలో కవిత్వంలా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు.
అడవి నుండి అడవికి మొదలై అడవి పుస్తకమైపోయిన ఇద్దరు మనుషులు, ఒక కుక్క-వైటీ. పుస్తకం చదివాక మీతో పంచుకోకుండా ఉండలేని కొన్ని విషయాలు ఇక్కడ ఉంచుతున్నాను.
ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నందున పుస్తకం మా ఊరు చేరింది. చేతికందడం ఆలస్యమైంది. ఎదురుచుస్తూ ఉన్నాను. వీలుచేసుకుని నేనే వెళ్లి పుస్తకం తెచ్చుకుని ఇక నిన్న ఉదయం తెరిచాను. నేను ఏదీ ఉహించుకోలేదు ఈ పుస్తకం గురించి. ఎందుకంటే ఇది ఏ ప్రముఖ రచయితో రాసిన కథో, కవితో, ఏ నవలో సీరియలో కాదిది.
ఈ పుస్తకం నిండైన ఒక అన్వేషి యదార్థ జీవన పథ అనుభవాల మాల.మనుషుల ఇరుకుతనం మధ్య, వాడిపోయిన మానవత్వం మధ్య ఇమడలేని ఒక సున్నిత పసి హృదయం పాడిన తన హృదయాంతరాల తపన. సత్యం కోసం అర్రులుచాస్తూ కొండల్లోకి, చిక్కటి అడవుల్లోకి, నదుల్లోకి, అనేక పూల వనాల్లోకి నిశ్చలంగా నడుస్తూ వెళ్లిన ఒక సాధకురాలు చెప్పిన అత్యంత పురాతన మార్మిక రహస్యం ఈ పుస్తకం.
“ఎడారిని చూడటమంటే ప్రియతముని జాడ తెలియడం” అని తన హృదయాంతరాల్లోంచి నాకు ఆ యోగిని గంభీరమైన స్వరం వినపడగానే నా చుట్టూ. నాలో ఒక నిశ్చలత ఆవరించింది. మరుక్షణమే ఎదో అలజడి కూడా.
ఏవీ వద్దు అనుకుని వెళ్లిపోయారంట అడవిలోకి… అనుకుని కాదు. అనుకుంటూ ఉంటే వెళ్లలేం అనుకుని… ఇక అనుకోకుండా వెళ్లిపోయారు. లోకమంటే అసహ్యమూ కాదు. జీవితమంటే నిర్వేదం అసలు కానే కాదు.ఏదీ కాదు. ఏదీ కానప్పుడు మరెందుకు అక్కడున్నారు అంటే “ఇక్కడెందుకు ఉండకూడదు?” అని ప్రశ్నించే తత్వం.
మాలా ఇక్కడ మనుషుల మధ్య ఎందుకు లేరు అంటే “మీరు కూడా మాలాగా అడవిలో ఎందుకు ఉండలేరు?” అని అడిగినట్లు అనిపిస్తుంది నాకు.నిజమే…
కొందరు లోకానికి చెందరు.వాళ్ళను ఆశ అనే గురుత్వాకర్షణ పట్టి ఉంచలేదు. నాది అనే చక్రంలో ఎల్లకాలం తిరుగుతూ ఉండలేరు. ఉండనివ్వదు వారి హృదయం. అలాగే జయతి లోహితాక్షన్లు కూడా లోకానికి చెందరు.వీళ్ళనుగానీ… ఈ పుస్తకాన్నిగానీ “ఇదీ” అని నిక్కచ్చిగా చెప్పలేము. ఒక విషయానికి పరిమితం చెయ్యనూలేము.
వాళ్లు అనంతమైన సత్య దర్శనానికి వెళ్లిపోయారంతే.
జయతిగారి సత్య సౌందర్య దాహానికి సహచరుడు లోహితాక్షన్ గారి సహకారం చరిత్రలో చెరగని ప్రేమ ముద్రగా నిలిచిపోతుంది. తండ్రిమాటను కాదనక రాముడు అడవులకెళ్తే..వెంట సీతాదేవి..లక్ష్మణుడు నడిచినట్టు… సీతాదేవి అడవులకు వెళ్తానంటే వెంట నడచిన ఒక రాముడు, అలాగే వైటీ… ఇది రామాయణంలా ఉంది అనిపిస్తోంది.
“నాకు అడవికి వెళ్లిపోవాలనీ, అడవికే సొంతమైపోవాలనీ, అక్కడే ఆ కొండల్లో ఉండిపోవాలనీ ఉంది” అని జయతిగారు చెప్పినప్పుడు మరొకరిలా “ఏమిటీ పిచ్చి? ఎందుకు అడవి?” అని కేకలేయకుండా
“సరే. నీ ఇష్టం” అని ప్రేమగా అనేంత సముద్రమంత హృదయం లోహితాక్షన్ గారిది. అన్నింటా వెంట ఉండి… వెన్నుగా నిలుస్తూ ఉన్నారు వారు.ఇద్దరూ సాధకులే.సాధువులే.
పగలంతా ప్రకృతి మాత వారిపై కురిపించిన సౌందర్య రసాన్ని హృదయ పాత్ర నిండా నింపుకుని… నింపుకున్న పాత్రను దోసిట్లో ఉంచుకుని జాగ్రత్తగా సాయంత్రానికి కుటీరాన్ని చేరుకుంటారు.గాఢమైన చీకటి పడ్డాక సత్య సౌందర్య రస పాత్ర చేతబుచ్చుకుని త్రాగుతూ అనంతమైన ఆనందంలో మునకలేస్తారు… వారిని చుస్తూ వైటీ కూడా ఆనందంతో గంతులేస్తుంది.
రేపు ఏమి తినాలి? అన్న పట్టింపు లేదు, ఎక్కడికెళ్లాలన్న ప్రణాళికా లేదు, అడవి,కొండ,కుటీరం,వైటీ తో కలసి ముగ్గురి జీవనం. తదేకమైన జీవితం. రోజులతరబడి ఒకే సంగీతం. నదిగలగలలు, జలపాతపు హోరు, జివ్వుమని వీచే మహా వృక్షాల శబ్దం…కుండపోత వర్షపు ఊపిరాడనీయని మ్రోత ఎప్పుడూ తదేకమైన జీవితమే. సుదూరపు అడవులను, కొండలను, నదులను అనంతమైన ఏడారులనూ కలగంటూ తదేకమైన చూపు.
సూర్యోదయ, సూర్యాస్తమయాలు కురిసే మెత్తటి నారింజ రంగు నీరెండలలో నిత్యం తడిసిపోతూ ఉంటారు ఈ అన్వేషకులు. చీకటి పడ్డ పున్నమి రోజులలో కుటీరపు ఆరుబయట కూర్చుని నింగినుండి భూమిపైకి పారే చల్లని వెన్నెల్లో సేదతీరుతారు ఈ పుణ్య దంపతులు.
వేవేల అడవి పూల చెట్లు రంగురంగుల పక్షులు మీదకు వాలే సీతాకోకచిలుకలు భూమిపై ఉండే ఆనందంమంతా వారిదే.
వాళ్ళు అడవికి చెందినవారు.అడవి అపార దయామయి వారికి. అడవి అందాలను ఫోటోలు తీస్తూ… కొన్నిసార్లు ఫోటోతీయలేక ఆ సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోవడం. ఇదొక అద్భుత యదార్థ జీవిత యాత్ర.
అంతా ఆనందమే కాదుగా. ఆకలుంటుంది.భయముంటుంది. అడవంటే అడుగడుగునా ప్రమాదముంటుంది. క్రూర జంతువులు, విష నాగులు, క్రిమి కీటకాలు, ఎండలు… హోరు వానగాలులు… అన్నీ ఉంటాయి. మనం చలిస్తాం. ఇక చాలని చాలిస్తాం. కానీ వాళ్ళలా కాదు….
గీతలో యోగి గురించి శ్రీకృష్ణుడు
సర్వభూతస్తమాత్మానాం సర్వభూతానిచాత్మని
ఈక్షతేయోగయుక్తాత్మా సర్వత్రసమదర్శినః
అన్నట్టు వీరు అన్నింటినీ నిశ్చలంగా చూస్తూ ముందుకు నడచిపోయే, మన కాలంలో జీవిస్తూ ఉన్న అద్భుత సాధకులు. మరింత గాఢమైన అడవి కోసం వెతుకుతూ… చిక్కని ఆనంద పారవశ్యంలో నడుస్తూ అనంతమైన దారుల్లో వారి పయనం.
వీరి అనుభవాలూ, అనుభూతులు పుస్తక రూపంలో వచ్చాయిగనుక ఈ మాట చెబుతున్నాను. వీరి ఈ సాధనా పథం తెలుగు సాహిత్యములో కొందరిని… నిజమైన అన్వేషకులను… మరింత ముందుకు… మరింత లోతుకు… మరెంతో విశాల విస్తీర్ణం చేయగలరని నా చిన్న అభిప్రాయం.
ఇదెంతో అందమైనది కూడా. పుస్తకంలోంచి ఓ బిందువు అమృతానుభూతిని గుండెలోకి ఒంపుకున్నాను. మీరూ అడవి పుస్తకం చదివి హృదయ పాత్రను నింపుకోండి.
“‘అడవి నుండి అడవికి’, ‘అడవి పుస్తకం’ అనేవి జయతి లోహితాక్షణ్ తల్లి రాసిన రెండు పుస్తకాలు.”
కె.కె. రామయ్యగారు!
రచయిత్రి పేరు జయతి లోహితాక్షణ్? జయతి లోహితాక్షణ్ తల్లి? లేక పుస్తకాలు రాసింది జయతి లోహితాక్షణ్ అన్న వ్యక్తి గారి తల్లిగారు? మీరు ఈ రెండు పుస్తకాలు చదివారా?
రామయ్యగారూ! అడవులతో మీకున్న పరిచయం ఎలాటిది? మీరు చేసిన ప్రయాణాలు ఎట్టివి? అడవుల గురించి గాని, అడవివాసం గురించి గాని, మీరు చదివిన ఇతర పుస్తకాలు, వాటి రచయితల పేర్లు (ఏ దేశపువారైనా గాని,) ఏమిటి?
Your recommendation of someone else’s recommendation of some one else’s writing on something whatsoever! How many middle men do I need? Why should I heed you?
‘అడవి నుండి అడవికి’, ‘అడవి పుస్తకం’ అనేవి జయతి లోహితాక్షణ్ తల్లి రాసిన రెండు పుస్తకాలు.
1) “అడవి నుండి అడవికి” జయతి లోహితాక్షణ్ గారి మొదటి రచన, 2018లో ప్రచురణ. పుస్తక సమీక్ష నవంబరు 2018 ఈమాట సంచిక లో దాసరి అమరేంద్ర గారే అద్భుతంగా చేసారు.
2) “అడవి పుస్తకం” జయతి లోహితాక్షణ్ గారి రెండవ రచన, 2021 లో ప్రచురణ. ఈ పుస్తకం జయతి లోహితాక్షణ్ రెండున్నర సంవత్సరాల క్రిందట రాసిన ‘అడవి నుండి అడవికి’ అన్న రచనకు కొనసాగింపు. ఎక్కడ ఆ పుస్తకం ముగిసిందో అక్కడ్నించి ఆరంభమవుతుందీ పుస్తకం…
జయతి లోహితాక్షణ్ గారి రచనలలోని అంతసూత్రాన్ని (ప్రకృతితో మమేకం అవుతున్న తన అభీష్టాన్ని) సున్నితంగా పట్టుకుని మనకు వివరించడం దాసరి అమరేంద్ర గారికే సాధ్యం (మరో యాత్రా పథికుడిగా). వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ గురించి కొమాండూరి వేణుగోపాల అభిప్రాయం:
05/16/2021 7:55 am
ఈ వ్యాస రచయిత చెప్పినట్లు అప్రయత్నంగా శివాలయంలో ఉండి శివదీక్షామంత్రాలు విని కైవల్యము పొందటమవేది ఆహేతుకమే కాక, అనైతిక ప్రవర్తనలను ప్రోత్సహించడము కూడా. (ఇక్కడ విషయాన్నే ఎత్తి చూపుతున్నాను కానీ కలి దోషమని కాదు). ఇలాంటి రచన (ప్రధానోద్దేశ్యము దుర్మార్గులను కూడా భక్తిదిశగా మళ్లించటమైననూ) వల్ల నిజమైన దీక్షాపరులు,భక్తులు (తాము కష్టాలు పాలైనప్పుడు, ఇతరుల వల్ల గానీ, పరిస్థితుల వల్లన కానీ) దుర్భర స్థితులు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు (మన నిత్య జీవితంలో చాలా మందినే చూసి ఉంటాము) పూర్తి అసందిగ్ధతకు, భద్రతారాహిత్యానికి లోనవుతారు.
తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి Nagendra Kasi అభిప్రాయం:
05/16/2021 4:07 am
Wonderful write up Sir.
గెలుపు గురించి Surendranath Goturi అభిప్రాయం:
05/16/2021 2:07 am
Very engaging story, layered with psychologicl realities of vulnarable and fragile human nature, sir..thanks for the share.
తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి B. Rama Naidu అభిప్రాయం:
05/15/2021 6:06 pm
బాగా పరిచయం చేస్తున్నారు. ఈయనో అసాధారణ రచయిత అనిపించింది. ఇదే మొదటిసారి ఆయన వైవిధ్య సాహితీ కారుడని తెలిసింది.
ఈయన కథలు నాకు ఎంత మేరకు అర్ధం అవుతాయనే అనుమానం కూడా వచ్చింది.
అయన తన గురించి చెప్పుకున్న విషయాలు నా ఆలోచనలకు దగ్గిరగా ఉన్నాయి.
రచయితల సంఘాలు 1970 ల తరవాత చేసిన మంచి చెడుల మీద క్రిటికల్ అప్రైసల్ రావలసి ఉంది.
రెండో భాగం గురించి ఎదురు చూస్తున్నాను.
మను చరిత్ర – ప్రథమాశ్వాసము గురించి Neelakanta Pratap T అభిప్రాయం:
05/15/2021 8:56 am
మనోజ్ఞమైన కావ్యాన్ని చదివే సౌభాగ్యాన్ని కలిగించినందుకు నమస్సుమాంజలులు. కరోన కఠిన కాలమందు కమనీయమైన కావ్య పఠన నా college days మనోహర స్మ్రతులు గుర్తుకు తెచ్చినై. ఈ కావ్యాన్ని ఆ రోజుల్లో మాకు బళ్ళారిలో మునిసిపల్ కాలేజ్ లో వర్ణించి వివరించిన ఉపాధ్యాయులైన శ్రీ నారాయణస్వామికి నా మనహ్పూర్వక వందనములు ఈ ద్వారా తెలుపుకొంటాను.
అడవి పుస్తకం గురించి సోమ భూపాల్ అభిప్రాయం:
05/14/2021 10:20 pm
జయతి లోహితాక్షన్ అమ్మగారి అడవి పుస్తకం గురించి సవిరమైన విశ్లేషణ సార్… తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్… గురించి N S murty అభిప్రాయం:
05/14/2021 11:20 am
అన్వర్,
చంద్ర గారిని మొదటి సారీ ఆఖరి సారీ కలుసుకున్నది San Antonoioలో Texas Telugu Association వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో. గడిపింది కొద్దిగంటలే అయినా, అతను కొద్ది క్షణాల్లోనే ఎన్నాళ్లనుండో పరిచయమున్న మిత్రుడిలా దగ్గరయ్యాడు. మరిచిపోలేని మిత్రుడయ్యాడు. చాలా మంచి విషయాలు మాటాడేడు. దురదృష్టవశాత్తూ అతని నెంబరు పోగొట్టుకున్నా. అతనితో తీసుకున్న సెల్ఫీ కూడా పోగొట్టుకున్నా సెల్ ఫోనుతో పాటే. ఆయన ఇండియా రాననో, రాలేననో చెప్పినట్టు గుర్తు. అతనొక చెరగని జ్ఞాపకపు ముద్ర.
అన్వర్, మీకు మీ జ్ఞాపకాలని మంచి కుతూహలం రేకెత్తించే కథలుగా చెప్పగలిగే నేర్పు ఉంది. మీతోబాటు చెయ్యిపట్టుకుని తీసుకుపోతారు. అభినందనలు.
అడవి పుస్తకం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
05/13/2021 8:58 pm
డా. లైలా యెర్నేని గారు, నమస్కారములు.
‘అడవి పుస్తకం’ గురించి క్రిందపొందుపరిచిన సోమ భూపాల్ గారి వ్యాఖ్యానం దయచేసి చూడండోసారి.
ఫేస్బుక్లో జయతి లోహితాక్షన్ గారి పోస్ట్‌లు; వారు తీసిన అడవి, అడవి బిడ్డల అరుదైన ఫొటోలు చూడండి. దాసరి అమరేంద్ర గారు, కాకినాడ అక్కయ్య డా. వాడ్రేవు వీరలక్ష్మి, వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఇంకా ఎందరెందరికో మల్లే తను మీకూ మరింత దగ్గరిగా పరిచయమవుతారు. మీ అభిమానానానికి పాత్రులవుతారు.
అడవి మాట పక్కన పెట్టి జయతికి తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాల పట్ల ఉన్న ఉత్తమ అభిరుచిని చూడండి. మీరు కనెక్ట్ అవుతారు.
________________________________________
అనంత చీకట్లో ఒక్కటే పాక, దాని ముందు చలిమంట, ఆ మంట ముందు మేము ముగ్గురం
( జయతి, లోహితాక్షన్, వైటీ.)
ఎక్కడో పుస్తకం మధ్యలో వస్తుంది ఈ మాట.నేను మెల్లగా కూరుకుపోతూ ఉన్నాను ఆ భావనలో.యజ్ఞం కాక మరేమిటి అది.యజ్ఞమే.అన్వేషనా యజ్ఞం.కాసేపు పుస్తకం కనపడలేదు నాకు.చీకటి,ముందు మంట.. అనంతమైన ఆకాశం…చేతికందే పాలపుంత.ఆమె ఇది కవిత్వంగా రాయలేదు.ఆ గాఢమైన అడవిలో కవిత్వంలా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు.
అడవి నుండి అడవికి మొదలై అడవి పుస్తకమైపోయిన ఇద్దరు మనుషులు, ఒక కుక్క-వైటీ. పుస్తకం చదివాక మీతో పంచుకోకుండా ఉండలేని కొన్ని విషయాలు ఇక్కడ ఉంచుతున్నాను.
ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నందున పుస్తకం మా ఊరు చేరింది. చేతికందడం ఆలస్యమైంది. ఎదురుచుస్తూ ఉన్నాను. వీలుచేసుకుని నేనే వెళ్లి పుస్తకం తెచ్చుకుని ఇక నిన్న ఉదయం తెరిచాను. నేను ఏదీ ఉహించుకోలేదు ఈ పుస్తకం గురించి. ఎందుకంటే ఇది ఏ ప్రముఖ రచయితో రాసిన కథో, కవితో, ఏ నవలో సీరియలో కాదిది.
ఈ పుస్తకం నిండైన ఒక అన్వేషి యదార్థ జీవన పథ అనుభవాల మాల.మనుషుల ఇరుకుతనం మధ్య, వాడిపోయిన మానవత్వం మధ్య ఇమడలేని ఒక సున్నిత పసి హృదయం పాడిన తన హృదయాంతరాల తపన. సత్యం కోసం అర్రులుచాస్తూ కొండల్లోకి, చిక్కటి అడవుల్లోకి, నదుల్లోకి, అనేక పూల వనాల్లోకి నిశ్చలంగా నడుస్తూ వెళ్లిన ఒక సాధకురాలు చెప్పిన అత్యంత పురాతన మార్మిక రహస్యం ఈ పుస్తకం.
“ఎడారిని చూడటమంటే ప్రియతముని జాడ తెలియడం” అని తన హృదయాంతరాల్లోంచి నాకు ఆ యోగిని గంభీరమైన స్వరం వినపడగానే నా చుట్టూ. నాలో ఒక నిశ్చలత ఆవరించింది. మరుక్షణమే ఎదో అలజడి కూడా.
ఏవీ వద్దు అనుకుని వెళ్లిపోయారంట అడవిలోకి… అనుకుని కాదు. అనుకుంటూ ఉంటే వెళ్లలేం అనుకుని… ఇక అనుకోకుండా వెళ్లిపోయారు. లోకమంటే అసహ్యమూ కాదు. జీవితమంటే నిర్వేదం అసలు కానే కాదు.ఏదీ కాదు. ఏదీ కానప్పుడు మరెందుకు అక్కడున్నారు అంటే “ఇక్కడెందుకు ఉండకూడదు?” అని ప్రశ్నించే తత్వం.
మాలా ఇక్కడ మనుషుల మధ్య ఎందుకు లేరు అంటే “మీరు కూడా మాలాగా అడవిలో ఎందుకు ఉండలేరు?” అని అడిగినట్లు అనిపిస్తుంది నాకు.నిజమే…
కొందరు లోకానికి చెందరు.వాళ్ళను ఆశ అనే గురుత్వాకర్షణ పట్టి ఉంచలేదు. నాది అనే చక్రంలో ఎల్లకాలం తిరుగుతూ ఉండలేరు. ఉండనివ్వదు వారి హృదయం. అలాగే జయతి లోహితాక్షన్లు కూడా లోకానికి చెందరు.వీళ్ళనుగానీ… ఈ పుస్తకాన్నిగానీ “ఇదీ” అని నిక్కచ్చిగా చెప్పలేము. ఒక విషయానికి పరిమితం చెయ్యనూలేము.
వాళ్లు అనంతమైన సత్య దర్శనానికి వెళ్లిపోయారంతే.
జయతిగారి సత్య సౌందర్య దాహానికి సహచరుడు లోహితాక్షన్ గారి సహకారం చరిత్రలో చెరగని ప్రేమ ముద్రగా నిలిచిపోతుంది. తండ్రిమాటను కాదనక రాముడు అడవులకెళ్తే..వెంట సీతాదేవి..లక్ష్మణుడు నడిచినట్టు… సీతాదేవి అడవులకు వెళ్తానంటే వెంట నడచిన ఒక రాముడు, అలాగే వైటీ… ఇది రామాయణంలా ఉంది అనిపిస్తోంది.
“నాకు అడవికి వెళ్లిపోవాలనీ, అడవికే సొంతమైపోవాలనీ, అక్కడే ఆ కొండల్లో ఉండిపోవాలనీ ఉంది” అని జయతిగారు చెప్పినప్పుడు మరొకరిలా “ఏమిటీ పిచ్చి? ఎందుకు అడవి?” అని కేకలేయకుండా
“సరే. నీ ఇష్టం” అని ప్రేమగా అనేంత సముద్రమంత హృదయం లోహితాక్షన్ గారిది. అన్నింటా వెంట ఉండి… వెన్నుగా నిలుస్తూ ఉన్నారు వారు.ఇద్దరూ సాధకులే.సాధువులే.
పగలంతా ప్రకృతి మాత వారిపై కురిపించిన సౌందర్య రసాన్ని హృదయ పాత్ర నిండా నింపుకుని… నింపుకున్న పాత్రను దోసిట్లో ఉంచుకుని జాగ్రత్తగా సాయంత్రానికి కుటీరాన్ని చేరుకుంటారు.గాఢమైన చీకటి పడ్డాక సత్య సౌందర్య రస పాత్ర చేతబుచ్చుకుని త్రాగుతూ అనంతమైన ఆనందంలో మునకలేస్తారు… వారిని చుస్తూ వైటీ కూడా ఆనందంతో గంతులేస్తుంది.
రేపు ఏమి తినాలి? అన్న పట్టింపు లేదు, ఎక్కడికెళ్లాలన్న ప్రణాళికా లేదు, అడవి,కొండ,కుటీరం,వైటీ తో కలసి ముగ్గురి జీవనం. తదేకమైన జీవితం. రోజులతరబడి ఒకే సంగీతం. నదిగలగలలు, జలపాతపు హోరు, జివ్వుమని వీచే మహా వృక్షాల శబ్దం…కుండపోత వర్షపు ఊపిరాడనీయని మ్రోత ఎప్పుడూ తదేకమైన జీవితమే. సుదూరపు అడవులను, కొండలను, నదులను అనంతమైన ఏడారులనూ కలగంటూ తదేకమైన చూపు.
సూర్యోదయ, సూర్యాస్తమయాలు కురిసే మెత్తటి నారింజ రంగు నీరెండలలో నిత్యం తడిసిపోతూ ఉంటారు ఈ అన్వేషకులు. చీకటి పడ్డ పున్నమి రోజులలో కుటీరపు ఆరుబయట కూర్చుని నింగినుండి భూమిపైకి పారే చల్లని వెన్నెల్లో సేదతీరుతారు ఈ పుణ్య దంపతులు.
వేవేల అడవి పూల చెట్లు రంగురంగుల పక్షులు మీదకు వాలే సీతాకోకచిలుకలు భూమిపై ఉండే ఆనందంమంతా వారిదే.
వాళ్ళు అడవికి చెందినవారు.అడవి అపార దయామయి వారికి. అడవి అందాలను ఫోటోలు తీస్తూ… కొన్నిసార్లు ఫోటోతీయలేక ఆ సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోవడం. ఇదొక అద్భుత యదార్థ జీవిత యాత్ర.
అంతా ఆనందమే కాదుగా. ఆకలుంటుంది.భయముంటుంది. అడవంటే అడుగడుగునా ప్రమాదముంటుంది. క్రూర జంతువులు, విష నాగులు, క్రిమి కీటకాలు, ఎండలు… హోరు వానగాలులు… అన్నీ ఉంటాయి. మనం చలిస్తాం. ఇక చాలని చాలిస్తాం. కానీ వాళ్ళలా కాదు….
గీతలో యోగి గురించి శ్రీకృష్ణుడు
సర్వభూతస్తమాత్మానాం సర్వభూతానిచాత్మని
ఈక్షతేయోగయుక్తాత్మా సర్వత్రసమదర్శినః
అన్నట్టు వీరు అన్నింటినీ నిశ్చలంగా చూస్తూ ముందుకు నడచిపోయే, మన కాలంలో జీవిస్తూ ఉన్న అద్భుత సాధకులు. మరింత గాఢమైన అడవి కోసం వెతుకుతూ… చిక్కని ఆనంద పారవశ్యంలో నడుస్తూ అనంతమైన దారుల్లో వారి పయనం.
వీరి అనుభవాలూ, అనుభూతులు పుస్తక రూపంలో వచ్చాయిగనుక ఈ మాట చెబుతున్నాను. వీరి ఈ సాధనా పథం తెలుగు సాహిత్యములో కొందరిని… నిజమైన అన్వేషకులను… మరింత ముందుకు… మరింత లోతుకు… మరెంతో విశాల విస్తీర్ణం చేయగలరని నా చిన్న అభిప్రాయం.
ఇదెంతో అందమైనది కూడా. పుస్తకంలోంచి ఓ బిందువు అమృతానుభూతిని గుండెలోకి ఒంపుకున్నాను. మీరూ అడవి పుస్తకం చదివి హృదయ పాత్రను నింపుకోండి.
– సోమ భూపాల్ May 11, 2021
అడవి పుస్తకం గురించి Lyla yerneni అభిప్రాయం:
05/13/2021 5:43 pm
“‘అడవి నుండి అడవికి’, ‘అడవి పుస్తకం’ అనేవి జయతి లోహితాక్షణ్ తల్లి రాసిన రెండు పుస్తకాలు.”
కె.కె. రామయ్యగారు!
రచయిత్రి పేరు జయతి లోహితాక్షణ్? జయతి లోహితాక్షణ్ తల్లి? లేక పుస్తకాలు రాసింది జయతి లోహితాక్షణ్ అన్న వ్యక్తి గారి తల్లిగారు? మీరు ఈ రెండు పుస్తకాలు చదివారా?
రామయ్యగారూ! అడవులతో మీకున్న పరిచయం ఎలాటిది? మీరు చేసిన ప్రయాణాలు ఎట్టివి? అడవుల గురించి గాని, అడవివాసం గురించి గాని, మీరు చదివిన ఇతర పుస్తకాలు, వాటి రచయితల పేర్లు (ఏ దేశపువారైనా గాని,) ఏమిటి?
Your recommendation of someone else’s recommendation of some one else’s writing on something whatsoever! How many middle men do I need? Why should I heed you?
Who are you?
-Lyla
అడవి పుస్తకం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
05/13/2021 5:36 am
డా. లైలా యెర్నేని గారు,