పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. అస్తిత్వపు ఆనవాళ్ళు గురించి అక్షర అభిప్రాయం:

    07/04/2021 1:33 am

    మతాంతర వివాహం చేసుకుని, ఒకర్ని ఒకరు చక్కగా అర్థం చేసుకుని కొన్ని సంవత్సరాలు చక్కగా అర్థం చేసుకుని మెలుగుతున్న సరిత, రఫీ కొడుకు ఉపనయనం విషయంలో మతభేదం వచ్చి, వారి సంసారంలో కలతలు వచ్చి బాధపడుతున్న సమయంలో సరిత స్నేహితురాలు సరైన హితబోధ చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది. కథకి చక్కటి ముగింపు చూపిన రచయిత్రికి అభనందనలు.

  2. అజెండా గురించి Srikanth అభిప్రాయం:

    07/03/2021 4:11 pm

    శేషు అజెండాను పసిగట్టి చెక్ పెట్టిన కరుణ చాతుర్యం ఈ కథలో ప్రధాన హైలెట్.. టైటిల్ జస్టిఫికేషన్. కథ బాగుంది!

  3. అజెండా గురించి Uma అభిప్రాయం:

    07/02/2021 9:27 pm

    సుధ కథ బాగా నచ్చింది. పాము కప్ప యనాలజి గొప్పగా అనిపించింది. చిన్న కథలో చిన్న పాత్రలతో ఒకటి రెండు మాటల్లోనే పాత్రల మనస్తత్వాలు లోతుగా చెప్పగలగడం చాలా నచ్చింది.

  4. జులై 2021 గురించి purnima అభిప్రాయం:

    07/02/2021 11:37 am

    ఈ విషయమై ఫేస్‍బుక్‍లో చాలానే చర్చ నడిచింది. అక్కడ కూడా కా.రా రచనల “క్లాసిక్” స్టేటస్‌ గురించి ప్రశ్నలెత్తినవాళ్ళని, ముఖ్యంగా పాతిక ముప్ఫై ఏళ్ళ వయసున్నవారిని “మీకేం తెలీదు. మీకెప్పటికీ అర్థం కాదు. మీది అజ్ఞానం. మూర్ఖత్వం. అమాయకత్వం.” అన్న condescending tone ఎక్కువగా వినిపించింది.

    అసలు ఒక రచనని, రచయితలని “క్లాసికల్”గా అభివర్ణించడానికి ఇంత తాపత్రయం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. వాద ప్రతివాదాలు జరక్కుండానే అందరూ ఏకగ్రీవంగా ఎందుకు ఒక రచయితని, వారి రచనలని ఒక అందలం ఎక్కించాలి? ప్రతివాదం వినిపిస్తే అది ఆ రచయితని అగౌరవపరిచినట్టు ఎందుకు భావిస్తున్నారు? సమకాలీనులు వివాదాలు సృష్టించి, నిషేదించి, కాల్చి బూడిద చేసిన ప్రపంచ సాహిత్యాన్ని మనం ఇప్పుడు “క్లాసిక్స్” అనుకుంటూ చదవడం లేదా? తరాల తరబడి మరుగున పడిపోయిన రచనలు కూడా కొత్త వెలుగులోకి తీసుకొచ్చి ప్రాచుర్యం పొందిన దాఖలాలే లేవా?

    అసలు ఒక “క్లాసిక్ రచన” అని దేన్ని అంటారు, లేదా అనుకోవచ్చు? కాల్వినో చెప్పిన పధ్నాలుగు లక్షణాలు ఉండాలా, లేదా కొన్ని ఉంటే చాలా? (https://www.brainpickings.org/2012/07/06/italo-calvinos-14-definitions-of-a-classic/)

    ఇప్పటి పదిహేనేళ్ళ కుర్రాడికి క్రికెట్ లో అత్యుత్తమ బాటింగ్‍ని పరిచయం చేయాలంటే, “వివ్ రిచర్డ్స్ తోపు, సునీల్ గవాస్కర్ తురుము, అసలు సచిన్ టెండూల్కర్‍కి తిరుగే లేదు. వీళ్ళు తెలీకపోవడం నీ దౌర్భాగ్యం.” అని ఊదరగొట్టడం ఒక పద్ధతి. వాళ్ళ బాటింగ్‍కి సంబంధించిన వీడియోలు చూపించాకా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలుగా ఆనాటి ఫిట్నెస్, పిచ్, మాచ్ కండిషన్లు వివరించి వాళ్ళ బాటింగ్‍లో కంటికి కనిపించని గొప్పతనాన్ని వివరించడం ఇంకో పద్ధతి. పద్ధతి ఏదైనా ముందు అసలా పదిహేనేళ్ళ కుర్రాడికి క్రికెట్ పై ఆసక్తి ఉండాలి, బాటింగ్ దిగ్గజాల గురించి తెల్సుకోవాలనే కుతూహలం ఉండాలి.

    ఆ కుతూహలం కలిగేంచే వాతావరణాన్ని సృష్టించడమే మనం చేయగలిగింది. ఏ తరం వాళ్ళకి వాళ్ళ తరానికి సంబంధించిన స్టార్స్ ఉంటారు, ఆ హైప్ తెలుస్తుంది. తర్వాతి తరాలకి అందించాల్సింది ఆ స్టార్‍డమ్, హైప్ కాదు. వాళ్ళు చేసిన పనిలో పస తెలియజెప్పగలగాలి.

  5. అజెండా గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    07/02/2021 11:11 am

    దగ్గర దగ్గరగా ఇటువంటి ఇతివృత్తమే ‘అట్రిబ్యూట్’ అన్న కథలోనూ అనిపించింది. అవకాశాలని అందుకోవడానికి చూడడం. శేషు ఒక రకంగా ఆలోచిస్తుంటే, శ్రీధర్ బాబు మరో యాంగిల్‌లో ఆలోచిస్తున్నాడు! పాత్రల చిత్రణ సూపర్ గా ఉంది!

  6. ఊహల ఊట 2 గురించి Ravada shyamala అభిప్రాయం:

    07/02/2021 10:39 am

    బాల్యంలోని సంఘటనలు ఎంత బాగా గుర్తున్నాయి మీకు! చాలా బాగా చెప్పారు మేడం. బెల్కోరా- ఈ పదం బాగుంది. మాకు మా బాల్యం గుర్తుకు వచ్చింది. మీకు అభినందనలు మేడం.

  7. అస్తిత్వపు ఆనవాళ్ళు గురించి Seshu అభిప్రాయం:

    07/02/2021 10:12 am

    A thought provoking story. Many people are secular like Sarita and Rafi. But our system and society force them to shake their attitude and resolve. It’s sad that sometimes they yield to pressure. Overall a good story!

  8. ఊహల ఊట 2 గురించి Sumanaspati అభిప్రాయం:

    07/02/2021 6:04 am

    The stories will be good material for a short film series.

  9. ఆట గురించి sudha అభిప్రాయం:

    07/01/2021 8:51 pm

    Thank you Amerendra garu, Bhaskar garu , Vamsi Krishna garu, Maa Siddhique garu for your valuable inputs.

  10. ఊహల ఊట 2 గురించి రత్నాల బాలకృష్ణ, విజయనగరం అభిప్రాయం:

    07/01/2021 11:01 am

    చాలా సహజంగా బాల్యంలో వచ్చిన ఆలోచనలను ఊహల ఊట రూపంలో అందిస్తున్న తులసిగారికి అభినందనలు.