eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
పాఠకుల అభిప్రాయాలు
Total Comments: 16453
ఊహల ఊట 4
గురించి రత్నాల బాలకృష్ణ, విజయనగరం అభిప్రాయం:
09/03/2021
11:00 am
బాల్యపు ఊహలు చాలా అమాయకంగా, తెలివిగా, ఆలోచనాత్మకంగా ఉన్నాయి. పదాలను కనిపెట్టవచ్చు అన్న విషయం ఆ బాల్యంలోనే తోచటం చాలా బాగుంది. నానా నవ్వులు అన్న కొత్త పదం, అస్మదీయులుకు తస్మదీయులు అన్న వ్యతిరేక పదం పింగళిగారు పుట్టించినట్టుగా ఉంది.
పుస్తకాలను పరిచయం చెయ్యడంకంటే ముఖ్యంగా ఆ రచయితల (సరికాదు… అనుభవదార్లు అనాలేమో) తృష్ణనీ, విశాలదృక్పథం యొక్క ఆత్మనీ ఆవిష్కరించారు అమరేంద్రగారూ! మీరు రేపిన కాంక్షకు పుస్తకాలు సేకరించుకుంటాం. మెల్లగా చదువుకుంటాం. అంతవరకూ పరవాలేదు. బాక్ పాక్ వేసుకుని బయటకు నడవాలనిపిస్తోందే! అదెలా సాధ్యం? ఓ నాలుగైదు దశాబ్దాల ముందు ఇటువంటి కబురు అందినా… ఏమో ఎగిరేవాణ్ణేమో చుక్కలదాకా. మునిగేవాణ్ణేమో రంగురంగుల నీలి ప్రపంచపు నిలువు లోతుల్లోకి. దూరిపోయేవాడినేమో కాకులు దూరని కారడవుల్లోకి! ఏమో? ప్చ్! ఓ జీవితకాలం లేటు.
ధన్యవాదాలు.
రాజా.
నిజంగానే ఎంతో మక్కువతో చదివి రాసినట్లుగా తెలుస్తోంది. చాలా బాగా రాసారు అమరేంద్రగారూ. మీ పుస్తక పరిచయం నాలో ఉన్న ప్రయాణపు ఆరాటాన్ని సంతృప్తిపరచింది చాలామటుకు. మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది కదా… నాలాటివాళ్లు ఇటువంటి సాహసయాత్రా సాహిత్యాన్ని చదివితే చాలు. ధన్యవాదాలు.
Enjoyed the essay.
The following poem of mine composed 10 or 12 years back, explains itself.
Eliot and Bacon
సుతి లేని ఎలియట్ కి
మతి లేని పెళ్ళాం
శివ శివా! శివ శివా!
అతలాకుతలం అతని ప్రపంచం.
ఇంటిలోని పోరు ఇంతింత కానపుడు
హరి హరీ! హరి హరీ ! ఇంకేదిరా దారీ!
హార్వర్డులో చదువు, ఆక్స్ ఫోర్డులో చదువు, కాని
పిచ్చి పెళ్ళామున్న, కచ్చి కవితలె పుట్టు
కవితలో రట్టు గద అతివపై అతి కసి.
కాగితంపై వక్ర విషాదమే కురిసింది
బ్రతుకు ఇవ్వని సుఖము
సాహితీ బహుమతులలో మెరిసింది!
అతని కన్న ఘనుడు అతని అడారి అభిమాని
ఏథియిస్టు, హోమో, ఫ్రాన్సిస్ బేకన్
ఒకరి కళ వేస్ట్ లేండ్, మరొకరి కళ వాస్ట్ మోర్గ్
బేకన్ కేన్వాసు మీదంతా కార్కాసులే గదా
ఆ కేజ్ లో మనుషులా, మరి మాంసపు ముద్దలా!!
ఎంత జంతువు, ఎంత బందీ, ఎంత బాధ ఇతని మనిషి
ఎంత న్యూనత, ఎంత హేళన, ఎంత శూన్యత ఇతని మనిషి
అందుకేనా అతని కామి జార్జ్ డయర్,
ఆ ఆర్టిస్ట్ అసహ్యాన్నీ,అసహనాన్నీ అనుభవించీ
అనుభవించీ, తనను తానే చంపుకుందీ?
టేట్ బ్రిటన్ లో ఈ కాళకళ విలయనృత్యం
చూసి నే నివ్వెర పోతే, కాలు కదలక నిలిచిపోతే
ప్రళయ వేగంతో పరుగులెత్తే స్ప్రింటర్ల మార్గంలోంచి,
ఇతర ప్రేక్షకులు నన్ను పక్కకు లాగారు.
నాకేం తెలుసు, టేట్ లో ఇప్పుడు
ఆర్టే కాక రన్నింగు కూడా ఎక్సిబిట్ చెయ్యొచ్చని!:-)
గాడ్! ఆ స్ప్రింటర్లు -ఆ వేగపు చలనపు మాస్,
నా స్తంభించిన బాడీని కొడితే
నే ఫట్ ఫట్ పేలిపోయి, నా మాంసం, నా రక్తం, నా ఎముకల
స్ప్లింటర్లు పక్కన గేలరీ తెల్ల గోడలకు ప్లాస్టరైతే,
నేనే ఫ్రాన్సిస్ బేకన్ పాస్తుమస్ మాస్టర్ పీసును.
నే మ్యూసియం గోడ మీంచి – స్వీనీ స్వీటు గొంతులో
“Birth and copulation and death
That’s all the facts when you come to brass tacks”
అని ఎప్పటికీ పాడుతూ ఉండే పని.
అంతేనా, అంతేనా, మళ్ళీ
” Birth and copulation, and death
I have been born, and once is enough.
You don’t remember, but I remember,
Once is enough ”
జననం, సంగమం, ఖననం
ఒకసారి అయ్యింది చాలు
నీకు గుర్తులేదూ! నాకు గుర్తుంది!
ఒకసారి అయ్యింది చాలు:-)
ఈ మరుభూమిలో మరుజన్మ వద్దు
మహదేవా! శివా! శివా! అని
గోడమీద బేకన్ బొమ్మగా, ఎలియట్ పొయెట్రీగా
అతుక్కుపోయి గోల గోల చేసే పని.
ఊహల ఊట 4 గురించి రత్నాల బాలకృష్ణ, విజయనగరం అభిప్రాయం:
09/03/2021 11:00 am
బాల్యపు ఊహలు చాలా అమాయకంగా, తెలివిగా, ఆలోచనాత్మకంగా ఉన్నాయి. పదాలను కనిపెట్టవచ్చు అన్న విషయం ఆ బాల్యంలోనే తోచటం చాలా బాగుంది. నానా నవ్వులు అన్న కొత్త పదం, అస్మదీయులుకు తస్మదీయులు అన్న వ్యతిరేక పదం పింగళిగారు పుట్టించినట్టుగా ఉంది.
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
09/03/2021 3:34 am
పుస్తకాలను పరిచయం చెయ్యడంకంటే ముఖ్యంగా ఆ రచయితల (సరికాదు… అనుభవదార్లు అనాలేమో) తృష్ణనీ, విశాలదృక్పథం యొక్క ఆత్మనీ ఆవిష్కరించారు అమరేంద్రగారూ! మీరు రేపిన కాంక్షకు పుస్తకాలు సేకరించుకుంటాం. మెల్లగా చదువుకుంటాం. అంతవరకూ పరవాలేదు. బాక్ పాక్ వేసుకుని బయటకు నడవాలనిపిస్తోందే! అదెలా సాధ్యం? ఓ నాలుగైదు దశాబ్దాల ముందు ఇటువంటి కబురు అందినా… ఏమో ఎగిరేవాణ్ణేమో చుక్కలదాకా. మునిగేవాణ్ణేమో రంగురంగుల నీలి ప్రపంచపు నిలువు లోతుల్లోకి. దూరిపోయేవాడినేమో కాకులు దూరని కారడవుల్లోకి! ఏమో? ప్చ్! ఓ జీవితకాలం లేటు.
ధన్యవాదాలు.
రాజా.
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి Sunitha Pothuri అభిప్రాయం:
09/02/2021 11:08 pm
నిజంగానే ఎంతో మక్కువతో చదివి రాసినట్లుగా తెలుస్తోంది. చాలా బాగా రాసారు అమరేంద్రగారూ. మీ పుస్తక పరిచయం నాలో ఉన్న ప్రయాణపు ఆరాటాన్ని సంతృప్తిపరచింది చాలామటుకు. మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది కదా… నాలాటివాళ్లు ఇటువంటి సాహసయాత్రా సాహిత్యాన్ని చదివితే చాలు. ధన్యవాదాలు.
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి Amarendra అభిప్రాయం:
09/02/2021 6:59 pm
మూర్తి గారూ..లేదు. ఇలాంటి ప్రశ్నకే అనికేత్ ఇచ్చిన సమాధానం పైన ఉంది చూడండి
వీళ్లది కొత్త చూపు. గంతలు వదిలిన చూపు.
టి. ఎస్. ఎలియట్ కవితాశిల్పం గురించి Lyla yerneni అభిప్రాయం:
09/02/2021 2:34 pm
Enjoyed the essay.
The following poem of mine composed 10 or 12 years back, explains itself.
Eliot and Bacon
సుతి లేని ఎలియట్ కి
మతి లేని పెళ్ళాం
శివ శివా! శివ శివా!
అతలాకుతలం అతని ప్రపంచం.
ఇంటిలోని పోరు ఇంతింత కానపుడు
హరి హరీ! హరి హరీ ! ఇంకేదిరా దారీ!
హార్వర్డులో చదువు, ఆక్స్ ఫోర్డులో చదువు, కాని
పిచ్చి పెళ్ళామున్న, కచ్చి కవితలె పుట్టు
కవితలో రట్టు గద అతివపై అతి కసి.
కాగితంపై వక్ర విషాదమే కురిసింది
బ్రతుకు ఇవ్వని సుఖము
సాహితీ బహుమతులలో మెరిసింది!
అతని కన్న ఘనుడు అతని అడారి అభిమాని
ఏథియిస్టు, హోమో, ఫ్రాన్సిస్ బేకన్
ఒకరి కళ వేస్ట్ లేండ్, మరొకరి కళ వాస్ట్ మోర్గ్
బేకన్ కేన్వాసు మీదంతా కార్కాసులే గదా
ఆ కేజ్ లో మనుషులా, మరి మాంసపు ముద్దలా!!
ఎంత జంతువు, ఎంత బందీ, ఎంత బాధ ఇతని మనిషి
ఎంత న్యూనత, ఎంత హేళన, ఎంత శూన్యత ఇతని మనిషి
అందుకేనా అతని కామి జార్జ్ డయర్,
ఆ ఆర్టిస్ట్ అసహ్యాన్నీ,అసహనాన్నీ అనుభవించీ
అనుభవించీ, తనను తానే చంపుకుందీ?
టేట్ బ్రిటన్ లో ఈ కాళకళ విలయనృత్యం
చూసి నే నివ్వెర పోతే, కాలు కదలక నిలిచిపోతే
ప్రళయ వేగంతో పరుగులెత్తే స్ప్రింటర్ల మార్గంలోంచి,
ఇతర ప్రేక్షకులు నన్ను పక్కకు లాగారు.
నాకేం తెలుసు, టేట్ లో ఇప్పుడు
ఆర్టే కాక రన్నింగు కూడా ఎక్సిబిట్ చెయ్యొచ్చని!:-)
గాడ్! ఆ స్ప్రింటర్లు -ఆ వేగపు చలనపు మాస్,
నా స్తంభించిన బాడీని కొడితే
నే ఫట్ ఫట్ పేలిపోయి, నా మాంసం, నా రక్తం, నా ఎముకల
స్ప్లింటర్లు పక్కన గేలరీ తెల్ల గోడలకు ప్లాస్టరైతే,
నేనే ఫ్రాన్సిస్ బేకన్ పాస్తుమస్ మాస్టర్ పీసును.
నే మ్యూసియం గోడ మీంచి – స్వీనీ స్వీటు గొంతులో
“Birth and copulation and death
That’s all the facts when you come to brass tacks”
అని ఎప్పటికీ పాడుతూ ఉండే పని.
అంతేనా, అంతేనా, మళ్ళీ
” Birth and copulation, and death
I have been born, and once is enough.
You don’t remember, but I remember,
Once is enough ”
జననం, సంగమం, ఖననం
ఒకసారి అయ్యింది చాలు
నీకు గుర్తులేదూ! నాకు గుర్తుంది!
ఒకసారి అయ్యింది చాలు:-)
ఈ మరుభూమిలో మరుజన్మ వద్దు
మహదేవా! శివా! శివా! అని
గోడమీద బేకన్ బొమ్మగా, ఎలియట్ పొయెట్రీగా
అతుక్కుపోయి గోల గోల చేసే పని.
-Lyla
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి suryanarayana murthy అభిప్రాయం:
09/02/2021 1:37 pm
ఇలాంటి యాత్రలు చెయ్యాలంటే సాధారణ జీవితం మీద ఒక రకమైన వైరాగ్యం కలగాలి, ఆ విషయం పుస్తకాల్లో కనపడిందా?
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి రఘువర్మ బసవరాజు అభిప్రాయం:
09/01/2021 11:32 pm
చక్కటి శైలి, ఆసక్తికరమైన భిన్న యాత్రికుల యాత్రానుభవాల కథనం! మీలోని యాత్రికుడి హృదయం దర్శనమిచ్చింది వ్యాసం ఆద్యంతమూ. అభినందనలు అమరేంద్రగారూ!
ఊహల ఊట 4 గురించి వి.వెంకటరావు అభిప్రాయం:
09/01/2021 10:24 pm
ఊహాల ఊట 4 యెంత బాగుందో! మచ్చకొండా, సింహాచలం సత్రం చదువుతుంటే, విజయనగరంలో తిరుగుతున్నట్టుగానే వుంది. పిల్లలకు వచ్చే ప్రశ్నలూ, జవాబులూ కథలో ఇంకిపోయాయి.
సంకల్పం-సంభవం గురించి దాము అభిప్రాయం:
09/01/2021 9:51 pm
Thank You అదిత్య గారు. తప్పకుండా మీకు తమిళ కథలు పంపుతాను.
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి ఛాయా మోహన్ బాబు అభిప్రాయం:
09/01/2021 9:49 pm
చదివే వాళ్ళని ఆ యాత్రికులకి పరిచయం చేసి వాళ్ళతో పాటు అనుభవాల్ని పంచుకునేలా చేసిన రచన. అతి చక్కటి పుస్తకాలకి చక్కటి పరిచయం