ఈ సారి ఊట ఎంత బాగా ఊరిందో! ఆడ ఏడుపులు, మగ నిబ్బరాలు, చావు, బతుకు, పయనం, అన్నిటిమీదా బుర్రా మనసూ ఏకం చేసి ఊహలూరించేసింది పాపాయి. నాగమణికి ఇలాంటి నేస్తం మళ్ళీ దొరుకుతుందా ఎక్కడైనా? మాకు మాత్రం ఇలాంటి ఊటలింకెన్నో కావాలి.
మీ మాటల్లో చెప్పాలంటే – “ప్రతీ పదం ఆచితూచి రాయాలి. ప్రతీ అక్షరాన్ని పట్టిపట్టి చూసి చూసి తడబడిన, పొరబడిన వాటికి సర్దిచెప్పి సరిచేయాలి.‘ఇది తప్పుడు స్టేట్‌మెంట్. మేం ఒప్పుకోం!’ అనే దాడికి గురికాగల వాక్యాలని గుర్తించి ఎవరూ కొట్టిపారేయలేని రిఫరెన్సుల లింక్స్ చేర్చి వాటి మనోధైర్యాన్ని పెంచాలి. భావావేశంలో అదుపు తప్పి ఆవేశపడుతున్న పదాలను వెనక్కి లాక్కొచ్చి కాసిన్ని మంచినీళ్ళు తాగించాలి. బెరుకుగా వెనక్కి దాక్కుండిపోతున్న నిజాలని ముందుకు చొచ్చుకొచ్చేలా తోయాలి.”
అభిప్రాయానికి, నిజానికి, ఏదన్నా చెప్పాలంటే ఎంత కష్టం కదా… ఎన్ని సున్నితత్వ యుద్ధాలు చేయాలో, ఎన్ని ఎడిట్ యుద్దాలకీ, కత్తెర్లకీ బలి అవ్వాలో…
అభిప్రాయం ఎలా టెంప్లెట్ అయిందో రాజకీయం, జీవితం అలా టెంప్లెట్ అయింది, అవబోతోంది అని ఖచ్చితంగా చెప్పారు పూర్ణిమా…
నాకు యువాల్ నొహ్ హరారి గుర్తు వచ్చాడు. తెలుగులో చదవటం మరీ ఆందోళనగా ఉంది.
గొప్ప కథ అనేకన్నా గొప్ప నెరేటివ్, మరింత గొప్పగా క్రిస్ప్ గా చెప్పారు. హాట్స్ అఫ్ఫ్ .. కుడోస్
చాలా బాగుంది. అరుదుగా దొరుకుతాయి ఇలాంటి మంచి రచనలు. జరుగుతున్న విషయాలు చెప్పడం, పదాల, వాక్యాల ప్రయోగం ఆసక్తిగా అనిపించింది. ఆసాంతం చదివించింది. రచయిత్రికి అభినందనలు!
పూర్ణిమ వ్రాసిన కథలలో “℞: మారేజ్” కథ నాకు బాగా అర్థమైన, నచ్చిన కథ. ఇప్పుడు ఆ కథ ప్రస్తావన రావడం వల్ల మళ్ళీ పూర్తిగా చదివాను. నాకు ఆ కథ సారంశం గుర్తుంది. అది తట్టిన అంశం గుర్తుంది. అందులో అమ్మాయి వేదన గుర్తుంది. మరి “దేహ భాషల మూస” అని ఎందుకన్నారు అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు మళ్ళీ చదివాను.
ఆ కథని వర్ణించడానికి ఆంగ్లంలో “graphic description” ఆనడం సరిపోతుందనిపించింది. అర్థం రూఢి చేసుకుందామని వెతితికితే దొరికిన వివరణ నప్పినట్టు అనిపించింది:
“If you say that a description or account of something unpleasant is graphic, you are emphasizing that it is clear and detailed.”
ఆ కథకి, కథనానికీ ఆమె అలా చెప్పడం సరిపోయింది. అది సహజంగా ఉంది కానీ తెచ్చిపెట్టినట్లు అనిపించలేదు. అలా అయ్యి ఉంటే “మూసలో” కథ అనవచ్చునేమో.
ఆ కథకీ, ఈ ప్రస్తుత కథకీ సామ్యం ఉంది. “చినుకులా సాగి నదులుగా పారి” అన్నట్లు ఒక సమస్య, ఎప్పుడూ ఉన్న సమస్య, ఎప్పటికప్పుడు తగ్గిపోయినట్టు మభ్యపెట్టుకుంటూ వస్తుంటే దాని మానాన అది ఉధృతంగా పెరుగుతూ పోవడం కళ్ళకి కట్టబ్దుతోంది. ℞: మారేజ్ కథలోనూ అంతే. ఇక తల వొగ్గాను అనుకుని చెప్పిన మందు తీసుకుంటే అక్కడితో సమస్య తీరలేదు, ఈ కథలో లానే.
మరి ఈ రెండు కథలో ఒక మూసకు చెందుతాయేమో, ఆ విధంగా చూస్తే?
ఊహల ఊట 5 గురించి Lalitha P అభిప్రాయం:
10/11/2021 1:22 am
ఈ సారి ఊట ఎంత బాగా ఊరిందో! ఆడ ఏడుపులు, మగ నిబ్బరాలు, చావు, బతుకు, పయనం, అన్నిటిమీదా బుర్రా మనసూ ఏకం చేసి ఊహలూరించేసింది పాపాయి. నాగమణికి ఇలాంటి నేస్తం మళ్ళీ దొరుకుతుందా ఎక్కడైనా? మాకు మాత్రం ఇలాంటి ఊటలింకెన్నో కావాలి.
నేను సైతం గురించి Ratna Sree Vattem అభిప్రాయం:
10/10/2021 12:21 pm
రావుడి మాటల్లో సగటు మనిషి మనస్తత్వం చక్కగా చూపించారు. ఇదే అసలు వాస్తవం. చాలా బావుంది👌👌👌
నేను సైతం గురించి Sridhar Alla అభిప్రాయం:
10/10/2021 11:16 am
Good one! Reflects the present state of the society and the hypocrisy, but life should carry on in spite of all this drama!
ఎడిట్ వార్స్ గురించి సాయి పద్మ అభిప్రాయం:
10/10/2021 7:35 am
మీ మాటల్లో చెప్పాలంటే – “ప్రతీ పదం ఆచితూచి రాయాలి. ప్రతీ అక్షరాన్ని పట్టిపట్టి చూసి చూసి తడబడిన, పొరబడిన వాటికి సర్దిచెప్పి సరిచేయాలి.‘ఇది తప్పుడు స్టేట్‌మెంట్. మేం ఒప్పుకోం!’ అనే దాడికి గురికాగల వాక్యాలని గుర్తించి ఎవరూ కొట్టిపారేయలేని రిఫరెన్సుల లింక్స్ చేర్చి వాటి మనోధైర్యాన్ని పెంచాలి. భావావేశంలో అదుపు తప్పి ఆవేశపడుతున్న పదాలను వెనక్కి లాక్కొచ్చి కాసిన్ని మంచినీళ్ళు తాగించాలి. బెరుకుగా వెనక్కి దాక్కుండిపోతున్న నిజాలని ముందుకు చొచ్చుకొచ్చేలా తోయాలి.”
అభిప్రాయానికి, నిజానికి, ఏదన్నా చెప్పాలంటే ఎంత కష్టం కదా… ఎన్ని సున్నితత్వ యుద్ధాలు చేయాలో, ఎన్ని ఎడిట్ యుద్దాలకీ, కత్తెర్లకీ బలి అవ్వాలో…
అభిప్రాయం ఎలా టెంప్లెట్ అయిందో రాజకీయం, జీవితం అలా టెంప్లెట్ అయింది, అవబోతోంది అని ఖచ్చితంగా చెప్పారు పూర్ణిమా…
నాకు యువాల్ నొహ్ హరారి గుర్తు వచ్చాడు. తెలుగులో చదవటం మరీ ఆందోళనగా ఉంది.
గొప్ప కథ అనేకన్నా గొప్ప నెరేటివ్, మరింత గొప్పగా క్రిస్ప్ గా చెప్పారు. హాట్స్ అఫ్ఫ్ .. కుడోస్
నేను సైతం గురించి Ganga Rao Kattula అభిప్రాయం:
10/10/2021 6:25 am
ఎండింగ్ లో ట్విస్ట్ చాలా బాగుంది.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి భవానీ ప్రసాదు అభిప్రాయం:
10/09/2021 11:08 am
రకరకముల యమక ప్రయోగములు చాలా చక్కగా వివరించారు. శబ్దాలంకారముల గూర్చి తెలుసుకొనుటకు ఏదయినా పుస్తకమును రిఫరెన్స్ కొరకు సూచించగలరా?
నాకు నచ్చిన పద్యం: మారన వరూధిని కామన గురించి డా.జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి అభిప్రాయం:
10/07/2021 10:47 pm
మార్కండేయ పురాణం — మారన రచించిన తెలుగు కావ్యం — లభిస్తుందా? దయతో తెలుపగలరు.
మేము – మా భోజనపుబల్లలు గురించి సాంబమూర్తి లండ అభిప్రాయం:
10/07/2021 2:27 am
జీవితపు ఒక సున్నిత అనుభవాన్ని కవిత్వం చేయడం బాగుంది. ప్రాణమున్న మనం కూడా అవసరానికి అనుగుణంగా మారిపోతే బాగుండును… 👌
ఎడిట్ వార్స్ గురించి Kiran అభిప్రాయం:
10/06/2021 11:38 pm
చాలా బాగుంది. అరుదుగా దొరుకుతాయి ఇలాంటి మంచి రచనలు. జరుగుతున్న విషయాలు చెప్పడం, పదాల, వాక్యాల ప్రయోగం ఆసక్తిగా అనిపించింది. ఆసాంతం చదివించింది. రచయిత్రికి అభినందనలు!
ఎడిట్ వార్స్ గురించి లలిత అభిప్రాయం:
10/06/2021 4:29 pm