శేషగిరిగారు, మీరు ఎన్నో దేశాలు చుట్టి వచ్చారు. ఆ విశేషాలన్నీ పుస్తక రూపంలో వస్తే చాలా బాగుంటుంది.
ఊహల ఊట 8
గురించి VenigaLLa Balakrishnarao అభిప్రాయం:
01/08/2022
8:23 pm
బ్రతికినన్నళ్ళూ ఊరేవి ఊహలు. వాటిని సాహిత్యానికి అనువుగా మలుచుకునే నేర్పు తులసి గార్కి వెన్నతో వచ్చిన విద్య. పాఠకుల హృదయాలకు హత్తుకునేటట్లు, వారి బాల్యం గుర్తువచ్చేటట్లు చేసిన తులసి గార్కి ధన్యవాదాలు.
దిల్ దఢక్నేదో అంటే అదొక్కటేనా అతగాడికి వచ్చింది… ఆవిడకి ఇవ్వ గలిగేది. అని నాలాంటి వారికనిపించినా…
ఈ మధ్య మా కుటుంబంలో జరిగిన ఒకానొక విషయం నన్ను ఈ కధని ఒప్పుకునేలా చేసింది. కాకపోతే కధలో రచయిత్రి స్వేచ్చ. అది తప్పా ఇంకేదీ చేతకాని మొగుడితో పిల్లలుండడం మూలంగా కలిపేసింది. ఇలలో మాత్రం మగాడి స్వేచ్చ ఆడది ప్రశ్నించినందుకు. ఆయనగారి మగతనపు ఆత్మాభిమానం దెబ్బతిని వాదించుకోడాలు శృతిమించి స్వేచ్చకోసం, కొత్తగా పెళ్ళైన జంట విడాకుల కోసం సిద్ధంగా ఉండి కౌన్సిలింగ్ కి పంపించాము. ఏం జరుగుతుందో ఏమో.
కోవిడ్ మూలంగా చాలా కొత్త రకం సమస్యలు. కాకపోతే కొత్త సీసాలో పాత సారా. అంతే తప్ప అర్ధం చేసుకునే గుణాలు మాత్రం కేవలం కధల్లోనూ నవలల్లోనూ మాత్రమే వ్యక్తీకరిస్తున్నారు తప్ప, నిజానికీ ఎవరూ కూడా తగ్గేదే లేదు అనుకుంటూ రెచ్చి పోతున్నారు.
మధ్యలో లాభపడుతున్నది గంటకి 500 నుంచి 1000 రూపాయలకి పెంచుకున్న కౌన్సిలర్లు. సమస్య వినిపించడానికి పోతే ఆర్ధిక స్థితిగతులు కనుక్కుని “ఏమమ్మా నీకు సంసారం కావాలా, విడాకులు కావాలా, నీకేది కావాలంటే అలానే చేద్దాం అంటున్నారు” అని చెపితే నాకు అర్ధం కాక తల పట్టుకున్నా. బహుశా మీలాంటి రచయిత్రులు ఆ కౌన్సిలింగ్ రంగంలోకి దిగితే నాలుగు కుటుంబాలు నిలబడతాయేమో అనిపించింది.
రోజు రోజు రోత, బరువు మోత అతని జీవితం. అంత బరువు చాలనట్టు, పూర్వ జన్మల, ముందు జన్మల ఫిలాసఫీల గొడవెందుకు? ఆ ఇరుకింటిలో, అటు అమ్మా నాన్న గది, వారి రతికార్యక్రమం మూలుగులు, గోడల్లోంచి కొడుకు వినాలి. ఇటుపక్క ఎదిగే చెల్లెలి గది. మధ్యలో ఇతడు. He is already castrated, by disgust.
గోపీచంద్ అసమర్ధుని జీవయాత్ర లోని తన కంట్రోల్లోనే లేని తన పుట్టుక, మావ, తన పెళ్లి, పెళ్లం, అందుమూలకంగా సంతానం అనే అతిఘోరపు మరిన్ని మాంసం ముద్దల ఉత్పత్తి, వాటి పోషణ లోని బరువు నిజం, అదే కాఫ్కా రచనల రోజు-రోజు జీవితం లోని నిజం. రోజూ తోసుకువచ్చే తిండి, అద్దె, డబ్బార్జన అవసరాల ఘోరనిజం. సీతారామారావు అటు కొడుకుగా, అల్లుడిగా, ఆ తర్వాత ఇటు భర్తగా, తండ్రిగా అన్ని వైపులనుండీ ఇరుక్కుపోతే, అతడిని రచయితే ఆఖర్లో శ్మశానానికి పంపి జీవితం నుండి రిలీజ్ చేసాడు. కాఫ్కా బతుకు ఇంకాస్త నయం. ఒక్క కొడుకుగానే ఇరుక్కుపోయాడు. మొగుడు, తర్వాత తండ్రి ఐపోయి, ఆ పాత్రల నిర్వాహకపు క్షోభ అతను పడకుండా, టి.బి. చిన్న వయసులోనే అతడిని రిలీజ్ చేసింది.
అసలు ఏ కుటుంబంలో నైనా అన్నాతమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య సయోధ్య ఉంటుందా, ఉండదు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు జుట్జుజుట్టూ పీక్కుంటూ, కిందపడి హోరాహోరీ యుద్ధాలు చేస్తారు. వాళ్లని విడదియ్యటానికి, ఇరుగుపొరుగులు రావలసి వస్తుంది.. అమ్మానాన్నలు వాళ్లప్పటికే, వారి బెసికిపోయిన బతుకు కథలు, సైకయాట్రిస్టులతో, జర్నలిస్టు రైటర్లతో చెప్పుకోటంలో, బిజీగా ఉంటారు. ఒకింట్లో ఎదిగిన అక్కా చెల్లెళ్లు, ఒకరి జీవితాన్ని ఒకరు కబళించటానికి/ఒకరినుండి ఒకరు రక్షించుకోటానికి పడే యాతనలు కుందెరా the sisters చదవాలి. “Coveting” అన్న సబ్జెక్ట్ మీద ఒక పేపర్ ప్రజెంట్ చెయ్యి అంటే రాసాడేమో అనిపిస్తుంది.
కాఫ్కా, కామూ, కుందెరా, గోపీచంద్ లు వాస్తవమే రాసారు. జరుగుతుండంగా రాసారు. Theirs are not recollections in tranquility. రచయితకు డిమెన్షియా వచ్చాక, ఓ 50, 60 ఏళ్లు వెనక్కు వెళ్లి రాసే, కుక్డ్ అప్ మెమొరీలు కావవి.
జీవితంలో బాల్యం సంగతికొస్తే, అది ఎంత unsettling time, vulnerable time! It is a time of horror, where in you are a little red riding hood, and your own grandmother devours you. In the disguise of wolf. All those Hansel and Gretel stories, the Cinderella’s stepmother, the prince that does not arrive for years to wake you from a death like sleep, they are all every child’s nightmare. You cannot come out of childhood without deep scars. I know. I sympathize.
బాల్యం, బాల్యం తీపి ఙ్నాపకాలంటూ తెలుగులు ఎన్నెన్ని అబద్ధాలు రాస్తారో. కళ్లలో కుంకుడుకాయ రసం పడి మంటలు పెట్టటం అది కూడా తీపి గుర్తేనంట. గుగ్గీలో, రేగుపళ్లో నెత్తిమీద గుమ్మరించటం, సమత్తాడటం, నీ బాల్యంలో మరో తెలిసిన మనిషికి పాడె కట్టటం, నీ కళ్ల ముందే జుట్టు గొరిగి మరో ఆడదాన్ని బోడెమ్మను చెయ్యటం, ఆ గుండు మీద ఓ గుడ్డను పైకీ కిందకీ, పైకీ కిందకీ రోజస్తమానం లాక్కోటం, ఇవీ తీపి గురుతులు. దేవా! మరి చేదుగురుతు లెలాటివి? లేవు. అన్నీ సబ్కాన్షస్ లాండ్రొమేట్లో చక్కగా తెల్లగా ఉతికేసి సబ్లిమేట్ ఐ వచ్చేసాయి. తెలుగు వాళ్ల మనసులు మల్లియలు. అదేంటంటే, అది ఒక సామూహికమైన whitewashing agreement. పక్కనే పారే మురుగు కాలవలు. ముక్కుకి చెరుగు అడ్డం పెట్టుకుని కంపు కాలవలు లంఘించి పేరంటానికి పేటంతా ఉత్సాహంగా చేరుకునే తంతు.
అలాటి బాల్యం నుండి బైటబడి, ఆ తర్వాత నీవు దూరే మరో labyrinthine corridor ఏమిటి? What is so good about youth and middle age? There is no big bang there either. They also go down with a whimper.
విశ్వనాథ నవల చెలియలి కట్టలో, హీరో ( ఆ హీరో పేరేంటి?) ఇంటికి తిరిగివచ్చి, అతని పెళ్లాం రత్నావళి, అతడి తమ్ముడు రంగడి తో, తనింట్లో తన పక్కమీదే పొర్లుతుంటే కిటికీ లోంచి చూసిన అతని షాక్! అలాటి అసహాయత. కథ అక్కడికే ఆఖరు. ఇంటిల్లపాదీ అందరూ సముద్రం కేసి పరిగెత్తాల్సిన తరుణం అదే. Really, there is no redemption. There is nothing to salvage. Is there? తోటకూర గిల్లుకుంటూ, దొడ్లో నీళ్లు తోడుకుంటూ ఉండే, మడి వంటల పెంట జీవితపు ఇద్దరు వెధవ ముండల్నీ, ఒక incestuous పెళ్లాన్నీ, ఇంటో పెట్టుకుని ఈడుస్తున్న ఇతని మహత్తర జీవిత గాథ, అక్కడికే ఐపోయింది. అవతల పారెయ్యక, ఎందుకా కథని మద్రాసు పంపి అష్టకష్టాలు పడ్డాడో రచయిత. అలాటి ద్రోహపు సంబంధాల శవాలు నేను అప్పుడెప్పుడో మార్చుయరీ బల్లలమీద చూసాను. A Young man and a woman. They were so full of life; it was hard to believe they are dead. Or rather killed in vengeance.
I see the same helplessness in T.S. Eliot’s personal life. A Young man whose wife is either seducing or being seduced by his own teacher, a world class philosopher. Eliot does not know where to turn, how to handle this coveting “thy own student’s wife” sin. There is no solution for this nausea. No jumping out of this abyss. It is absurd as absurd can be. Datta, damayathi or whatever crap, does not bring any Shanti! Shanti, Shanti. Ultimately, the atheist teacher had driven the student to Christianity.
Kafka – he lives his tragedy. He foresees all his predicaments. His is a good chess player’s intellect, in a tournament. He sees the board in front of him. There are not many more moves left. His goose is cooked. There is no win for him. That is the kind of books he wrote.
Someone else, some other players, people such as us, across the world, later we read and analyze these real-life tournaments. We think – Can I play differently? In my own game of life? My own thoughts keep changing.
కాఫ్కా Metamorphosis ని తలుస్తూ, కొన్నేళ్ల క్రితం ఒకరోజు ఏడుసుకుంటూ నేను రాసిన రాత ఒకటి, కింద. ఇందులో పూర్వజన్మ, ముందు జన్మ, ఏ ఫిలాసఫీల స్పృహ లేదు.
….
Kafka. Kafka. Kafka. If it is not for Franz Kafka, what business did I have, in Praha? I know of metamorphosis well enough, having seen and heard tales of so many humans in dire circumstances.
Who has not meta-morphed into a cockroach like Gregor, at one time or the other? I know you had a letter to your father, Dear Kafka, that you did not post. I had one to my father, even if I posted, he would not have understood, that to turn into a helpless cockroach, for any person, it is only a matter of time.
మౌనంగా ఉంటా,
అదే మర్యాద.
కుటుంబ సభ్యులారా!
పుల్ల పెట్టి నన్ను వెనక్కి
గదిలోకి నెట్టనవసరం లేదు
తెలిసింది.
నా దేహ పరిస్థితి
నా ఆర్థిక పరిస్థితి
నా పరిస్థితి సర్వం మారిపోయింది.
ఇక ఈ గదిలోనే ఉంటా.
గది బైటికి రాను.
ఉద్యోగానికి చెల్లు చీటీ
పంపలేదని
యజమాని కేకలేస్తాడు;
మీరు తలుపు మీద బాది
నన్ను నీకేం రోగం
అని విసుక్కుంటారు.
కానీ నేను తలుపు తియ్యలేనే
సమాధానం చెప్పలేనే
ఏం చెయ్యను!
ఏం రాయాలో
ఎలా రాయాలో
నాకిప్పుడు రాదు.
నే చెప్పాలని ప్రయత్నించినా
నన్ను చూస్తే మీకిప్పుడు గాభరా.
తెలిసింది నాకు.
నా ఆకృతి, నా స్థితి మారిపోయింది.
ఇక మౌనంగా ఉంటమే మర్యాద.
మీరు గబుక్కున
గదిలొకి తోసిన
ఆ బ్రెడ్డూ,ఆ నీరూ,
(కాక్రోచ్ కి ఏం పెట్టాలో
మీకు మాత్రం ఎలా తెలుస్తుంది!)
ఆ బ్రెడ్డూ,
ఆ ఛీసూ,
ఇంత కతికి
మంచం మీదో
మంచం ఎక్కలేకపోతే
మంచం కిందో
పడి ఉంటా.
శబ్దం చెయ్యను.
మౌనంగానే ఉంటా.
ఒక రోజు
పనిమనిషి వచ్చి నన్ను
ఊడ్చి పారేసినట్టు
మీకు సున్నితంగా తెలుపుతుంది.
కిటికీలు ఎత్తుతుంది,
గాలిలో కాసేపే లెండి
ఆ తేమ వాసన.
కుటుంబ సభ్యులారా!
మీరు మళ్ళీ ఊపిరి పీల్చుకోవచ్చు
బైటి ప్రపంచంలో
అందరితో కలిసి తిరగొచ్చు
ఏమీ జరగనట్టుగా
నేనసలు లేనే లేనట్టుగా
ఉండొచ్చు.
ఇక ఎవ్వరికీ నావల్ల
నామోషీ ఉండదు.
Lyla.
….
PS: Dear Editors: For some time, the search feature in the opinions section is not working. It just crunches numbers when I type the name of a writer or search word. But does not bring up any opinions. Please discard this writing in case there is redundancy. Thanks.
[Thanks for alerting us on the comment search functionality. We will look into it and fix it – Ed.]
కొoడపొలం మీద మీ సమీక్ష చాలా బావుoది. కొoడపొలం అంటే ఏమిటో కూడా తెలియని పాఠకులకు దాని అర్ధం తెలియజేయడం దగ్గర నుoచి నవల లోని ప్రతి మంచి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిoచి వెoటనే నవలను చదవాలనే ఆసక్తిని పెంచారు.
ఉత్తర మొరాకో శోధనలు 1 గురించి Amarendra Dasari అభిప్రాయం:
01/10/2022 3:10 am
మాధవ్ గారూ
ఈ మొరాకో శోథనలు ఇక్కడ పూర్తయ్యాక పుస్తకంగా తెస్తాము..
నా స్నేహితులు గురించి అచ్యుత్ కుమార్ అభిప్రాయం:
01/09/2022 8:07 pm
Short and sweet
కళ్ళు ఉంటాయి అందరికి
మనం రోజూ చూసేవే అందంగా కనిపిస్తుంది కొందరికి
దాన్ని అక్షర రూపంలో పెట్టగలవాడే కవి
ఉత్తర మొరాకో శోధనలు 1 గురించి Madhav అభిప్రాయం:
01/09/2022 2:06 pm
శేషగిరిగారు, మీరు ఎన్నో దేశాలు చుట్టి వచ్చారు. ఆ విశేషాలన్నీ పుస్తక రూపంలో వస్తే చాలా బాగుంటుంది.
ఊహల ఊట 8 గురించి VenigaLLa Balakrishnarao అభిప్రాయం:
01/08/2022 8:23 pm
బ్రతికినన్నళ్ళూ ఊరేవి ఊహలు. వాటిని సాహిత్యానికి అనువుగా మలుచుకునే నేర్పు తులసి గార్కి వెన్నతో వచ్చిన విద్య. పాఠకుల హృదయాలకు హత్తుకునేటట్లు, వారి బాల్యం గుర్తువచ్చేటట్లు చేసిన తులసి గార్కి ధన్యవాదాలు.
దిల్ ధడక్‌నే దో! గురించి srinivas sathiraju అభిప్రాయం:
01/08/2022 5:41 pm
ఎంత అన్యాయంగా ఉందో కదా.
దిల్ దఢక్నేదో అంటే అదొక్కటేనా అతగాడికి వచ్చింది… ఆవిడకి ఇవ్వ గలిగేది. అని నాలాంటి వారికనిపించినా…
ఈ మధ్య మా కుటుంబంలో జరిగిన ఒకానొక విషయం నన్ను ఈ కధని ఒప్పుకునేలా చేసింది. కాకపోతే కధలో రచయిత్రి స్వేచ్చ. అది తప్పా ఇంకేదీ చేతకాని మొగుడితో పిల్లలుండడం మూలంగా కలిపేసింది. ఇలలో మాత్రం మగాడి స్వేచ్చ ఆడది ప్రశ్నించినందుకు. ఆయనగారి మగతనపు ఆత్మాభిమానం దెబ్బతిని వాదించుకోడాలు శృతిమించి స్వేచ్చకోసం, కొత్తగా పెళ్ళైన జంట విడాకుల కోసం సిద్ధంగా ఉండి కౌన్సిలింగ్ కి పంపించాము. ఏం జరుగుతుందో ఏమో.
కోవిడ్ మూలంగా చాలా కొత్త రకం సమస్యలు. కాకపోతే కొత్త సీసాలో పాత సారా. అంతే తప్ప అర్ధం చేసుకునే గుణాలు మాత్రం కేవలం కధల్లోనూ నవలల్లోనూ మాత్రమే వ్యక్తీకరిస్తున్నారు తప్ప, నిజానికీ ఎవరూ కూడా తగ్గేదే లేదు అనుకుంటూ రెచ్చి పోతున్నారు.
మధ్యలో లాభపడుతున్నది గంటకి 500 నుంచి 1000 రూపాయలకి పెంచుకున్న కౌన్సిలర్లు. సమస్య వినిపించడానికి పోతే ఆర్ధిక స్థితిగతులు కనుక్కుని “ఏమమ్మా నీకు సంసారం కావాలా, విడాకులు కావాలా, నీకేది కావాలంటే అలానే చేద్దాం అంటున్నారు” అని చెపితే నాకు అర్ధం కాక తల పట్టుకున్నా. బహుశా మీలాంటి రచయిత్రులు ఆ కౌన్సిలింగ్ రంగంలోకి దిగితే నాలుగు కుటుంబాలు నిలబడతాయేమో అనిపించింది.
దిల్ ధడక్‌నే దో! గురించి Vijaya Karra అభిప్రాయం:
01/08/2022 3:31 pm
Thank you so much – Amarendra garu, Rahman garu and Narayanaswamy garu !!!
భారతీయ పరిచయక్రమం: కాఫ్కా గురించి Lyla yerneni అభిప్రాయం:
01/08/2022 11:49 am
కాఫ్కా ను నేనసలు ఇలా చదవలేదు.
రోజు రోజు రోత, బరువు మోత అతని జీవితం. అంత బరువు చాలనట్టు, పూర్వ జన్మల, ముందు జన్మల ఫిలాసఫీల గొడవెందుకు? ఆ ఇరుకింటిలో, అటు అమ్మా నాన్న గది, వారి రతికార్యక్రమం మూలుగులు, గోడల్లోంచి కొడుకు వినాలి. ఇటుపక్క ఎదిగే చెల్లెలి గది. మధ్యలో ఇతడు. He is already castrated, by disgust.
గోపీచంద్ అసమర్ధుని జీవయాత్ర లోని తన కంట్రోల్లోనే లేని తన పుట్టుక, మావ, తన పెళ్లి, పెళ్లం, అందుమూలకంగా సంతానం అనే అతిఘోరపు మరిన్ని మాంసం ముద్దల ఉత్పత్తి, వాటి పోషణ లోని బరువు నిజం, అదే కాఫ్కా రచనల రోజు-రోజు జీవితం లోని నిజం. రోజూ తోసుకువచ్చే తిండి, అద్దె, డబ్బార్జన అవసరాల ఘోరనిజం. సీతారామారావు అటు కొడుకుగా, అల్లుడిగా, ఆ తర్వాత ఇటు భర్తగా, తండ్రిగా అన్ని వైపులనుండీ ఇరుక్కుపోతే, అతడిని రచయితే ఆఖర్లో శ్మశానానికి పంపి జీవితం నుండి రిలీజ్ చేసాడు. కాఫ్కా బతుకు ఇంకాస్త నయం. ఒక్క కొడుకుగానే ఇరుక్కుపోయాడు. మొగుడు, తర్వాత తండ్రి ఐపోయి, ఆ పాత్రల నిర్వాహకపు క్షోభ అతను పడకుండా, టి.బి. చిన్న వయసులోనే అతడిని రిలీజ్ చేసింది.
అసలు ఏ కుటుంబంలో నైనా అన్నాతమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య సయోధ్య ఉంటుందా, ఉండదు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు జుట్జుజుట్టూ పీక్కుంటూ, కిందపడి హోరాహోరీ యుద్ధాలు చేస్తారు. వాళ్లని విడదియ్యటానికి, ఇరుగుపొరుగులు రావలసి వస్తుంది.. అమ్మానాన్నలు వాళ్లప్పటికే, వారి బెసికిపోయిన బతుకు కథలు, సైకయాట్రిస్టులతో, జర్నలిస్టు రైటర్లతో చెప్పుకోటంలో, బిజీగా ఉంటారు. ఒకింట్లో ఎదిగిన అక్కా చెల్లెళ్లు, ఒకరి జీవితాన్ని ఒకరు కబళించటానికి/ఒకరినుండి ఒకరు రక్షించుకోటానికి పడే యాతనలు కుందెరా the sisters చదవాలి. “Coveting” అన్న సబ్జెక్ట్ మీద ఒక పేపర్ ప్రజెంట్ చెయ్యి అంటే రాసాడేమో అనిపిస్తుంది.
కాఫ్కా, కామూ, కుందెరా, గోపీచంద్ లు వాస్తవమే రాసారు. జరుగుతుండంగా రాసారు. Theirs are not recollections in tranquility. రచయితకు డిమెన్షియా వచ్చాక, ఓ 50, 60 ఏళ్లు వెనక్కు వెళ్లి రాసే, కుక్డ్ అప్ మెమొరీలు కావవి.
జీవితంలో బాల్యం సంగతికొస్తే, అది ఎంత unsettling time, vulnerable time! It is a time of horror, where in you are a little red riding hood, and your own grandmother devours you. In the disguise of wolf. All those Hansel and Gretel stories, the Cinderella’s stepmother, the prince that does not arrive for years to wake you from a death like sleep, they are all every child’s nightmare. You cannot come out of childhood without deep scars. I know. I sympathize.
బాల్యం, బాల్యం తీపి ఙ్నాపకాలంటూ తెలుగులు ఎన్నెన్ని అబద్ధాలు రాస్తారో. కళ్లలో కుంకుడుకాయ రసం పడి మంటలు పెట్టటం అది కూడా తీపి గుర్తేనంట. గుగ్గీలో, రేగుపళ్లో నెత్తిమీద గుమ్మరించటం, సమత్తాడటం, నీ బాల్యంలో మరో తెలిసిన మనిషికి పాడె కట్టటం, నీ కళ్ల ముందే జుట్టు గొరిగి మరో ఆడదాన్ని బోడెమ్మను చెయ్యటం, ఆ గుండు మీద ఓ గుడ్డను పైకీ కిందకీ, పైకీ కిందకీ రోజస్తమానం లాక్కోటం, ఇవీ తీపి గురుతులు. దేవా! మరి చేదుగురుతు లెలాటివి? లేవు. అన్నీ సబ్కాన్షస్ లాండ్రొమేట్లో చక్కగా తెల్లగా ఉతికేసి సబ్లిమేట్ ఐ వచ్చేసాయి. తెలుగు వాళ్ల మనసులు మల్లియలు. అదేంటంటే, అది ఒక సామూహికమైన whitewashing agreement. పక్కనే పారే మురుగు కాలవలు. ముక్కుకి చెరుగు అడ్డం పెట్టుకుని కంపు కాలవలు లంఘించి పేరంటానికి పేటంతా ఉత్సాహంగా చేరుకునే తంతు.
అలాటి బాల్యం నుండి బైటబడి, ఆ తర్వాత నీవు దూరే మరో labyrinthine corridor ఏమిటి? What is so good about youth and middle age? There is no big bang there either. They also go down with a whimper.
విశ్వనాథ నవల చెలియలి కట్టలో, హీరో ( ఆ హీరో పేరేంటి?) ఇంటికి తిరిగివచ్చి, అతని పెళ్లాం రత్నావళి, అతడి తమ్ముడు రంగడి తో, తనింట్లో తన పక్కమీదే పొర్లుతుంటే కిటికీ లోంచి చూసిన అతని షాక్! అలాటి అసహాయత. కథ అక్కడికే ఆఖరు. ఇంటిల్లపాదీ అందరూ సముద్రం కేసి పరిగెత్తాల్సిన తరుణం అదే. Really, there is no redemption. There is nothing to salvage. Is there? తోటకూర గిల్లుకుంటూ, దొడ్లో నీళ్లు తోడుకుంటూ ఉండే, మడి వంటల పెంట జీవితపు ఇద్దరు వెధవ ముండల్నీ, ఒక incestuous పెళ్లాన్నీ, ఇంటో పెట్టుకుని ఈడుస్తున్న ఇతని మహత్తర జీవిత గాథ, అక్కడికే ఐపోయింది. అవతల పారెయ్యక, ఎందుకా కథని మద్రాసు పంపి అష్టకష్టాలు పడ్డాడో రచయిత. అలాటి ద్రోహపు సంబంధాల శవాలు నేను అప్పుడెప్పుడో మార్చుయరీ బల్లలమీద చూసాను. A Young man and a woman. They were so full of life; it was hard to believe they are dead. Or rather killed in vengeance.
I see the same helplessness in T.S. Eliot’s personal life. A Young man whose wife is either seducing or being seduced by his own teacher, a world class philosopher. Eliot does not know where to turn, how to handle this coveting “thy own student’s wife” sin. There is no solution for this nausea. No jumping out of this abyss. It is absurd as absurd can be. Datta, damayathi or whatever crap, does not bring any Shanti! Shanti, Shanti. Ultimately, the atheist teacher had driven the student to Christianity.
Kafka – he lives his tragedy. He foresees all his predicaments. His is a good chess player’s intellect, in a tournament. He sees the board in front of him. There are not many more moves left. His goose is cooked. There is no win for him. That is the kind of books he wrote.
Someone else, some other players, people such as us, across the world, later we read and analyze these real-life tournaments. We think – Can I play differently? In my own game of life? My own thoughts keep changing.
కాఫ్కా Metamorphosis ని తలుస్తూ, కొన్నేళ్ల క్రితం ఒకరోజు ఏడుసుకుంటూ నేను రాసిన రాత ఒకటి, కింద. ఇందులో పూర్వజన్మ, ముందు జన్మ, ఏ ఫిలాసఫీల స్పృహ లేదు.
….
Kafka. Kafka. Kafka. If it is not for Franz Kafka, what business did I have, in Praha? I know of metamorphosis well enough, having seen and heard tales of so many humans in dire circumstances.
Who has not meta-morphed into a cockroach like Gregor, at one time or the other? I know you had a letter to your father, Dear Kafka, that you did not post. I had one to my father, even if I posted, he would not have understood, that to turn into a helpless cockroach, for any person, it is only a matter of time.
మౌనంగా ఉంటా,
అదే మర్యాద.
కుటుంబ సభ్యులారా!
పుల్ల పెట్టి నన్ను వెనక్కి
గదిలోకి నెట్టనవసరం లేదు
తెలిసింది.
నా దేహ పరిస్థితి
నా ఆర్థిక పరిస్థితి
నా పరిస్థితి సర్వం మారిపోయింది.
ఇక ఈ గదిలోనే ఉంటా.
గది బైటికి రాను.
ఉద్యోగానికి చెల్లు చీటీ
పంపలేదని
యజమాని కేకలేస్తాడు;
మీరు తలుపు మీద బాది
నన్ను నీకేం రోగం
అని విసుక్కుంటారు.
కానీ నేను తలుపు తియ్యలేనే
సమాధానం చెప్పలేనే
ఏం చెయ్యను!
ఏం రాయాలో
ఎలా రాయాలో
నాకిప్పుడు రాదు.
నే చెప్పాలని ప్రయత్నించినా
నన్ను చూస్తే మీకిప్పుడు గాభరా.
తెలిసింది నాకు.
నా ఆకృతి, నా స్థితి మారిపోయింది.
ఇక మౌనంగా ఉంటమే మర్యాద.
మీరు గబుక్కున
గదిలొకి తోసిన
ఆ బ్రెడ్డూ,ఆ నీరూ,
(కాక్రోచ్ కి ఏం పెట్టాలో
మీకు మాత్రం ఎలా తెలుస్తుంది!)
ఆ బ్రెడ్డూ,
ఆ ఛీసూ,
ఇంత కతికి
మంచం మీదో
మంచం ఎక్కలేకపోతే
మంచం కిందో
పడి ఉంటా.
శబ్దం చెయ్యను.
మౌనంగానే ఉంటా.
ఒక రోజు
పనిమనిషి వచ్చి నన్ను
ఊడ్చి పారేసినట్టు
మీకు సున్నితంగా తెలుపుతుంది.
కిటికీలు ఎత్తుతుంది,
గాలిలో కాసేపే లెండి
ఆ తేమ వాసన.
కుటుంబ సభ్యులారా!
మీరు మళ్ళీ ఊపిరి పీల్చుకోవచ్చు
బైటి ప్రపంచంలో
అందరితో కలిసి తిరగొచ్చు
ఏమీ జరగనట్టుగా
నేనసలు లేనే లేనట్టుగా
ఉండొచ్చు.
ఇక ఎవ్వరికీ నావల్ల
నామోషీ ఉండదు.
Lyla.
….
PS: Dear Editors: For some time, the search feature in the opinions section is not working. It just crunches numbers when I type the name of a writer or search word. But does not bring up any opinions. Please discard this writing in case there is redundancy. Thanks.
[Thanks for alerting us on the comment search functionality. We will look into it and fix it – Ed.]
కాపరుల జీవిత దర్పణం: కొండపొలం గురించి G. నకుల్ రెడ్డి అభిప్రాయం:
01/05/2022 6:33 pm
కొoడపొలం మీద మీ సమీక్ష చాలా బావుoది. కొoడపొలం అంటే ఏమిటో కూడా తెలియని పాఠకులకు దాని అర్ధం తెలియజేయడం దగ్గర నుoచి నవల లోని ప్రతి మంచి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిoచి వెoటనే నవలను చదవాలనే ఆసక్తిని పెంచారు.
అభినందనలు
కాపరుల జీవిత దర్పణం: కొండపొలం గురించి G. నకుల్ రెడ్డి అభిప్రాయం:
01/05/2022 6:19 pm
చాలా బాగుంది. మనసుకు హత్తుకునేలా వుంది. క్లుప్తంగా అర్దం అవుతుంది.
మాట శీతకన్నేసింది గురించి Sriram అభిప్రాయం:
01/05/2022 12:15 pm
పూర్తిగా అర్థమవకపోయినా, ఎంతో చక్కటి గగుర్పాటూ అంతే మంచి స్పందనా