వ్యాసం, కథ కలగలిపిన చారిత్రక కథనం. చాలా ఆసక్తికరంగా బావుంది. ‘వైద్యమే భయంకరమైన జబ్బు’ … చాలా ఆలోచించవలసిన, చర్చ జరగవలసిన అంశం. మతమూ, రాజకీయాల విష పరిష్వంగమే నేటి దయనీయ స్థితి. ఆత్మధైర్యాన్ని, గుంపుల జీవిత క్రమబధ్ధీకరణకూ ఊతమివ్వాల్సిన మతం, విశ్వాసం ఈరోజు మొత్తం సమాజానికీ వదిలించుకోలేని గుదిబండ అయి కూర్చుంది.
ఇలాంటి రచనల వల్ల ఏమి ఉపయోగం? కవితల పేరుతో ఈమాటలో వస్తున్న రచనలు కొన్ని పేలవంగా మరికొన్ని అర్థరహితంగా ఉంటున్నాయి. సంపాదకులు ఎలా ప్రచురిస్తున్నారు. సంపాదకుల అభిరుచి పైనే సందేహం వస్తుంది. కొన్నిసార్లు పేరున్న రచయితలు వ్రాసినవి కూడా ఏమంత బాగాలేవు.
పై రచనలో ఉన్న వాక్యాలకు సంబంధం ఏమి ఉందో రచయిత లేదా సంపాదకులు వివరించగలరు.
చాలా అసందర్భాలు ఉన్నట్టున్నాయి కథలో. నలభైనాలుగేళ్ళ వాళ్ళావిడ ఉద్యోగం చేస్తోందంటే ఆవిడ ఎంత అనాకారి అయినా “బంగారు గుడ్ల బాతు” అని తెలుస్తుంది మొగుడికి. అలా ఆవిడ స్కూటర్ అమ్మి పారేసి ఆవిణ్ణి వదులుకుంటాడా? అయినా ఇన్నేళ్ళు ఉద్యోగం చేస్తే లోన్ ఇవ్వరా ఇల్లు కొనుక్కోవడానికి? చాలా అవకతవకల్తో రాసిన కథ అని ‘నాకు’ అనిపించింది. అద్దెకి ఇల్లు తీసుకున్నందుకు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా చివరకి పెద్ద ఇల్లు ఓ సారి చూపిస్తే రెక్కలు కట్టుకు వాల్తారు కుటుంబం అంతా. మరో తిక్క వ్యవహారం – ఓ సారి ఇచ్చేసిన అద్దె ఎవరూ తిరిగి ఇవ్వరు ఎంత దెబ్బలాటలు పెట్టినా, పిల్లలు అమెరికాలో ఉన్నా. అయినా ఇది నా స్వంత ఘోష కాని కథలో పటుత్వం నాకైతే అనిపించలేదు.
>>“ఆమె ఇల్లు,” అని పేరు పెట్టకుండా ‘ఆమె మొగుడు’, అని పేరు పెడితే, అప్పుడు కథ లోని మగవాడిని స్టడీ చేసేవారా?
“ఆమె ఇల్లు” కధ పట్ల మీ స్పందన బాగుంది, పరుషంగానూ ఉంది. మన కామ్రేడ్ రంగనాయకమ్మ కూడా ఇలానే అంటారనుకుంటా.
” ఆ ఇంటిలో ఎవరో అద్దెకు దిగేసినట్టున్నారు. బయట నిలబడి ఆ ఇంటినే చూస్తూ ఉండిపోయింది.
ఆ ఇంటినుండి తప్పించుకుని చక్కని సుగంధం బయటకు వస్తోంది. అది ఆమె కొనిపెట్టిన చందనం అగరొత్తుల పరిమళమే. ఆ పరిమళం ఆమెకు పెద్ద నిట్టూర్పునిచ్చింది, బాధనీ కలిగించింది. కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకుంటూ వీధిలో తిరిగి నడవసాగింది. ”
యీ ముగింపు అహల్య పట్ల జాలిని కలిగించటవే కాదు, ఆమె దుఃఖంతో పాఠకులు మమేకం అవుతారు. ఆమె పట్ల నిరాదరణతో ప్రవర్తించిన కుటుంబ సభ్యుల పట్ల, వ్యవస్థ లోని అసమానతల పట్ల పాఠకుడిలో చైతన్యాన్ని కలిగిస్తాయని… ఆరోగ్యదాయకమైన మార్పుల పట్ల అనురక్తి కలిగిస్తాయని నమ్ముతున్నాను.
అభూత కల్పన. ఆధారాలు లేని ఊహ. భారత దేశములో అంతరించిన మతాలు శాస్త్ర చర్చలో ఓడి, కొన్ని దుర్వ్యసనాలవంటి స్వయంకృత అపరాధాలవల్ల కనుమరుగైనాయి గాని భౌతిక దాడులవల్ల కాదు. స్వయంకృత అపరాధాల వల్లె బౌద్ధ స్థూపాలకు లంజల దిబ్బలని పేరు వచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలొ ఇవి అనేకం కనిపిస్తాయి.
విశాఖ గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
02/23/2022 10:41 pm
వ్యాసం, కథ కలగలిపిన చారిత్రక కథనం. చాలా ఆసక్తికరంగా బావుంది. ‘వైద్యమే భయంకరమైన జబ్బు’ … చాలా ఆలోచించవలసిన, చర్చ జరగవలసిన అంశం. మతమూ, రాజకీయాల విష పరిష్వంగమే నేటి దయనీయ స్థితి. ఆత్మధైర్యాన్ని, గుంపుల జీవిత క్రమబధ్ధీకరణకూ ఊతమివ్వాల్సిన మతం, విశ్వాసం ఈరోజు మొత్తం సమాజానికీ వదిలించుకోలేని గుదిబండ అయి కూర్చుంది.
ఉత్తర మొరాకో శోధనలు 3 గురించి Amarendra Dasari అభిప్రాయం:
02/23/2022 8:53 pm
రామానాయుడుగారు, రాజాగారు, తులసిగారు… సంతోషం, ధన్యవాదాలు.
అనువాదం మాత్రమే నాది. అనుభవాలు, మూల అక్షరాలు నిమ్మగడ్డ శేషగిరిగారివి.
ఊహల ఊట 9 గురించి ఝాన్సీ అభిప్రాయం:
02/20/2022 11:38 am
హబ్బా! మళ్ళీ మమ్మల్ని అందమైన బాల్యం లోకి తీసుకుపోయారు తులసిగారూ!
వెతలే వెతుకులాట గురించి బుచికి అభిప్రాయం:
02/19/2022 2:49 pm
ఇలాంటి రచనల వల్ల ఏమి ఉపయోగం? కవితల పేరుతో ఈమాటలో వస్తున్న రచనలు కొన్ని పేలవంగా మరికొన్ని అర్థరహితంగా ఉంటున్నాయి. సంపాదకులు ఎలా ప్రచురిస్తున్నారు. సంపాదకుల అభిరుచి పైనే సందేహం వస్తుంది. కొన్నిసార్లు పేరున్న రచయితలు వ్రాసినవి కూడా ఏమంత బాగాలేవు.
పై రచనలో ఉన్న వాక్యాలకు సంబంధం ఏమి ఉందో రచయిత లేదా సంపాదకులు వివరించగలరు.
ఆమె ఇల్లు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
02/16/2022 2:16 pm
చాలా అసందర్భాలు ఉన్నట్టున్నాయి కథలో. నలభైనాలుగేళ్ళ వాళ్ళావిడ ఉద్యోగం చేస్తోందంటే ఆవిడ ఎంత అనాకారి అయినా “బంగారు గుడ్ల బాతు” అని తెలుస్తుంది మొగుడికి. అలా ఆవిడ స్కూటర్ అమ్మి పారేసి ఆవిణ్ణి వదులుకుంటాడా? అయినా ఇన్నేళ్ళు ఉద్యోగం చేస్తే లోన్ ఇవ్వరా ఇల్లు కొనుక్కోవడానికి? చాలా అవకతవకల్తో రాసిన కథ అని ‘నాకు’ అనిపించింది. అద్దెకి ఇల్లు తీసుకున్నందుకు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా చివరకి పెద్ద ఇల్లు ఓ సారి చూపిస్తే రెక్కలు కట్టుకు వాల్తారు కుటుంబం అంతా. మరో తిక్క వ్యవహారం – ఓ సారి ఇచ్చేసిన అద్దె ఎవరూ తిరిగి ఇవ్వరు ఎంత దెబ్బలాటలు పెట్టినా, పిల్లలు అమెరికాలో ఉన్నా. అయినా ఇది నా స్వంత ఘోష కాని కథలో పటుత్వం నాకైతే అనిపించలేదు.
>>“ఆమె ఇల్లు,” అని పేరు పెట్టకుండా ‘ఆమె మొగుడు’, అని పేరు పెడితే, అప్పుడు కథ లోని మగవాడిని స్టడీ చేసేవారా?
లైలా గారి ఈ వ్యాఖ్య చదివాక నవ్వు ఆగలేదు.
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి Prasuna Balantrapu అభిప్రాయం:
02/16/2022 2:02 am
ఇంతకు ముందు చదివినా మళ్ళి చదువుతునప్పుడు అంతే ఆనందించాము. రజని గారి గురించి ఇంత సమగ్రంగా అతి తక్కువ మంది రాయగలరు . శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు
మంటో కథలు: సియా హాషియే 1 గురించి C.Suseela అభిప్రాయం:
02/15/2022 11:24 pm
చాలా మంచి అనువాదం. కదిలించే జీవితం. నిజమైన జీవితం! మనిషిని మనిషి చంపటం! ఎంతదారుణం! ఈ కోణం ఒకటిఉంది !!😭
గడినుడి – 64 గురించి manjari lakshmi అభిప్రాయం:
02/15/2022 9:45 am
ఎప్పటి నుంచో దీన్ని నింపుతున్నాము. ఇప్పుడే రావటం లేదంటే, ఏదో టెక్నికల్ సమస్య మీదగ్గర ఉందనిపిస్తొంది. అసలేవి ఏక్టివేట్ అవటం లేదు.
ఆమె ఇల్లు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
02/15/2022 1:47 am
డా. లైలా యేర్నేని గారూ, నమస్తే.
“ఆమె ఇల్లు” కధ పట్ల మీ స్పందన బాగుంది, పరుషంగానూ ఉంది. మన కామ్రేడ్ రంగనాయకమ్మ కూడా ఇలానే అంటారనుకుంటా.
” ఆ ఇంటిలో ఎవరో అద్దెకు దిగేసినట్టున్నారు. బయట నిలబడి ఆ ఇంటినే చూస్తూ ఉండిపోయింది.
ఆ ఇంటినుండి తప్పించుకుని చక్కని సుగంధం బయటకు వస్తోంది. అది ఆమె కొనిపెట్టిన చందనం అగరొత్తుల పరిమళమే. ఆ పరిమళం ఆమెకు పెద్ద నిట్టూర్పునిచ్చింది, బాధనీ కలిగించింది. కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకుంటూ వీధిలో తిరిగి నడవసాగింది. ”
యీ ముగింపు అహల్య పట్ల జాలిని కలిగించటవే కాదు, ఆమె దుఃఖంతో పాఠకులు మమేకం అవుతారు. ఆమె పట్ల నిరాదరణతో ప్రవర్తించిన కుటుంబ సభ్యుల పట్ల, వ్యవస్థ లోని అసమానతల పట్ల పాఠకుడిలో చైతన్యాన్ని కలిగిస్తాయని… ఆరోగ్యదాయకమైన మార్పుల పట్ల అనురక్తి కలిగిస్తాయని నమ్ముతున్నాను.
విశాఖ గురించి sanath అభిప్రాయం:
02/14/2022 11:04 pm