పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి తః తః అభిప్రాయం:

    06/06/2022 11:46 am

    శ్రీనివాస్:కథా కథనమూ రెండూ బాగున్నాయి. అందమైన బూతులు నేర్చుకోవాలనుకుంటే సైన్యమే మంచి బడి.

    అటూ ఇటూగా బెజవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. గవర్నమెంట్ కాలేజిలో పి.యు.సి.లో – చైనా యుద్ధం ప్రభావంతో మగపిల్లలకు మొదలైన – కంపల్సరీ యన్.సి.సి. (నేషనల్ కాడెట్ కోర్) రోజులు గుర్తుకొచ్చాయి. ఆరంభశూరత్వమేమో మహా స్ట్రిక్ట్‌గా ఉండే వాళ్ళు పెటి ఆఫీసర్లు. ఆ మరుసంవత్సరం బి.ఎస్‍సి. వచ్చేసరికి ఆడపిల్లలకు ఐచ్చిక ఎన్.సి.సి. వచ్చింది. చాలామంది ఆడపిల్లలు ఎన్.సి.సి.లో జేరారు. ‘రంగారు బంగారు చెంగావులను వీడి యూనిఫారము దాల్చ నోర్వలేను, సింగారమొలకించు సిగల పూవులుదీసి కుచ్చుటోపిధరింప మెచ్చలేను’ అంటూ పద్యం రాయటం గూడా గుర్తొస్తోంది. వీటితొపాటు డేవిడ్ నివెన్ ‘ద మూన్ ఇజ్ ఎ బలూన్’లో మిలటరీలో అతని దొంగ స్లీప్ వాకింగ్ ఎపిసోడ్ గూడా.

    మా బాబాయి కొడుకొకడు నాకన్నా చిన్నవాడు, పదవతరగతి తప్పి తల్లిదండ్రులు పెడుతున్న బాధ భరించలేక పారిపొయి సైన్యంలో సాపర్‍గా చేరాడు. ఇప్పటికీ వారం పదిరోజులకొకసారి ఫోన్ చేసి హిమాలయాల్లో, చైనా సరిహద్దుల్లో వాడి అప్పటి అనుభవాలు పూస గుచ్చినట్టు చెబుతూ ఉంటాడు. “నీతో మాట్లాడటానికి మూడు రోజులు కాజువల్ లీవ్ పెట్టాలిరా!” అంటూ ఉంటాను వాడితో.

    నమస్కారాలతొ
    తః తః

  2. ఊహల ఊట 13 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    06/06/2022 1:27 am

    లెట్ మీ ఎంజాయ్ మై మాగాయ టెంక!సూపర్‍గా ఉంది.

    చిన్నప్పుడు మాగాయి టెంకలు మామిడికాయ పప్పులో టెంకలు నాకంటే నాకు కావాలి అని పోటీపడి అమ్మచేతఒడ్డించుకుని మరీ చీక్కోవడం గుర్తొచ్చింది. తాటి ముంజలు దబ్బాకు మజ్జిగ మామిడి పళ్ళువట్టి వేళ్ల చాపలు కుండలో నీరు అన్ని వేసవి సందళ్ళు బాగా గుర్తు చేశారు. ప్రతి నెల ఏభాగానికి ఆ భాగమే కొత్తగా చదివింపచేస్తోంది.

    ఇంత చక్కని శీర్షికను అందిస్తున్న డాక్టర్ తులసి గారికి కృతజ్ఞతాభివందనములు.

  3. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి Gireesh Kunnathattil అభిప్రాయం:

    06/05/2022 11:54 am

    మిలట్రీ నేపధ్యంలొ తెలుగు కథ! చాలా బాగుంది. ‘కుడ్ కుడ్’ లోగ్ – ఇది దక్షిణ భారతీయులకు మిలట్రీలో మాత్రమే ఉండే nickname. ఇంత సాధికారంగా రాసారంటే, మీరు మిలట్రీలో పని చేసిన వారై ఉండాలి! లేదా మీ రీసర్చ్ అమోఘం! I presume it’s a series, looking forward!

  4. అర్థంకాని కవిత్వం గురించి CSRAMBABU అభిప్రాయం:

    06/05/2022 5:33 am

    కవిత్వాన్ని ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో చెప్పిన వ్యాసం!

  5. బూడిదలో బంగారం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/04/2022 2:51 pm

    దాదాపు తొంభైలలో అనుకుంటా, నేషనల్ జిగ్రాఫిక్ వారు ఓ కధనం ప్రచురించారు. దాని ప్రకారం దాదాపు మొత్తం బాంబే (అప్పట్లో) జనాల్లో ఉద్యోగం లేనివాడు ఎవరూ లేరు. అదే న్యూ యార్క్ లో అయితే అనేకమంది ఉన్నారు. ఉత్తరోత్తరా టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పెరిగాయి కాని తగ్గలేదు. నేను కొంతకాలం బాంబే లో ఉద్యోగం చేసినవాణ్ణే. రోడ్లు, మంచినీరు, ట్రాన్స్ పోర్ట్ విషయం లో బాంబే కి మించిన పట్టణం ఇప్పటికీ ఇండియాలో మరోటి లేదని ఘంటాపధంగా చెప్పగలను. నగరంలో ఉన్న ఒకే ఒక కనాకష్టం ఏమిటంటే ఇల్లుగానీ రూం గాని దొరకడం. అది ఒకసారి కుదురుకుంటే ఎవరూ మళ్ళీ అక్కడనుంచి బయటకి వెళ్లరు. జనం బాగా సహాయం చేసే మనుషులు. రోడ్డుకి రెండువైపులా ఉడిపి హోటళ్ళు, మంచి సేఫ్టీ అన్నీ బాగుంటాయ్. ఇవన్నీ కూడా నేషనల్ జిగ్రాఫిక్ వారు ప్రచురించిన కధనంలో చెప్పారు. ఈ అనువాదంలో ‘ముంబై’ అన్నారంటే కధ గత పదేళ్ళలోపు రాసినదేమో, పేరు మార్చాక. అప్పటికి ఉద్యోగాలు కోకొల్లలుగా ఉన్నాయ్ ముంబై లో. ఏ పనైనా చేస్తాననుకునేవారికి ముంబై లో ఉద్యోగం దొరకదనే ప్రశ్నే ఉదయించదు.

    రెండో విషయం – మనిషి పోయాక రిగర్ మార్టిస్ (తప్పుగా పలుకుతున్నానేమో?) అనేది 5 నుంచి ఆరు గంటలు పడుతుంది. మొదటగా జరిగేది దవడలు కిందకి జారతాయి. బిగుసుకుపోవు. అందుకే చర్చ్ లో అందరికీ చివరి దర్శనానికి పోయినవాణ్ణి పెట్టినపుడు నోరు కుట్టేస్తారు(ట). తర్వాత బిగుసుకుంటుంది శరీరం. బిగుసుకోవడం అంటే మరీ నోట్లో వేళ్ళు తెగిపోయే అంత కాదు. మరో రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ బిగువు పోతుంది. అదీగాక భీమా చేతిలో ఏదో ఆయుధం ఉంది దాంతో శవం నోటిమీద కొట్టి చేతులు బయటకి లాక్కోలేడా? అదీ ఒక్క దెబ్బతో నక్కని చంపగలవాడు కదా?

    మూడో విషయం – నక్కలు గుంపుగా వేటాడవు. ఎవరి జీవితం వారిదే. ఇది టివి చూస్తే తెలుస్తుంది. పులులు, హైనాలూ, తోడేళ్ళు గుంపుగా వేటాడతాయి. కొన్ని రకాల నక్కలు అలా గుంపుగా వేట చేయొచ్చేమో అనుకున్నా, నక్కలు అతి జాగ్రత్తమైనవి. మనిషనే వాడు రాగానే, లేదా మరో జంతువు రాగానే పక్కకు తప్పుకుని చాలా సేపు అంచనా వేసుకుని గాని దగ్గిరకి రావు. ఇది మనం నీతి కధల్లో చదువుకున్నదే – నక్కల తెలివి గురించి. అరవ్వొచ్చేమో కానీ మనిషి దగ్గిరకి వచ్చేసి కరిచేంత సాహసం *వెంఠనే* చేయవు.

    ఇలా చెప్పుకుంటూ పోతే అవకతవలు చాలా ఉన్నై ఈ కధలో. రచయిత మరాఠీ వారని పేరు బట్టి తెలుస్తోంది. ఆయన కూడా బాంబేలో ఉద్యోగాలు, ఇవన్నీ చూసుకోకపోయినా అనువాదకులు చూసుకోవద్దా? గూగిల్ చేస్తే ఈ చిన్న విషయాలు తెలుస్తాయి. ఈ ఇద్దరూ మర్చిపోయినా సంపాదకులు కూడా మర్చిపోయినట్టున్నారు. అదే ఆశ్చర్యం.

  6. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 68 గురించి Dr Rao అభిప్రాయం:

    06/02/2022 11:35 pm

    “సరిచూడు” అన్న బొత్తాము ఇక్కడ లేదు.

    [సరిచేసాము. దోషము చూపినందుకు ధన్యవాదాలు- సం.]

  7. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి seetaram అభిప్రాయం:

    06/02/2022 4:39 pm

    కర్ణ పేయం .తెలుగు లెస్స. లలిత కళల రమనీయ సమన్వయం.

  8. ఉత్తర మొరాకో శోధనలు 7 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    06/02/2022 11:55 am

    థాంక్యూ చరణ్ గారూ… ఈ రచనా, దాని అనువాదం మీలాంటి పాఠకుల కోసమే.

  9. ఉత్తర మొరాకో శోధనలు 7 గురించి Charan అభిప్రాయం:

    06/02/2022 11:24 am

    అద్భుతంగా వర్ణించారండీ. ప్రతి నెలా ఈమాటలో ఈ article కోసం ఎదురుచూసేవాణ్ణి. మేమూ మొరాకో వెళ్ళినంత సంబరపడిపోయాము.

  10. ఊహల ఊట 13 గురించి స్వాతి అభిప్రాయం:

    06/02/2022 6:58 am

    చిన్నప్పటి వేసవికాలాన్ని మళ్లీ రుచి చూపించారు. కిటికీలకు తడి పరదాలు కట్టుకోవడం, తడి ఇసుక మీద కుండలతో నీళ్ళు, దబ్బాకు వేసిన మజ్జిగ, తాటి ముంజలు, మావిడి పళ్ళు, నట్టింట్లో నేల మీద పడుకుని దొర్లడం… ఎన్ని జ్ఞాపకాలో! చిన్నప్పుడు పక్కని ఒక తాతగారిని బీబీ తాతగారు అనేవాళ్లం. ఇప్పటికీ అదే పిలుపు😀. నట్టింట్లో కూచుని కొన్ని మాటలు కూడదు అంటారు. నిజవే… కబుర్లతో పాటు మన పెద్దవాళ్ళు చెప్పేవి ఎంత బాగా చెప్పేరో…