పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. Madre: రెండు వాచకాలు గురించి gopal sumkara అభిప్రాయం:

    09/10/2022 4:22 am

    beautiful poem

  2. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 9 గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    09/09/2022 5:43 am

    అన్వర్ గారు వ్రాస్తున్న తెలుగు పరమాద్భుతంగా వున్నది. పిల్లలచేత చదివించటానికి ప్రింట్-ఎడిషన్ ఉంటే దయచేసి ఉటంకించగలరు.

  3. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల గురించి శ్రీనివాస్ అభిప్రాయం:

    09/08/2022 9:16 pm

    నేను ఒక ప్రభుత్వరంగ సంస్థ లో పనిచేస్తున్నప్పుడు ఆర్మీకి కావలసిన కొన్ని పరికరాలు పంపి వాటి శిక్షణ సమయంలో సిపాయి నుంచి కమాండింగ్ ఆఫీసర్ వరకు కొన్ని నెలలు వారితో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి.

  4. ష్‌! ఆమె పని చేసుకుంటోంది గురించి Lyla yerneni అభిప్రాయం:

    09/08/2022 7:51 pm

    రచయిత్రి, నంబూరి పరిపూర్ణ బొమ్మ, క్వీన్ ఎలిజబెత్ బొమ్మ చూస్తే -నాకేం తేడా కనిపించలేదు. దాదాపు ఇద్దరిదీ ఒకే వయసు కదా. 93, 97. ఒక్కలాగే ఉండక ఈ ఇద్దరు ఆడవాళ్లు, ఇంకెలా ఉంటారు!
    ఇద్దరూ పనిమంతులే. ఒక్కరోజు ఖాళీగా కూర్చున్నట్టు లేరు. వారికి ఎన్నో బాధ్యతలు, మరి.

    బయొలాజికల్ గా మనిషి జీవితాలను గురించి ఆలోచించేవారికి, ఏ జీవితాల్లోనూ పెద్ద తేడాలుండవు. మగ జంతువులు, స్పెర్మ్ ఇచ్చి, ఆడజంతువులు అండాలిచ్చి -సంతానం ఉత్పత్తి చేస్తారు. ఆడవాళ్లు, పాలిచ్చి ఆ ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువ సంతానాన్నో సాకుతారు. సాకక చస్తారా! అది జంతువులలో built in parental care.

    దీనిలో మాత్రం పరిపూర్ణకూ, ఎలిజబెత్ కీ ఏమి తేడా ఉంది. ఆ తర్వాత వారి సంతానాన్నీ, మళ్లీ వారి సంతానాన్నీ, నేను చూస్తే మాత్రం, ఏం తేడా ఉంటుంది? మానవులంతా చేసేది ఈ జంతు కార్యక్రమమే.
    మరి ఎందుకు -హేరీ, మేగన్- ఆ మొగుడూ పెళ్లం బొమ్మలు చూస్తానికే, మళ్లీ వాళ్ల పిల్లల బొమ్మలు చూస్తానికే ప్రజలు ఎగబడి చస్తారో నాకైతే అర్ధం కాదు. ఏ ఆడామగా, ఎవరి ప్రేమ కలాపాలకు మాత్రం ఏమి తేడా ఉంటుంది. డెలివరీ రూమ్ లో, ఎలిజబెత్ ప్రసవించినా, డయానా కన్నా, ఆ తర్వాత కేట్, మేగన్ – ఏ ఆడది కన్నా గాని, పిల్లో, పిల్లడోనే ఉద్భవించేది! అందరూ ప్రపంచం లోకి వచ్చే ద్వారం ఒకటే. ఆ ఘట్టం మారదు.

    కొన్నేళ్ల క్రితం నేను రచ్చబండలో రాస్తున్నప్పుడు, అప్పుడే తెలుగు వికీపీడియా నిర్మించటం మొదలు పెట్టారు. నన్ను అందులో సహాయం చెయ్యమంటే, నాకు టెంప్లేట్లు, లైఫ్ హిస్టరీ డిక్టేషన్లు బాగా అలవాటే కాబట్టి, నమూనాలేగదా తెలుగువారికి కావలసింది అని, నా సంగతే రాస్తానన్నా. నా పేరూ, ఊరూ, మా అమ్మానాన్నా పేర్లూ, పుట్టిన ఊళ్లూ గట్రా నాకన్నా ఎవరికి బాగా తెలుస్తాయి? పని తేలిక గదా అందుకని.
    అప్పుడు నాకు చెప్పబడింది ఏంటంటే, వికీపీడియాలు – ‘ఫేమస్ పీపుల్’ ను ప్రజలకు పరిచయం చెయ్యటానికి అని. ఎవరి సంగతి వాళ్లు రాయటానికి రూల్స్ ఒప్పవంట. నేను, నా జీవితాన్ని తక్కువ చేసుకుని, నేను ఇంపార్టెంట్ కాదనుకుని, నేను అప్పటి దాకా చేసిన పని పిచ్చదండగ అనుకుని, -పోయి ఏ వేమననో , శ్రీశ్రీ నో, ఎంటిఆర్ నో గురించి వాకబు చేసి వాళ్లను గురించి శ్రద్ధాభక్తులతో, వికిపీడియాలు నిర్మించాలి. అది నేను చెయ్యగలిగిన పని కాదు.

    ఆ తర్వాత కొన్నేళ్ళకు, ఒక తెలుగు మేగజిన్ కి నేను ఆర్టికల్ రాసి, కావాలంటే మేగజీన్ అట్టమీద నా బొమ్మ వేసుకోమన్నా. ఎవరి బొమ్మేస్తే మాత్రం ఏం? నాకైతే ఏం తేడా లేదు. కాని మేగజీన్కి ఉంది. అట్టలమీద లంబాడీలు, బుట్టలల్లేవాళ్లు, లోక్సత్తా నాయకులు, కొత్త ప్రధానులు, దేవుళ్ల బొమ్మలు, నేను చూసి, ఆహా, ఓహో అని మెచ్చాలి. నా బొమ్మ వాళ్లెందుకు చూడకూడదు? వాళ్లను గురించే మిగతా ప్రపంచం ఎందుకు తెలుసుకోవాలి? నాకు అర్ధంకాదు. ఆ పత్రిక అట్టలు, వేరే కల్చర్ కల నా మెయిల్ మేన్ కి భయం కలిగించాయి. అతని భయం నా కర్ధమయింది. కాని ఆయా దేశస్థుల సంస్కృతీ విషయాల సర్దుబాట్ల గురించి, ప్రచారం గురించీ, కూడా నాకు ఆసక్తి లేదు.

    ఇవ్వాళ క్వీన్ ఎలిజబెత్ స్కాట్లెండ్ ఇంటిమీద డబుల్ ఇంద్రధనుస్సు కనిపించిందంట, అందరూ చూస్తున్నారు. చూడవలిసిందే. తప్పక. ‘పరిపూర్ణ’ పేరు గురించి, ఆమె జీవితంలో పరిపూర్ణత ఉన్నదా లేదా అని ఏమీ గుంజాటన పడక్కర్లేదు. ఆవిడ బొమ్మ ఎంతో బాగుంది. చూడవలిసిందే తప్పక. ఆవిడను, ఆమె పిల్లలను గురించి నేను వికీలో చదివాను. ఏం తేడాలేదు. అందరి జీవితం లానే. అందరి పిల్లల్లాటి పిల్లలే.

    ఏం తేడాలుండవు మానవజీవితాలలో. అందరికీ ఆకాశంలో ఇంద్రధనుస్సులు, అందరికీ, అందరికీ ఒకటే.

    -Lyla

  5. బార్న్ టు ఫ్లయ్ గురించి Nitin sathe అభిప్రాయం:

    09/08/2022 11:15 am

    Excellent! Must publish his book in Telugu.

  6. నేనే! గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/07/2022 10:35 pm

    అనేకానేక వలయాలకావల విషాద జీరల మీ కవిత చదువుతున్న పాఠకుల్లో నేనొకడిని తల్లీ!

  7. Trash గురించి Anuradha Bandi అభిప్రాయం:

    09/06/2022 1:08 pm

    Raj Reddy garu, Thimsa garu, Vijay Bhaskar garu, Shiva Shankar garu.

    Thank you.

  8. స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    09/06/2022 12:54 pm

    వ్యాసం అత్యుత్తమంగా అనిపించింది. మూలం – గుర్విందర్ గారు ఎవరు?

    [ఆయన ఒక బ్లాగర్. వ్యాసం చివర ఆయన పేరులో లింక్ చూడండి. – సం.]

  9. వి. ఎ. కె. అంటే? గురించి Gopala Krishna అభిప్రాయం:

    09/06/2022 8:13 am

    Thank you Smt Bhargavi for your excellent article (speech) on Sri VAK RangaRao of whom I am a very very big fan for the past 50 years. I am waiting for his vast ‘JNANA BHANDARAM’to be unlocked for a long time. Thanks a lot for becoming his ‘First Publisher’. Thanks also to the ‘Second Publisher’ for bringing out two more. They are some of my treasured possessions. I too hope fervently that some one will bring out more of such gems.

    I also hope Sri V A K will take your suggestion of recording seriously and start a you tube channel of his own.

    With grateful thanks
    Gopala Krishna

  10. సెప్టెంబర్ 2022 గురించి సమీక్ష్యకారి అభిప్రాయం:

    09/06/2022 6:39 am

    ప్రశ్నిస్తూ చూపుడు వేలు చూపిన గౌరీ లంకేశ్, ఎంఎం కల్బుర్గి, నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారేల గతి ఏమైంది? చూపుడు వేలే కాదు, ప్రాణాలే పోయాయి.