పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 14 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/05/2022 5:58 pm

    1972లో విక్టోరియా నెం.203 అన్న విజయవంతమైన హిందీ సినిమా వచ్చింది. అందులో విలాసవంతమైన గుర్రపుబగ్గీది ప్రముఖ పాత్ర.

  2. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 14 గురించి anwar అభిప్రాయం:

    12/04/2022 11:29 pm

    శ్రీ శర్మ గారికి: ఆ రోజు బొంబాయిలో టాక్సీ స్ట్రైక్ ఉంది. నేను దర్జాగా విక్టోరియా ఎక్కి నేరుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కార్యాలయానికి వెళ్లాను (గుర్రపు బగ్గీని విక్టోరియా అనడం వాడుక అనుకుంటాను, శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ వారి రచనల్లో చాలా సార్లు విక్టోరియా ఎక్కి దిగడం చదివి ఉంటిని.)

  3. వంద కుర్చీలు 2 గురించి తఃతః అభిప్రాయం:

    12/04/2022 2:32 pm

    Sri Dasari: మీ కొత్త సినిమా ద్వారా మీరు ఏం సందేశం ఇస్తారని ఎవరొ అడిగితే చక్రపాణి ‘సందేశం ఇవ్వాలనుకుంటే టెలిగ్రాం ఇవ్వచ్చు సినిమా తీయటం ఎందుకు?’ అన్నారట. I was talking about story writing (story as an art form). In my opinion a good story writer is one who melts *his/her reader, does not mince. ఇహ వివక్షతలంటారా – ఏసమాజమూ తప్పించుకోలేని, పూర్తిగా బయట పడలేని అవలక్షణం వివక్షత- ఎదురు వివక్షతకు దోహదం చేయటం కూడా.

    నమస్కారాలతో – తఃతః

    *his ఒక్కటీ రాసి వదిలేస్తేనే ఒక వివక్షత!

  4. ష్‌! ఆమె పని చేసుకుంటోంది గురించి వివిన మూర్తి అభిప్రాయం:

    12/04/2022 11:51 am

    ఈ వ్యాసం, వ్యాఖ్య చాలా ఆలశ్యంగా ఈ రోజే చూసాను. అద్బుతంగా ఉంది మీ వ్యాఖ్య lyla yerneni గారూ కొన్నేళ్ల క్రితం నేను రచ్చబండలో రాస్తున్నప్పుడు, అప్పుడే తెలుగు వికీపీడియా నిర్మించటం మొదలు పెట్టారు. నన్ను అందులో సహాయం చెయ్యమంటే, నాకు టెంప్లేట్లు, లైఫ్ హిస్టరీ డిక్టేషన్లు బాగా అలవాటే కాబట్టి, నమూనాలేగదా తెలుగువారికి కావలసింది అని, నా సంగతే రాస్తానన్నా. నా పేరూ, ఊరూ, మా అమ్మానాన్నా పేర్లూ, పుట్టిన ఊళ్లూ గట్రా నాకన్నా ఎవరికి బాగా తెలుస్తాయి? పని తేలిక గదా అందుకని.
    అప్పుడు నాకు చెప్పబడింది ఏంటంటే, వికీపీడియాలు – ‘ఫేమస్ పీపుల్’ ను ప్రజలకు పరిచయం చెయ్యటానికి అని. మీరు రాసిన ఈమాట చాలా ఆలోచనీయం. లోకంలో బ్రతికిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. పేరు పెట్టుకోటం అనే పద్దతి మానవజాతిలోకి వచ్చాక కొందరి పేర్లు మిగిలిపోయాయి. అలా పేర్లు మిగిలిపోటమే చరిత్ర అనే భావనగా మానవుడి భావనగా స్థిరపడ్డాక మిగిలిపోటం అనే ఆశ కూడా వచ్చింది. అంత సుదూరాంశం పక్కనుంచి మనగురించి మనకి చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకునే అవకాశం సోషల్ మీడియా ఇచ్చింది. దీన్ని మనం పంచుకోటం అనుకోవచ్చు. రైలు ప్రయాణాలలో ఒకప్పుడు మనుషులు ఒకరి గురించి తెలుసుకునే అలవాటుండేది. మన గురించి మనం చెప్పుకునే అవకాశం వికీపీడియా ఇవ్వకపోయినా ఫేస్బుక్ వంటివి ఇస్తున్నాయని నేను అనుకుంటున్నాను.

  5. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 14 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    12/04/2022 11:24 am

    అన్వర్, ఉత్తినే తప్పులు వెతకుదాం అని కాదు గానీ, ఇది చెపుదాం అని ఈ వాఖ్య రాస్తున్నా.

    నేను దర్జాగా విక్టోరియా ఎక్కి నేరుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కార్యాలయానికి వెళ్లాను.

    అర్ధం చూసుకున్నారా? అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసు ఉండేది ‘విక్టోరియా టెర్మినస్” అనే రైల్వే స్టేషన్ దగ్గిరలో. “ట్రైన్ ఎక్కి విక్టోరియా టెర్మినస్‍ లో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కార్యాలయానికి వెళ్లాను.” అని ఉండాలి అనుకుంటా మీ అనువాదం. ఈ మధ్యన ఆ ట్రైన్ స్టేషన్ పేరు కూడా “ఛత్రపతి శివాజీ టెర్మినస్” గా మార్చారు.

    అనువాదం బాగుంది. నేను కొన్నేళ్ళు బాంబే లో ఉద్యోగం చేసినందు వల్ల ఈ సంగతి తెల్సు – కేవలం లక్ష్మణ్ కార్టూన్ కోసమే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కొనేవారు బాంబేలో వేలకొద్దీ ఉన్నారు. కొన్ని రోజుల్లో ఆయన కార్టూన్ లు చూసి రోజు రోజంతా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. కామన్ మాన్ అనేది బోంబే లో ప్రతీ ఒక్కరికీ సరిగ్గా అతికినట్టూ, వర్తించినట్టు ఉండేది. ఆయన కార్టూన్ల వల్ల వచ్చినదే “చల్తా హై” (సర్దుకు పోదాం, ఫర్వాలేదోయ్, మనందరం ఒకటే వగైరా) అనే నానుడి ఆ నగరంలో (లేదా వైస్ వెర్సా). ఇప్పటికీ కూడా అలాగే ఉందని అని నేను నమ్ముతున్నా – శివాజీ టెర్మినస్, ముంబయి అని పేర్లు మార్చినా.
    నమస్తే

    [రచయిత ఉద్దేశ్యం విక్టోరియా కారియేజ్ అని బహుశా – సం.]

  6. వంద కుర్చీలు 2 గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/04/2022 5:05 am

    “కాప్పా… రే కాప్పా… సొక్కాలు వద్దురా. దమ్మదొరల కుర్చీల్లో కూర్చోవద్దు బిడ్డా…” అంటూ ఆక్రోశించే తల్లి…

    “అమ్మను వదిలేయకు. అమ్మను నీతోనే ఉంచుకో. అమ్మకు ఇప్పటివరకు మనం చేసింది చాలా పెద్ద అన్యాయం, పాపం. ఆమె అన్నెంపున్నెం ఎరుగని అమాయక జంతువు. జంతువుల బాధను ఓదార్చడం అసాధ్యం. కాబట్టి అది అంతులేనంత లోతుగా నిలిచిపోతుంది. అమ్మకు చేసిన అన్యాయానికి అన్ని విధాలా ప్రాయశ్చిత్తం చెయ్యి…” అన్న ప్రజానందుల (శ్రీ నారాయణ గురువు గారి శిష్యుడు) వారి దీవెనల ఆదేశం…

    సమాజం లోని అట్టడు వర్గానికి చెందిన అసహాయుల అరణ్యరోదనను వినిపించుకోమని, సామాజిక న్యాయం, సకలజనుల సౌభాగ్యంతో కూడిన సమసమాజ నిర్మాణం జరగాలని ఆశించిన జాతిపిత బాపూ, భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన జ్యోతిరావ్ ఫూలే, సంఘ సంస్కర్తలు, ఆధ్యాత్మిక గురువులు, దేశప్రగతి కోసం పోరాడిన, పోరాతున్న ప్రజానాయకులు, ఆత్మబలిదానాలు చేస్తున్న వీరులు…

    సామాజిక, ఆర్ధిక, రాజకీయ వెనుకబాటుతనంతో తరతరాలుగా అన్యాయానికి బలౌతున్న వారి గురించి “నూఱు నాఱ్కాలికళ్” తమిళ్ కధలో ఆవిష్కరించిన జయమోహన్ గారికి, మాత్రుకను “వంద కుర్చీలు”గా తెలుగులో అనుసృజించి గుండెను పిండేసిన అవినేని భాస్కర్ గారికి కైమోడ్పులు అని అనలేని అసహాయత నాది. ఆ తల్లి ఆక్రందనలలో దహించుకుపోతూ…

    ~ త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు

  7. ఊహల ఊట 19 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    12/03/2022 11:35 pm

    ఊహల ఊట 19వ భాగం చదివాను. పనసకాయ పొట్టు గింజలు తొనలు పనస ప్రస్థానం బాగుంది. సమాజంలో బీద గొప్ప తేడాలను చిన్నతనం నుండే గమనించడం పెద్దయ్యాక ఆ తేడాని తాను పోగొట్టాలి అనుకోవడం కుంతల పాత్ర ద్వారా పలికించడం రచయిత్రి మనోభావాలకు అద్దం పడుతోంది. మంచి సందేశాన్ని అందించిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ చాగంటి తులసి గారికి అభినందన వందనాలు.

  8. వంద కుర్చీలు 2 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/03/2022 8:29 pm

    లోకో భిన్న రుచి..
    ఆహ్లాదాలూ తియ్యందనాలూ తప్ప వివక్షల వాస్తవాలు తెలియని వారికి అవి చేదు విషాల్లా కనిపిస్తాయి..అనవసరపు విషాదాలనిపిస్తాయి..

  9. వంద కుర్చీలు గురించి Sivakumar Tadikonda అభిప్రాయం:

    12/03/2022 7:26 pm

    ఇది కథ కాదు. కల్పన కాదు. చారిత్రికతని నింపుకుని, అద్భుతమైన అక్షరాల పేనికతో చేసిన సంఘర్షణభరిత నిజజీవిత చిత్రణ. భార్యాభర్తలు ఒకరినొకరు ఎంపిక చేసుకోవడంలో కూడా కాల్క్యులేషన్! కథగా మలచింది మాత్రం గుర్తుండిపోయే ముగింపునిచ్చి అనిపిస్తుంది. ఈ జీవితం తన కెలా తెలిసిందో రచయిత కథలోనే చెబుతాడు. “అతని ఇంటినుండి అతని శిష్యడైన ఒక యువరచయిత … ఉత్తర కేరళలో కాసర్కోడులో ఏదో ఉద్యోగం చేస్తుంటాడతను. ఇక్కడికి వచ్చినప్పుడు సుందర రామసామి ఇంటి మేడమీద ఉంటాడు. నేను సుందర రామసామితో మాట్లాడుతుంటే కొన్నిసార్లు అతనూ వచ్చి మా మాటల్లో కలిసేవాడు. అతని పేరు జెయమోహన్ అని గుర్తు.” ఈ కథని రాసినందుకు జయమోహన్ గారికీ, అనువాదం అనిపించకుండా తెనిగించిన భాస్కర్ గారికీ ధన్యవాదాలు!

    “ఎంగిలి” పదం వాడుక “ఎంగిలి ఆకులు,” “ఎంగిలి మెతుకులు” వాడకాల్లో సరయినదే గానీ, నోటిలోంచి కారేదాన్ని గుంటూరులో మాత్రం “చొంగ” అనేవారు. చివర్లో, “చొంగ కారిన ఆమె ముఖం దిండుమీద ఒక పక్కకు ఒరిగిపోయింది.” అని ఉండాలి కదా అనుకున్నాను. భాస్కర్ గారివైపు “ఎంగిలి కారడం” వాడుక సరయినదే నేమో ననిపించింది.

    గాడిదల సంత పక్కన ఉన్న ప్రభుత్వాసుపత్రి గూర్చి కాప్పా పంపిన రిపోర్ట్ తరువాత డాక్టర్ మాణిక్యం ఉద్యోగానికి ఎసరుపెట్టిన వైనం, 2007లో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల నుండీ వచ్చిన క్షతగాత్రులని సరిగ్గా చూడట్లేదని అమెరికాలోని వాల్టర్ రీడ్ ఆర్మీ మెడికల్ సెంటర్ కి సంబంధించిన ఇద్దరిని పదవులనించీ తొలగించడాన్ని గుర్తుకు తెచ్చింది. బుష్ ప్రభుత్వం, యుధ్ధానికి ఎంత ఖర్చవుతుంది అంటే నాకేం తెలుసు అని జవాబిచ్చింది. ఇంక యుధ్ధానికి పంపుతున్నవాళ్లల్లో ఎంతమందికి దెబ్బలు తగిలి హాస్పిటల్‌కి వస్తారో అని ఆలోచించే తీరిక ఎక్కడున్నది? వస్తున్నవాళ్లందరినీ చేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి అని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చెబితే, ఇటు కాంగ్రెసు, అటు అధ్యక్షుడు డబ్బుల్లేవు, సరిపుచ్చుకొమ్మని చేతులెత్తేశారు. హాస్పిటల్లో బెడ్లు లేక కారిడార్లల్లోనూ, నేలమీద యుధ్ధ వీరులు పడివున్నారు అని పేపర్లో వార్త రాగానే మాత్రం, ముందు ఒక ఇద్దర్ని పైపదవుల్లోనించీ పీకేశారు. ఇది కులంతో కాక వ్యవస్థకి సంబంధించిన విషయం.

  10. Janaki’s Zen గురించి Mahesh అభిప్రాయం:

    12/03/2022 6:08 am

    రావణుడి దుర్గుణములు తోలగితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ధన్యులము🙏