పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. ఉండి ఉంటే… గురించి శ్యామల కల్లూరి అభిప్రాయం:

    08/02/2023 6:53 am

    ఇప్పుడు ఉండి వుంటే… అందరూ జీవితంలో ఒక్కసారైనావెళ్లపోయిన వాళ్లనిలా తల్చుకుంటారు.

  2. కాసిల్ ఆఫ్ ఆల్బకర్కీ గురించి Sunitha అభిప్రాయం:

    08/01/2023 9:57 pm

    ఇనేస్‌ను చంపేవాడు ఆమె అందాన్ని చూసి ఉండాల్సింది.”
    “అది చూసే చేశాడేమో!” అతనిలో ఏదో దిగ్భ్రాంతి.”

    కథ పూర్తయ్యాక… ఈ మాటలు మళ్ళీ చదువుకుంటే…!

  3. భద్దర్రావు వస్తాడు గురించి Sivakumar Tadikonda అభిప్రాయం:

    08/01/2023 7:03 pm

    కథ పేరు – “భగవంతం కోసం”

  4. స్వీయచరిత్రలు: వలసకాలపు ఆంధ్రసమాజం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    08/01/2023 4:53 pm

    మంచి పరిచయం..

    ‘జాతీయత అన్న అంశాన్ని తొలిసారిగా గుర్తించిన వీరాస్వామయ్య’ – కాశీయాత్ర చరిత్ర మరోసారి ఈ కోణంలోంచి చదవాలి.

    ఒక యాత్రాచరిత్రను పరిశోధకులు రాజగోపాల్ ఆత్మకథల కోవలో చేర్చడం చర్చనీయం..ఆసక్తికరం. హర్షణీయం

  5. భద్దర్రావు వస్తాడు గురించి Sivakumar Tadikonda అభిప్రాయం:

    08/01/2023 4:15 pm

    Inspired by Samuel Becket’s play, “Waiting for Godot”? తెలుగులో కూడా కాఫీ హోటల్‌లో కూర్చుని ఒకరి రాకకోసం నిరీక్షించడం గూర్చిన ఒక కథని గుర్తు చేసింది.

  6. నాన్నా తెలుసా గురించి ఉరుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    08/01/2023 12:43 pm

    ఎంత చక్కగా ఉన్నాయి మీ పద్యాలు. మొదట అబ్బురం, ఆ వెంటనే ఆ అమ్మను తలచుకొని బాధ!

  7. తూనీగ తూనీగ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    08/01/2023 7:57 am

    ఒళ్లు గగుర్పొడిచింది అన్న మాటకు అర్ధం అనుభవంలోకి వచ్చింది.

  8. స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి శామల అభిప్రాయం:

    07/28/2023 1:27 am

    Stoicకి సరయిన తెలుగు పదం ‘స్థితప్రజ్ఞుడు’ అంటే వినసొంపుగా లేదు. ‘విరాగి’ పదం కొంచెం దగ్గరవుతుందేమో. స్థితప్రజ్ఞత బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినది. Stoicism ఒక philosophical term. దానికి ఆంధ్రం ‘స్థితప్రజ్ఞతావాదం’ అని ఇంత చక్కని వ్యాసం రాసిన అనువాదకులు ఉదహరించటం, తెలిసీ తెలియని నాకు కొరుకుడు పడటం లేదు. స్థితప్రజ్ఞతావాదులు అనగా ఎవరు?

  9. భార్గవీ నిలయం గురించి Sridevi Somanchi అభిప్రాయం:

    07/23/2023 10:18 pm

    భలే వుంది కథ.

  10. నాన్నా తెలుసా గురించి K.V.Giridhararao అభిప్రాయం:

    07/23/2023 7:15 am

    కామేశ్వరరావు గారు,
    చాలా బాగున్నాయి మీ పద్యాలు.
    అల్పాక్షరాలతో అనలార్థాన్ని, అనంతమైన భావాన్ని ఆవిష్కరించారు.
    ధన్యవాదాలు.