పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. సోల్జర్ చెప్పిన కథలు: ఒంటరి పాట గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/01/2023 11:25 am

    బావుంది. ఒక్కసారిగా సోల్జర్ కథలు రాగభరితమైపోయాయి. మరి ఒకటి రెండు ఎపిసోడ్లు సంగీతం చుట్టూ అల్లితే బావుంటుంది.

    తెలుగులో సైన్యపు జీవితాల చిత్రణ అరుదు. ఈ కథలన్నీ పుస్తకంగా వస్తే బావుంటుంది.

  2. నిండు వేసవి గురించి పి.వి.రమణరావు అభిప్రాయం:

    09/01/2023 10:56 am

    గతస్మృతులతో కథని నడిపించి ఓ పరిష్కారం చూపించారు. రచయిత్రికి అభినందనలు.

  3. నిండు వేసవి గురించి Seshu Chebolu అభిప్రాయం:

    09/01/2023 10:37 am

    Simple story, expressed in lucid language! Felt refreshed reading it. Keep it up Anuradha garu.

  4. నిండు వేసవి గురించి వెంపరాల దుర్గా ప్రసాద్ అభిప్రాయం:

    09/01/2023 9:23 am

    కథనం బావుంది. ఒక సారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి వచ్చిన అనుభూతి కలిగింది. కానీ వేరే ప్రత్యామ్నాయ వేసవి శిబిరం వైపు తిప్పేసేరు రచయిత్రి. బాగానే ఉన్నా, ఈనాటి పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండడం లేదు. ఆ దిశగా వాళ్ళని కొద్దిరోజులయినా ప్రోత్సహించడం మానకూడదు. మూలాలను మరుస్తున్న పిల్లలకు మనం నిర్దేశం చేయడం కూడా అవసరమే కదా.

  5. నిన్ను కావలించుకునే… గురించి Adi Ramesh అభిప్రాయం:

    09/01/2023 9:00 am

    Interesting poem.

  6. యాత్ర గురించి శామల అభిప్రాయం:

    09/01/2023 3:48 am

    జయమోహన్ వంటి ఉన్నతస్థాయి సమకాలీన రచయిత భారతదేశంలో ఉన్నారని ఈమాట ద్వారానే తెలిసింది. ఆ ఎరుక ఒక సంపదగా భావిస్తాను. రచయిత పాటవాన్ని యథాతథంగా (ఇనుమడింపజేసి కూడా అయిఉండవచ్చు, నాకు తమిళం తెలియదు) ఆంధ్రంలో అనుసృజన చేసిన రచయితలకి ధన్యవాదాలు.

    జయమోహన్ పరిచయవాక్యాల్లో ఉదహరించినట్లు ఆయన మర్యాదపూర్వకంగా తిరస్కరించినది పద్మభూషణ్ కాదు, పద్మశ్రీ.

    ఆయన మిగతా కథలు విషయప్రధానమయితే, ఈకథలో విషయంకంటే నాటకీయత పాత్ర ఎక్కువ ఉందని నాకనిపించింది. కథలో చెప్పినట్లుగా కొన్ని అనుభవాలు వ్యక్తపరచలేము, కైలాసమానసరోవరయాత్రలో స్వానుభవం.

    కేదార్‌నాథ్ నుంచి కైలాసపర్వతానికి నడకమార్గం లేదు.

  7. ఊహల ఊట 27 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    08/28/2023 1:01 am

    వృక్షత్వం, ఈ పదం ఈ మాటకే అందాన్నిచ్చింది. పూసలాయించడం బాగుంది.

    ఈనెల ఊహల ఊట చదువుతుంటే అప్పుడే కుంతల పెద్దదైపోయిందా అనిపించింది. మా బాల్యం కూడా అక్కడక్కడా గుర్తు వచ్చినది.

    తులసి గారి జ్ఞాపకాల పందిరికి, ఊహల ఊటకి జయహో జయహో!

  8. కాసిల్ ఆఫ్ ఆల్బకర్కీ గురించి sudha అభిప్రాయం:

    08/17/2023 8:25 am

    Thank you Sunitha garu

  9. అదే కాంతి: ఒక పరిశీలన గురించి Kishore Karnam అభిప్రాయం:

    08/14/2023 9:24 pm

    Very good review and commentary.

  10. ఊహల ఊట 27 గురించి sumanaspati reddy అభిప్రాయం:

    08/12/2023 8:46 pm

    16 వ భాగం తరువాతి నుండి “ఊహల ఊట” (రెండవ మాలిక అనవచ్చునేమో) ఉద్భవన, ప్రవాహ గతుల్లో కొంత మార్పు వచ్చేసింది. చలాకీ బాల్యం నుండి కౌమార్యపు చాంచల్యానికీ, ఆలోచనల్లో ఇంకొంత ధైర్యం, గందరగోళానికీ! ఇదంతా తులసి గారు పదునుగా త్వరిత కలం వేగంతో చేస్తూ వెళ్తుంటే ఊహాలోచనల తుపాను పాఠకున్ని చుట్టేస్తుంది. నేటి సమాన్య సమస్యలు, మానసిక తీరుతెన్నుల ఛాయ కూడా ఈ తుపాను పైకి అర్రులు చాచి కలిసిపోవడం తులసి గారి ధైర్య ప్రయోగ డృష్టికి తార్కాణం.