పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. పొంతన గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    07/23/2024 10:22 am

    సూటిగా స్పష్టంగా ఏ శషభిషలు లేకుండా చాలా ఇంపుకలిగేటట్టు వ్రాసారు.

  2. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి sankara appajee అభిప్రాయం:

    07/23/2024 9:23 am

    ధన్యవాదములు సారు. పద్యాలతో పాటుగ భావాలు గానీ తాత్పర్యము గానీ వుంటే చాలా బాగుంటుంది.

  3. హుష్! గురించి S. Simon అభిప్రాయం:

    07/23/2024 7:12 am

    ఇంతకీ ఏం చెప్పదలచుకున్నారు దేశరాజు గారు?

  4. ముష్టి పలురకములు గురించి V R Veluri అభిప్రాయం:

    07/22/2024 6:00 pm

    శాయి గారూ:

    ఎంత మంచి పద్యం తిరిగి రాశారు, వ్యాఖ్యానంతో సహా! వ్యాసునికి, ఆయన పదివేలమంది శిష్యులకీ, మూడు రోజులపాటు భిక్ష దొరకకపోవటం, ఆయన కాశీ బ్రహ్మణులపై కోపించి, శపించటానికి సిద్ధపడటం, మొత్తం కథ పూర్తిచేస్తే బాగుండేది.

    ఆకథ చివరికి, ‘తనకోపమె తనశత్రువు’ అనే చిన్ననాటి నీతి పద్యం గుర్తుచేస్తుంది కదూ!

    Once in a while, it is heartwarming to re-read our own timeless classics.

    ధన్యవాదాలు
    వేలూరి వేంకటేశ్వర రావు.

  5. ఆలిస్ మన్రో గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    07/22/2024 7:35 am

    This nobel Prize winner is nothing short of a wretched woman who ignored the sexual advances
    Of her second husband towards her own daughter;Ms.skinner.Revulsion went down my spine on hearing Ms. Skinner’s revealations.
    A famous telugu writer (became famous by writing on occult practices) also indulged in such un ethical practice many years back and is never pardoned by telugu readers.
    Atleast she should have shown her helplessness in her writings instead of throwing it under carpet.

  6. ముష్టి పలురకములు గురించి VSTSayee అభిప్రాయం:

    07/21/2024 2:51 pm

    వ్యాసుడు – కాశి – మాధుకరవృత్తి

    త్రిషవణస్నానంబుఁ దీర్చు భాగీరథి – శివధర్మములు చెప్పు శిష్యతతికి
    నుదరపోషణము సేయును మాధుకరవృత్తి – లింగార్చనంబుఁ గల్పించు నియతి
    ముక్తిమంటపమధ్యమునఁ బురాణము సెప్పుఁ – బంచాక్షరంబు జపంబు సేయు
    భూతి సర్వాంగీణముగ సముద్ధూళించు – ధరియించు రుద్రాక్షదామకములు
    శ్రుతులు నాల్గు నేర్పఱిచిన సూక్షబుద్ధి
    బ్రహ్మసంవేది యాదిపురాణకర్త
    భారతాఖ్యానసంహితా ప్రథమసుకవి
    గంధవతిపట్టి యానందకాననమున. (కాశీఖండము: సప్తమాశ్వాసము-128)

    (మల్లంపల్లి శరభేశ్వరశర్మగారి వ్యాఖ్యనుండి)
    మాధుకరవృత్తి
    మధుకరమునకు (తుమ్మెదకు) సంబంధించిన వర్తనము (జీవనము)
    ఒక్కొక్క పువ్వునుండి ఒక్కొక్క తేనెబిందువును తుమ్మెదసేకరించినట్లు ఒక్కొక్క యింటినుండి ఒక్కొక్క యన్నకబళమును మాత్రమే పరిగ్రహించుట పేరు మాధుకరవృత్తి.

  7. ఆలిస్ మన్రో గురించి Ranga Rao అభిప్రాయం:

    07/20/2024 8:49 pm

    గౌరవనీయులైన వేలూరి వారికి అభివాదములు! బతుకుదెరువు కోసం గడిపిన ముప్పై ఏళ్ళ రచనా జీవితంలో తెలుసుకున్న సత్యం అది!

  8. ముష్టి పలురకములు గురించి V R Veluri అభిప్రాయం:

    07/20/2024 5:12 pm

    అయ్యా శర్మ గారూ:

    మీ ముష్టి కథనం పూర్తిగా చదివాను. బాగా రాశారు.

    మీరు మరిచిపోయారో, రాయటం మంచిదికాదో అని మానేసారో తెలియలేదు. మీరు బ్రాహ్మల భిక్షాటన ప్రస్తావించలేదు.

    వేదం, శాస్త్రం, వ్యాకరణం, చదువుకోని బ్రాహ్మలు (అంటే వైదీకుల్లో ఒక శాఖ వాళ్ళు: వీళ్ళని కొన్ని ప్రాంతాలలో మురికినాడులని కూడా పిలవటం కూడా కద్దు) పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, వర్జ్యం, వగైరా బట్టీపట్టి, ప్రొద్దున్నే ఇతర బ్రాహ్మల ఇంటి ముందు కొచ్చి, అవి వల్లించి, ‘భిక్షాం దేహి’ అని అడుక్కునే వాళ్ళు. బామ్మో, అమ్మో, ఒక గుప్పెడు బియ్యం ఆ బాపనాయన జోలెలో వేసేవాళ్ళు.

    వాళ్ళ వెనకాలే నిలబడి, ఎందుకూ పనికిరాని నియోగులు కూడా అడుక్కునేవాళ్ళట! ఆయితే, ఎంతైనా ‘నియోగి’ భేషజం కదా! అందుకని, ‘ఏవమ్మోయ్. ఆచేత్తోనే నాక్కూడా ఓ గుప్పెడు బియ్యం పారెయ్యి’ అని అడుక్కునేవాళ్ళని చదువుకున్న వైదీకులు వేళాకోళం చెయ్యటం మాచిన్నప్పుడు విన్నాను.

    మీరు బాగా చిన్నవాళ్ళు కదా, మీరు విని వుండకపోవచ్చు. ఇప్పుడు మీ ముష్టి కథనం ముగింపు సవ్యంగా గుండ్రంగా ముగుస్తుంది.

    వేలూరి వేంకటేశ్వర రావు.

  9. కలుపుకొంటే కలుపుకొన్నంత గురించి ఉరుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    07/20/2024 12:13 pm

    చిన్న సవరణ

    “ఇప్పటి తమిళనాడులో, ఒకప్పుడు జరిగిన పారులెదిరింపు ఎసవులో (ఉద్యమంలో), ఎక్కువగా దెబ్బతినింది తెలుగు పౌరులే (బ్రాహ్మణులే). ఊళ్ళకు ఊళ్ళు, ఇళ్ళకు ఇళ్ళు వదిలేసి నగరాలకు వలసపోయింది తెలుగు వైదికులే. ఇప్పటికీ కావేరి ఒడ్డునున్న మేల్గేరులలో అంతో ఇంతో తమిళ పారులు ఉన్నారు కానీ, తెలుగువారిని వెతికివెతికి పట్టుకోవాలి.”

    పౌరులు కాదు, పారులు.

    [కృతజ్ఞతలు – సం.]

  10. మరల రామాయణంబదేల… గురించి V R Veluri అభిప్రాయం:

    07/18/2024 6:21 pm

    లైలా గారూ: ఎన్నాళ్ళకెన్నాళ్ళకి! మీరు ఎప్పుడు ఏది రాసినా అది చక్కగా వుంటుంది. చదవబుద్ధి అవుతుంది.

    నన్నెచోడునిపై వ్యాసంలో జె. కె. ఎమ్.గారు, క్రౌంచ అంటే హెరొన్ (heron) అని రాశారు. హెరొన్‌ల ముక్కులు, కాళ్ళూ పొడుగ్గా వుంటాయి. పరగల ముక్కు, కాళ్ళూ, పొట్టిగా వుంటాయి. పరగపిట్ట మన గుప్పిట్లో ఇముడుతుంది; అంత చిన్నది!

    అందుచేత, మా సూర్యనారాయణరాజు అప్పటో మాకు విందుల్లో పెట్టే పిట్టలు పరగలు (పోనీ పరిగలు అందాం, శాయిగారికి కోపం రాకండా!) అనే నేను నిర్థారించుకుంటున్నాను.

    ధన్యవాదాలు

    వేలూరి వేంకటేశ్వర రావు.