పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16440

  1. నాకు నచ్చిన పద్యం: పొలయలుక గురించి Nagaraju Kesari అభిప్రాయం:

    10/24/2024 2:20 am

    చాలా బాగున్నది.

  2. పరకాల కాళికాంబ స్వీయచరిత్ర గురించి బొల్లాప్రగడ వెంకట పద్మ రాజు అభిప్రాయం:

    10/22/2024 12:41 pm

    పరకాల కాళికాంబగారి స్వీయ చరిత్రపై శాంతిశ్రీ బెనర్జీగారి సమీక్ష చాలా బాగుంది. వారికీ, అందించిన ఈమాటకూ ధన్యవాదాలు! ఈ మాట మనసులోంచి వచ్చింది సుమండీ. నరసాపురానికి కొంగు చివరలా ఉండే కొప్పర్రు వాడిని కావటం వల్లనూ, మా ఊరు కమ్యూనిస్టు గడ్డ కావటం వల్లనూ పరకాల కుటుంబం గురించి చిన్నప్పటి నుంచీ బాగా విని ఉండటం వలన వారి ప్రస్తావన చాలా… ఆనందం కలిగించింది.

    కాళికాంబగారు ధీరమహిళ. పేదలకి ఎంతో అందుబాటులో ఉండేవారు. ఈ మాటలు ఇప్పటికీ వారి ఇల్లు ఉన్న పంజా సెంటర్ చుట్టు ప్రక్కల ఆ కాలంలో నివసించిన వాళ్ళు చెబుతూ ఉంటారు. నిజంగానే, మేధావిగా ప్రభాకర్‌గారి ఎదుగుదల గురించి ఆమె మాటల్లో వింటే ఇంకా బాగుండేది.

    ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మహిళ కూడా భర్త ఎదుగుదలకి ఏమి చేయగలదో, తను ఎంత వరకూ ఎదగగలదో చూపించిన గొప్ప వ్యక్తి కాళికాంబగారు. ఆమెను అతి దగ్గర నుంచి చూసిన వాడిగా గర్విస్తున్నాను. జోహర్!

  3. పంచేంద్రియాలు: 1. వాసన గురించి sudha అభిప్రాయం:

    10/21/2024 8:24 pm

    Such a detailed write up. Throughly read it. Thank you.

  4. కరుణశ్రీ: తపోభంగము గురించి ఓలేటి శ్రీనివాస భాను అభిప్రాయం:

    10/21/2024 1:48 am

    గోరు వెచ్చని పాయసం లాగా ఉంది కె.వి.యస్. రామారావు గారి వారి వ్యాసం.

  5. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి M.A.Khadeer అభిప్రాయం:

    10/20/2024 10:13 pm

    It was a sad development that Isnail too moved towards religion. Brahmins(some) are the red hot revolutionaries in India, like Gora gaaru,

  6. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి అమరేంద్ర అభిప్రాయం:

    10/20/2024 8:30 pm

    నాగేస్రావ్ గారూ
    ఇంగ్లీషు వెర్షన్లు ఉన్నాయండి
    మీ వాట్సప్ నెంబర్/ మైల్ ఐడి నాకు పంపండి (వాట్సప్9818982614)..అవి మీకు పంపుతాను.
    మీ పాపకు శుభాకాంక్షలు

  7. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి నాగేస్రావ్ అభిప్రాయం:

    10/18/2024 9:30 pm

    అమరేంద్ర గారూ, శేషగిరి గారు రాసిన ఈ వ్యాసాలు ఇంగ్లీష్ లో దొరుకుతాయా? మా అమ్మాయికి యాత్రలంటే చాలా ఇష్టం, కానీ తెలుగు చదవలేదు, అందుకని.

  8. పాముకాటుకి చెంపదెబ్బ? గురించి Rao Vemuri అభిప్రాయం:

    10/17/2024 10:14 pm

    నెనర్లు !🙏

  9. చదువు అనే ఆరోవేలు గురించి Pv seshssaina Reddy అభిప్రాయం:

    10/17/2024 8:54 am

    పుస్తకం చదవడం అనే అలవాటు కోసం దొంగగా మారాను అని రాశావే చాలా సూపర్ రా! నిజమే మన చిన్నప్పుడు మంగళ షాపులలో ఉండే బుక్కులే మనకు దిక్కు, అలానే ప్రతాప్ టాకీస్ దగ్గర గ్రామచావిడిలో అమ్మే బుక్కులు చూసేవాళ్లం. నేషనల్ టాకీస్ ఎదురుగా ఒక శాపతను వీక్లీలు అమ్మేవాడు అవి కూడా మనం బాగానే వెంటపడి చదివే వాళ్ళం. మన చార్ మధు పుస్తకాలు అయితే ఇంకోపంతా వాడు వాడి తమ్ముడు ఇద్దరు కలిసి అదే బుక్ చదువుకునేవారు నీకు తెలుసు కదా… ఇప్పటికి కూడా పుస్తకాలు చూస్తే షాపులో ఊరికే తిరిగే బుద్ధి అవుతూనే ఉంటుంది. విశాలాంధ్ర బుక్ హౌస్ మన శ్రీనిధి హోటల్ దగ్గర ఆపుతుంటారు ఖచ్చితంగా వెళుతూ ఉంటాం. హైదరాబాదులో అయితే నీకు బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంటాయి. అందుబాటులో ఉంటాయి అనుభవించే అవకాశం ఉంది. మాకు అంత లేదురా అబ్బీ, ఉంటా..

  10. పాముకాటుకి చెంపదెబ్బ? గురించి వంశీ క్రిష్ణ అభిప్రాయం:

    10/17/2024 2:09 am

    మీరు చెప్పింది నిజమే. పాము విషము (venom) ప్రోటీనులు లేదా పాలీ పెప్‌టైడ్ నిర్మితాలు. వివిధరకాల గ్లైకోలైజేషన్స్ ఆ ప్రోటీనుల మీద ఉండటం వల్ల ఒకే రకమైన విరుగుడు తయారు చేయడం కుదరదు. ఫాస్పోలైపేజెస్ జీవకణాలలోకి కేవలం ప్రవేశించడానికి పనికొస్తాయి మరియూ అవి ప్రాథమిక విరుగు కారకాలుగా పనికొస్తాయి కానీ ఖర్చుతో కూడుకున్నది మరియూ పంటపొలాలలో, అడవుల్లో తిరిగే మనుషులకు అందుబాటులో ఉండవు. ప్రథమ చికిత్సగా గాయాన్ని వెంటనే నీటితో కడిగి, ప్రోటీన్ డీనెచురేటింగ్ ఏజంట్స్ మరియు క్షారకారకాలు, అంటే యాంటిసెప్టిక్ సబ్బు, డిటర్జంట్ లాంటివి పనికొస్తాయి. మిగతావన్నీ మీరు చెప్పేశారు, ఏఐ, మెషీన్ లెర్నింగ్, హ్యూమన్ జీనోం ప్రాజెక్టులలో పని చేసిన మీకు జీవరసాయన శాస్త్రం పైన ఇంత అవగాహన ఎలా వచ్చిందో ఆశ్చర్యం.