మీరు చెప్పినట్లు చందమామ పాత సంచికలు చదివాను. మే 1961 సంచికలో “ఈ విధంగా బ్రహ్మయొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను, తన నోట అప్రయత్నంగా వెలువడిన శ్లోకాలలాటి శ్లోకాలతో, అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు. ఆ కథనే మనం కూడ చదివి ఆనందించుదాం,” తో మొదలయి ఆగస్టు 1966 సంచిక లో కుశలవుల పట్టాభిషేకం తో ముగుస్తుంది. సీతారాముల కాలకృత్యాలు, అన్న పానీయాల విషయం పలుమార్లు వస్తుంది.
జూన్ 1962 సంచికలో, “రాముడు చిత్రకూటానికి వచ్చి నెల అయింది. ఈ రోజే అతను తన పర్ణశాల విడిచి సీతతో సహా కొండ మీద విహరించటానికి బయలుదేరాడు. చిత్రకూట పర్వతం చాలా అందమైనది. అక్కడి చెట్లూ, పక్షులూ, మృగాలూ, చిత్రవిచిత్రమైన ధాతువులూ, పక్కనే ప్రవహించే మందకినీ నదీ, మనోహరమైన దృశ్యాలూ చూస్తూ వారిద్దరు చాలాసేపు విహరించారు. రాముడు సీతతో, “నీవు, లక్షణుడూ నా వెంట ఉంటే ఈ దృశ్యాలు చూసి ఆనందిస్తూ ఎన్ని ఏళ్లపాటయినా ఇక్కడే ఉండి పోగలను,” అన్నాడు. ఇలా చాలా సేపు విహరించిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఒకచోట కూర్చున్నారు. రాముడు కులాసాగా కబుర్లు చెపుతూ సీత చేత మాంసఖండాలు తినిపించాడు.”
ఇది మీకు ఎందుకు వెటకారంగా కనిపించిందో నాకర్థం కాలేదు. అంత పెద్ద కథలో తిండీ తిప్పలకన్నా ముఖ్యమైన విషయమేదన్నా చెప్తే మీరన్న వెటకారానికి విలువ ఉండేది.
కొడవటిగంటి నాస్తికుడయి తన సంపాదకత్వం క్రింద రామాయణ మహాభారతాల కథల్ని వేయించడం అన్నింటికన్నా ఆశ్చర్యమన్నారు మీరు. ఎందుకాశ్చర్యం? మీదగ్గర వున్న కొ.కు. సాహిత్య సెట్టులో ఉందో లేదో, “వ్యాస ప్రపంచం – 5, సాహిత్య వ్యాసాలు,” లో “బాలల సాహిత్యం,” అన్న భాగంలో తన అభిప్రాయలని చెప్పాడు:
“బాల సాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావాలను బలంగా నాటాలి. ధైర్య సాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా, పిల్లల మనస్సులకు చాలా మేలు చేస్తాయి.”
“దేవుడి మీద భక్తినీ, మత విశ్వాసాలనూ ప్రచారం చెయ్యటనికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు. కథల్లో దేవతలూ, భక్తులూ ఉండరాదని కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని సుఖాలూ ఒనగూడుతాయన్న అభిప్రాయాన్ని పెద్దలు కలిగి ఉండటం ఎంత తప్పో, పిల్లలకు ఇవ్వటం అంతకు పదింతలు తప్పు.”
“బాల సాహిత్యం ప్రయోజనాలలో ఒకటి ప్రాచీన సాహిత్యం గ్రంథాలతో ప్రథమ పరిచయం ఒకటి అని నా నమ్మకం.”
“వ్యాస ప్రంపంచం – 8, లేఖలు,” లో కృష్ణాబాయి కి 1964లో వ్రాసిన ఉత్తరం నుండి : ” చందమామకు కథలు బయట నుంచి కూడా వస్తాయి. కొన్ని మాత్రమే నేను మా లైబ్రరీ పుస్తకాలలో నుంచి ఏరుతాను. అన్ని కథలూ చక్రపాణి గారు చూసి ఆమోదించటం జరుగుతుంది. నేను చేసేది కథలను తిరగరాయటం.”
“చందమామలో భక్తిని రేకెత్తించే కథలు గాని, మతప్రచారం చేసే కథలుగాని వెయ్యము. చక్రపాణిగారి పాలసీ కూడా అదే. అయితే శాస్త్రీయ భావాలను పెంచే కథలు కూడా వెయ్యటంలేదు. శాస్త్రవిజ్ఞానం పట్ల నాకెంత నమ్మకమో చక్రపాణిగారికి అంత అనుమానం – చదివే వాళ్ళు అర్థం చేసుకోలేరని. అప్పటికీ చాలా రోజులు శాస్త్ర విషయాలకు కొన్ని పేజీలు కేటాయిస్తూ వచ్చాను. దాన్ని నిలిపి వెయ్యవలసి వచ్చింది.”
“చందమామలో పిల్లల మనస్సులను నీరసపరిచేవి, నిర్వీర్యం చేసేవీ అయిన కథలు రాకుండా సాధ్యమైనంత శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాం. ప్రత్యేకంగా ఏ కథ అయినా అటువంటి దోరణిలో ఉన్నదనిపిస్తే శ్రమ అనుకోక నాకొక కార్డుముక్క రాయండి.”
ఈ ఉల్లేఖనలు కొందరికైనా ఉపయోగపడతాయనే ఆశతో,
కొడవళ్ళ హనుమంతరావు
మీ అనువాదం చక్కగా ఉంది. బుచ్చిబాబు, “నన్ను మార్చిన పుస్తకం,” అన్న 1953 నాటి వ్యాసంలో, అనువాదాల ద్వారా రావాల్సిన రస్సెల్ గ్రంథాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఆ అవసరం ఇప్పటికీ ఉంది. ఇది రస్సెల్ BBC కి ఇచ్చిన “Six Autobiographical Talks,” లో మొదటిది. మిగిలినవి కూడా అనువదిస్తారని ఆశిస్తాను.
సామాన్య పాఠకులకు ఉద్దేశించిన రస్సెల్ వ్యాసాలు చదవడానికి సులభంగా ఉంటాయి; అర్థం తెలియని పదాలు అరుదు. మీ అనువాదంలో, “నిష్పాదించుకున్న” మాటకి అర్థం ఆంధ్రభారతిలో వెతకాల్సి వచ్చింది. “మతైక” కి బదులు “మతపరమైన” అంటే సులువుగా బోధపడేది.
ఇది చాలా నచ్చింది: “హెగెల్ విశ్వం ముక్కలు చెయ్యలేని ఒక ముంజ లాంటిది, ఎక్కడ తాకినా మిగిలిన మొత్తమూ కదులుతుంది.”
భూషణ్ గారూ: గ్రంథచౌర్యం గురించి సమగ్రమైన, సునిశితమైన చక్కని వ్యాసం వ్రాశారు. అలాగే చౌర్యానికి గురైన మా నాన్నగారి వ్యాసాన్ని ప్రస్తావించి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు 🙏 ఇండియా ప్రయాణం, అనారోగ్యం, ఇతర వత్తిళ్లలో వెంటనే స్పందించలేకపోయాను.
తః తః గారూ: మీరన్నది నిజం. చెళ్ళపిళ్ళవారు శ్రీశ్రీతో మాట్లాడుతూ “మన కవిత్వానికి లక్షణం కంఠవశమయ్యే రచన” అన్నారు. ఇది అబ్బూరివారి పుస్తకంలో ప్రస్తావించారు. పైన హనుమంతరావుగారు కూడా quote చేశారు.
ఇదే విషయం గురించి మా నాన్నగారు కవిత్వం నా దృక్పథం (2010లో వ్రాసిన వ్యాసం)లో ప్రస్తావించారు. అది జయంతిలోనో మరో అచ్చు పత్రికలోనో తర్వాత ప్రచురింపబడినా వెబ్ లింకు లేదు. అయినా ఆ సందర్భం గురించి ఆయన వ్రాసిన వ్యాసంలో ఒక పేరాని ఇక్కడ quote చేస్తున్నాను.
“ఛందోబద్ధంగా పద్యం వ్రాయగలిగితే చాలు దానికి ఏదో ఒక మేరకు readability వస్తుంది. ఏదో ఒక మేరకు కంఠవశం అయ్యే గుణం అది సంతరించుకుంటుంది. అంటే, ప్రాచీన ఛందోరీతుల ఔదార్యం వల్ల, వైశిష్ట్యం వల్ల ఒక handsome subsidy రచయిత పొందవచ్చునన్నమాట. కానీ, వచన కవిత అలా కాదు. వచన కవిత వ్రాయబోయి ఎందుకూ కొరగాని భ్రష్టమైన వచనమే వ్రాయడం చాలా సందర్భాలలో జరుగుతుంది. తిలక్ గారు వచన కవితలపై కల్పించిన మక్కువతో ఎన్నో వచన కవితల్ని, అక్కడక్కడనైనా చదివాను. సత్యమైన విషయమేమిటంటే, ఆకట్టుకొనే కవితల కోసం వెదికినా అవి ఎక్కువగా కనిపించకపోవటం, కంఠవశమయ్యే గుణం వాటికి లేకపోవటం, మనల వదలకుండా వెంబడించే పంక్తుల సమాహారం లేకపోవటం.”కంఠవశమయ్యే గుణం” అని ఈ వ్యాసంలో పదే పదే ప్రస్తావించటం జరుగుతున్నది. ఇది చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి పదబంధం. ఒకసారి శ్రీశ్రీగారు వేంకటశాస్త్రిగారిని (శ్రీశ్రీగారికి శాస్త్రిగారంటే చాలా గౌరవమట) వినయంగా అడిగారట,’కవిత్వానికి ప్రధాన లక్షణమేమిటి’ అని. దానికి వారు’కంఠవశమయ్యే గుణం కవితకు ప్రధాన లక్షణాలలో ఒకటి’అని అభిభాషించారట.“
ఈ వ్యాసం ప్రతి నాకు అందుబాటులో ఉండటానికి ఒకే ఒక్క కారణం మా నాన్నగారి ప్రతి తెలుగు రచనను నేను టైప్ చేయడం మాత్రమే 😊
వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయో వృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవినేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప… అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.
ఆనాటి శాస్త్రి గారి నిర్వచనాన్ని శ్రీశ్రీ నాతో జీవితాంతం దాకా ప్రస్తావించేవాడు. ఈనాటి ‘ప్రయోగాత్మక’ కవితలో కంఠవశం కాగల లక్షణం లోపించిందని శ్రీశ్రీకి తెలుసు. అంచేతనే అలాంటి కవిత్వానికి భవిష్యత్తు సంకోచప్రదమనేవాడు. అంతేకాదు, ఇతర భాషల్లోంచి కవిత్వాన్ని అనువందిచటం కూడా తెలుగు సాహిత్యాభ్యుదయానికి ముఖ్యాంశం అని అంటూ “శాస్త్రిగారూ అలా అన్నారే” అనేవాడు.
ప్రియమైన శ్రీ కర్లపాలెం హనుమంతరావుగారు, నమస్కారములు.
చానాళ్లకి మిమ్మల్ని ఇలా ఇక్కడ చూడగలిగాను. మీ రచనావ్యాసంగం ఎలా సాగుతోంది? హాస్యరసభరితంగా ఉండే మీ రచనలు మళ్లీ చదవాలని ఉంది.
ఇకపోతే ప్రస్తుత సంవాద విషయానికొస్తే “తన ప్రైవెసీ పోయిందని విచారించే సినీతార“ అంటూ మీరు ఇచ్చిన ఉదాహరణ నాకంతగా నచ్చలేదు సార్. సృజనశీలురైన కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, చిత్రకారులు, అభినయం చేసే వారందరూ ఓ తపోనిష్టతో వారి సృజనని ఆవిష్కరిస్తారని… తమను ప్రోత్సహించే కొద్దిపాటి పలుకులకే ఎంతో సంతోషించి మరింతగా ఎదగాలని ఆశిస్తారని అనుకుంటున్నా. మీకు తెలియని విషయం కాదిది.
సోషల్ మీడియా కీకారణ్యంలో నించి, ప్రసార మాధ్యమాల వెల్లువనించి తన మనసుకు కలుగుతున్న చెదురుబాటు నుంచి కుదురుబాటును మాత్రమే ఆశించారు కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి. ఆ మాధ్యమాలు పూర్తిగా అనర్థం, వ్యర్థం అనటం వారి ఉద్దేశ్యం కాదనుకుంటా. అవి రెండువైపులా పదునున్న కత్తులు… వసతులు కలిగిస్తాయి, ఊపిరాడకుండా చేస్తాయి అనే ఓ వాదో అపవాదో వాటిపై ఉంది కదా.
సవివరణగా సాయి బ్రహ్మానందం గొర్తి గారిచ్చిన స్పందన ఎంతో బావున్నా… అందులో కూడా కొన్ని సున్నితంగా లేవనిపించాయి. బహుశా కవయిత్రి ఇంద్రాణిగారితో వారికున్న చనువుకొద్దీ అలా రాసారేమో. ( అవునూ “రచయిత మహాశయా” అనేది పుంలింగ ప్రయోగం అనుకోవచ్చా? అలా అయితే మరి స్త్రీలింగ ప్రయోగంలో ఆ పదాలని ఎలా రాయాలో అని కుంచెం డౌటింగు).
విమర్శలను సరిగా అర్థంచేసుకుని “పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు” అంటూ ఎంతో వినయం, వొందనం చూపిన ఇంద్రాణిగారు కవయిత్రిగా / రచయిత్రిగా మరింతగా ఎదగాలని దీవించమని విన్నపం సార్.
సినిమాల్లో చేరి గుర్తింపు సంపాదించుకోవాలన్న మోజుతో శ్రమించి ఆ కల సాధించిన తరువాత ప్రైవెసీ పోయిందని విచారించిన విధంబుగా ఉందీ కథ. సెల్ఫ్ కంట్రోల్ ఉంటే సాంకేతిక అభివృద్ధి అందించే లాభాలను మాత్రమే సులభంగా సాధించుకునే మాధ్యమం సామాజిక మాధ్యమం. నా వరకు నేను కలలోనైనా కలుస్తానని ఊహించని పెద్దలతో పరిచయలాభం పొందాను. జై.. సామాజిక మాధ్యమాలూ!
చావు బ్రతుకులు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/02/2024 2:02 pm
దంతుర్తి గారు,

నేను ఫిలాసఫీ ఎందుకు చేపట్టాను? గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/27/2024 2:26 pm
కిశోర్ గారూ,
మీ అనువాదం చక్కగా ఉంది. బుచ్చిబాబు, “నన్ను మార్చిన పుస్తకం,” అన్న 1953 నాటి వ్యాసంలో, అనువాదాల ద్వారా రావాల్సిన రస్సెల్ గ్రంథాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఆ అవసరం ఇప్పటికీ ఉంది. ఇది రస్సెల్ BBC కి ఇచ్చిన “Six Autobiographical Talks,” లో మొదటిది. మిగిలినవి కూడా అనువదిస్తారని ఆశిస్తాను.
సామాన్య పాఠకులకు ఉద్దేశించిన రస్సెల్ వ్యాసాలు చదవడానికి సులభంగా ఉంటాయి; అర్థం తెలియని పదాలు అరుదు. మీ అనువాదంలో, “నిష్పాదించుకున్న” మాటకి అర్థం ఆంధ్రభారతిలో వెతకాల్సి వచ్చింది. “మతైక” కి బదులు “మతపరమైన” అంటే సులువుగా బోధపడేది.
ఇది చాలా నచ్చింది: “హెగెల్ విశ్వం ముక్కలు చెయ్యలేని ఒక ముంజ లాంటిది, ఎక్కడ తాకినా మిగిలిన మొత్తమూ కదులుతుంది.”
కొడవళ్ళ హనుమంతరావు
నేను ఫిలాసఫీ ఎందుకు చేపట్టాను? గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/26/2024 1:26 am
దీనికి రస్సెల్ విస్తృత రచనలలో మూలమేదో చెప్పాల్సింది.
[మూలవ్యాసపు వివరాలు చేర్చాము. కృతజ్ఞతలు – సం.]
వార్ధక్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
02/03/2024 2:24 pm
వేలూరి గారు,
ఏనాటికీ మరుపురాని మీ పాత జ్ఞాపకాలలో సంక్రాంతి చలిమంట చెంత చదివిన పద్యాలు కూడా ఉండాలి
(https://www.wisdomlib.org/history/compilation/triveni-journal/d/doc72677.html).
మీ వార్ధక్యాన్ని తలచుకుంటే ఈమధ్యనే చదివిన రెండు పద్యాలు గుర్తొచ్చాయి.
1) Amartya Sen’s “Home in the World: A Memoir,” Thomas Moore “Oft, in the Silly Night” పద్యంతో మొదలవుతుంది (https://www.poetryfoundation.org/poems/44782/oft-in-the-stilly-night-scotch-air).
2) Stanley Kunitz’s “The Layers” (https://www.poetryfoundation.org/poems/54897/the-layers).
కొడవళ్ళ హనుమంతరావు
Endowed Chair In Telugu To Expand Language And Cultural Opportunities గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/25/2024 8:37 pm
తః తః గారికి ధన్యవాదాలు. జాషువా నా అభిమాన కవి; ఆయన స్పృశించని జీవిత పార్శ్వం లేదు:
“వసుధ శాసింపగల సార్వభౌముడగును
ధీరుడగు, భిక్షకుండగు, దీనుడగును
దుఃఖితుడగు, నిత్య సంతోషి యగును
సత్కవి ధరింపరాని వేషములు గలవె?”
కొడవళ్ళ హనుమంతరావు
గ్రేడింగ్ అమ్మలు గురించి గుమ్మడిదల రంగారావు అభిప్రాయం:
04/08/2023 11:44 am
క్లుప్తంగానైనా బాగా వ్రాసారు హనుమంతరావు గారూ పొగాకు గ్రేడింగు గురించి. శైలిలో పెద్దిబొట్ల సుబ్బరామయ్యగారి స్పూర్తి కనిపించింది. అభినందనలు.
ఈ రచన నా సొంతం కాదు! గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:
11/25/2022 8:40 pm
భూషణ్ గారూ: గ్రంథచౌర్యం గురించి సమగ్రమైన, సునిశితమైన చక్కని వ్యాసం వ్రాశారు. అలాగే చౌర్యానికి గురైన మా నాన్నగారి వ్యాసాన్ని ప్రస్తావించి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు 🙏 ఇండియా ప్రయాణం, అనారోగ్యం, ఇతర వత్తిళ్లలో వెంటనే స్పందించలేకపోయాను.
తః తః గారూ: మీరన్నది నిజం. చెళ్ళపిళ్ళవారు శ్రీశ్రీతో మాట్లాడుతూ “మన కవిత్వానికి లక్షణం కంఠవశమయ్యే రచన” అన్నారు. ఇది అబ్బూరివారి పుస్తకంలో ప్రస్తావించారు. పైన హనుమంతరావుగారు కూడా quote చేశారు.
ఇదే విషయం గురించి మా నాన్నగారు కవిత్వం నా దృక్పథం (2010లో వ్రాసిన వ్యాసం)లో ప్రస్తావించారు. అది జయంతిలోనో మరో అచ్చు పత్రికలోనో తర్వాత ప్రచురింపబడినా వెబ్ లింకు లేదు. అయినా ఆ సందర్భం గురించి ఆయన వ్రాసిన వ్యాసంలో ఒక పేరాని ఇక్కడ quote చేస్తున్నాను.
“ఛందోబద్ధంగా పద్యం వ్రాయగలిగితే చాలు దానికి ఏదో ఒక మేరకు readability వస్తుంది. ఏదో ఒక మేరకు కంఠవశం అయ్యే గుణం అది సంతరించుకుంటుంది. అంటే, ప్రాచీన ఛందోరీతుల ఔదార్యం వల్ల, వైశిష్ట్యం వల్ల ఒక handsome subsidy రచయిత పొందవచ్చునన్నమాట. కానీ, వచన కవిత అలా కాదు. వచన కవిత వ్రాయబోయి ఎందుకూ కొరగాని భ్రష్టమైన వచనమే వ్రాయడం చాలా సందర్భాలలో జరుగుతుంది. తిలక్ గారు వచన కవితలపై కల్పించిన మక్కువతో ఎన్నో వచన కవితల్ని, అక్కడక్కడనైనా చదివాను. సత్యమైన విషయమేమిటంటే, ఆకట్టుకొనే కవితల కోసం వెదికినా అవి ఎక్కువగా కనిపించకపోవటం, కంఠవశమయ్యే గుణం వాటికి లేకపోవటం, మనల వదలకుండా వెంబడించే పంక్తుల సమాహారం లేకపోవటం.”కంఠవశమయ్యే గుణం” అని ఈ వ్యాసంలో పదే పదే ప్రస్తావించటం జరుగుతున్నది. ఇది చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి పదబంధం. ఒకసారి శ్రీశ్రీగారు వేంకటశాస్త్రిగారిని (శ్రీశ్రీగారికి శాస్త్రిగారంటే చాలా గౌరవమట) వినయంగా అడిగారట,’కవిత్వానికి ప్రధాన లక్షణమేమిటి’ అని. దానికి వారు’కంఠవశమయ్యే గుణం కవితకు ప్రధాన లక్షణాలలో ఒకటి’అని అభిభాషించారట.“
ఈ వ్యాసం ప్రతి నాకు అందుబాటులో ఉండటానికి ఒకే ఒక్క కారణం మా నాన్నగారి ప్రతి తెలుగు రచనను నేను టైప్ చేయడం మాత్రమే 😊
ఈ రచన నా సొంతం కాదు! గురించి Kodavalla Hanumantha Rao అభిప్రాయం:
11/24/2022 9:39 pm
శ్రీశ్రీ, శాస్త్రిగార్ల సంభాషణ
అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవనకుతూహలం” నుండి:
వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయో వృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవినేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప… అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.
ఆనాటి శాస్త్రి గారి నిర్వచనాన్ని శ్రీశ్రీ నాతో జీవితాంతం దాకా ప్రస్తావించేవాడు. ఈనాటి ‘ప్రయోగాత్మక’ కవితలో కంఠవశం కాగల లక్షణం లోపించిందని శ్రీశ్రీకి తెలుసు. అంచేతనే అలాంటి కవిత్వానికి భవిష్యత్తు సంకోచప్రదమనేవాడు. అంతేకాదు, ఇతర భాషల్లోంచి కవిత్వాన్ని అనువందిచటం కూడా తెలుగు సాహిత్యాభ్యుదయానికి ముఖ్యాంశం అని అంటూ “శాస్త్రిగారూ అలా అన్నారే” అనేవాడు.
— కొడవళ్ళ హనుమంతరావు
చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/06/2020 12:43 am
ప్రియమైన శ్రీ కర్లపాలెం హనుమంతరావుగారు, నమస్కారములు.
చానాళ్లకి మిమ్మల్ని ఇలా ఇక్కడ చూడగలిగాను. మీ రచనావ్యాసంగం ఎలా సాగుతోంది? హాస్యరసభరితంగా ఉండే మీ రచనలు మళ్లీ చదవాలని ఉంది.
ఇకపోతే ప్రస్తుత సంవాద విషయానికొస్తే “తన ప్రైవెసీ పోయిందని విచారించే సినీతార“ అంటూ మీరు ఇచ్చిన ఉదాహరణ నాకంతగా నచ్చలేదు సార్. సృజనశీలురైన కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, చిత్రకారులు, అభినయం చేసే వారందరూ ఓ తపోనిష్టతో వారి సృజనని ఆవిష్కరిస్తారని… తమను ప్రోత్సహించే కొద్దిపాటి పలుకులకే ఎంతో సంతోషించి మరింతగా ఎదగాలని ఆశిస్తారని అనుకుంటున్నా. మీకు తెలియని విషయం కాదిది.
సోషల్ మీడియా కీకారణ్యంలో నించి, ప్రసార మాధ్యమాల వెల్లువనించి తన మనసుకు కలుగుతున్న చెదురుబాటు నుంచి కుదురుబాటును మాత్రమే ఆశించారు కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి. ఆ మాధ్యమాలు పూర్తిగా అనర్థం, వ్యర్థం అనటం వారి ఉద్దేశ్యం కాదనుకుంటా. అవి రెండువైపులా పదునున్న కత్తులు… వసతులు కలిగిస్తాయి, ఊపిరాడకుండా చేస్తాయి అనే ఓ వాదో అపవాదో వాటిపై ఉంది కదా.
సవివరణగా సాయి బ్రహ్మానందం గొర్తి గారిచ్చిన స్పందన ఎంతో బావున్నా… అందులో కూడా కొన్ని సున్నితంగా లేవనిపించాయి. బహుశా కవయిత్రి ఇంద్రాణిగారితో వారికున్న చనువుకొద్దీ అలా రాసారేమో. ( అవునూ “రచయిత మహాశయా” అనేది పుంలింగ ప్రయోగం అనుకోవచ్చా? అలా అయితే మరి స్త్రీలింగ ప్రయోగంలో ఆ పదాలని ఎలా రాయాలో అని కుంచెం డౌటింగు).
విమర్శలను సరిగా అర్థంచేసుకుని “పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు” అంటూ ఎంతో వినయం, వొందనం చూపిన ఇంద్రాణిగారు కవయిత్రిగా / రచయిత్రిగా మరింతగా ఎదగాలని దీవించమని విన్నపం సార్.
చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి కర్లపాలెం హనుమంతరావు అభిప్రాయం:
06/04/2020 8:44 pm