(అమృతధారలకు బదులు) “అమృతగింజలు,” “తొలకరి పగటిని,” “బాల్యం తిరిగి ప్రవహిస్తుంది,” ఇలా కొన్ని పదాలు మెరుగుపరచదగ్గవి.
నాదగ్గర ఉన్నది 1997 నాటి మొదటి ప్రచురణ. అట్ట వెనుక సౌందర్యవతి అయిన కవయిత్రి చిత్రం, అట్టపై ఎగిరే/పడే ఆకుల చిత్రంతో నాణ్యమైన ముద్రణ. ఇన్నాళ్ళూ ముఖచిత్రం ఎవరు వేశారో పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తే, కవర్ పెయింటింగ్: సూర్య ప్రకాశ్, The Flight 1992 (oil on canvas) అని ఉన్నది. ఈయన పేరున్న చిత్రకారుడే కాక, శాస్త్రీయ సంస్థలలో “Artist-in-Residence” కూడానట. From Gemini:
Surya Prakash (1940–2019) was a celebrated contemporary artist from Hyderabad, often called the “Monet of India” for his deep connection to nature. His series “The Flight” (or simply Flight) is considered one of his most significant transitions from raw abstraction toward the nature-inspired style that defined his later career.
The Concept of “The Flight”: The series was inspired by a simple, everyday observation: dry, dead leaves being lifted and carried by the wind. While the subject sounds mundane, Prakash used it to explore profound themes:
Levitation and Movement: Unlike traditional landscapes that ground objects, the leaves in Flight appear to glide or float weightlessly. Prakash deliberately omitted tree trunks or branches to create a sense of pure, unattached motion.
Symbolism of Life and Decay: Critics often interpret the dead leaves as a metaphor for the limitation of life and the transience of human existence. The “flight” of these lifeless objects suggests a final, graceful journey—a “last dance” before returning to the earth.
“ఆకురాలు కాలం” శిశిర రుతువు గురించి కాదు, “ఎన్ కౌంటర్ల కాలం” గురించి. కవయిత్రి రెండో కవితా సంపుటికి ఎదురుచూస్తూ,
ఆంగ్లంలోని క్లుప్తత తెలుగులో కూడా వస్తే ఇంకా బావుండేది.
కొడవళ్ళ హనుమంతరావు
ధన్యవాదాలు సర్. మెండేజ్ నీటిని ఒక దుఃఖ ప్రతీకగా తన కవిత్వంలో ఎక్కువగా వాడింది. ఆకాశాన్ని, సముద్రాన్ని దుఃఖానికి ప్రతీకలుగా చూపింది. ఇది ఒక నాలుగైదు డ్రాఫ్ట్స్ తర్వాత సంపాదకులతో చర్చల తర్వాత అంగీకరించుకున్నది. అనువాదం మూలంలో ఉన్న క్లుప్తతతో సాధారణంగా బాగుంటుంది. కానీ ఈ ఆంగ్లమూలమే స్పానిష్ కవితకు దగ్గరగాలేదు. అందుకే స్పానిష్ మూల కవితకు దగ్గరగా తేవడం కోసం కొంత వివరణ చేర్చవలసి వచ్చింది.
ఆకట్టుకున్న కవిత. Concha Méndez కవితలేవీ నేనింతకు ముందు చదవలేదు. పరిచయం చేసినందుకు కోగంటి గారికి కృతజ్ఞతలు. అసలు మూలం (స్పానిష్) కాకపోయినా కనీసం ఆంగ్ల మూలం ప్రస్తావించాల్సింది. వెతికితే:
This must be my last loss,
I repeat each time
grief rips apart the sky
leaving me weeping.
I don’t want to learn
that we are each a sea
where losses come as waves
breaking, always breaking.
— Translated from Spanish by Harriet Truscott in Modern Poetry in Translation (mpT), No. 3 2023, “Fresh and Salt: Focus on Water.”

[ఆంగ్ల అనువాదానికి లింకు మీరు సూచించిన తరువాత జత చేసాం. — సం.]
తప్పు చూపెట్టినందుకు వేమూరిగారికి కృతజ్ఞతలు. కాకినాడలోని వైద్య కళాశాల పేరు రంగరాయ అనీ వరంగల్లులోని దాని పేరు కాకతీయ అని తెలుసు. బహుశా నేను వరంగల్లులో చదవడాన అది మనసులో ఉండి పొరబాటు అయింది.
శ్రీనివాస్ గారూ, మీ వివరణకీ ప్రోత్సాహానికీ కృతజ్ఞతలు. గరికపాటి వారి జోలికి పోను కాని వేరే వ్యాఖ్యలో Black Holes కథ చెప్పాను.
దేవయాని “వాఁడిమయూఖముల్ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె” నని ప్రస్తావించి నేను అనవసరంగా నాకు లేని పద్య పాండిత్యాన్ని ప్రదర్శించానేమో కాని, “కిరణాలు తరంగాలా? బాణాలా?” అన్న వ్యాసంలో, కొడవటిగంటి ఇలా అంటాడు: “సూర్యుడి తాలూకు శక్తి మనకు బాణంలాగా చేరుతున్నదా? తరంగంలాగా చేరుతున్నదా? బాణంలాగే చేరుతున్నదనుకునేటందుకే ఎక్కువ ఆధారం వుంది. ఎందుకంటే శూన్యంలో తరంగాలుపుట్తజాలవు. మన పూర్వీకులు కిరణాలను బాణాలుగానే పరిగణించారనుకునేటందుకు ఆధారం వుంది. శరంః అనే సంస్కృతం మాట బాణానికీ కిరణానికీ కూడా వర్తిస్తుంది.”
ఈమాట పాఠకులు, కనీసం నావ్యాసాలు చదివేవారు, అన్నీ వేదాల్లో ఉన్నాయనుకునే అమాయకులు కాదనుకుంటాను. అలాగే, మానవుడు ఆలోచించడం పదహారో శతాబ్దంలోనే మొదయిందని భ్రమపడేవారూ కాదనుకుంటాను. ఈ సందర్భంలో, నేను నా యుక్త వయసులో చదివినదొకటి గుర్తొస్తోంది. JBS Haldane (https://en.wikipedia.org/wiki/J._B._S._Haldane) అన్న బ్రిటీష్ జీవ శాస్త్రవేత్త, పేరున్న పాపులర్ సైన్సు రచయిత, మార్క్సిస్టు. చివరన మన దేశంలో స్థిరపడ్డాడు; మరణానంతరం తన దేహాన్ని కాకినాడలోని కాకతీయ వైద్య కళాశాలకి ఇవ్వమని విల్లు రాశాడు.ఓ వ్యాసంలో [1], హాల్డేన్:
“In my last book on genetics, there are seven quotations from Dante’s Divine Comedy. I have been criticized for ‘dragging in’ Dante. But I think it is worthwhile to show the continuity of human thought. I don’t agree with Dante’s theory that mutations are due to divine providence, but I consider it desirable to point out that he had a theory on this subject. I think that popular science can be of real value by emphasizing the unity of human knowledge and endeavour, at their best. This fact is hardly stressed at all in the ordinary teaching of science, and good popular science should correct this fault, both by showing how science is created by technology and creates it, and by showing the relation between scientific and other forms of thought.”
కొడవళ్ళ హనుమంతరావు
[1] “How to Write a Popular Scientific Article,” in “On Being the Right Size and other Essays,” by JBS Haldane. Oxford University Press. 1985.
చాలా చోట్ల, కొందరి పండితుల రచనలలో కూడా సుధేష్ణ అని ఉంది. ఉదాహరణకు, కోవెల “విశ్వనాథ సాహిత్య దర్శనం,” సి. మృణాళిని “ఇ(o)తిహాసం” చూడండి.
From Google: మోనియర్-విలియమ్స్ నిఘంటువు ప్రకారం ‘దేష్ణ’ అనే పదం ‘దా’ (dā) అనే ధాతువు (Root) నుండి పుట్టింది, దీనికి ‘ఇచ్చుట’ అని అర్థం. కాబట్టి సుదేష్ణ అంటే “గొప్ప దాత”.
Srinivas గారూ,
మీరు, “Linking mythology with science is not appropriate,” అంటూ ఆలోచించమని ఓవీడియో లింక్ ఇచ్చారు. ఆ లింక్ పనిచెయ్యడం లేదు. నావ్యాసంలో ఎక్కడ సైన్సుకీ పురాణగాథలకీ లంకె పెట్టానో కాస్త వివరించండి.
దంతుర్తి గారు ఇచ్చిన పోలిక సరికాదు. ఫారడే చిన్నతనంలో చెడుతిరుగుళ్ళు చేసి దారి తప్పినవాడు కాదు. ఆర్థికలేమి వల్ల చదువుకొనసాగలేదు. శాస్త్రీయపరంగా ఫారడే ఓదారిలో పడటానికి ముఖ్య కారకులు: తను పనిచేసిన పుస్తకాల షాపు యజమాని రీబౌ, రెవెరెండ్ ఐజాక్ వాట్స్ రాసిన “Improvement of Mind,” చివరకి మనస్పర్ధలు వచ్చినా రాయల్ ఇన్స్టిట్యూషన్‌లో ఉద్యోగం ఇచ్చిన డేవీ. అయితే జీవితంలో ఏకష్టాలొచ్చినా నిబ్బరంగా ఎదుర్కోడానికి తన మత విశ్వాసం తోడ్పడిందనుకుంటాను.
సాహితీ ఉద్దండులతో (సూరపరాజు, వాడ్రేవు, తమ్మినేని, న్యాయపతి) విభేదించడానికి బిడియపడుతూనే సాహసిస్తున్నాను.
సూరపరాజు గారు,“Literary Criticism is not on literature; it is literature,” అన్నదానితో నాకు పేచీ లేదు. కాని ఉత్తమ సాహిత్య స్థాయికి చేరిన విమర్శలు అరుదు.
రెడ్డిగారి ప్రోత్సాహంతో శర్మగారు 1928 లో అనంతపురం కళాశాలలో చేసిన ఉపన్యాసాలు ఇప్పటికీ ఇంపుగా ఉన్నాయి:
“వెదకి, యేర్చి యోగివేమన్న చెప్పిన
మాటవనలకొక్క నీటుఁ గూర్చి
వానిలోన రుచుల వాచవి చూపితి
కీర్తనీయ చరిత! కృష్ణశర్మ!”
— చిలుకూరు నారాయణరావు
ఆడవారి రచనలపై ఉపన్యసించమని 1928 లో ఇంగ్లాండు కళాశాలలు కోరితే, Virginia Woolf, “But, you may say, we asked you to speak about women and fiction – what has that got to do with a room of one’s own?” అంటూ మొదలెట్టిన ప్రసంగం ఇప్పటికీ ఓ సాహితీరత్నంగా విలసిల్లుతోంది.
“ఆగమగీతి” లోని ప్రారంభానికి
“మానస యజన వాటికపై మరల నేడు
ముసురుతోంది సందేహాల మందేహాంధదేహచ్ఛాయ
ద్విధాదూషిత ద్వ్యాభా సహజాసుర మాయ.”
వ్యాఖ్యానం ఇస్తూ సూరపరాజు గారు, గాయత్రీ మంత్రం, భగవద్గీత, శంకరభాష్యం, హరివంశం, సహస్రనామాలు, వేదాంతులు, చివరకి అంధరంధ్రం (Black Hole) దాకా వెళ్ళారు. నాకు హడలు పుట్టి, భాష్యకారుని గురించిన బైరాగి హెచ్చరిక గుర్తొచ్చింది: “భాష్యకారుడు అపరిణత బుద్ధులైన పాఠకులకు సహాయకారి కావచ్చు. సాధారణార్థాలు బోధించవచ్చు. కాని ఈ ప్రయత్నంలో తరచు అతడు కావ్యంలో మృణత్వాన్ని చెరుస్తాడు. అతి సున్నితంగా వ్రేలిడివలసిన చోట నానార్భాటాలు చేసి తుదకు రసాభాస చేసి కూచుంటాడు.” కటువుమాటకి క్షమించవలె.
మందేహులు అంటే వికాసం కోల్పోయినవారని నిఘంటువు అర్థం. (“పొడమిన సందేహంబుల, జడిసిన మందేహులం బ్రసన్నులఁ జేయన్,” పాండురంగ మాహాత్మ్యము, 1-157. అచ్చ తెలుగు అంకెలకు బదులు వాడుకలో ఉన్న అంకెలను వాడమని ఆంధ్రభారతి శాయి గారికి మనవి). “ద్విధాదూషిత ద్వ్యాభా” అంటే నాకు సరయిన అర్థం దొరకలేదు కాని మందేహుల మానసాన్ని కటిక చీకటితో (ద్విధాదూషిత ద్వ్యాభా సహజాసుర) పోల్చినట్లు ఆ సమాసాన్ని అర్థం చేసుకున్నాను.
కవిత ముగింపుకి సూరపరాజు గారి వ్యాఖ్యానం: “ఉదయిస్తాడు…..నవమానవుడు…అతని వ్యోమమార్గంలో ఉల్కాధరప్రహరి తరణి.” (“ప్రహరి” లోని “హరి” విష్ణుసహస్రనామఫలశ్రుతిలోని సర్వప్రహరణాయుధుడా?)
ఉల్కాధర ప్రహరి అంటే చుట్టూ (ప్రహరి) ఉల్కని (మెరుపుని) ధరించిన వాడు (సూర్యుడు) అని అర్థం చేసుకున్నాను. విష్ణు సహస్ర నామాలు తలపుకే రాలేదు.
“ఆగమగీతి”కి ఉపశీర్షిక “సంచయనం” అన్నారు కాని నాదగ్గరున్న ప్రతుల్లో ఎలాంటి ఉపశీర్షికా లేదు. బైరాగి “అస్థిసంచయనం చేస్తూ,” ఈ ప్రయాణాన్ని “నీ గుండెల డమడమాల బండి మోత సద్దు మణగి” (“క్షమించండి”) వర్ణించాడన్నారు. ప్రఖ్యాత పుష్కిన్ కవితనివ్వడం సరియే కాని, ఎర్రన హరివంశంలోని పద్యంలో (షష్ఠాశ్వాసము-22) ఏముంది విశేషం? కవ్వాలు, కొడవళ్ళు, కత్తులు, బియ్యం, పప్పులు, అన్నీ బస్తాలలో వేసి బళ్ళు కట్టి బృందావనానికి బయలుదేరారని చెప్తుంది.
“ఉపనిషత్తు ఇంటి సరుకులు, బిందెలు గిన్నెలు డబ్బాలు, బరువును మోస్తున్న బండిని చెబుతున్నది. ఇది తన కవితలో అస్థిత్వం నుండి అస్తిత్వానికి ప్రయాణంగా ఊహించాడు ఔపనిషద బైరాగి,” అన్నారు. ఉపనిషత్తులలోని బండి గురించి నాకు తెలియదు కాని, “క్షమించండి” లో బైరాగి, తన కవిత జనుల “జీవిత జయఘోషల పల్లవి” ని పలకలేదు కాని:
“జీవితం ఉరిత్రాటి ఉచ్చులాగు
ఒంటరి సున్నాలాగు పిలుస్తోన్న రోజున
నీ గుండెల డమడమాల బండి మోత సద్దుమణగి
నీడలేని మైదానంలో, ఒంటరి బాటసారిలా ప్రాణం
మొండి గుర్రమై చతికిలపడినప్పుడు నా గానం
నైరాశ్యపు కొండబాటపై, తడబడు అడుగులలో కొనఊపిరి వెదుకులాట
నీ మండిన గొంతుకలోని ఎండిన పెదవులపై
మంచుబొట్టు చెమ్మలాగు నాపాట ఆరిపోతే చాలు
బ్రతుకు కిటికీ రెక్కలోంచి
నీ వెరిగిన మొగం ఒకటి మెరసిపోతే చాలు!”
ఇది సామాన్య పాఠకులకి బాగానే అర్థం అవుతుంది. ఉపనిషత్తుల ఉటంకాలు మిగిల్చేది గందరగోళాన్ని మాత్రమే. చివరన, “విజ్ఞానశాస్త్రవేత్తలు దానినే అంధరంధ్రం (Black Hole) అంటున్నారు. ఆ రంధ్రంలోకి వెలుగు వెళుతుంది, వస్తుంది,” అన్నారు. బ్లాక్ హోల్ నుండి వెలుగు రావడమేమిటి? అసలు దాని పేరే “నల్లని గొయ్యి.” దాని నుండి ఏదీ, కాంతితో సహా, వచ్చే ప్రసక్తే లేదు. దీని గురించిన ఆసక్తికరమైన వాస్తవ కథ ఉంది.
జులై 31, 1930 న ఇరవై ఏళ్లయినా నిండని ఓ కుర్రవాడు స్వదేశాన్ని వదిలి పైచదువులకి ఇంగ్లాండుకి ప్రయాణమయ్యాడు. రెండు వారాలకు పైనే ఓడ ప్రయాణం. తోటి ప్రయాణీకుల సరదాలలో పాల్గొనకుండా, తను తెచ్చుకున్న మూడు భౌతికశాస్త్ర పుస్తకాల అధ్యయనంలో మునిగాడు. దానిలో ఒకటి Arthur Eddington’s “The Internal Constitution of the Stars.” నక్షత్రాల జనన మరణాల గురించి ఆలోచిస్తూ, ఆ కుర్రవాడు ఓ వినూత్న విషయం కనుగొన్నాడు. సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు క్షీణించి కొన్ని చివరకి “బ్లాక్ హోల్” (ఆ పేరు తర్వాత వచ్చింది) గా మారతాయని తన లెక్కలద్వారా చూపాడు. ఇంగ్లాండు చేరిన తర్వాత తన ఫలితాలని ప్రచురిస్తే, పెద్దలు నమ్మలేదు. Eddington చిన్నచూపుతో నిరుత్సాహపడిన యువకుడు [1], ఇంగ్లాండు వదలి అమెరికాలో స్థిరపడ్డాడు. మరి కొన్నేళ్ళకి అతని పరిశోధనలు నిజమని తేలాయి. అతనే 1983 లో నోబెల్ బహుమతి పొందిన S. Chandrasekhar. నోబెల్ విందు ప్రసంగంలో మనందరికీ తెలిసిన టాగోర్ కవితనీ, అంతగా తెలియని వుల్ఫ్ నవలనీ ప్రస్తావించాడు (https://www.nobelprize.org/prizes/physics/1983/chandrasekhar/speech/).
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Empire of the Stars: Obsession, Friendship, and Betrayal in the Quest for Black Holes,” by Arthur I. Miller. Houghton Mifflin Company. 2005.
మధుకుల్యలవంటి కవితలు రాసిన మహెజబీన్ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/07/2026 5:21 pm
ఇన్నేళ్ళ తర్వాత మరలా “ఆకురాలు కాలం” పై మంచి సమీక్ష. “కుల్యలు,” “వాకలు,” మాటల కోసం ఆంధ్రభారతికి వెళ్ళాల్సొచ్చింది, సంతోషం.
దీనిపై దాదాపు పాతికేళ్ళ నాటి తమ్మినేని విమర్శ (https://eemaata.com/em/issues/200205/548.html) చదవదగ్గది.
(అమృతధారలకు బదులు) “అమృతగింజలు,” “తొలకరి పగటిని,” “బాల్యం తిరిగి ప్రవహిస్తుంది,” ఇలా కొన్ని పదాలు మెరుగుపరచదగ్గవి.
నాదగ్గర ఉన్నది 1997 నాటి మొదటి ప్రచురణ. అట్ట వెనుక సౌందర్యవతి అయిన కవయిత్రి చిత్రం, అట్టపై ఎగిరే/పడే ఆకుల చిత్రంతో నాణ్యమైన ముద్రణ. ఇన్నాళ్ళూ ముఖచిత్రం ఎవరు వేశారో పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తే, కవర్ పెయింటింగ్: సూర్య ప్రకాశ్, The Flight 1992 (oil on canvas) అని ఉన్నది. ఈయన పేరున్న చిత్రకారుడే కాక, శాస్త్రీయ సంస్థలలో “Artist-in-Residence” కూడానట. From Gemini:
Surya Prakash (1940–2019) was a celebrated contemporary artist from Hyderabad, often called the “Monet of India” for his deep connection to nature. His series “The Flight” (or simply Flight) is considered one of his most significant transitions from raw abstraction toward the nature-inspired style that defined his later career.
The Concept of “The Flight”: The series was inspired by a simple, everyday observation: dry, dead leaves being lifted and carried by the wind. While the subject sounds mundane, Prakash used it to explore profound themes:
Levitation and Movement: Unlike traditional landscapes that ground objects, the leaves in Flight appear to glide or float weightlessly. Prakash deliberately omitted tree trunks or branches to create a sense of pure, unattached motion.
Symbolism of Life and Decay: Critics often interpret the dead leaves as a metaphor for the limitation of life and the transience of human existence. The “flight” of these lifeless objects suggests a final, graceful journey—a “last dance” before returning to the earth.
“ఆకురాలు కాలం” శిశిర రుతువు గురించి కాదు, “ఎన్ కౌంటర్ల కాలం” గురించి. కవయిత్రి రెండో కవితా సంపుటికి ఎదురుచూస్తూ,
కొడవళ్ళ హనుమంతరావు
ఇదే చివరిసారి… గురించి Dr.Vijay Koganti అభిప్రాయం:
03/04/2026 11:36 am
ధన్యవాదాలు సర్. మెండేజ్ నీటిని ఒక దుఃఖ ప్రతీకగా తన కవిత్వంలో ఎక్కువగా వాడింది. ఆకాశాన్ని, సముద్రాన్ని దుఃఖానికి ప్రతీకలుగా చూపింది. ఇది ఒక నాలుగైదు డ్రాఫ్ట్స్ తర్వాత సంపాదకులతో చర్చల తర్వాత అంగీకరించుకున్నది. అనువాదం మూలంలో ఉన్న క్లుప్తతతో సాధారణంగా బాగుంటుంది. కానీ ఈ ఆంగ్లమూలమే స్పానిష్ కవితకు దగ్గరగాలేదు. అందుకే స్పానిష్ మూల కవితకు దగ్గరగా తేవడం కోసం కొంత వివరణ చేర్చవలసి వచ్చింది.
మీ పరిశీలనకు ధన్యవాదాలు.
నమస్తే.
ఇదే చివరిసారి… గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/02/2026 10:39 pm
ఆకట్టుకున్న కవిత. Concha Méndez కవితలేవీ నేనింతకు ముందు చదవలేదు. పరిచయం చేసినందుకు కోగంటి గారికి కృతజ్ఞతలు. అసలు మూలం (స్పానిష్) కాకపోయినా కనీసం ఆంగ్ల మూలం ప్రస్తావించాల్సింది. వెతికితే:
This must be my last loss,
I repeat each time
grief rips apart the sky
leaving me weeping.
I don’t want to learn
that we are each a sea
where losses come as waves
breaking, always breaking.
— Translated from Spanish by Harriet Truscott in Modern Poetry in Translation (mpT), No. 3 2023, “Fresh and Salt: Focus on Water.”
ఆంగ్లంలోని క్లుప్తత తెలుగులో కూడా వస్తే ఇంకా బావుండేది.
కొడవళ్ళ హనుమంతరావు
[ఆంగ్ల అనువాదానికి లింకు మీరు సూచించిన తరువాత జత చేసాం. — సం.]
కంప్యూటర్ చిప్ కథ – 9: జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ సమీకరణాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/01/2026 11:13 pm
Rao Vemuri గారికి, ఇక్కడ అంతరిక్షం అంటే space అని అర్థం.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/01/2026 12:36 pm
తప్పు చూపెట్టినందుకు వేమూరిగారికి కృతజ్ఞతలు. కాకినాడలోని వైద్య కళాశాల పేరు రంగరాయ అనీ వరంగల్లులోని దాని పేరు కాకతీయ అని తెలుసు. బహుశా నేను వరంగల్లులో చదవడాన అది మనసులో ఉండి పొరబాటు అయింది.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
12/31/2025 5:51 pm
శ్రీనివాస్ గారూ, మీ వివరణకీ ప్రోత్సాహానికీ కృతజ్ఞతలు. గరికపాటి వారి జోలికి పోను కాని వేరే వ్యాఖ్యలో Black Holes కథ చెప్పాను.
దేవయాని “వాఁడిమయూఖముల్ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె” నని ప్రస్తావించి నేను అనవసరంగా నాకు లేని పద్య పాండిత్యాన్ని ప్రదర్శించానేమో కాని, “కిరణాలు తరంగాలా? బాణాలా?” అన్న వ్యాసంలో, కొడవటిగంటి ఇలా అంటాడు: “సూర్యుడి తాలూకు శక్తి మనకు బాణంలాగా చేరుతున్నదా? తరంగంలాగా చేరుతున్నదా? బాణంలాగే చేరుతున్నదనుకునేటందుకే ఎక్కువ ఆధారం వుంది. ఎందుకంటే శూన్యంలో తరంగాలుపుట్తజాలవు. మన పూర్వీకులు కిరణాలను బాణాలుగానే పరిగణించారనుకునేటందుకు ఆధారం వుంది. శరంః అనే సంస్కృతం మాట బాణానికీ కిరణానికీ కూడా వర్తిస్తుంది.”
ఈమాట పాఠకులు, కనీసం నావ్యాసాలు చదివేవారు, అన్నీ వేదాల్లో ఉన్నాయనుకునే అమాయకులు కాదనుకుంటాను. అలాగే, మానవుడు ఆలోచించడం పదహారో శతాబ్దంలోనే మొదయిందని భ్రమపడేవారూ కాదనుకుంటాను. ఈ సందర్భంలో, నేను నా యుక్త వయసులో చదివినదొకటి గుర్తొస్తోంది. JBS Haldane (https://en.wikipedia.org/wiki/J._B._S._Haldane) అన్న బ్రిటీష్ జీవ శాస్త్రవేత్త, పేరున్న పాపులర్ సైన్సు రచయిత, మార్క్సిస్టు. చివరన మన దేశంలో స్థిరపడ్డాడు; మరణానంతరం తన దేహాన్ని కాకినాడలోని కాకతీయ వైద్య కళాశాలకి ఇవ్వమని విల్లు రాశాడు.ఓ వ్యాసంలో [1], హాల్డేన్:
“In my last book on genetics, there are seven quotations from Dante’s Divine Comedy. I have been criticized for ‘dragging in’ Dante. But I think it is worthwhile to show the continuity of human thought. I don’t agree with Dante’s theory that mutations are due to divine providence, but I consider it desirable to point out that he had a theory on this subject. I think that popular science can be of real value by emphasizing the unity of human knowledge and endeavour, at their best. This fact is hardly stressed at all in the ordinary teaching of science, and good popular science should correct this fault, both by showing how science is created by technology and creates it, and by showing the relation between scientific and other forms of thought.”
కొడవళ్ళ హనుమంతరావు
[1] “How to Write a Popular Scientific Article,” in “On Being the Right Size and other Essays,” by JBS Haldane. Oxford University Press. 1985.
తిక్కనగారి భారతంలో ఒక పద్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
12/31/2025 1:06 pm
నేను సుధేష్ణ అని రాశాను, సుదేష్ణ అని ఉండాలి.
చాలా చోట్ల, కొందరి పండితుల రచనలలో కూడా సుధేష్ణ అని ఉంది. ఉదాహరణకు, కోవెల “విశ్వనాథ సాహిత్య దర్శనం,” సి. మృణాళిని “ఇ(o)తిహాసం” చూడండి.
From Google: మోనియర్-విలియమ్స్ నిఘంటువు ప్రకారం ‘దేష్ణ’ అనే పదం ‘దా’ (dā) అనే ధాతువు (Root) నుండి పుట్టింది, దీనికి ‘ఇచ్చుట’ అని అర్థం. కాబట్టి సుదేష్ణ అంటే “గొప్ప దాత”.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
12/30/2025 9:07 pm
ప్రోత్సహించినవారికి కృతజ్ఞతలు.
Srinivas గారూ,
మీరు, “Linking mythology with science is not appropriate,” అంటూ ఆలోచించమని ఓవీడియో లింక్ ఇచ్చారు. ఆ లింక్ పనిచెయ్యడం లేదు. నావ్యాసంలో ఎక్కడ సైన్సుకీ పురాణగాథలకీ లంకె పెట్టానో కాస్త వివరించండి.
దంతుర్తి గారు ఇచ్చిన పోలిక సరికాదు. ఫారడే చిన్నతనంలో చెడుతిరుగుళ్ళు చేసి దారి తప్పినవాడు కాదు. ఆర్థికలేమి వల్ల చదువుకొనసాగలేదు. శాస్త్రీయపరంగా ఫారడే ఓదారిలో పడటానికి ముఖ్య కారకులు: తను పనిచేసిన పుస్తకాల షాపు యజమాని రీబౌ, రెవెరెండ్ ఐజాక్ వాట్స్ రాసిన “Improvement of Mind,” చివరకి మనస్పర్ధలు వచ్చినా రాయల్ ఇన్స్టిట్యూషన్‌లో ఉద్యోగం ఇచ్చిన డేవీ. అయితే జీవితంలో ఏకష్టాలొచ్చినా నిబ్బరంగా ఎదుర్కోడానికి తన మత విశ్వాసం తోడ్పడిందనుకుంటాను.
కొడవళ్ళ హనుమంతరావు
తిక్కనగారి భారతంలో ఒక పద్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
12/09/2025 9:34 am
సుధేష్ణ కోసం వెతుకుతూ ఇక్కడకి యథాలాపముగ వచ్చాను. వేలూరి గారి ప్రశ్నకి విశ్వనాథ వారి జవాబు [1]:
“తిక్కన్న గారు మరియొక పద్యమును వ్రాయగలరు కదా! వ్రాయలేదు. ఎందుచేత వ్రాయలేదు.
ఈ పద్యములోని అన్వయము, కూర్పు, మాటలు, సర్వమును ద్రౌపది కీచకునితో మాటాడునపుడు సహజముగా వచ్చినవి. ఈమాటలలో ఆమెయొక్క మనోయధార్ధ్యము విస్పష్టముగా గోచరించుచున్నది. మరల నదే పద్యము భర్తతో మాటాడినపుడు చెప్పినచో నామె మనోయధార్ధ్యము, ఆమె కోపము, కీచకునితో నన్నప్పు డెట్లున్నవో అట్లు వెలయించుటకు చెప్పినది. భర్త కదా! అతడు నమ్మవలయును. ఇప్పుడు నమ్మక తప్పదు. అప్పుడున్న కోపపుటొత్తిడి యిప్పుడుండదు. ఇంకేవో మాటలు వచ్చును. భర్తకు నమ్మకము కుదురును కుదరదు. ఇప్పుడు కుదరక తప్పదు.
ఆ వెనుకటి స్థితిని సరిగా నదే పద్యముతో రూపుకట్టించుట గొప్పకవులు చేసెడి శిల్పములో నొకటి.”
కొడవళ్ళ హనుమంతరావు
[1] విశ్వనాథ విమర్శ గ్రంథ నిdhi – II. తృతీయ ముద్రణ. 2021. పేజి 56.
ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
11/15/2025 11:10 pm