మీ వ్యాసం నన్ను చాలా శ్రద్ధగా చదివించింది. ఇంత స్పష్టంగా, సరళంగా, విశ్లేషణాత్మకంగా వివరించినందుకు ధన్యవాదాలు. మీ మిగిలిన వ్యాసాల కోసం ఎదురు చూస్తుంటాను.
ఆంధ్రవిశ్వవిద్యాలయములో నేను యం.యే ఫిలాసఫీ చేసినప్పుడు నా మిత్రులు ఎక్కువగా ఆంగ్లసాహిత్యవిధ్యార్ధులు ఉండేవారు.వాళ్ళంతా ఇంగ్లీషు సాహిత్యం తెగ చదివేస్తున్నారని నేను ఓ తెగ ఇదై పోయేవాడిని.చదవాలి,కానీ అంత సామర్ధ్యం లేదు ఇలా సతమవుతూ ఉండగా నాకొక రహస్యం తెలిసింది,దానితో వారి సిలబస్ దాదాపుగా స్పెషలైజేషన్ల తోసహా చదివి అవతపడేసా.అదే పారా ఫ్రేజ్ గైడ్లు.శామ్యూల్ జాన్సన్ రచించిన “introduction to shakespear” మామూలుగా ఐతే నా జీవితకాలంలో చదవగలిగేవాడిని కాను,కానీ ఆ గైడు పుస్తకాల పుణ్యమాఅని ఆ మహానుభావుల గురించి కాస్త తెలుసుకోగలిగాను.
సత్యజిత్ రాయ్ (రే కాదు రాయ్ అనాలని ఈ మధ్య రోహిణీప్రసాద్ గారు చెప్పారు) అలాగే, సినిమాల్లో చారులత సినిమాలోని సున్నితమైన మానసిక విశ్లేషణను,పాత్రల మధ్య అంతర్గత సంఘర్షణలను ఏనాటికైనా అర్ధం చేసుకోవటం నావల్ల అవుతుందా అని బుర్రబద్దలు కొట్టుకుని కొన్నాళ్ళయ్యాక మానేసాను.కానీ తలవని తలంపుగా మీ వ్యాసం నా అజ్ఞానతిమిరం మీద సన్నని వెలుగురేఖలు దోసిళ్ళతో విరజిమ్మింది,ఇది చదివి కూడా తెలుసుకోలేకపొతే సత్యజిత్ రాయ్ సినిమాలు చూడటం,చదవటం,మాట్లాడటం,రాయటం చేస్తే రౌరవాది మహానరకప్రాప్తి ఏమో గానీ సగటు సినిమా అభిమాని అని చెప్పుకోవటం కూడా నేరం కింద పరిగణించాలి.
జె.యు.బి.వి.ప్రసాద్ గారి కథ “మదర్స్ డే” లో, ఇంటి పనులు కుటుంబంలో ఇద్దరూ కలిసి చేసుకోవడమనే అంశం బావుంది. అన్ని “డే” ల లాగే ఈ “మదర్స్ డే” కూడా వ్యాపార సంస్కృతి నుంచీ పుట్టుకొచ్చిందేనన్నవిషయాన్ని కూడా సున్నితంగా చెప్పారు కథలో. ఎవరో ఏదో “డే” పెట్టారు కదా అని, మనం దాన్ని ఆలోచించకుండా ఫాలో చెయ్యకూడదు అన్నదే నా అభిప్రాయం.
మార్పు లేని చోట మిగిలేది మురుగే. హిందూ మొగుడ్తో, కిరస్తానీ పాదరీతో, జిలుగు సాయిబుతో నేర్చిన పాఠాలే సంద్రాలి సంభాషణలేవో మాలతి గారు. అన్ని మార్పుల అనుభవాలే మీకు అక్షర సత్యాలుగా కనిపించాయేవో, వినిపించాయేవో. పనికి మాలినవని అనుకున్నా పురోగమనం అనేది సహజ పరిణామం. మీకూ, నాకూ పనికిరాకపోవచ్చు, కానీ ఇది మీ, నా పరిణామం మాత్రవే కాదు, మొత్తం మానవ జాతి పరిణామం, పురోగమనం. పదికాలాల పాటు నిలచిపోవటవనేది సాపేక్షవే తప్ప ఆబ్సల్యూట్ నిలచిపోవడవనేది కాదు. moving is moving up అనే భావనకి అర్థం లేదు. moving is moving అంతే. పైకా క్రిందకా, ప్రక్కకా కాదు. చలనం అనేది ప్రకృతి సహజం.
మీ కథ బాగుందో బాగలేదో కానీ, కథలాగా మాత్రం లేదు. మీ వ్యాసం విషయంలో హనుమంతరావు గారి అభిప్రాయంతో నేనేకీభవిస్తాను.
రెడ్డి గారు తెలుగు మట్టి వాసన గుప్పిటి విప్పి గుప్పు మనిపించారు. computer లకి కూడా మనసుంటుందనిపించారు, నలభై మంది Washington లు ఒక బాపూకి సాటి కాదని పించారు. కవిత చదివినతర్వాత నిట్టూర్పు విదవకుండా ఉండలేకపోయాను.
కొ శ్యా సు రా
హమ్మయ్య, గ్రంథ చౌర్యం అంటే నగరపాలకసంస్థ గ్రంధాలయం నుంచి తెచ్చి ఇంట్లోపదేళ్ళుగా “మరిచి”పోయిన పుస్తకాలూ, సుబ్బారావుగారింటినుంచి ఇదిగోచదివేసి మళ్ళా ఇచ్చెయనూ అని మరిచిపోయిన పుస్తకలూ కాబోలునని ఉలిక్కి పడ్డాను.
ఇహ రచయితల” నామచౌర్యం” విషయం కొస్తే ఆ మద్య Sidney Sheldon బొంబాయి ( ముంబాయి కాదు) Church Gate దగ్గర foot path మీద పుస్తకాలు చూసి ఆస్చర్య పోయట్ట ” నేనే .. ఇన్ని .. పుస్తకాలు రాసానా ” అని.
James Hadley Chase, Irwing Wallace లు రాయని పుస్తకాలు మనమెన్ని చదవలేదు గనక.
అదేంటో తెలుగు రచయితలలో ఈ నామచౌర్యం నామ మాత్రంగానైనాలేదు
కొ శ్యా సు రా
చాలా బాగుంది.మంచి సృజనాత్మకమయిన ఆలోచన.అయితే,క్రోనోలజీని పాటించి వుంటే ఇంకా బాగుండేదేమో.తెలియని వారు విశ్వనాథ తరువాత పోతన,తరువాత పుట్టపర్తి వారు అనుకునే ప్రమాదం వుంది.అయినా సరే అత్యధ్బుతమయిన వ్యంగ్యం ఇది.
డాలర్ దేహాన్నొదిలి గురించి sk.allabakshu అభిప్రాయం:
05/03/2008 10:51 pm
చాలా రోజుల తర్వాత మంచి సైటు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి సుధాకర బాబు అభిప్రాయం:
05/03/2008 10:49 pm
మీ వ్యాసం నన్ను చాలా శ్రద్ధగా చదివించింది. ఇంత స్పష్టంగా, సరళంగా, విశ్లేషణాత్మకంగా వివరించినందుకు ధన్యవాదాలు. మీ మిగిలిన వ్యాసాల కోసం ఎదురు చూస్తుంటాను.
తెలుగు కావ్యపురుషుడి కథ గురించి శేషతల్పశాయి అభిప్రాయం:
05/03/2008 10:35 pm
కావ్యపురుషుడు వచ్చాడు, వెళ్ళాడు. మళ్ళీ వచ్చాకన్నా “విశ్వసృష్ఠి”తోనే మొదలయ్యాయా అన్నట్టున్న ముద్రారాక్షసాల సంగతిని చూడమనాలి!
ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:
05/03/2008 10:22 pm
ఆంధ్రవిశ్వవిద్యాలయములో నేను యం.యే ఫిలాసఫీ చేసినప్పుడు నా మిత్రులు ఎక్కువగా ఆంగ్లసాహిత్యవిధ్యార్ధులు ఉండేవారు.వాళ్ళంతా ఇంగ్లీషు సాహిత్యం తెగ చదివేస్తున్నారని నేను ఓ తెగ ఇదై పోయేవాడిని.చదవాలి,కానీ అంత సామర్ధ్యం లేదు ఇలా సతమవుతూ ఉండగా నాకొక రహస్యం తెలిసింది,దానితో వారి సిలబస్ దాదాపుగా స్పెషలైజేషన్ల తోసహా చదివి అవతపడేసా.అదే పారా ఫ్రేజ్ గైడ్లు.శామ్యూల్ జాన్సన్ రచించిన “introduction to shakespear” మామూలుగా ఐతే నా జీవితకాలంలో చదవగలిగేవాడిని కాను,కానీ ఆ గైడు పుస్తకాల పుణ్యమాఅని ఆ మహానుభావుల గురించి కాస్త తెలుసుకోగలిగాను.
సత్యజిత్ రాయ్ (రే కాదు రాయ్ అనాలని ఈ మధ్య రోహిణీప్రసాద్ గారు చెప్పారు) అలాగే, సినిమాల్లో చారులత సినిమాలోని సున్నితమైన మానసిక విశ్లేషణను,పాత్రల మధ్య అంతర్గత సంఘర్షణలను ఏనాటికైనా అర్ధం చేసుకోవటం నావల్ల అవుతుందా అని బుర్రబద్దలు కొట్టుకుని కొన్నాళ్ళయ్యాక మానేసాను.కానీ తలవని తలంపుగా మీ వ్యాసం నా అజ్ఞానతిమిరం మీద సన్నని వెలుగురేఖలు దోసిళ్ళతో విరజిమ్మింది,ఇది చదివి కూడా తెలుసుకోలేకపొతే సత్యజిత్ రాయ్ సినిమాలు చూడటం,చదవటం,మాట్లాడటం,రాయటం చేస్తే రౌరవాది మహానరకప్రాప్తి ఏమో గానీ సగటు సినిమా అభిమాని అని చెప్పుకోవటం కూడా నేరం కింద పరిగణించాలి.
మదర్స్ డే గురించి Bhushan అభిప్రాయం:
05/03/2008 9:35 pm
జె.యు.బి.వి.ప్రసాద్ గారి కథ “మదర్స్ డే” లో, ఇంటి పనులు కుటుంబంలో ఇద్దరూ కలిసి చేసుకోవడమనే అంశం బావుంది. అన్ని “డే” ల లాగే ఈ “మదర్స్ డే” కూడా వ్యాపార సంస్కృతి నుంచీ పుట్టుకొచ్చిందేనన్నవిషయాన్ని కూడా సున్నితంగా చెప్పారు కథలో. ఎవరో ఏదో “డే” పెట్టారు కదా అని, మనం దాన్ని ఆలోచించకుండా ఫాలో చెయ్యకూడదు అన్నదే నా అభిప్రాయం.
అలిగితివా… గురించి kosyasura అభిప్రాయం:
05/03/2008 9:02 pm
అబ్బ !! అలక ఇంత అందంగా కూడా ఉంటుందా. !!
కొ శ్యా సు రా
అక్షరం పరమం పదం గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
05/03/2008 7:52 pm
మార్పు లేని చోట మిగిలేది మురుగే. హిందూ మొగుడ్తో, కిరస్తానీ పాదరీతో, జిలుగు సాయిబుతో నేర్చిన పాఠాలే సంద్రాలి సంభాషణలేవో మాలతి గారు. అన్ని మార్పుల అనుభవాలే మీకు అక్షర సత్యాలుగా కనిపించాయేవో, వినిపించాయేవో. పనికి మాలినవని అనుకున్నా పురోగమనం అనేది సహజ పరిణామం. మీకూ, నాకూ పనికిరాకపోవచ్చు, కానీ ఇది మీ, నా పరిణామం మాత్రవే కాదు, మొత్తం మానవ జాతి పరిణామం, పురోగమనం. పదికాలాల పాటు నిలచిపోవటవనేది సాపేక్షవే తప్ప ఆబ్సల్యూట్ నిలచిపోవడవనేది కాదు. moving is moving up అనే భావనకి అర్థం లేదు. moving is moving అంతే. పైకా క్రిందకా, ప్రక్కకా కాదు. చలనం అనేది ప్రకృతి సహజం.
మీ కథ బాగుందో బాగలేదో కానీ, కథలాగా మాత్రం లేదు. మీ వ్యాసం విషయంలో హనుమంతరావు గారి అభిప్రాయంతో నేనేకీభవిస్తాను.
డాలర్ దేహాన్నొదిలి గురించి kosyasura అభిప్రాయం:
05/03/2008 6:57 pm
రెడ్డి గారు తెలుగు మట్టి వాసన గుప్పిటి విప్పి గుప్పు మనిపించారు. computer లకి కూడా మనసుంటుందనిపించారు, నలభై మంది Washington లు ఒక బాపూకి సాటి కాదని పించారు. కవిత చదివినతర్వాత నిట్టూర్పు విదవకుండా ఉండలేకపోయాను.
కొ శ్యా సు రా
గ్రంథచౌర్యం గురించి … గురించి kosyasura అభిప్రాయం:
05/03/2008 6:30 pm
హమ్మయ్య, గ్రంథ చౌర్యం అంటే నగరపాలకసంస్థ గ్రంధాలయం నుంచి తెచ్చి ఇంట్లోపదేళ్ళుగా “మరిచి”పోయిన పుస్తకాలూ, సుబ్బారావుగారింటినుంచి ఇదిగోచదివేసి మళ్ళా ఇచ్చెయనూ అని మరిచిపోయిన పుస్తకలూ కాబోలునని ఉలిక్కి పడ్డాను.
ఇహ రచయితల” నామచౌర్యం” విషయం కొస్తే ఆ మద్య Sidney Sheldon బొంబాయి ( ముంబాయి కాదు) Church Gate దగ్గర foot path మీద పుస్తకాలు చూసి ఆస్చర్య పోయట్ట ” నేనే .. ఇన్ని .. పుస్తకాలు రాసానా ” అని.
James Hadley Chase, Irwing Wallace లు రాయని పుస్తకాలు మనమెన్ని చదవలేదు గనక.
అదేంటో తెలుగు రచయితలలో ఈ నామచౌర్యం నామ మాత్రంగానైనాలేదు
కొ శ్యా సు రా
తెలుగు కావ్యపురుషుడి కథ గురించి kasturimuralikrishna అభిప్రాయం:
05/03/2008 6:26 pm