పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. గ్రంథచౌర్యం గురించి … గురించి bollojubaba అభిప్రాయం:

    05/05/2008 10:41 am

    ప్రసాద్ గారు అభిప్రాయ పడినట్లుగా ఆధునిక సాహిత్యంలోని గ్రంధచౌర్యాన్ని గురించి ఎప్పుడు రాస్తారు.
    వినాలని ఉంది.
    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  2. నీటి అద్దాలు గురించి kosyasura అభిప్రాయం:

    05/05/2008 8:57 am

    నీరు జారుతున్న అద్దాలపై ,నీరు కారుతున్న జీవిత ప్రతిబింబాలు చూపకనే చూపారు.మసకబారుతున్న అద్దాలలొంచి చదువుకున్నాను.
    కొ శ్యా సు రా

  3. ఈమాట మే 2008 సంచిక విడుదల గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/05/2008 7:05 am

    ఈమాట సంపాదక వర్గంలో చేరిన మాచవరం మాధవ్ గారికి, శంకగిరి నారాయణ స్వామి గారికి అభినందనలు.

    మీ చేరికతో ఈమాట సంపాదక వర్గం బలపడింది.

    లక్ష్మన్న

  4. అంతర్మథనం గురించి lalithasravanthi అభిప్రాయం:

    05/05/2008 7:04 am

    అసలు ఎలా రాస్తారండి ఇంత బాగా
    ఒక్క సారి మీ బుర్ర అప్పివ్వండి [:)]
    బాగుందండీ కథ
    ఆఖరున ఇంకాస్త పొడిగించాల్సింది

  5. గుర్రాలు – గుగ్గిళ్ళు, మరో సారి… గురించి surya అభిప్రాయం:

    05/05/2008 12:13 am

    అదీ సంగతి!! అందుకే గామోసు ఈ మధ్య చిన్న బూషయ్య, కండ సీవమ్మ, చామన చాయోళ్ళ విస్తరాకుల వైపు చూసి దిష్టి పెట్టడం మొదలెట్టారు. “ఐబాబోయ్, ఎంతెంత వాయిలు కలుపుకు తినేస్తున్నారో” అన్జెప్పి!

  6. లింకన్ తో ఓ రాత్రి గురించి “Sailakshmi” అభిప్రాయం:

    05/04/2008 11:48 pm

    సాయిలక్ష్మి స్వాభిప్రాయం
    అర్ధరాత్రి (నిజంగా) అపరాత్రి హ్హా, హ్హా, హ్హా! అని నవ్వి,నవ్వి, నవ్వి ఇంక నవ్వలేక లింకను వస్తాడేమోనని భయపడి అలసిపోతే, పక్కవాళ్ళు ఈ కధ చదివి హ్హా, హ్హా, హ్హా! అని నవ్వి, నవ్వి, నవ్వి నవ్వలేక లింకను వస్తాడేమోనని భయపడి అలసిపోతే, ఇంకో పక్క వాళ్ళు హ్హా, హ్హా, హ్హా! అని నవ్వి,నవ్వి, నవ్వి నవ్వలేక …

    చాలా బాగుంది!

  7. అక్షరం పరమం పదం గురించి “Sailakshmi” అభిప్రాయం:

    05/04/2008 11:23 pm

    సాయిలక్ష్మి సా (స్వ) భిప్రాయం–
    మాలతి గారు,
    అక్షరమ్ముక్క నేర్వని , నాగరికత లేని సంద్రాలు “నాను ఓ మడిసినని”; “మడుసులం గంద. ఆపరమాతుముడేటి సెప్పినాడూ నీడూటీ నువ్ సేసుకుంట పో. ” అన్న మాటలు ఎదలో పాతుకుపోయే అనంత సుభాషితాలే.
    నవ నాగరీకతతో నిరంతరం కదిలే కాలంలో క్షరం లేని అక్షరం మారకపోయినా ఫాంటులు మారుతూ ముద్రారాక్షసాల తో క్షరాన్ని కలుగజేస్తున్నాయన్న మాట నిజం.
    తాళ పత్రాలతో మొదలిడిన గ్రంధాలు కాలక్రమేణా ఉసిరికాయంత సీ.డీ లలోకి మారినా నిరంతరము మారే కాలములో ఏది శాశ్వతము? అన్నది బాగా చెప్పారు.
    చివరగా బ్రాకెట్టుల్లో “కదుల్తుంటే పైకి పోతున్నట్లే( Moving is moving up)అనుకునే పైకిపోతున్న అంటే ‘పెరుగుట’ అనుకుంటే “పెరుగుట విరుగుట కొరకే”
    అన్నట్లు మీ బాసుగారిచ్చిన తెలుగు పుస్తకములోని భాష –’’ఆయన పచ్చి శాకాహరము తినిపించబడవలసిన అవుసరము కలిగెను. స్నీనము చేపించుటకు ఇతరులు లేక పరివేషకులు పస్తువులు తెచ్చి ఇచ్చుడకు కవలసిన వస్తు సందాయంనకు వారు దుకానములో తీసుకొనిరాకుండుటకు”–
    ప్రస్తుత తెలుగు భాషా పరిస్థితిని చక్కగా తెలిపారని నా కనిపించింది. పనికిమాలినదే కదా!
    మీ కధలో వ్రాసిన వివిధ తెలుగు భాషా చాతుర్యము మెచ్చుకోదగినదే.
    ‘మీరు పాఠకులకు వచ్చే సందేహాలను ముందే ఆలోచించి వ్రాయటము,
    పనికిమాలిన పనులు సేయటానికి కడుపుసేత్తోపట్టుకొని (సంద్రాలు మాటలు) మెరికల్లాటి వాళ్ళు అమెరికా వచ్చి టక టక లాడే కీ లను పట్టుకొని వేలాడటము
    బాగుంది.
    ఇదివరకు మీ ‘కధల సంపుటి” పుస్తకాన్ని చదివాను. కధలు బాగున్నాయి. ఎలా మెచ్చుకోవాలో తెలియలేదు. ఈ కధతో అవకాశం వచ్చింది. మీకు, ఈ మాట వారికి నా మాట “Thanks”.

    ‘సాయిలక్ష్మి’

  8. తెలుగు కావ్యపురుషుడి కథ గురించి సుధాకర బాబు అభిప్రాయం:

    05/04/2008 10:11 pm

    నాకు ఈ రూపక కధ చదువుతుంటే ఏదో తెలుగు భాషా చరిత్ర మహా గ్రంధానికి ప్రవేశిక లాగా అనిపించింది. కావ్య పురుషుడి జీవితంలో ఒకో ఘట్టాన్నీ ఒకో అధ్యాయంగా విస్తరించవలసిందే మీరు.

    కధ ముందుకు చదవాలంటే నాకు ఇంకో భయం కూడా కలుగుతుంది. కావ్య పురుషుని తరువాతి కధా భాగాలలో అతడు దురలవాట్లకు లోనై, ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం కోల్పోయి, రోగ పీడితుడై అడుక్కుతినే దశకు రావచ్చును (చుట్టూరా పరికించండి ఒకమారు). ఎక్కడికి వెళ్ళినా పురజనులు అతనిని ఆదరించడం బదులు పిచ్చివాడని గేలి చేస్తారు. కుక్కల మొరుగుళ్ళు, గాడిదల ఓండ్రింపులు అతని కావ్యగానాన్ని వినిపించకుండా చేస్తాయి. (21వ శతాబ్దం) హత విధీ. ఆ తరువాత కావ్య పురుషుడు కోలుకొని నవనవోన్మేష మనోల్లాసంతో ధృఢదేహుడై, అందరి మన్ననలు తిరిగి సాధించి తన సాహితీవిహారాన్ని ఎలా సాగిస్తాడో? ఇదే మీ కధనానికి నిజమైన సవాలు.

  9. పేరు గలవాడేను మనిషోయ్ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/04/2008 10:07 pm

    కథ వాతావరణం, సన్నివేశాలు, కళ్ళకు కట్టినట్లు సృష్టించి, రక్తి కట్టే భాషలో సంభాషణలు నడిపించి దిట్ట అనిపించుకున్నారు రానారె.

    వరి అన్నం, దస్తా తెల్ల కాగితాలూ తీరని కోరికలయిన జీవితాలతో నాక్కాస్త అనుభవం ఉంది. రేడియో కింత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే, చాసో “ఎందుకు పారేస్తాను నాన్నా?” కన్నా మించి ఉండేది. కొత్తపాళీ గారిచ్చిన ఇతివృత్తానికి మరీ కట్టుబడి పోవడాన అలా సృష్టించాల్సొచ్చిందేమో.

    చాసో రాసింది 1945లో. అరవై డెబ్భై ఏళ్ళ తర్వాత గూడా ఇలాంటి కథలొస్తున్నాయంటే, అది మన దేశ దౌర్భాగ్యం.

    కొడవళ్ళ హనుమంతరావు

  10. అలిగితివా… గురించి Srini Chimata అభిప్రాయం:

    05/04/2008 6:55 pm

    చాలా బాగుందండి.. మీ రచనా శైలి నన్ను ఎప్పుడూ అచ్చెరువొందిస్తుంది. Keep it up.

    Srini Chimata
    http://www.ChimataMusic.com