పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16451

  1. అటో యిటో గురించి Lakshmi narayana అభిప్రాయం:

    05/12/2008 7:38 am

    చాలా బాగుందండీ. వాస్తవాన్ని కళ్ళకు కట్టంచారు.

  2. మదర్స్ డే గురించి వినీల్ అభిప్రాయం:

    05/12/2008 7:34 am

    నాకైతే రవికిరణ్ గారి అభిప్రాయం సహేతుకంగా ఉందనిపించింది.
    భూషణ్ గారు,
    “సుందరానికి తనతో విభేదించే వాళ్ళ పైన కాదు అగౌరవం. దేన్ని ఫాలో చేస్తారో, దాన్ని సరిగా అర్థం చేసుకుని ఫాలో చెయ్యనివాళ్ళ పైనే అగౌరవం”
    ఈ “సరిగా” అర్థం చేసుకోవడం ఏమిటి? ఏది సరి? ఏది సరి కాదు అని ఎవరు నిర్ణయిస్తారు? అందరికీ “సరి” ఒకటేనా?
    రవికిరణ్ గారన్నట్టు సుందరం పాత్ర ఇదే సరి అని ఒక గిరి గీసి దానిలో లేని వారిని కించపరుస్తుంది. ఇది కథో కరపత్రమో కానీ, మంచి కథ అని మాత్రం అనలేను.

  3. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి నాగమురళి అభిప్రాయం:

    05/12/2008 2:38 am

    హనుమంతరావు గారూ,

    మీ వ్యాసం చదవడం మొదలు పెట్టే ముందు నిడివి కొంచం భయం కలిగించినా, మొదలు పెట్టగానే సమయం తెలియలేదు. ఎత్తిన తల దించకుండా ఏకబిగిన చదివించింది మీ వ్యాసం. మీరు రాస్తున్న ఈ వ్యాస పరంపర ఎంతో ఆవశ్యకమైనదీ, స్ఫూర్తిదాయకమైదీ. తెలుగులో ఇటువంటి రచనలు ఇంకా చాలా రావాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు రాసే కామెంట్లు కూడా నేను ఆసక్తిగా చదువుతాను. ఇంగ్లీషులో పాప్యులర్ సైన్సు పుస్తకాలు నాకు చాలా ఇష్టం. తెలుగులో కూడా చిన్నప్పుడు కొన్ని చదివినా, అటువంటి పుస్తకాలు విరివిగా లేవనే నాకు అనిపిస్తుంది. మీరు ఇటువంటి అంశాలు ఎన్నుకుని సాధారణ పాఠకులకోసం పుస్తకాలు కూడా రాయాలి అని ఆశిస్తున్నాను.

    తెలివైన విద్యార్థులకు ఖాళీ సమయాల్లో పాఠ్య, పాఠ్యేతర అంశాల్లో శిక్షణ ఇచ్చి విజయ సాధనకి తోడ్పడే ఒక కార్యక్రమాన్ని కొందరు మిత్రులు ఇటీవల చేపట్టారు. ఈమాటలోని ఇటువంటి వ్యాసాలు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను అన్నాను. పిల్లలు ఇటువంటి వ్యాసాలు సొంతంగా చదివి ఆస్వాదించేలా చెయ్యడం ప్రస్తుతానికి మా లక్ష్యం అన్నారు. ఏది ఏమైనా ఇటువంటి రచనలు శాశ్వతంగా నిలిచి అనేకమందికి శాస్త్ర విషయాలపై ఆసక్తి రేకెత్తిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు. ధన్యవాదాలు.

  4. మదర్స్ డే గురించి Bhushan అభిప్రాయం:

    05/11/2008 10:15 pm

    ‘మదర్స్ డే’ కథ మీద రవికిరణ్ తిమ్మిరెడ్డిగారి అభిప్రాయం చదివాక రాయాలనిపించింది.

    రవికిరణ్ గారి ప్రకారం స్వాతంత్ర్యం రోజున జెండాలు పట్టుకు తిరగా అక్కర్లేదు. మదర్స్ డే నాడు మదర్స్ లానూ వుండక్కర్లేదు. మరి వాటిని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఎలా చేసుకోవాలి?

    కథలో సుందరం మొదట మదర్స్ డే కి కొంచెం వ్యతిరేకంగానే వున్నాడు. కాని ఆ వ్యతిరేకత దేని పైన? ఒక్క రోజు తల్లుల్ని గౌరవించే పద్ధతుల మీదా, బహుమతుల మీదా. బహుమతులివ్వలేని పిల్లలూ, మీకు మదర్స్ డే వున్నట్టేనా ! పండగలకి గుడ్డ ముక్క పెడితేనే అక్కా, చెల్లీ.

    తల్లులందరూ పిల్లలకి దగ్గరగా వున్నప్పుడూ తల్లులే, దూరంగా వున్నప్పుడూ తల్లులే, సరే. మరి మదర్స్ డే ని ఫాలో చేసేవాళ్ళు, ఆ రోజు ఎలా గడపాలి? వినాయక చవితి నాడు వినాయకుడితోనూ వొద్దు, మదర్స్ డే నాడు పిల్లలతోనూ వొద్దు, రవికిరణ్ గారి ప్రకారం.

    సుందరానికి తనతో విభేదించే వాళ్ళ పైన కాదు అగౌరవం. దేన్ని ఫాలో చేస్తారో, దాన్ని సరిగా అర్థం చేసుకుని ఫాలో చెయ్యనివాళ్ళ పైనే అగౌరవం.

    అసలు, కథని రవికిరణ్ గారు సరిగా అర్థం చేసుకున్నట్టు లేదనిపిస్తోంది నాకు.

  5. నన్నయ హంసగీతికలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/11/2008 6:52 pm

    శారద రాత్రులు

    దాదాపు రెండేళ్ళ క్రితం, రచ్చబండలో ఈ పద్యం గురించి రాశాను: గొప్ప కవిత్వం రాయాలంటే గొప్ప కవిత్వం చదవాలన్నారు (తమ్మినేని అనుకుంటా); దానిని వచనానికి అన్వయించుకొని, శ్రీపాద “అనుభవాలూ – జ్ఞాపకాలూనూ” చదవడం మొదలెడితే “శారద రాత్రులు” పద్యం మీద ఆయన వ్యాఖ్యానం నన్ను కట్టేసింది. ఎవరన్నా వివరిస్తే తప్ప నాకై నాకు మన పాత పద్యాల్లోని కవిత్వాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియదు.

    (కొడవటిగంటి కుటుంబరావుకి శ్రీపాద ఇచ్చిన సలహా: “ఆడవాళ్ళు మాట్లాడుకునేది వినవోయ్. అసలైన తెలుగు వస్తుంది.” పుస్తకభాషగా ఉన్న కుటుంబరావు రచనాధోరణి దానితో మారిపోయిందట! సౌమ్య గారు చెప్తున్న మాటలు నిజమయితే, శ్రీపాద పాతబడిపోయాడా అని అనుమానమేస్తుంది. ఆవిణ్ణి తప్పుపట్టడం లేదని మనవి.)

    అప్పుడు గూడా రచ్చబండలో ముచ్చటించుకున్నాం – పాత్రలు ఇవే. మోహనరావు గారూ, కామేశ్వరరావు గారూ పాత సాహిత్యంలో (ఇతరేత్రా కూడా) ఉద్దండులు. సమగ్రమైన చక్కటి వ్యాసం రాసినందుకు JKM గారికి అభినందనలు.

    “దళిత నవీన” పద్యం వివరణ మనోహరంగా ఉంది. కప్పల బెకబెకలలో ఉపనిష్ద్గానామృతం అతిశయోక్తి అనిపించింది. (మా ఇంటి వెనకాల ఉన్న చెరువులో కప్పలు పాడే సంగీతానికి ఇంట్లో ఫ్యాను మోత జత చేస్తే తప్ప నాకు నిద్ర పట్టదు.) వానా, వెన్నెలా కలిసిన మంచి ఇస్మాయిల్ కవిత “కప్పల నిశ్శబ్దం.”
    మోహనరావు గారు పద్యాల గురించి రాసే కొన్ని వాక్యాలు – “పందొమ్మిది ర-కారాలు, ఎనిమిది ల-కారాలు, ఏడు శసలు, ఆరు ప-కారాలు, త-కారాలు ఈ పద్యానికి ఒక ఊపునిస్తుంది” – చదివితే నాబోంట్లకు చెవిటివాడి ముందర శంఖం ఊదినట్లుంటుంది. లైలా గారి లాంటి ప్రతిభావంతులు మాత్రం ఉత్తేజపడి ఠకీ మని ఓ కవిత అల్లేస్తారు! పాఠకుల్లో రకాలు అనేకం.

    కామేశ్వరారావు గారు చెప్తేనే మధునాపంతుల వారి వ్యాసం చదివాను. “శారద రాత్రులు” అను ఉత్పలమాలలో చుట్టుకొని నన్నయ గంటము ఇక కదలలేదట! నన్నయ మొదటి ఉత్పలమాల “రాజుకులైక భూషణుడు” లోనూ చివరి ఉత్పలమాల “శారద రాత్రుల” లోనూ వెన్నెల ప్రస్తావనే అన్నారు. అది గూడా మంచి వ్యాసం.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. లింకన్ తో ఓ రాత్రి గురించి రాజేంద్ర అభిప్రాయం:

    05/11/2008 12:00 pm

    ఇప్పటివరకూ నేను చదివిన సౌమ్యరచనల్లో నన్ను అసలు ఏమాత్రం ఆకట్టుకోని రచన ఇది.
    వాడు .. ఆ పుట్టు నాస్తికుడు …
    అబ్రహాం లింకన్ని ఒక దెయ్యపు పాత్రగా ప్రవేశపెట్టటం
    పైగా..లింకన్! నా వైపు అభావంగా చూస్తున్నాడు!
    లింకన్ కళ్ళలో నాకు కోపం కనబడ్డది,
    లింకన్ పెదాలపై ఓ విషపు నవ్వు మెరిసింది.
    ఆ పెదాలపై ఇందాకటి విషపు నవ్వు. “ఇప్పుడర్థమైందా, నేనెవర్నో?” అన్నట్లు ఉంది ఆ నవ్వు.
    లింకన్ విషపు నవ్వు తీవ్రత తగ్గినట్లు అనిపించింది.
    ఇలా వీలయినన్ని సార్లు ఆ మహనీయుడిని తూలనాడటం చాలా ఆశ్చర్యకరంగా,అభ్యంతరకరంగానూ ఉంది.
    దయ్యపు పాత్రలతో హాస్యంపండించితీరాలి అనుకున్నప్పుడు ఏ హిట్లర్నో లేదా కుర్రభూషయ్యనో ఒక పాత్రగా తీసుకుని ఉండాల్సింది,పుట్టు నాస్తికుడు అనే జీవి అసలు ఉంటుందా?పైగా వాడికి లింకన్ దెయ్యం లాకనిపించటం దానితో వాడు తెల్లారెపాటికి గంటలకొద్దీ పూజలు చేసి,గంటకొట్టి హారతులిచ్చే స్థాయికి మారటం ఏమిటి?నాస్తికుడు చివరిరీలుకొచ్చేసరికి భక్తశిఖామణిగా మారి తీరాలన్న మన భారతీయ సినిమా సంస్కృతిని నరనరానా జీర్ణించుకోపోతే తప్ప సాధారణంగా ఇలాంటి కధలు అలాంటి ముగింపులు ఇవ్వటం చాల కష్టం.

  7. హిందోళ రాగం – అనుబంధం గురించి Sai Brahamanandam Gorti అభిప్రాయం:

    05/11/2008 11:23 am

    మోహన రావు గారూ,

    హిందూస్తానీ సంగీతకళాకారులు కి బదులు అని అన్ని సందర్భాలలోనూ పాడరు. కానీ రాయడం మాత్రమే ధ అని రాస్తారు. మీరు చెప్పిన తరువాత నా దగ్గర ఉన్న పాత పుస్తకాలు వెతికాను. గాంధర్వ వేదం అనే పుస్తకంలో దైవతం గురించి ఈ క్రింది శ్లోకం ఉంది.

    ధీర్యస్తి సధీనాం తత్సంబంధీ దైవతః స్మృతః
    షష్టస్థానే ధృతో యస్మాత్తతో సౌ ధైవతో మతః

    ఆరవ స్థానమున ధరింపబడినది ధైవతము అని ఇందులో ఉంది. కానీ స్వరాల పుట్టుక గురించి చెప్పే ఇంకో పద్యంలో –

    పుష్ప సాధారణే కాలే పికః కూజతి పంచమం
    దైవతం హేషతే వాజీ నిషాదం బృహంతే గజః

    పూవులు పూచు కాలమున కోయిల పంచమ ధ్వని పలుకుతుంది. గుర్రము హి హి అని సకిలించుట పోలి దైవతముంటుంది. ఏనుగు ఘీంకారం నిషాదానికి మూలం. ఇలా ఈ శ్లోకంలో చెప్పబడింది.,
    ఈ శ్లోకం గమనిస్తే – ఇక్కడ ధైవతము అని లేదు. దైవతమనేఉంది. ఇంకా కొన్ని పుస్తకాలు తిరగేస్తే నీ నీ పరస్పరం వాడడం ఉంది. ఇది చూసాక ఏది సరిఅయినదనీ, నేను ఇండియాలో కర్ణాటక సంగీత పెద్దల్నీ సంప్రదించాను. మనం ఎలా ఉచ్చరిస్తామో ( పాడతామో ) అలాగే రాయడం సంప్రదాయం అని చెప్పారు. పూర్వం ధ అని రాసినా ద అనే పలుకుతూ పాడేవారట.
    ఇది హిందుస్తానీ కీ వర్తిస్తుంది.
    మాల్కోస్ పాట వినండి.

    మీరన్నట్లుగా ధ అని ఎక్కడా వినిపించదు. హిందీలో రాసేటప్పుడు ధ అని రాసినా మామూలు ద గానే పలుకుతున్నారు, అక్కడక్కడ తప్ప. కానీ కర్ణాటక సంగీతంలో మాత్రం ద గానే రాస్తున్నారు. కొంతమంది తమిళ గాయకులు తప్ప, అందరూ ద అనే పాడుతున్నారు. కర్ణాటక రాగాలపైల వ్యాసాలు రాస్తూ, ద నీ ధ నీ కావల్సినట్లుగా వాడడం చూసి రాసాను. అంతే!

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  8. లింకన్ తో ఓ రాత్రి గురించి Sowmya అభిప్రాయం:

    05/11/2008 10:57 am

    “చదువుకున్న అమ్మాయిలు, తొక్కా, తోలూ, ఏహె లాంటి మాటలు వాడటం చదివి, ఔరా అనుకున్నాను.)”

    @Hanuma garu:ఒక్కసారి మా హైదరాబాదొచ్చి కాలేజీపిల్లల మాటలు వినండి. ఇంతకన్నా వివరణ ఏమీ లేదు. వింటే చాలు. నేనుగా ఈ పదాలు వాడకున్నా కూడా. నేను రోజులో పదుల సంఖ్యలో ఇవన్నీ వింటూనే ఉంటాను. హైదరాబాదనే కాదు, ఇక్కడి ఏ ఊర్లో అన్నా ఇంతే ఉండొచ్చని నేను అనుకుంటూన్నా.

  9. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/11/2008 7:03 am

    రావు గారికి:

    మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం.

    ఈ వ్యాసం ప్రచురించే కాలానికి “ఈమాట” వయస్సు ఒక్క సంవత్సరం మాత్రమే. ఆ రోజుల్లో, “ఈమాట” గురించి తెలిసిన వారు ఇప్పటి కన్నా సంఖ్యలో తక్కువే! అప్పట్లో ఈమాట ప్రచురణార్ధం వచ్చిన కథలు, కవితలు, వ్యాసాలు కూడా తక్కువే. అందుకని, అప్పటి సంపాదకులం, మేమే, మాకు తెలిసిన విధంగా ఈమాట కోసం రాసేవాళ్ళం. ఇదంతా, దాదాపు పది ఏళ్ళ నాటి మాట.

    అప్పట్లో, ఎక్కువ ఫొటోలు కూడా అంతర్జాలంలో దొరికేవి కావు. సాలూరు రాజేశ్వరరావు పై ఈమాట లో మరో రెండు వ్యాసాలను మీరు పాత సంచికల్లో చదవచ్చు. నేను రాసిన ఈ వ్యాసం కన్నా మరిన్ని వివరాలు మీకు ఆ రెండు వ్యాసాల్లో దొరుకుతాయి.

    మీ అభిరుచికి తగ్గట్టు ఈ రెండు వ్యాసాలు ఉంటాయని ఆశిస్తూ,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. తెలుగు సినిమా పాట గురించి gks raja అభిప్రాయం:

    05/11/2008 6:21 am

    చాలా చక్కని వ్యాసాన్ని ప్రచురించినందుకు సంతోషం. తెలుగు పాట తెర వెనుక మహత్తులు చెప్పి మమ్మల్ని ఊరించిన మీరే మాకు మంచి పాటల్ వెబ్ అడ్రసులు చెప్పగలరు.
    కృతజంతలతో.
    రాజా.