పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఛందోధర్మము గురించి satya rama prasad kalluri అభిప్రాయం:

    08/20/2008 7:27 am

    అన్నట్లు శ్రీశ్రీ ‘ సిప్రాలి ‘ ఏమిటండీ? ‘సిరిసిరిమువ్వ, ప్రాసక్రీడ, లిమరిక్కుల సమాహారమే కదా! వీటిలో ఛందస్సు లేనివేవి?

    తెలుగు సామెతల్లో సాధారణంగా యతో, ప్రాసో లేకుండా ఉండి ఉంటే వాటిలో సగానికి సగం కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి కావా?

    భావం పుణ్యాంగన అయితే దానికి సోకును (బాహ్యమే కానక్కరలేదు) ఛందస్సు అనుకోవచ్చును అని నేననుకొంటున్నాను. (దీనినే ఎవరో ఒక పూర్వికుడు పుణ్యాంగనకు పణ్యాంగనకువలె అందాన్ని కూర్చేది ఛందస్సు అన్నాడు.) ‘యతిప్రాసలు విసర్జింపబడినవి’ అని బోరవిరుచుకోవటం సులభమేగాని, లయ కూడా లేని కవితలు కాలపురుషుడి కట్టెదుట నిలవటం కష్టమే.

    ఎటొచ్చీ ఛందస్సుకోసం కవిత్వం అనటంకూడా తెలివితక్కువే.

    ఆంధ్రపత్రికలో ఒకప్పుడు ప్రాస ఎంత సాంక్రామికమో (contagious) చెప్పటానికి ఒక ఉదాహరణను ఇచ్చారు. ఎవరో ఒక సింగుగారు క్రొత్తగా తెలుగుతో కుస్తీపడుతూ ‘అనుమానానికైనా ఆస్కారంలేకుండా తిరస్కరించి పంపారు’ అంటే కోపంతో వాళ్ళ బాసు ‘మిస్టర్ సింగ్ ! రైమింగ్ కోసం మీనింగ్ పాడుచేయద్దని మీకెన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి?’ అన్నాడట. మరి దీనిని కవిత్వం అని ఎవరూ అనరు కదా!

    చేతనైన వైణికుడి చేతిలో ఎలాగైతే స్వరాలు వాటంతట అవే సరిగ్గా వస్తాయో, అలాగే కవిత్వంచెప్పేవాడి ముఖతః రావలసిన లయ, సందర్భోచితఛందస్సు వగైరా అవే వచ్చిపడతాయి. వెతుక్కుంటే వచ్చేవికావు అవి.

    గణితంప్రకారం కవిత్వంలో భావం, ఛందస్సు పరస్పరపూరకాలు (complementary) అనుకోవటం సబబేమోననిపిస్తోంది నాకైతే.

    ఏది ఏమైనా ఆలోచింపజేసిన, మంచి వ్యాసాన్ని అందించిన దేశికాచార్యులవారిని అభినందిస్తున్నాను.

    కల్లూరి సత్యరామ ప్రసాద్
    kalluriprasad@hotmail.com

  2. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి baabjeelu అభిప్రాయం:

    08/20/2008 7:23 am

    (ఈ అభిప్రాయం కామేశ్వర రావు గారినుద్దేసించి రాసినది కాదు. ఆయన తిరుమల రామచంద్ర గారు రాసిన “తెలుగు వ్యాసం” వ్యాసం ప్రకారం “వ్యాసుడు”. కామేశ్వర రావు గారి గురించి కానీ, వారు వ్రాసిన పై వ్యాసం గురించి కానీ అనుకొని ఎవరయినా, ఈ క్రిందు వ్రాసిన అభిప్రాయానికి “సెట్ పట్” లాడిస్తూ “అభిప్రాయం” వ్రాస్తే అట్టి వారు “ఇంటర్నేషనల్ పీనల్ కోడు టూ థౌజెండైటు” ప్రకారం శిక్షార్హులగుదురు)

    ఇహపోతే, ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.

    “ట్రాఫిక్ డిపార్ట్ మెంట్” కీ కవిత్వం గురించి రాసీవాళ్ళకీ పెద్ద తేడా లేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.

    కవిత్వంగురించి రాసీ వాళ్ళు, అందులోనూ ఇది కవిత్వం, అది కవిత్వం కాదు అని రాసీ వాళ్ళు “పెథాలజిస్టులు”. ఆ మాటకొస్తే “విమర్శకులు” కూడా.

    వొక రకంగా కవిత్వం రాసేవాళ్ళకూ, వచనం రాసేవాళ్ళకూ ఇది ఆనందదాయకవైన వార్త. ( ఈముక్కే మా స్నేహితుడితో అంటే, రాసీ వాళ్ళు విమర్శించీవాళ్ళనెప్పుడు పట్టించుకున్నార్రా అనీసేడు, ధన్యుడు వాడు.) బహుశా “ఉక్తి వైచిత్రి” వున్న వాళ్ళందరికీ “ఈ చీకిరెట్టు” ముందే తెలుసేమో? అందుకే క్రుష్ణశాస్త్రి గారు విమర్శకులకి మందు ఇంకా రాయడవే అనీసేరు.

    వుదాహరణకి, “వైదేహీ శశిధర్” గారి కవిత్వంలో, “క్లుప్తత” లేదు, “భావ శబలత” లేదు వగైరాలతో పాటూ, “కుకవి నింద” లేదు, “పుష్పలావికల” వర్ణన లేదు అని మహానుభావుడు “చేరా” గారన్నా ఆ కవిత్వాన్ని మనం చదువుతాం. (“చేరా” గార్ని “బరువు” కోసం వాడుకున్నాను. తప్పు నాది)

    “అద్దువైతం” అంతా తెలిసిపోయిందనుకుంటున్నాను.

    “చాత్రిబాబు” వచనంలో కవిత్వాన్ని, బతుకునీ, చూసి మురిసిపోయే మాకు, వొక వ్యాసంలొ (పేరు గుర్తులేదు), వొకాయన “చాత్రిబాబు”కి “మెంటల్ మెనోపాజ్” వచ్చేసింది అని రాసేరు. అది చదివి”ఏందార్రా బగమంతుడా” అని “బెంగటిల్లిపోయేం” జమిలిగా మేవందరం.

    అయినా “చాత్రిబాబు” ఈయేల్టికీ బతికేవున్నాడు. హమ్మయ్య అనుకున్నాం మళ్ళీ జమిలిగా.

    ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.

    సర్పవా? రజ్జువా? ఎవళు చెబ్తారో? ఎవళికాళ్ళే తెల్సుకోవాలో?

    “యద్యదాచరిత శ్రేష్ఠహ తత్త దేవేతరో జనహ” అన్న “మంచిముక్కకి” ఇలా అర్ధం చెప్పుకోవల్సొస్తుంది: “ఆవిడ పట్టిన నోము, జగవంతా పట్టింది. జగం పట్టిన నోము మనం పడుతున్నాం”. ఎవరూ మిగల్రూ. అయినా నోవుపట్టాల్సిందే.

    “అసందర్భ ప్రేలాపన” అని మా “సాయి” లాటి వాళ్ళు అనొచ్చు.

    “సాయి” గారూ, “ఎమ్ ఒ ఎమ్ ” లో ఇలా రాస్తే మనకెవరికీ అభ్యంతరం వుండదనే అనుకుంటున్నాను.

    కవిత్వం/వచనం రాయడం సులువు. దాన్ని చదువుకుని “ఆహా, వోహో” అనుకోవడం ఇంకా సులువు. “చెస్, చెండాలం” అనుకోవడం మరీ సులువు.

    ఎవరో రాసిన కవిత్వం/వచనం గురించి, అది ఎందుకు బాగుందో/బాగోలేదో రాయడం చాలా కష్టం.”ఈ చాలా కష్టాన్ని” చదివి, నాలాటి పాఠకుడు అయోమయంలో పడడం ఇంకా సులువు. (మా “సాయి” లాటి వారు కాదు).

    దీని బదులు, పిల్లల పుస్తకాలకి అట్టలేసుకోడం, వాళ్ళ “హోమ్ వర్క్” చేయించడం సులువు.

    ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.

    ఛందస్సు ప్రకారం రాయాలి, సమాసాల ప్రకారం చదవాలి, వొకే గుక్కలో చదవాలి, వొకేగుక్కక్కర్లేదు. వుత్పలమాలలోనూ, చంపకమాలలోనూ, మత్తేభంలోనూ, అన్నిట్లోనూ అన్ని రసాలూ ఆవిష్కరించొచ్చు.

    ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.

  3. గ్రంథచౌర్యం గురించి … గురించి పాఠకుడు అభిప్రాయం:

    08/20/2008 7:21 am

    త్యాగరాజు రాసినట్టు కృతులు రాసి, వాటిని త్యాగరాజు పేరు మీదే చలామణీ చేస్తే, దాన్ని గ్రంధ చౌర్యం అనరు. దాన్ని ప్రక్షిప్తం అంటారు. రామాయణం తిరగరాసి నప్పుడు అనేక మంది కవులు తమ సొంత పైత్యాన్ని కూడా కలిపేసి రాసేవారు. అయితే ఈ ప్రక్షిప్తాలు మూల కధకి గానీ, మూల కవికి గానీ హాని చెయ్యవు. అపఖ్యాతి తీసుకురావు. ప్రక్షిప్తాలు సమాజ పరిణామ క్రమంలో భాగంగా వుంటాయి. దీనికీ, గ్రంధ చౌర్యానికీ పోలికే లేదు.

    పాఠకుడు

  4. ఛందోధర్మము గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:

    08/20/2008 6:28 am

    కవిత్వం కోసం ఛందస్సా, ఛందస్సు కోసం కవిత్వమా? కవిత్వం కోసం ఛందస్సు వదులుకోడం తప్పా? ఛందస్సు కోసం కవిత్వాన్ని బలి చేయడం ఒప్పా?

    ఛందస్సువలన కవిత్వానికి ఒరిగేదేమిటి?

    ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆంగ్లకవి P.B. Shelley రాసిన “To a Sky Lark”


    Thou art unseen, but yet I hear thy shrill delight

    Like a high-born maiden
    In a palace tower,
    Soothing her love-laden
    Soul in secret hour
    With music sweet as love, which overflows her bower…

    లోని భావాన్ని రాయప్రోలు సుబ్బారావుగారు తన చంపకమాల పద్యాలలో ఎంత మధురంగా పొందుపరిచారో ఆలోచించి చూస్తే దొరకవచ్చు:
    “ప్రమద రసోదయాలస తరంగములన్ దవిలించి, పారవ
    శ్యమున నుయాలలూపెదవయారె! చరాచర చేతన ప్రపం
    చము బహిరంతర భ్రమణ సాధ్వసమేది ప్రశాంతమయ్యె, నే
    త్రములకు గానరావు, మధురంబుగ పాడెదవెందొ కోయిలా!

    ధవళ చిరత్న రత్నరచితంబగు సౌధమునగ్రమందు పూ
    నవకపు సెజ్జపై వలపునన్ తన కిన్నెర మేళవించి మో
    హవశముగా ప్రపంచమును నాకులపెట్టు నొయారివోలె, నీ
    భువనమునెల్ల రాగమయ భోగములన్ దనియింతొ కోయిలా!”

    నేను నమ్మిన సత్యం: నిజమైన కవిత్వం చెప్పగలిగన వారికెవరికీ ఛందస్సు ఆటంకం కాదు. భాష మీద పట్టులేక, వచనకవితా ప్రక్రియని అడ్డంపెట్టుకుని ఎదో గిలికి పారేసి ఛందోధర్మాన్ని వదిలిపెట్టినందువల్లె ఇంత గొప్ప కవిత్వం వ్రాయగలిగామని జబ్బలు చరుచుకునే (కు)కవులు, వారి భజంత్రీలు విస్తృతపఠనం అలవాటు చేసుకుంటే పైన మచ్చుకు చెప్పిన ఉదాహరణలులాటివి కోకొల్లలు కనపడతాయి తెలుగు సాహిత్యంలో.

    ఆధునిక తెలుగుకవిత్వానికి ఆద్యుడుగా గుర్తింపు పొందిన రాయప్రోలువారు అద్భుతమైన కవిత్వాన్ని అలవోకగా చిలికించగల గొప్ప కవి. యతిప్రాసలు పద్యానికి అతికించినట్టు ఉండకూడదనేవారిలో ఆయన ఒకరు అని ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంగారు నాతో ఎప్పుడూ అనేవారు. కవిత్వభాష గురించి అలాంటి మహనీయుడు రాయప్రోలువారి మాటల్లోనే:

    ధేనువులు తిను బహువిధ తృణచయమ్ము
    త్రావు నానానదీకూప జీవనమును
    కలిసి పరిణమింపవె పాలుగా ధరిత్రి
    శబ్దమేళన తంత్రనైజమ్ము నిదియె

    రాయప్రోలుగారి కవిత్వానికి నన్ను పరిచయం చేసిని పూజ్యులు ఆచార్య భొడ్డుపల్లి పురుషోత్తంగారికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను.

    రాజాశంకర్ కాశీనాథుని

  5. పలాయనం గురించి Seetharama అభిప్రాయం:

    08/20/2008 3:35 am

    I don’t understand why this story is accepted for print. I regret that I could not call ‘this’ any thing but a story. What did the writer want to say? Is he trying to showcase the difference between what people wish for, and what they have in reality? If so, I have no hesitation saying that the writer chose a wrong story line. If he wanted a comedy story, he missed those lines right from the beginning.

    To have an interest to write is appreciated, but as “Bharago” the famous writer said once, you need to read Five Hundred books before you attempt to write one.

    However, I don’t intend to discourage the writer, he can continue his effort, and one day, there will be light at the end of the tunnel. It is upto the editor(s) to read the story before printing. If they don’t have content, it is worth reprinting some good old stories rather than printing junk

    Regds

    Ram

  6. పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి jayaprabha అభిప్రాయం:

    08/20/2008 2:49 am

    కామేశ్వర రావు గారు,

    మీ పద్యం అంటే వున్న “సుముఖత” గురించిన విచికిత్స చదివాను. అన్ని రకాల కారణాలని గురించి సుహృద్బావంగా విశ్లేషణ చెయ్యాలన్న ఒక తపన కనిపించింది. కానీ అసలు విషయం ఏమిటంటే మా కాళోజీ చెప్పిన జవాబే నేనూ చెబుతాను వినండి (ఈ మాట మీద కాపీరైట్ కాళోజీదీ సుమా!).

    ఒకసారి ఆయన్ని నేను అడిగాను పద్యాలు ఎందుకు రాయలేదు మీరు అని. ఆయన అన్నాడు కదా “నాకు పద్యం రాయడం రాదు, అందుచేత రాయలేదు” అని. అది మా కాలోజీ సూటితనం. మరి నేను చెప్పేది కూడా అంతే. “పద్యవిద్య” అని అనేవారు కదా — అంటే అది ఒక skill అన్నమాట. దానిలో శిక్షణ పొందాలి. ఛందస్సు క్షుణ్ణంగా చదువుకుని వుండాలి. ముక్కున పట్టిన నాలుగు అవసరార్థపు “గణ” పరిజ్ఞానంతోనే ఈ కాలం వాళ్ళు పద్యాలు ఎట్లా రాసేయగలరండీ? అత్యాశ అలా ఎవరైనా ఆశిస్తే, అవునా?

    ఇంకా వచన పద్యం (ఇక్కడ పద్యాన్ని కవిత్వానికి పర్యాయంగా అంటున్నాను) రాయటం కూడా సుళువేమీ కాదు. వచనంలో నిట్ట నిలువుగా రాసేదంతా కవిత్వం అని ఎవరూ అనలేరు. మంచి పద్యానికి వుండే లక్షణం మంచి prose poem కి కూడా వర్తిస్తుంది. ఒక లయ, తూగు అంతర్లీనంగా వుండాలి. “కంఠగత లక్షణం” మంచి పోయెమ్ కి వుండాల్సిన లక్షణం కూడా, వచన కవిత్వం అయినా సరే. బాగున్న పద్యం, అది యే రూపంలో వున్నా, కాళిదాసు చెప్పినట్టుగా, “రసనగర నర్తకి” గా వుండాల్సిందే. దీనికి తిరుగు లేదు. వచన కవిత్వం లో కూడా మంచి పద్యం కోట్ చెయ్యగలిగినది నోటిమీద వుండగలిగినదై వుండటం దాని ప్రభావానికి గుర్తే.

    అయితే, అలాగే ఛందోబద్ధమైన పద్యాలన్నీ కూడా గొప్పవి కావు. మీరు వుదాహరించిన తిక్కన గారి పద్యం, రామాభ్యుదయంలోని తిక్కన గారి పద్యాన్ని అనుకరిస్తూ రాసిన పద్యం — వీటిని వుదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే బాగున్న poem ఎందుకు బాగుందో చెప్పటం తేలిక. బాగాలేనిది ఎందుకు బాగాలేదో చెప్పటం — ముఖ్యంగా సమకాలంలో — చాలా కష్టం. అంచేత మాట్లాడకుండా వూరుకుంటారు (లేదా బాబ్జీలు గారి లాంటి అవతారం ఎత్తవలసి వుంటుంది మరి నిజాలు చెప్పడానికి).

    ఇంకా మళ్ళీ వెనక్కి అంటే ఛందోబద్ధమైన పద్యం రాయటం దగ్గరికి వస్తాను. మంచి లయతో, ధారాశుద్ధితో చక్కని ఉపమానంతో, పుష్టిగా వున్న భాషతో (భాషాడంబరం కాకుండా) ఎవరైనా రాస్తే, పద్యం అయినా చెలామణీ అవుతుందనే నేననుకుంటాను, ఇవ్వాళకూడా!

    విషయం ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఛందస్సును స్వాధీన పరుచుకొని పరిపుష్టిగా పద్యాలు చెప్పేవాళ్ళ సంఖ్య తగ్గటం వల్ల పద్యం వెనకబడింది తప్ప, వచన కవిత్వం వల్ల కాదు. ఔననిపించుకునే పద్యాలు రాసేవారి సంఖ్య పద్యంలోనూ, వచన పద్యంలోనూ కూడా ఇవ్వాళ తక్కువే సుమా.

    “వస్తువు” ముఖ్యమే ఎప్పుడైనా కవిత్వంలో. కానీ దాని వ్యక్తీకరణ ఎట్లా వున్నదన్నదాని మీదనే ఒక మామూలు కవికి, ఒక మహాకవికి మధ్యనుండే భేదం బోధపడుతుంది.

    కవి నామధేయులు ఉంటారు అన్ని కళల్లోనూ. కవులు కొందరే వుంటారు అన్ని కలాల్లోనూ. రూపం ఏది అన్నదానికన్నా సారం ఎంత అన్నది చూడవలసిన విషయం కవిత్వంలో. ఎందులోనైనా బాగున్నవి నిలబడగలిగినవీ నిలబడతాయి. మిగితాయి పోతాయి. అది కాల మహిమ. అదంతే. మంచి కవిత్వానికి, మంచి సంగీతానికి సూర్య చంద్రులు కాపలా వుంటారు. నిశ్చింతగా వుండండి. అస్తు!

    జయప్రభ.

  7. 88 ఏళ్ళ యువకులు గురించి Illaiyaraja అభిప్రాయం:

    08/19/2008 12:33 pm

    Thank you so much for the info.

  8. హిందోళ రాగం – అనుబంధం గురించి satya rama prasad kalluri అభిప్రాయం:

    08/19/2008 10:40 am

    హిందోళంగురించి శ్రీ కొడవటిగంటి వ్రాసిన వ్యాసం చాలా ఉపయుక్తంగా ఉన్నది.

    1) జేసుదాసు ‘మనసులోని మర్మము (త్యాగరాజకీర్తన)ను’ చతుశ్శ్రుతి రిషభంతో పాడగా (రికార్డు) మొదట విని ఆశ్చర్యపోయాను. అతడు చెంబై శిష్యపరంపరవాడట. అంతకు ముందు శ్రీరంగం గోపాలరత్నం, మరికొందరు శుద్ధరిషభంతోనే పాడారు. నాకు తెలిసిన ఒక విద్వాంసుడు త్యాగయ్య కీర్తనలు రెండిటిలోనూ ఒకటి ఇలాగ అయిపోయిందని బాధపడ్డాడు

    2) ‘మామవతు శ్రీ సరస్వతీ’ కూడా ఇస్తే బాగుండేదనిపించింది. అయినా దీనికి అంతమెక్కడ?

    ఎంతో శ్రమతో చక్కటి వ్యాసం ఇచ్చిన శ్రీ కొడవటిగంటివారికి అభివాదాలు.

    సత్యరామ ప్రసాదు కల్లూరి
    kalluriprasad@hotmail.com

  9. ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి krishna అభిప్రాయం:

    08/19/2008 9:42 am

    ఇంత చక్కటి తెలుగు వాక్యాలు/హృదయాలు చదివి ఎన్నాళైందో!

  10. పద్య శిల్పం గురించి baabjeelu అభిప్రాయం:

    08/19/2008 6:49 am

    “మావేటంతావమ్మా? మీరేటంతే మావూ అదేఅంతావు.”

    కామేశ్వరరావుగారి లాటి వాళ్ళని, మీలాటి వారు “కమాండ్” చెయ్యగలరు. ఆయన మంచి సలహా అని, మనస్ఫూర్తిగా వుపక్రమించగలరు.

    ఎందుకంటే; పరిమితి, పరిధీ తెలిసి, విపులీకరించి,విశ్లేషించగల నేర్పూ, ఓర్పూ వున్న”వ్యాసుడు” కామేశ్వరరావుగారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. (సిరికిం… పద్యాన్ని గురించి నాలాటి వాడికి అంత సంయమనంతో, చక్కగా వివరించేరు)

    “అంచేతేటంటే, కావేస్వొర్రావుబావూ, ఆయమ్మ సెప్పినట్టు కానీండి. మరికేటీ సూడొద్దు. కాదంటే ఆయమ్మొప్పదు.”

    నేను మీరిచ్చిన “లింక్” తో “అటజని..” పద్యం గురించి ఇంకా తెలుసుకుని మురిసిపోయేను. అయితే పద్యాన్ని చదవడానికీ, ఛందస్సుకీ “లింక్” వుందా, లేదా? దీనిగురించి మీరు “విపులీకరించి, విశ్లేషించాలి”. దానికి అభిప్రాయవేదిక సరిపోదు అని మీరు వొప్పుకోవాలి. వొప్పుకుంటారు.