వైదేహి శశిధర్ గారూ,
చిక్కని కవిత్వం.
అన్ని ప్రక్రియలలోనూ కవిత్వానికే ఎందుకు పెద్దపీట వేస్తారో ఢంకా బజాయించి చెప్పేవి ఇలాటి రచనలే.
ఇంత చిన్న మోనిటర్ మీద, ఏ ఇషాన్ ఆర్యో షూట్ చేసిన దృశ్యాన్ని, చూపించగలిగేరు.
మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు ఆలస్యంగా కృతజ్ఞతలు. ఇంద్రగంటి పద్మ గారు చాలా సాయం చేశారు. ప్రచురించే సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వలన మామూలు కంటె కాస్త ఎక్కువగా శ్రమపడ్డారు. వారికి చాలా థాంక్స్.
వెంకటేశ్వర రావు గారు, మీ దృష్టికి రాలేదో, లేక మీకు దొరకలేదో, నాకు తెలీదు గానీ, జయప్రభ గారి “వామనుడి మూడోపాదం” కవితా సంపుటి మీద వెల్చేరు నారాయణ రావు గారు చేసిన సమీక్ష చెప్పుకోవలసిన రివ్యూ. ఆ పుస్తకం అచ్చై తెలుగులో ఒక సంచలం సృష్టించిన రోజుల్లో ఆంధ్రజ్యోతి వీక్లి లో అచ్చు అయ్యింది. అలాగే దాదాపు వెనువెంటనే అనుకుంటాను జయప్రభ గారి “భావకవిత్వంలో స్త్రీ” అన్న విమర్శ పుస్తకాన్ని పురాణం సుబ్రమణ్య శర్మ గారు ఒక మూడు వారాల పాటు ఆంధ్ర జ్యోతి వీక్లి లోనే సమీక్ష చేసారు. అది ఒక కొత్త దృక్పథాన్ని సరిగా గ్రహించలేక సమీక్షకుడు ఎన్ని పిల్లి మొగ్గలు వేసి బొల్తాపడతాడో చెప్పడానికి మరో వుదహారణ. మీరు వీటిని పట్టించుకోలేదేమా? అనుకున్నాను.
రవిశంకర్ గారి కవిత్వం అంటే ఇష్టపడే వాళ్ళల్లో నేనొకణ్ణి. ఈ వ్యాసం మొదటి భాగం కవితా సమీక్ష ఉన్నట్లుగా నవలా సమీక్ష లేదు.
నవీన్ గారు ఆయన అనుభవాలు రాసారు. అమెరికాలో జరిగే కొన్ని విషయాల గురించి పైపైనే స్పృశించి చెప్పారు. అందువల్ల ఇది ఇండియానుండి వచ్చేవాళ్ళకి గైడులా ఎలా ఉపయోగపడుతుంది? ఈ నవల్లో చాలా చోట్ల పొందుపర్చిన వివరాలు సరిగ్గా లేవు. తెలీని వాళ్ళకి పరవాలేదు కానీ, అమెరికాలో ఉంటున్న వాళ్ళకి ఈ నవల ఓ పట్టాన మింగుడుపడదు.
ఎయిర్ పోర్ట్లో అమెరికన్ సంభాషణ గురించి ఈ వ్యాసంలో రాయలేదు. ఇరాక్ యుద్ధం గురించి నవీన్ గారేమనుకుంటున్నారో అది అమెరికన్తో మాట్లాడినట్లుగా రాసారు. పరిచయం లేని వ్యక్తుల దగ్గర అమెరికన్లు అంత లా మనసు విప్పి చెప్పరు. సిడ్నీ షెల్డన్ నవల్లో సెక్స్ లేకపోతే ఇక్కడ పుస్తకాలెవరూ కొనరన్నట్లుగా రాసారు. అది మాత్రం నిజం కాదు. ఇలాంటి చోటే నవీన్ సొంత అభిప్రాయాల్ని చొప్పించారన్నట్లుగా ఉంది. ఇవేమీ ఈ వ్యాస సమీక్షలో రాయలేదు. ఇది ఖచ్చితంగా రివ్యూ రాసేటి నవలల జాబితాలో చేరదు. వ్యాస రచయిత చెప్పినట్లుగా ఒక్క బిగిని చదివేసే నవల మాత్రం కాదు.
ప్రశంసల దగ్గర పెల్లుబికిన విశేషణాలు విమర్శ దగ్గర మౌనం వహించడం ఈ వ్యాసంలో కొట్టచ్చినట్లుగా కనిపించింది. నవల చదివితే ఈ అభిప్రాయం మరింత నిర్ధారింప బడుతుంది. ఇదే ఏ పేరులేని మామూలు రచయితో రాస్తే ఇలా రివ్యూలకి నోచుకుంటుందా? అందుకే అతితక్కువగా మెల్లని స్వరంలో విమర్శ సాగింది.
యాత్రా నవల అన్నారు. అంటే యాత్ర చేస్తూ రాసిన నవలనా లేక యాత్ర గురించి నవలనా? ట్రావెలాగ్ అని అనుంటే పోయేది. మరలా నవల అంటూ ఈ బిల్డప్పు ఏమిటి? నవలకి కావల్సిన మౌలిక లక్షణాలు ఈ పుస్తకంలో ఏ కోశానా కనిపించవు. అది వ్యాస రచయిత ఎక్కడా చెప్పినట్లు లేదు. విమర్శ మాత్రం ఘాటుగా లేదు. మరీ చెయ్య లేదనకుండా “కవర్ డిజైన్” సరిగ్గా లేదు. ఇంకాస్త శ్రద్ధ చూపిస్తే బాగుండేది అని రాసారు. ఇందులో నవలా వస్తు విమర్శ లేదు. స్నేహ పూర్వక సమీక్షలా వుంది.అందుబాటులో వుంటే చదవండి. చదివాక మీరూ నాతో ఏకభవిస్తారన్న నమ్మకం నాకుంది.
మాధవ్ గారూ,
అభిప్రాయాలు రాసేవాళ్ళు, వాళ్ళ తరపునో, వీళ్ళ తరపునో రాయరు.
కథావస్తువు, నాకు విపరీతంగా నచ్చింది. పంటికింద ఇన్ని “వన్నండాఫ్ ఇంచీ” సైజు రాళ్ళు పడ్డంతో, చెడ్డ చిరాకు వేసింది. అలా కాకుండా వుంటే, కారా మేస్టారి కథ మీద జరిగిన అద్భుతవైన “యుధ్ధం” లాటిది జరిగుండేది. అది తప్పిపోయింది. అదీ నా బాధ.
మీరు రాసిన, “తప్పులెందుకున్నై?” రెండు సార్లూ ఒకేలా రాసినా, ఒకసారి దబాయింపుగానూ, రెండోసారి సామరస్యం గానూ ఎలా వినిపించాయి మీకు?
అలాగే అద్రుష్టానికీ, అదృష్టానికీ తేడా ఏవిటో? (మీరు రాసిన వాక్యంలో మీ వొళ్ళుమంటే కనిపించింది. సరైన వుదాహరణ కాదు. “మోహన” గారు రాసినది ఒకసారి చదవండి. క్షమించాలి. సంపాదకులు అన్నీ తెలిసినవాళ్ళు. వాళ్ళు ప్రాచీన గ్రంథాలు అన్ని భాషలలోవీ, పరాయి భాషల్లో వస్తున్న సమకాలీన సాహిత్యం మాత్రమే చదువుతారు. “బై ది బై” వ్యావహారిక భాషకి కూడా “వృధ్ధ వ్యాకరణం” ఎవరైనా రాసేరా? జయంతి వారు అంత “పులేసం” కట్టేరో, “వ్యావహారిక భాష” మీద, మీ వల్ల తెలియడం నా అద్రుష్టం. మీ 2011 వుదాహరణ, “వుయ్ హావ్ టు టీచ్ దిస్ బగ్గ ఎ లెసన్” లాగే వినబడుతోంది. మాది రాణీగారింగ్లీషు లేదా రెన్ & మార్టిన్ ఇంకా కాదంటే ఎన్ డీ వీ ప్రసాద రావు ఇంగ్లీషు. సెమించాలి.)
ఇక, మాకు మీ అభిప్రాయాలే ముఖ్యం అన్న ముక్క నాకసలు అర్థం కాలేదు.
పాఠకులు రాసే అభిప్రాయాల వల్ల ఈ మాటకి ఏం ఒరుగుతుందో నాకు తెలీదు.
ఒక రచయిత రాసిన దాని మీద మిగిలిన వాళ్ళు ఏవైనా రాస్తే బ్లాకులు కట్టి మరీ వేసే సంపాదకులు, వాళ్ళని ఎవరైనా ఏవైనా అంటే, ఇలా వొంటికాలి మీద లేవడం, సహజవే కాబోలు.
ఇయన్నీ వొగ్గెద్దురూ. మీకు తెల్దని కాదు. వొకటే మందు, ఇలాటి తిక్కోళ్ళకి. అళ్ళెప్పుడైనా ఏటైనా రాసి పమ్మిస్తే, ఆర్ అని రెడ్డీంకు తో సున్నా సుట్టీసి, పక్కనొడేయాల. “అచ్చా! మావఁలాటోళ్ళవి కావంటారా” అవును కాబోలు.
గుప్పెడంత మనసు గురించి vennnu అభిప్రాయం:
09/02/2008 2:53 am
it is a matured poem. I felt good.
జ్ఞాపకాల ఎదురుచూపు గురించి vennnu అభిప్రాయం:
09/02/2008 2:46 am
పోయెమ్ చాలా బాగుంది. భావ వ్యక్తీకరణ లో పోయట్ మనసు కనిపిస్తోంది. It is really good.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి చివుకుల కృష్ణమోహన్ అభిప్రాయం:
09/02/2008 12:54 am
మురళీ గారూ,
ఒక్కటే మాట. అద్భుతం. పూర్తి నిష్పాక్షికంగా జ్యోతిషం గురించి నేను చూసిన మొదటి వ్యాస పరంపర ఇది.
ధార గురించి duppala ravikumar అభిప్రాయం:
09/02/2008 12:21 am
అంటే దేవరాపల్లి రాజేంద్రకుమార్ గారు ఇప్పుడు మంచి కథకులుగా కూడా మారారన్న మాట. చాలా బావుంది. అభినందనలు.
-రవి
ఏటి ఒడ్డున గురించి baabjeelu అభిప్రాయం:
09/01/2008 11:23 pm
వైదేహి శశిధర్ గారూ,
చిక్కని కవిత్వం.
అన్ని ప్రక్రియలలోనూ కవిత్వానికే ఎందుకు పెద్దపీట వేస్తారో ఢంకా బజాయించి చెప్పేవి ఇలాటి రచనలే.
ఇంత చిన్న మోనిటర్ మీద, ఏ ఇషాన్ ఆర్యో షూట్ చేసిన దృశ్యాన్ని, చూపించగలిగేరు.
తారామతి బిరాదరి గురించి Hrk అభిప్రాయం:
09/01/2008 9:50 pm
‘మబ్బు కొప్పు లోంచి నీళ్ల దండ/ జారి చెట్ల కొమ్మల్లో చిక్కుకుంటోది’ … ఊహ చాల చాల బాగుంది. మొత్తంగా పద్యం బాగుంది. …హెచ్చార్కె
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
09/01/2008 8:06 pm
మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు ఆలస్యంగా కృతజ్ఞతలు. ఇంద్రగంటి పద్మ గారు చాలా సాయం చేశారు. ప్రచురించే సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వలన మామూలు కంటె కాస్త ఎక్కువగా శ్రమపడ్డారు. వారికి చాలా థాంక్స్.
కొడవళ్ళ హనుమంతరావు
పుస్తక సమీక్షల గురించి… గురించి rama అభిప్రాయం:
09/01/2008 7:52 pm
వెంకటేశ్వర రావు గారు, మీ దృష్టికి రాలేదో, లేక మీకు దొరకలేదో, నాకు తెలీదు గానీ, జయప్రభ గారి “వామనుడి మూడోపాదం” కవితా సంపుటి మీద వెల్చేరు నారాయణ రావు గారు చేసిన సమీక్ష చెప్పుకోవలసిన రివ్యూ. ఆ పుస్తకం అచ్చై తెలుగులో ఒక సంచలం సృష్టించిన రోజుల్లో ఆంధ్రజ్యోతి వీక్లి లో అచ్చు అయ్యింది. అలాగే దాదాపు వెనువెంటనే అనుకుంటాను జయప్రభ గారి “భావకవిత్వంలో స్త్రీ” అన్న విమర్శ పుస్తకాన్ని పురాణం సుబ్రమణ్య శర్మ గారు ఒక మూడు వారాల పాటు ఆంధ్ర జ్యోతి వీక్లి లోనే సమీక్ష చేసారు. అది ఒక కొత్త దృక్పథాన్ని సరిగా గ్రహించలేక సమీక్షకుడు ఎన్ని పిల్లి మొగ్గలు వేసి బొల్తాపడతాడో చెప్పడానికి మరో వుదహారణ. మీరు వీటిని పట్టించుకోలేదేమా? అనుకున్నాను.
rama
అమెరికా పర్యాటకుల రెండు పుస్తకాలు – II గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
09/01/2008 12:45 pm
రవిశంకర్ గారి కవిత్వం అంటే ఇష్టపడే వాళ్ళల్లో నేనొకణ్ణి. ఈ వ్యాసం మొదటి భాగం కవితా సమీక్ష ఉన్నట్లుగా నవలా సమీక్ష లేదు.
నవీన్ గారు ఆయన అనుభవాలు రాసారు. అమెరికాలో జరిగే కొన్ని విషయాల గురించి పైపైనే స్పృశించి చెప్పారు. అందువల్ల ఇది ఇండియానుండి వచ్చేవాళ్ళకి గైడులా ఎలా ఉపయోగపడుతుంది? ఈ నవల్లో చాలా చోట్ల పొందుపర్చిన వివరాలు సరిగ్గా లేవు. తెలీని వాళ్ళకి పరవాలేదు కానీ, అమెరికాలో ఉంటున్న వాళ్ళకి ఈ నవల ఓ పట్టాన మింగుడుపడదు.
ఎయిర్ పోర్ట్లో అమెరికన్ సంభాషణ గురించి ఈ వ్యాసంలో రాయలేదు. ఇరాక్ యుద్ధం గురించి నవీన్ గారేమనుకుంటున్నారో అది అమెరికన్తో మాట్లాడినట్లుగా రాసారు. పరిచయం లేని వ్యక్తుల దగ్గర అమెరికన్లు అంత లా మనసు విప్పి చెప్పరు. సిడ్నీ షెల్డన్ నవల్లో సెక్స్ లేకపోతే ఇక్కడ పుస్తకాలెవరూ కొనరన్నట్లుగా రాసారు. అది మాత్రం నిజం కాదు. ఇలాంటి చోటే నవీన్ సొంత అభిప్రాయాల్ని చొప్పించారన్నట్లుగా ఉంది. ఇవేమీ ఈ వ్యాస సమీక్షలో రాయలేదు. ఇది ఖచ్చితంగా రివ్యూ రాసేటి నవలల జాబితాలో చేరదు. వ్యాస రచయిత చెప్పినట్లుగా ఒక్క బిగిని చదివేసే నవల మాత్రం కాదు.
ప్రశంసల దగ్గర పెల్లుబికిన విశేషణాలు విమర్శ దగ్గర మౌనం వహించడం ఈ వ్యాసంలో కొట్టచ్చినట్లుగా కనిపించింది. నవల చదివితే ఈ అభిప్రాయం మరింత నిర్ధారింప బడుతుంది. ఇదే ఏ పేరులేని మామూలు రచయితో రాస్తే ఇలా రివ్యూలకి నోచుకుంటుందా? అందుకే అతితక్కువగా మెల్లని స్వరంలో విమర్శ సాగింది.
యాత్రా నవల అన్నారు. అంటే యాత్ర చేస్తూ రాసిన నవలనా లేక యాత్ర గురించి నవలనా? ట్రావెలాగ్ అని అనుంటే పోయేది. మరలా నవల అంటూ ఈ బిల్డప్పు ఏమిటి? నవలకి కావల్సిన మౌలిక లక్షణాలు ఈ పుస్తకంలో ఏ కోశానా కనిపించవు. అది వ్యాస రచయిత ఎక్కడా చెప్పినట్లు లేదు. విమర్శ మాత్రం ఘాటుగా లేదు. మరీ చెయ్య లేదనకుండా “కవర్ డిజైన్” సరిగ్గా లేదు. ఇంకాస్త శ్రద్ధ చూపిస్తే బాగుండేది అని రాసారు. ఇందులో నవలా వస్తు విమర్శ లేదు. స్నేహ పూర్వక సమీక్షలా వుంది.అందుబాటులో వుంటే చదవండి. చదివాక మీరూ నాతో ఏకభవిస్తారన్న నమ్మకం నాకుంది.
[ఈ కామెంటు ఎడిట్ చేయబడినది – సం.]
కేసు గురించి baabjeelu అభిప్రాయం:
09/01/2008 9:50 am