మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. వాడిన భాష, శైలి చదవటానికి సులభంగా ఉన్నాయి. “ఈమాట”కు పరిచయమైన కొత్తల్లోనే ఇంత చక్కగా రాసారంటే, ముందు ముందు సంచికల్లో, మీ “రాతల” కోసం ఎదురుచూడక తప్పదు.
అన్నట్టు, “ఈమాట రచయితలు” లిస్టులో మీ గురించి పరిచయం చదివినట్టు గుర్తు లేదు. మీ గురించి పరిచయం “ఈమాట” కి ఇంకా పంపకపోతే, దయచేసి ఇప్పుడైనా పంపించండి.
ఆరుద్ర, బాలమురళీ మీద రాసిన వ్యాసం, తపాలా శాఖ వారి దయ వల్ల గాల్లో కలిసిపోయిందని చాలా ఏళ్ళ కిందట చదివినప్పుడు కలిగిన బాధ, ఈ వ్యాసంతో ఉపశమించింది.
బాలమురళీ ఛలోక్తులు:
బొంబాయిలో రంగ్ భవన్ కచేరీ లో, స్వాతి తిరునాళ్ కీర్తన ముందు, “ఈ హిందీ పాట, ఒక మళయాళీ రాజుగారు రాసింది. ఒక మళయాళీ సినిమా కోసం, వరస కట్టి పాడింది, తెలుగునాట పుట్టి, తమిళనాట్లో పెరిగిన కుర్రాడు. ఆ కుర్రాణ్ణి నేనే.”
ఈ కచేరీలోనే “ఒరునాళ్ పోదుమా …” మొదలెట్టి, పాట ఆపి “పోగాదు ముడిచిట్టుమా?” అనడం.
ఈ కచేరీలోనే “రబీంద్రొ షొంగీత్” మొదలెట్టినపుడు, వెనక వరసలో కూచున్న బెంగాలీ “ఖూబ్ భాలో” అన్నప్పుడు, ఆశ్చర్యం వేసింది.
ఆగష్టు 24, 2008 న రవీంద్రభారతి లోజరిగిన కార్యక్రమం లో, “ఇలా అన్నీ పాడేస్తే ఇక నన్నెవరూ కచేరీలకి పిలవరు.” రసికులిచ్చిన లిస్ట్ చూసి.
ఎస్. జానకి గారు, స్టేజి దగ్గరకెళ్ళి, “దేవీ బ్రోవ సమయమిదే” అని నాలుగైదు సార్లు గట్టిగా అడిగేరు. బాలమురళీ “ఇదేనా?”
“తుంగా తరంగే” పాడమని ఎవరో రాసి పంపితే, “అవన్నీ బాలమురళీ గా వున్నప్పుడు పాడినవి.”
కచేరీ వినడానికి వచ్చిన వాళ్ళని బట్టి కచేరీ చెయ్యడం ఈయనొక్కరే చెయ్యగలరని నా నమ్మకం.
బాలమురళీ, శ్రీరంగం గోపాలరత్నం గార్లు కలిసి “ఎంకి పాటలు” కూడా పాడేరు. భక్తిరంజని కార్యక్రమం లాగే వుంటుంది. బహుశా అందుకే ఎవరూ వాటి ఊసు ఎత్తరేమో?
కృష్ణమోహన్ గారూ, చంద్రమోహన్ గారూ,
ఈ వ్యాసాల్ని ఓపికతో చదివినందుకు చాలా కృతజ్ఞతలు. మీ కామెంట్లకి చాలా సంతోషం కలిగింది.
ఈ వ్యాసాల్ని రాయడానికి ప్రేరణనిచ్చిన కొత్తపాళీ గారికీ, ప్రచురించిన ఈమాట సంపాదక వర్గానికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈమాటలోని పాత్రధారులే కొందరు రచ్చబండలో ఉన్నారు. ఆమధ్య ఇక్కడ పుట్టిన వివాదమొకటి ఎగిరి అక్కడ వాలింది. వైదేహి గారి కవిత చదివితే అక్కడ ప్రస్తావించిన Rorty వ్యాసం గుర్తొచ్చింది.
అది చూసి, షెల్లీ వ్యాసం చదివితే ఇది కనిపించింది:
“A Poet is a nightingale who sits in darkness, and sings to cheer its own solitude with sweet sounds; his auditors are as men entranced by the melody of an unseen musician, who feel that they are moved and softened, yet know not whence or why.”
కవిత్వం దైవం లాంటిదట. అందుకే దానికి పెద్దపీట.
సమీక్ష అనేది రకరకాల స్థాయిల్లో పనిచేస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో ‘రోడ్డవతల’ ఉన్న పుస్తకాల షాపుకు వెళ్ళి చూడగలిగే పరిస్థితి లేనప్పుడు ఫలాని పుస్తకం ఒకటి అచ్చయింది అనే ప్రాథమిక సమాచారం అందజెయ్యడం దగ్గర్నుంచీ అది దేన్ని గురించో వగైరా విషయాలు ఈ సమీక్షల ద్వారా తెలుస్తాయి. నేను ఇంటర్నెట్ మీద ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త ఎడిషన్ల ఆదివారం అనుబంధంలో ఈ వివరాలు చూస్తూ ఉంటాను. సమీక్షకుడు సాహితీపరుడుగా పేరున్నవాడు కాకపోతే అతని విమర్శను పాఠకులు సీరియస్ గా తీసుకోకపోవచ్చు.
1970-75 ప్రాంతాల్లో ఆంధ్రప్రభ వీక్లీవారు మా నాన్న కుటుంబరావుగారి చేత పుస్తక సమీక్షలు రాయించేవారు. ఎమెస్కో ప్రచురించిన విశ్వనాథ రచనలూ (దిండు కింద పోకచెక్క వగైరా), ఇతర పుస్తకాలూ చదివి ఆయన సమీక్షలు రాసేవారు. అందుకు పారితోషికం పది రూపాయలు! ఇది ఆ రోజుల్లోనూ చాలా తక్కువే. ఆయన సీనియర్ కథకుడు కనక సరికొత్త కథకి కూడా అప్పట్లో వాళ్ళిచ్చినది 75 రూపాయలే అనుకోండి. మొత్తం మీద సాహిత్య విమర్శకి భారతి మూతపడ్డాక విలువ తగ్గిందనిపిస్తుంది.
ఈ వ్యాసం (లేదా ఎడిటోరియల్) బాగుంది. Self-congratulatory అని కాదుగాని ఈమాటకూ తక్కిన వెబ్ పత్రికలకూ ఇటువంటి విషయాల్లోనే తేడా కనిపిస్తుంది. పాఠకులు కామెంట్లు రాసేటప్పుడు hyper critical ధోరణి అవలంబించకుండా ఈ ప్రయత్నాలకు ప్రోత్సాహాన్నివ్వడం మంచిది.
పడవ మునుగుతోంది గురించి psathyavathi అభిప్రాయం:
09/03/2008 8:01 am
శారదగారూ, మీరు తెలుగులో కూడా ఇంతబాగా వ్రాస్తారని ఈకధ చదివేదాకా తెలీదు. బాగా వ్రాసారు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/03/2008 6:07 am
నాగ మురళీ గారు:
మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. వాడిన భాష, శైలి చదవటానికి సులభంగా ఉన్నాయి. “ఈమాట”కు పరిచయమైన కొత్తల్లోనే ఇంత చక్కగా రాసారంటే, ముందు ముందు సంచికల్లో, మీ “రాతల” కోసం ఎదురుచూడక తప్పదు.
అన్నట్టు, “ఈమాట రచయితలు” లిస్టులో మీ గురించి పరిచయం చదివినట్టు గుర్తు లేదు. మీ గురించి పరిచయం “ఈమాట” కి ఇంకా పంపకపోతే, దయచేసి ఇప్పుడైనా పంపించండి.
అభినందనలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
బాలమురళీకృష్ణ గురించి baabjeelu అభిప్రాయం:
09/03/2008 5:23 am
ఆరుద్ర, బాలమురళీ మీద రాసిన వ్యాసం, తపాలా శాఖ వారి దయ వల్ల గాల్లో కలిసిపోయిందని చాలా ఏళ్ళ కిందట చదివినప్పుడు కలిగిన బాధ, ఈ వ్యాసంతో ఉపశమించింది.
బాలమురళీ ఛలోక్తులు:
బొంబాయిలో రంగ్ భవన్ కచేరీ లో, స్వాతి తిరునాళ్ కీర్తన ముందు, “ఈ హిందీ పాట, ఒక మళయాళీ రాజుగారు రాసింది. ఒక మళయాళీ సినిమా కోసం, వరస కట్టి పాడింది, తెలుగునాట పుట్టి, తమిళనాట్లో పెరిగిన కుర్రాడు. ఆ కుర్రాణ్ణి నేనే.”
ఈ కచేరీలోనే “ఒరునాళ్ పోదుమా …” మొదలెట్టి, పాట ఆపి “పోగాదు ముడిచిట్టుమా?” అనడం.
ఈ కచేరీలోనే “రబీంద్రొ షొంగీత్” మొదలెట్టినపుడు, వెనక వరసలో కూచున్న బెంగాలీ “ఖూబ్ భాలో” అన్నప్పుడు, ఆశ్చర్యం వేసింది.
ఆగష్టు 24, 2008 న రవీంద్రభారతి లోజరిగిన కార్యక్రమం లో, “ఇలా అన్నీ పాడేస్తే ఇక నన్నెవరూ కచేరీలకి పిలవరు.” రసికులిచ్చిన లిస్ట్ చూసి.
ఎస్. జానకి గారు, స్టేజి దగ్గరకెళ్ళి, “దేవీ బ్రోవ సమయమిదే” అని నాలుగైదు సార్లు గట్టిగా అడిగేరు. బాలమురళీ “ఇదేనా?”
“తుంగా తరంగే” పాడమని ఎవరో రాసి పంపితే, “అవన్నీ బాలమురళీ గా వున్నప్పుడు పాడినవి.”
కచేరీ వినడానికి వచ్చిన వాళ్ళని బట్టి కచేరీ చెయ్యడం ఈయనొక్కరే చెయ్యగలరని నా నమ్మకం.
బాలమురళీ, శ్రీరంగం గోపాలరత్నం గార్లు కలిసి “ఎంకి పాటలు” కూడా పాడేరు. భక్తిరంజని కార్యక్రమం లాగే వుంటుంది. బహుశా అందుకే ఎవరూ వాటి ఊసు ఎత్తరేమో?
ధార గురించి meenakshi అభిప్రాయం:
09/03/2008 4:31 am
చాలా బా రాసారు రాజేంద్ర గారు. ఈ కథ ఎండింగ్ ఇలా ఉంటుందని నేనసలు ఊహించలేదు..బావుంది.
సాయము శాయరా డింభకా! గురించి chavakiran అభిప్రాయం:
09/03/2008 3:20 am
రమణి గారూ,
మీరు మరీ సినీ హీరో అభిమానిలా మాట్లాడుతున్నారు. ఈ కథను విమర్శించడానికి పాత కథలు చదవక్కర్లేదు కదా!
కథ బాగుంది. కథ కథే కదా.
కాకుంటే ఒకటి రెండు సంఘటనలతో వారు వీరు వీరు వారు అనుకోకూడదనుకుంటాను. కొన్ని అలా జరిగిపోతుంటాయి.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నాగమురళి అభిప్రాయం:
09/03/2008 1:30 am
కృష్ణమోహన్ గారూ, చంద్రమోహన్ గారూ,
ఈ వ్యాసాల్ని ఓపికతో చదివినందుకు చాలా కృతజ్ఞతలు. మీ కామెంట్లకి చాలా సంతోషం కలిగింది.
ఈ వ్యాసాల్ని రాయడానికి ప్రేరణనిచ్చిన కొత్తపాళీ గారికీ, ప్రచురించిన ఈమాట సంపాదక వర్గానికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈమాట కొత్త వేషం గురించి Koti అభిప్రాయం:
09/02/2008 11:30 pm
ఎమని చెప్పను ఎన్నని చెప్పను
ఈ పత్రిక గురించి
ఎడారిలొ ఒయాసిస్సువనా,
కల్లోలిత కడలిలొ దొరికిన ఉటబావివనా
బాసటగా నిలిచిన నేస్తానివనా
ఏటి ఒడ్డున గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
09/02/2008 9:19 pm
“The Fire of Life”
ఈమాటలోని పాత్రధారులే కొందరు రచ్చబండలో ఉన్నారు. ఆమధ్య ఇక్కడ పుట్టిన వివాదమొకటి ఎగిరి అక్కడ వాలింది. వైదేహి గారి కవిత చదివితే అక్కడ ప్రస్తావించిన Rorty వ్యాసం గుర్తొచ్చింది.
అది చూసి, షెల్లీ వ్యాసం చదివితే ఇది కనిపించింది:
“A Poet is a nightingale who sits in darkness, and sings to cheer its own solitude with sweet sounds; his auditors are as men entranced by the melody of an unseen musician, who feel that they are moved and softened, yet know not whence or why.”
కవిత్వం దైవం లాంటిదట. అందుకే దానికి పెద్దపీట.
కొడవళ్ళ హనుమంతరావు
పుస్తక సమీక్షల గురించి… గురించి Rohiniprasad అభిప్రాయం:
09/02/2008 8:37 pm
సమీక్ష అనేది రకరకాల స్థాయిల్లో పనిచేస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో ‘రోడ్డవతల’ ఉన్న పుస్తకాల షాపుకు వెళ్ళి చూడగలిగే పరిస్థితి లేనప్పుడు ఫలాని పుస్తకం ఒకటి అచ్చయింది అనే ప్రాథమిక సమాచారం అందజెయ్యడం దగ్గర్నుంచీ అది దేన్ని గురించో వగైరా విషయాలు ఈ సమీక్షల ద్వారా తెలుస్తాయి. నేను ఇంటర్నెట్ మీద ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త ఎడిషన్ల ఆదివారం అనుబంధంలో ఈ వివరాలు చూస్తూ ఉంటాను. సమీక్షకుడు సాహితీపరుడుగా పేరున్నవాడు కాకపోతే అతని విమర్శను పాఠకులు సీరియస్ గా తీసుకోకపోవచ్చు.
1970-75 ప్రాంతాల్లో ఆంధ్రప్రభ వీక్లీవారు మా నాన్న కుటుంబరావుగారి చేత పుస్తక సమీక్షలు రాయించేవారు. ఎమెస్కో ప్రచురించిన విశ్వనాథ రచనలూ (దిండు కింద పోకచెక్క వగైరా), ఇతర పుస్తకాలూ చదివి ఆయన సమీక్షలు రాసేవారు. అందుకు పారితోషికం పది రూపాయలు! ఇది ఆ రోజుల్లోనూ చాలా తక్కువే. ఆయన సీనియర్ కథకుడు కనక సరికొత్త కథకి కూడా అప్పట్లో వాళ్ళిచ్చినది 75 రూపాయలే అనుకోండి. మొత్తం మీద సాహిత్య విమర్శకి భారతి మూతపడ్డాక విలువ తగ్గిందనిపిస్తుంది.
ఈ వ్యాసం (లేదా ఎడిటోరియల్) బాగుంది. Self-congratulatory అని కాదుగాని ఈమాటకూ తక్కిన వెబ్ పత్రికలకూ ఇటువంటి విషయాల్లోనే తేడా కనిపిస్తుంది. పాఠకులు కామెంట్లు రాసేటప్పుడు hyper critical ధోరణి అవలంబించకుండా ఈ ప్రయత్నాలకు ప్రోత్సాహాన్నివ్వడం మంచిది.
ధార గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
09/02/2008 7:54 pm
అభినందనలు.