పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    09/22/2008 11:29 am

    చాలా బాగుంది. సరస్వతీ స్తుతిపరంగా చెప్పిన సీసపద్యం చిట్టచివరగా చెప్పినా, చిరకాలం గుర్తుంచుకునేదిగా ఉంది.
    విధేయుడు
    Srinivas

  2. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి దిలీపు మిరియాల అభిప్రాయం:

    09/22/2008 3:50 am

    మీ సుదీర్ఘ మైన వ్యాసం చదివాను. ఇప్పటి వరకు ఎవరూ కూడా తమ అభిప్రాయం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇన్ని రాజకీయాలు, సాంఘిక పరిస్థితులు రామాయణాన్ని శాసించాయా?? మళ్ళీ ఇంకో సారి పూర్తిగా చదువుతాను.

  3. ఈమాట గురించి గురించి baabjeelu అభిప్రాయం:

    09/21/2008 8:04 am

    బాబూ,

    ఈయేలే, ఓ పత్రిక లో యండమూరి, మల్లాది ల జమిలి ఇంటర్వ్యూ చదివేను. సాన్నాళ్ళకి వీలు దొరికి. ఆళ్ళిద్దరూ, గొప్ప రచయతలు కారో, అవునో చివరాకరికి తేలుద్ది. వొగ్గేయండి, దానికోసం మాటాడుకోడం దండగ. కానీ ఒహటి తేలిపోనాది. ఆళ్ళకున్న ఇబ్బందులు, “ఈ మాట” లో రాసీవోళ్ళకి లేవు. లేవు గాక లేవు. ఆళ్ళకేగాదు, ఆళ్ళముందోళ్ళకీ, తరవాతోళ్ళకీ కూడా.

    కడుపెంత తా కుడుచు కుడుపెంత? దీనికై పడని పాట్లనెల్ల పడిదొరలనేల?

    అందుకే “ఈ మాట” లో మనందరం “సాహిత్య సేవ” పేరిట చేసీది ఎంతవరకూ రైటు? మనందరం అని నన్ను కూడా కలిపీసుకున్నందుకు, చెమించాల. చివరాకరికి, “స్టేంపులు” అంటించినప్పుడు, అయి నాలుక్కంటుకుపోయి, చేతికి రాకపోయీ బాధకూడాలేదు. “నైన్ టూ ఫైవ్” ఎడ్మెంట్ లో సదాశివ్ అమ్రాపుర్కార్ బాధలా.

    మనద్రుష్టం, మనద్రుష్టవేనా?(మనదృష్టం, మనదృష్టవేనా?)

    మనం “సాహిత్య సేవ” సేస్తన్నావాఁ? “ఆళ్ళకీ మా అందరికీ ఏటివోయ్ సంబందం?” అంటారా. “మావాళ్ళలాటోళ్ళవిఁ కావంటారా?” ఎందుకు లేదో? ఎందుకు కాదో? తేల్చీవోళ్ళెవరు?

  4. నిద్ర గురించి Sai Kiran Kumar అభిప్రాయం:

    09/21/2008 4:27 am

    నిద్ర కనురెప్పల గవాక్షాలను…
    ఖండిక సూపర్.

  5. చంద్రోదయం గురించి Audisesha Reddy Kypu అభిప్రాయం:

    09/20/2008 5:53 am

    కవిత చిన్నదే అయినా చక్కగా వుంది.

  6. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి satyasai kovvali అభిప్రాయం:

    09/20/2008 3:33 am

    చాలా బాగుంది మీవ్యాస పరంపర. ఎవరైనా మంచి ఫలితాలు చెప్తే జరిగినా, జరక్కపోయినా వినడానికి బాగుంటుంది. కానీ ఈమధ్యలో భయపెట్టి హోమాలూ, జపాలు చేయించే జ్యోతిష్కులూ ఎక్కువైపోయి జ్యోతిషులు బోగస్ అని నమ్మడానికే ఎక్కువ అవకాశం కలుగుతోంది.

  7. ఆవిడ గురించి krishna అభిప్రాయం:

    09/19/2008 10:20 pm

    హలో
    నిజంగా చాల అధ్బుతంగా వుంది. చాలా బాగా వ్రాశావు.

  8. కొడుకుల శివరాం భాగవత గానం గురించి A.V.S.RAO అభిప్రాయం:

    09/18/2008 6:41 am

    చాలా బాగున్నాయి. మనసు భాగవతంతో, భక్తితో నిండినది. ప్రశాంతత కలిగింది. నన్ను గుర్తు పెట్టుకోగలరు.

  9. రాగవాసిష్ఠం- నాటక వైశిష్ట్యం గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    09/17/2008 8:54 pm

    ఈ వ్యాసం చదవగానే మాతృక పుస్తకం చదవాలనిపించింది. అరుంధతి గురించి చిన్నప్పుడు వినటం, చదవటం జరిగింది. మళ్ళీ చదివే అవకాశం లేదా అవసరం తటస్థించలేదు. ఏదైనా లభిస్తే ఇప్పుడు చదవాలనిపిస్తుంది.

    ** కథాంశానికి భిన్నంగా రెండు ప్రశ్నలు మొలకెత్తాయి.
    1. మనిషి తన జీవిత, జీవన ప్రమాణంలో దేనివల్ల ప్రభావితమౌతున్నాడు?
    2. మనిషి తన జీవిత, జీవన ప్రమాణంలో దేనిని ప్రభావితం చేస్తున్నాడు?

    బహుశ ఈ రెండిటి మద్య జరిగే సంఘర్షణలతో మనిషి విడివడిపోతున్నాడనిపిస్తుంది.

  10. పడవ మునుగుతోంది గురించి vennnu అభిప్రాయం:

    09/17/2008 12:17 am

    ఒక వాస్తవాన్ని మీరు చెప్పిన విధానం అద్భుతంగా వుంది. నా మనుసును తాకింది. నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ మధ్య కాలంలో చదివిన మంచి కథ ఇది. its great.