పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. సువర్ణభూమిలో … గురించి surya అభిప్రాయం:

    11/05/2008 2:24 am

    అయ్యి బాబోయ్ వామనమూర్తి గారూ మీ కవితలో చాలా ఇన్ఫర్మేషనుందండీ బాబూ

  2. అరణ్య కవితలు గురించి A. KISHORE BABU అభిప్రాయం:

    11/05/2008 1:07 am

    సుబ్రహ్మణ్యం గారు
    మీకు మొదట నా అభినంధనలు.

    మీ కవితలు చాలా ఆలస్యంగా చదివాను.నేను కవితలు రాయను కానీ బాగా చదువుతాను. ఎక్కడైనా ఒక మంచి కవిత చూసినా హాయిగా చదువుకొని హృదయంలొ దాచుకొంటాను. ఇక్కడ కొంతమంది చేసిన విమర్శల గురించి ఎమీ పట్టించుకోకండి.అసలు ఏ కవి కూడా కవిత్వం కేవలం తనకోసం రాసుకొంటాడనేది నా అభిప్రాయము. ఆ సమయంలో కవి తాను పొందిన అనుభూతిని అక్షరాల్లో ఆవిష్కరించుకొంటాడు. అది మీరైనా, ఎవరైనా కావొచ్చు. మీ కవితల్లో ఎంతో అనుభూతివుంది.

    “ఎంత దారి తప్పి
    ఎక్కడెక్కడో తిరిగినా
    ఎట్టకేలకు నీటి జాడ

    అడవిలో మరొకసారి
    తప్పి పోవాలని ఉంది”

    ఎంత గొప్ప అనుభూతి. ఇది అనుభవించినవారికే తెలుస్తుంది. మరి కొన్ని కవితల్లో మీరు..
    “సముద్రం నుంచి
    పల్చటి నీటి పొర
    రెక్కలు కట్టుకొని
    రెప్పల కిందకి చేరుతుంటే
    మౌనంగా
    ఆ తీరాన ఆమె
    ఈ తీరాన నేను”

    “….
    ప్రకృతి రంగులన్నిటిని
    దోచెసుకొని రాత్రి
    తూరుపు కొండ చాటున
    మాటు వేసిన సూర్యుడు
    రాత్రి మీద దాడి చేసి
    వేటి రంగుల్ని తిరిగి
    వాటికే ప్రసాదిస్తాడు”

    ఆదునికత కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఇప్పుడెలాగు ఆ ప్రకృతి రమణీయతకు దూరమవుతున్నాము.పచ్చటి పైర్లు, పల్లె లోగిళ్ళ అందాలు ఎక్కడా. ఆ ప్రకృతి వొడిలో తిరిగి తిరిగి అలసి సొలసి, సేదతీరి తమని తామె మైమరచిపోయే అదృష్టాన్ని కోల్పోతున్న కాంక్రీట్ జంగిల్ పక్షులం. కనీసం ఇలాంటి కవితలు చదివినప్పుడైనా మళ్ళి ఒకింత సేపు మనసు ఆ ప్రకృతి వొడిని ఊహించుకొని సేద తీరుంది. ఇక్కడ విమర్శకులను నేనేమీ అనడం లేదు. కాకుంటే ఒక మనవి..
    నేడు తెలుగు అంతరించి పోతోందని, ముఖ్యంగా ఇంగ్లీషు మోజులో నేటి తరం తెలుగు భాషా సౌందర్యాన్ని మరచి పోతున్నారని బాధపడుతున్న తెలుగు లోకం ఒకసారి ఇలాంటి యువ కవులను వెన్ను తట్టి ప్రోత్సహించండి.ఇది మరికొంతమంది నవ కవులు పుట్టుకు రావడానికి దోహదపడుతుంది. కవులు కాక పోయినా ఫరవాలేదు, కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మార్చే వారైనా పుట్టుకొస్తారు.

    ఈ స్పూర్థితో మరికొంత మంది నవ కవులు (మీ దృష్టిలొ కవులు కకున్నా ఫరవాలేదు) కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మర్చే వారైనా పుట్టుకొస్తారు..

    “నేను బతకటానికి ఏమి కావాలి
    ఒక్క చిరునవ్వు చాలు
    ఆమె నవ్వింది
    నేను బతికాను”

    ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం దారిలొ దొరికిన కాగితంలో కవి ఆశారాజు రాసిన కవితలో చివరి వాక్యలు ఇవి..
    ఎంత తృప్తి కలిగించే కవితా ప్రయోగం, (వచనా ప్రయోగం అని కూడా అనుకోండి ఇబ్బంది లేదు).

    “తెలుగు బతకడానికి ఏమి కావాలి
    చక్కటి భావాన్ని వొలికే
    నాలుగు కమ్మని
    పదాలు తప్ప”

    మంచి కవిత రాశారు
    తెలుగు తల్లి నవ్వింది

    అమృతంలాంటి తెలుగు
    కవితా లోకానికి
    మీకు ఇదే
    నా చిరునవ్వుల స్వాగతం.

    కవితాభినందనలతో

    మీ
    కిషోర్ బాబు

  3. విన్నపము గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/04/2008 11:51 pm

    అగ్నిహోత్రుడు గారూ,

    నేను మిమ్మల్ని తూలనాడ లేదు; మీ పరిహాసం అనుచితం అని విమర్శించాను – ఆత్మీయంగా కాకపోయినా, నాదృష్టిలో సహేతుకంగా.

    తెలుగు ప్రాచీన హోదా గురించి నాకు తెలియదు; ABK ఎలాంటి మార్క్సిస్టో – కరడుగట్టిన వాడో, సుతిమెత్తని వాడో గూడా తెలియదు. మీ ప్రతిస్పందన చదివింతర్వాత, ABK 70, 80 లలో రాసిన సంపాదకీయాలు చాలా చూశాను – తెలుగు విశ్వవిద్యాలయం, గిడుగు, గురజాడ, వ్యవహారిక భాష, గాంధీ, భావే, వివేకానందుడు, … ఇలాంటి చాలా విషయాల మీద.

    అవి చదివితే, మీ పరిహాసం అనుచితమైనదన్న భావన మరికాస్త బలపడింది!

    కొడవళ్ళ హనుమంతరావు

  4. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి శాయి అభిప్రాయం:

    11/04/2008 11:02 pm

    “అన్వేషి”గారు “అ సైట్లో ఈ వ్యాసం ఉంచితే … ఇందులో ఏ నష్టమూ లేదు. … అది ఇలా చేయడం వల్ల లాభదాయకమే అనుకుంటూన్నాను.” అన్నారు.

    ఆ లాభం రెండో చోట లింక్ ఇస్తే రాదా? పూర్తి వ్యాసం మళ్ళీ ప్రచురిస్తేనే వస్తుందా?

  5. అసమర్థులు గురించి anuradha అభిప్రాయం:

    11/04/2008 9:28 pm

    చాలా బాగుంది.
    “కొందరు అదృష్టవంతులు ఆత్మలు చచ్చి మూసల్లా తయారవుతారు, సుఖపడతారు కూడా. మరి కొందరు అదృష్టవంతులు ఎదురు తిరిగి సొంత వ్యక్తిగా ఎదిగి తృప్తిగా జీవిస్తారు. నాలాంటి దురదృష్టవంతులు ఇటు సొంత ఆత్మ చావకా, అటు వారి ట్రెయినింగ్ తో కుదించుకుపోయీ అసమర్థుల్లా మిగిలి పోతారు.” ఈ వాక్యాలు ఇంకా బాగా నచ్చాయి.ఎందుకంటె నేను అలాంటి అసమర్థురాలినే. ధన్యవాదాలు ఇంత మంచి కథ అందించినందుకు.

  6. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి సగటు జీవి అభిప్రాయం:

    11/04/2008 9:02 pm

    నాకేం అనిపిస్తుందంటే, ఇదంతా తరాల మధ్య అంతరాలనిపిస్తుంది. ఈమాటలో ఈతరం వాళ్ళు తక్కువ. పత్రికలోని వ్యాసాలు కాచి వడబోసిన టీలాగా ఉండాలని అనుకుంటూన్నారు. తప్పేం లేదు. కానీ ఈ రోజుల్లో తెలుగు పత్రిక చదివేవాడ తక్కువైపోతుంటే ఇప్పుడు ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుందనిపిస్తుంది.

    ఇక నవతరంగం లో అంతా ఈ తరం వాళ్ళే.అక్కడ కాచి వడపోత లేదు. అంతా ఇన్స్టెంట్ టీ బ్యాగ్ టైపు. ఫట్ మని రాస్తారు. ఫట్ మని పబ్లిష్ చేస్తారు.ఒక విధంగా ఇది లాభం మరో విధంగా నష్టం. లాభమేంటంటే మరీ గొప్పగా రాయలేని వాళ్ళు సైతం రాసే అవకాశం పొందుతారు. అలాగే కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక నష్టమేంటంటే క్వాలిటీ. న.త లో వచ్చే అన్ని వ్యాసాలూ ఒకే నాణ్యత కలిగివుండవు.

  7. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    11/04/2008 12:24 pm

    ఎందుకు, ఎలా, అని అడక్కండి. నా దగ్గర నిజంగానే సమాధానం లేదు. కానీ యెందుకో పై కవిత చదవగానే సత్తసాయ్ (గాథాసప్తశతి) లోని “గాథలు” కొన్ని, అలాగే సుభాషిత రత్నకోశం, సుభాషిత రత్నభాండాగారాల్లోని కొన్ని ప్రకృతి వర్ణనలతో కూడిన సంస్కృత పద్యాలు గుర్తుకొచ్చాయి. లైలాగారన్నట్లు నిజంగా సరదాగా వుంది మీ కవిత. అభినందనలు.

    భవదీయుడు,
    శ్రీనివాస్

  8. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి lyla yerneni అభిప్రాయం:

    11/04/2008 12:06 pm

    భలే సరదాగా ఉంది కవిత. ఇంకా ఆ ఊళ్ళోకి వెళ్ళాలనే! ఎందుకు! 🙂

    ఇంతకు ముందు సంచికలో -తారామతి బిరాదరి- కూడా బహుత్ ఖూబ్. Haunting. Spell casting.

    ‘మబ్బు కొప్పు’ లోంచి బదులు, మబ్బు జుల్ఫ్ నుండి నీటిపూలు రాలి కొమ్మల్లో చిక్కుపడరాదా?

    మీ పొయెట్రీ లింకు ఇచ్చారు. చదువుకుంటాను. థేంక్యూ ఇంద్రాణీ!

    లైలా

  9. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి Kameswara Rao అభిప్రాయం:

    11/04/2008 11:50 am

    నన్నెచోడుని, అతని చక్కని పద్యాన్ని పరిచయం చేసారు. మోహనగారన్నట్టు ప్రబంధపరమేశ్వరుడు బిరుదుకి నన్నెచోడుడు తగినవాడే!
    మీ వివరణకి చిన్న సవరణ. “ముత్తరంగలు” అంటే నాభిపై భాగమ్మీద ఏర్పడే సన్నని మూడు మడతలు అని అర్థం, మూడు పాయలని కాదు. ఈ “ముత్తరంగల”నే “త్రివళులు” అని కూడా అంటారు.
    “మడుగులు వారి” అంటే మడతలు పడి అని అర్థం. వాననీరు కుచఘట్టనతో వేగంగా కిందకి పారి, త్రివళులని చేరి, ఆ మడతలకి మడతపడి వేగంగా నాభిని చొచ్చాయి అని అర్థం. ఈ అర్థంలో నీరు మూడు పాయలుగానే ఎందుకు చీలింది అన్న సందేహానికి తావుండదు.

  10. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి mOhana అభిప్రాయం:

    11/04/2008 11:45 am

    నాకు తోచిన రెండు నయాపైసలు!
    విజ్ఞానశాస్త్ర పత్రికలలో రచనలను ప్రచురించడానికి ముందు పత్రికకు రచయిత కాపీరైటు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈమాట వంటి పత్రికలకు రచయితలు అలా కాపీరైటు అందివ్వడం
    లేదు. ఐనా కూడా రచయిత మళ్ళీ తన రచనను మరో చోట ప్రచురిస్తే అక్కడ మొట్ట మొదట ఆ రచన ఈమాటలో ప్రచురించబడినది అని తప్పక చెప్పాలి. ఆ రచనను తన
    ఒక పుస్తకంలో భాగంగా ఉంచినా ఈ విషయాన్ని విదితం చేయాలి. ఈ రెండు సమయాలలో ఈమాట పత్రికకు అలా చేస్తున్నానని తెలియబరచాలి. ఇలా చేస్తే ఈమాట హక్కుదారులు, సంపాదకులు తప్పక అంగీకరిస్తారనే అనుకొంటాను. అలా చేయకపోతే అంత బాగుండదని నా అభిప్రాయం. విధేయుడు – మోహన