పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. పదేళ్ళ “ఈమాట” మాట గురించి ప్రవీణ్ గార్లపాటి అభిప్రాయం:

    11/08/2008 9:32 am

    [ప్రవీణ్ గారు, మీ సూచనలకు కృతజ్ఞతలు. వీటిని పరిశీలిస్తాము. — సంపాదకులు]

    ఈమాట స్థాపనలో అనుకున్న కొన్ని సంగతులయినా నిజం అయినందుకు సంతోషం.
    సాధించింది బాగున్నా ఇంకా సాధించాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి.

    చిన్న చిన్న మార్పులు, జోడింపులతో ఈమాటని ఇంకొంచం బాగా తీర్చిదిద్దవచ్చేమో.

    రీచ్: చక్కగా ఎన్నో ఫార్మాట్ లలో లభ్యమవుతున్న ఈమాటని అందరికీ రీచ్ అయ్యేలా కొద్ది కాలం పాటు ఒక న్యూస్ లెటర్ లాగా అందించవచ్చు. ఎలాగూ పీడీఎఫ్ ఫార్మాటు ఉంది కాబట్టి ఒక మెయిలింగు లిస్టు సృష్టించి దానిని జతచేసి ప్రతీ నెలా పంపించవచ్చు.


    సంభాషణలకు వీలు:
    వ్యాసాలు, కథలకు ఈమాట ఇంటర్ఫేసు బాగున్నా సంభాషణలకు అంత వీలుగా లేదని నాకు అప్పుడూ అనిపిస్తుంటుంది.
    చిన్న చిన్న మార్పులు చేసి ఇంటర్ఫేసుని ఇంకా చక్కగా తీర్చి దిద్దవచ్చు. ఉదా: వ్యాఖ్యలలో threading ప్రవేశపెట్టవచ్చు. ఒక చక్కని సంభాషణ కొనసాగించేలా చూడవచ్చు.

    యూనీకోడు వాడకం పరంగా “ఈమాట” చాలా సంతృప్తి కలిగిస్తుంది.

    ఈ మాటకి అభినందనలు.

  2. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష గురించి ప్రవీణ్ గార్లపాటి అభిప్రాయం:

    11/08/2008 9:05 am

    బాగుంది. వివరాలు చక్కగా, సంక్షిప్తంగా అందజేసారు.

  3. అసమర్థులు గురించి Audisesha reddy Kypu అభిప్రాయం:

    11/08/2008 6:03 am

    రమ్య గీతిక గారూ..! కథ ఆసాంతం చదివాను. హృదయానికి హత్తుకునేలా యెంత బాగా రాశారు. కీపిటప్ …!
    — కైపు ఆదిశేషా రెడ్డి.(నెల్లూరు )

  4. ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి Audisesha reddy Kypua అభిప్రాయం:

    11/08/2008 5:51 am

    పది వసంతాలు పూర్తి చేసుకున్న ”ఈ మాట” సంపాదకులకు అభినందనలు. ఇది మరింత విజయం దిశగా సాగి పోవాలని మనసారా కోరుకుంటున్నాను.

  5. సువర్ణభూమిలో … గురించి Sangeeta అభిప్రాయం:

    11/07/2008 10:08 pm

    శ్రీనివాస్ గారు:

    థాయ్ లాండ్, సువర్ణ భూమిలో ఒక ముఖ్యమైన భాగం,

    1. బ్యాంగ్ కాక్ ఐర్ పోర్ట్ పేరు : సువర్ణ భూమి

    లింకు: http://www.bangkokairportonline.com/node/15
    ___________________________
    Official name
    Suvarnabhumi Airport. The name Suvarnabhumi was chosen by HM King Bhumibol Adulyadej which means “The Golden Land”, specifically referring to the continental Indochina. “Golden Peninsula”or “Golden Land” is a traditional name for the Thailand-Cambodia-Laos-Burma region
    ___________________________

    కవితలు చాలా భావావేశం నిండి, ఒక వారం రోజులు నేను అనందించిన నా థాయ్ లాండ్ యాత్ర స్మృతులను తిరిగి వెలిగించాయి. ఇటువంటి కవితలు ఇంకా చదవాలని కోరిక.

    –సంగీత

  6. సువర్ణభూమిలో … గురించి Garikapati అభిప్రాయం:

    11/07/2008 9:16 pm

    ఇందులో అయుదు ఇంపైన కవితలు:

    ముందు మూడు కవితల్లో బుద్ధ జీవితం గొప్పతనం కళ్ళకు కట్టినా, ప్రతి కవితలో ఎదో ఒక ప్రాణి (ఎర్ర చారల పిల్లి, తేనెటీగ, కుక్కపిల్ల) బుద్దుడి గొప్పతనం ఎమీ తెలియదు, తెలుసుకోలేవు(కొంతమంది మన పాఠక మిత్రుల్లా) కనుక వాటి పనిలో అవి ఉన్నాయి (పాదాలను నాకుతూ).

    నాలుగవ కవిత: మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చు. తల ఎత్తక, దించక నిలిచి గమనించమని చెపుతున్నా, పైకి కిందికి చూసి ప్రాణ వాయువు అందని కొందరు పాఠకులు, గజ ఈతగాళ్ళైన మోహన, కామెశ్వర రావుగార్లకు నిజంగా పని పెట్టారు.

    చివరి కవిత: ముఖ్యంగా ఈ కవితల నేపధ్యం థాయ్ ల్యాండ్ అని ప్రియురాలి మనసునే కాదు మొత్తం కవితలనే ఛాయామాత్రంగనైనా ఆనవాలు పట్టడానికి కవి వదిలిన సూచన. ఈ సందర్భంగా “ఇస్మాయిల్ గారితో నా పరిచయం” అన్న విన్నకోట రవి శంకర్ గారి వ్యాసంలో వారు సూచించిన ‘కవిత్వంలో అస్పష్టత’ అనే అంశంపై చర్చ గుర్తుకు వచ్చింది.

    రవిశంకర్ గారు: “హంపీ పద్యమేమిటి అలా ఉందీ”
    ఇస్మాయిల్ గారు: “నువ్వు హంపీ వెళ్ళావా?”
    రవిశంకర్ గారు: “లేదు”
    ఇస్మాయిల్ గారు: “మరి హంపీ చూడకుండా హంపీ మీద పద్యం ఎలా అర్ధం అవుతుంతుంది?”

    “కవిత అర్ధం చేసుకోవడానికి కవి అనుభవించిన ప్రదేశం వెళ్ళాలని” జర్మన్ మహా కవి గోథె ఎక్కడో అన్నట్టు గుర్తు.

    కాబట్టి కనీసం మన్సుతో నైనా కవి ప్రదెశాన్ని చూడకుండా విమర్శించడం భావ్యం కాదు.

    –గరికపాటి

  7. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి వర్మ దాట్ల అభిప్రాయం:

    11/07/2008 8:03 pm

    అవును, ఇప్పుడు కావల్సిందల్లా ’ఆసరా’ అవగలిగినతనం మాత్రమే
    కానీ, లోపించింది కుడా అదే అవడంతో…….నే…..

  8. అసమర్థులు గురించి చిలమకూరు విజయమోహన్ అభిప్రాయం:

    11/07/2008 7:23 pm

    ఒక చట్రంలో బిగించిన స్త్రీ మనసులోని భావాలను ఎంత బాగా ఆవిష్కరించారండి.

  9. సువర్ణభూమిలో … గురించి lyla yerneni అభిప్రాయం:

    11/07/2008 4:57 pm

    “కాని కవికి గౌరవం చూపాలి, కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు….

    “సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు,వాటిని చదివి ఆనందించవచ్చు…”

    -mOhana అభిప్రాయం

    కవిత్వంలో పొరలు ఉన్నట్లే, ఈ మాటలలో కూడ ‘ధ్వని’ ఉన్నది. An implied meaning. అది మీరు ఏ మాత్రం ఉద్దేశించి ఉండరు. కాని వేరే చెవులకు అలా వినిపిస్తుంది. అది ఏమిటంటే – చర్చలలో – ప్రశ్న అడిగినప్పుడల్లా, కవితో వ్యతిరేకించినప్పుడల్లా, ఇది మాకు నచ్చలేదు -అని ఒక పాఠకుడు వ్యక్త పరిచినపుడల్లా, మరొక పాఠకుడు వచ్చి -కవిని గౌరవించాలనీ, కవి మనకు తెలియని విషయాలు పరిచయం చేస్తున్నందుకు ఋణపడి ఉండాలనీ – ఇలాటి మాటలు మళ్ళీమళ్ళీ రాయటం.

    ప్రశ్నలు అడిగిన వారికి కవిమీద గౌరవం లేదు – అన్న ధ్వని ఈ మాటలలో వినిపిస్తుంది. అది మంచిది కాదు. చాలా పాత పద్ధతి. సత్వరం మానివెయ్యాల్సిన పద్ధతి. ఈ పద్ధతి ప్రశ్నలు రాసే వాళ్ళను విముఖులను చేస్తుంది. విషయాలు నేర్చుకోటానికీ, తమ అభిప్రాయాలు వ్యక్త పరచటానికీ ప్రతిబంధకమవుతుంది. మనుషులు అందరూ ఒకరినొకరు గౌరవించుకోవలసిన అవసరం ఎప్పుడూ ఉంది. ఆ ఆదరానికి నోచుకోటానికి కవులూ, పండితులే కానక్కర్లేదు. కాబట్టి కవితలని గూర్చిన వాదాల్లో- కవులను గౌరవించాలి అని బోధలు అవసర్ల్లేదు.

    మనకు అర్థం ఐన కవితలను గురించి అభిప్రాయాలు రాసుకుని, అర్థం కాని వాటిని గురించి మౌనంగా ఉంటే, కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటాము? అర్థం కాని వాటిని గురించి ఎందుకు అడగ్గూడదు? చేతనైన వాళ్ళు చెపుతూనే ఉండాలి. చెప్పినందువల్ల ఈ కవిత కొంతైనా అర్థమయిందికదా.ఈ కవి రచనలు మరింత చదివిన కొద్దీ, ఇంకా ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంది.

    ఐనా, కవులు, పాఠకులు, అని వర్గాలు -అన్ని వేళలా లేవే. పండితులూ, కవులూ సర్వ వేళలా గురువులే కారే. వారు శిష్యులు కూడా. ఒకరి ప్రశ్నలూ, అభిప్రాయాలనుంచి ఇంకొకరు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు కాదా.

    కవిని గౌరవించక పోతే కవిత్వం మనుషులకు అర్థం కాదా ఏమిటి? ఈ కవి చెప్పిన ప్రకారం ఒక్క ప్రియురాలి మనసు తప్ప అందరికీ అన్నీ అర్థం అయ్యే అవకాశం ఉన్నట్లే ఉంది మరి.

    లైలా

  10. సువర్ణభూమిలో … గురించి mOhana అభిప్రాయం:

    11/07/2008 3:29 pm

    మొన్న డెట్రాయిట్లో జరిగిన సమావేశంలో (నా సమీక్ష చూడండి) కవితల పైన ఒక సదస్సు ఉండింది. అందులో కవితలో పొరలు పొరలుగా అర్థం ఉండాలి అన్నారు ఒకరు. కాని అలా రాస్తే పాఠకులకు అర్థం అవుతుందా అనే ప్రశ్నకు ఈ చర్చ జవాబు అనుకొంటాను. ఇందులో ఎన్నో పొరలు ఉన్నాయి. ఎవరికి కావలసిన అర్థాలు వారు కల్పించుకోవచ్చు. కొన్ని రచయితకు కూడా తోచిఉండక పోవచ్చు. ఉదాహరణకు బుద్ధుని శిరస్సు, మొండెము. దీనిని చదువగానే నాకు తోచింది ఎప్పుడో చదివిన షెల్లీగారు రాసిన ఓజిమాండియస్ అనే సానెట్. అందులో కూడా విరిగిన ఓజిమాండియస్ శిలావిగ్రహం ఎడారిలో ఉంటుంది.
    My name is Ozymandius, King of Kings,
    Look on my works, ye Mighty, and despair!
    అని అంతమవుతుంది. నిరంకుశుని ఎవరూ తలచుకోరు. ఆ విగ్రహంలోని కళను తప్ప, దాని కారకుడు శిల్పి. బుద్ధుని విగ్రహం విరిగి ఉన్నా, బుద్ధుని ఇప్పుడు కూడా పూజిస్తూనే ఉన్నారు కలువలతో. మనం ఎలా జీవిస్తున్నామో అన్నదే ముఖ్యం అనే ఒక భావన కలుగుతుంది ఈ పంక్తులు చదివిన తరువాత. ఈ ఊహ అందరికీ కలుగకపోవచ్చు. కాని పొరలు పొరలుగా ఉండాలి కవిత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక కవిత మంచిదో కాదో అనే దానికి తూనిక రాళ్ళు ఎలాగ ఉండాలో చెప్పలేము (వేలూరిగారి వ్యాసం చదవండి). కవిత మంచిదైతే కలకాలం నిలుస్తుంది, లేకపోతే తెలుగు సినిమాలా ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కాని కవికి గౌరవం చూపాలి,
    కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు. సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు, వాటిని చదివి ఆనందించవచ్చు. నేను పారిస్ వెళ్లినప్పుడు పోంపెదూ మ్యూసియంకి వెళ్లాను. అది మాడర్న్ ఆర్ట్ పైన. అందులో కొన్ని నాకు ఇంకా అర్థం కాలేదు. కాని ఉత్తమ కళాకారులచే సృష్టించబడినవి అవి. దానిని రసాస్వాదన చేయలేకపోవడం నా తప్పే గాని మ్యూసియం వారిది మాత్రం కాదు. విధేయుడు – మోహన