[ఈ అభిప్రాయం కొద్దిగా రీఫార్మాట్ చేయబడింది. -సం]
శ్రీ గొరుసు జగదీశ్వర రెడ్డి గారికి:
వ్యాసం నచ్చినందుకు సంతోషం. మీ వ్యాసం చదివాను. బాగుంది. అన్నట్టు, మీ వ్యాసం “చల్లగాలిలో యమునాతటిపై” అక్టోబర్ 21 తేదీ, 2007 లో ఆంధ్రజ్యోతిలో, “ఇతరములు” అన్న శీర్షికలో వచ్చింది.
రంగులరాట్నం సినిమాలో “కన్నుల దాగిన అనురాగం” అన్న పాటను గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు. పి. బి. శ్రీనివాస్ , సుశీలచే “పట్‌దీప్” రాగంలో బాణీ కట్టిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి
[ఈ పోస్ట్ ఎడిట్ చేయబడింది – సం.]
Malathi garu Namaskaram – I am Sammeta Umadevi. I saw Thulika now only. There is a need emerged about the translation. Of course there are so many translations from English to other languages but not from Telugu to English. Your trail must be appreciated. You are trying to correct the printing mistakes or other mistakes. It shows your dedication to the work. We all know that only because of the English translation Geethanjali got Noble prize. We can proudly say there are many equivalent works in Telugu. People of this generation must bring out them and elevate them. Any how we must congratulate for your hard work. Once again I wish all the best.
శ్రీ లక్ష్మన్నగారికి నమస్కారాలు.
మీరు సాలూరు రాజేశ్వరరావు మీద రాసిన వ్యాసం ఇప్పుడే చవివాను. అద్భుతం. నేను కూడా 2007 అక్టోబర్ 20 ఆంధ్రజ్యోతి ఆదివారంలో వారిపై నివాళి వ్యాసం రాశాను. అభినందనలతో – గొరుసు
మన భాష ఉనికికే ముప్పు కలిగితే, పాఠశాలల్లో, ప్రజల లావాదేవీలలో తెలుగు వాడకం ఎక్కువ చేస్తే ఫలితం ఉంటుంది కాని, కవులని స్పష్టంగా రాయండర్రో అని మొరెట్టుకున్నా, ఒకవేళ వాళ్ళు దానిని పాటించగలిగినా, ఒరిగేది మాత్రం సున్నా!
సాహిత్యానికీ సమాజ స్థితిగతులకీ పరస్పర సంబంధం ఉంది. కాని కార్యకారణ సంబంధాలు చూపకుండా ప్రతిదానికీ గ్లోబలైజేషన్ పేరెత్తడం వలన సాహిత్య వివేచన పెరగదు.
భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు. ఆధునిక కవిత్వంలో అస్పష్టతని వర్ణించడానికి నారికేళ పాకం అన్న పదమే అనుచితం కావచ్చు. వర్తమాన కాలపు కవిత్వంలో అస్పష్టత స్వభావం ఏమిటి? అది ఎన్ని రకాలు? ఏది అనివార్యం? ఏది అవాంఛనీయం? ఇది రావడానికి అసలు కారణాలు ఏమిటి? అని పాపినేని శివశంకర్ [1] తన సిద్ధాంత గ్రంథంలో కాస్త వివరించాడు. మనమాయనతో ఒప్పుకోనవసరం లేదు కాని చర్చలోకి తీసుకోవాలి.
సామాన్య పాఠకులు తెలుగు PhD థీసిస్ లు చదువుతారా? కవిత్వం ఆస్వాదించడానికి సిద్ధాంత గ్రంథాలు చదవాలా? అంటే అక్కర్లేదు. కాని గ్లోబలైజేషన్ ప్రభావంలో తెలుగు ఉనికికే ఆపద ముంచుకొచ్చిన తరుణంలో నారికేళ పాకం ముసుగులో అస్పష్టతని సమర్థించకూడదన్నప్పుడు – దీంట్లో సాహిత్య ప్రభావం గురించి చాలా గంభీరమైన భావాలున్నాయి కనుక – కాస్తో కూస్తో సిద్ధాంతపరమైన విచారణ చెయ్యాలి. PhD థీసిస్ లు కాకపోతే మరేదో, మనదో మరెవరిదో, కాస్త లోతుగా ఆలోచన చేసిన రచన ఆధారంగా.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “సాహిత్యం – మౌలిక భావనలు,” పాపినేని శివశంకర్, 1996. పేజీలు 139-146.
తంజావూరులో అప్పుడు చాలా మతాలున్నా,ఇతర మతాల ప్రస్తావనెక్కడా త్యాగరాజు తన కీర్తనల్లో తీసుకురాలేదు. ఒకే ఒక్క కీర్తనలో ఒక్క ముస్లిం పదమూ, మరో కీర్తనలో ఇంగ్లీషు పదమూ వాడాడు. ఆ వివరాలు ముందొస్తాయి. మీరు చెప్పిన కొనియాడు కీర్తన చరణంలో ఉన్న మతం పదానికర్థం ఆలోచనా విధానం. అభిమతం. హిందూ, ముస్లిమ్, క్రిష్టియన్ అనబడే మతాలు మాత్రం కాదు. కాస్త మరోసారి ఈ చరణం చూడండి.
ప: కొనియాడే నాయెడ దయ వెలకు
కొనియాడెదవు సుమీ రామ నిను
( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
11/29/2008 7:59 am
[ఈ అభిప్రాయం కొద్దిగా రీఫార్మాట్ చేయబడింది. -సం]
శ్రీ గొరుసు జగదీశ్వర రెడ్డి గారికి:
వ్యాసం నచ్చినందుకు సంతోషం. మీ వ్యాసం చదివాను. బాగుంది. అన్నట్టు, మీ వ్యాసం “చల్లగాలిలో యమునాతటిపై” అక్టోబర్ 21 తేదీ, 2007 లో ఆంధ్రజ్యోతిలో, “ఇతరములు” అన్న శీర్షికలో వచ్చింది.
రంగులరాట్నం సినిమాలో “కన్నుల దాగిన అనురాగం” అన్న పాటను గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు. పి. బి. శ్రీనివాస్ , సుశీలచే “పట్‌దీప్” రాగంలో బాణీ కట్టిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి
ధన్యవాదాలతో,
లక్ష్మన్న.
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి S.Umadevi అభిప్రాయం:
11/29/2008 7:39 am
[ఈ పోస్ట్ ఎడిట్ చేయబడింది – సం.]
Malathi garu Namaskaram – I am Sammeta Umadevi. I saw Thulika now only. There is a need emerged about the translation. Of course there are so many translations from English to other languages but not from Telugu to English. Your trail must be appreciated. You are trying to correct the printing mistakes or other mistakes. It shows your dedication to the work. We all know that only because of the English translation Geethanjali got Noble prize. We can proudly say there are many equivalent works in Telugu. People of this generation must bring out them and elevate them. Any how we must congratulate for your hard work. Once again I wish all the best.
( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి gorusu jagadeeshwar reddy అభిప్రాయం:
11/29/2008 3:17 am
శ్రీ లక్ష్మన్నగారికి నమస్కారాలు.
మీరు సాలూరు రాజేశ్వరరావు మీద రాసిన వ్యాసం ఇప్పుడే చవివాను. అద్భుతం. నేను కూడా 2007 అక్టోబర్ 20 ఆంధ్రజ్యోతి ఆదివారంలో వారిపై నివాళి వ్యాసం రాశాను. అభినందనలతో – గొరుసు
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
11/29/2008 12:13 am
ఆధునిక కవిత్వంలో అస్పష్టత
నాగులపల్లి శ్రీనివాస్ గారికి,
మన భాష ఉనికికే ముప్పు కలిగితే, పాఠశాలల్లో, ప్రజల లావాదేవీలలో తెలుగు వాడకం ఎక్కువ చేస్తే ఫలితం ఉంటుంది కాని, కవులని స్పష్టంగా రాయండర్రో అని మొరెట్టుకున్నా, ఒకవేళ వాళ్ళు దానిని పాటించగలిగినా, ఒరిగేది మాత్రం సున్నా!
సాహిత్యానికీ సమాజ స్థితిగతులకీ పరస్పర సంబంధం ఉంది. కాని కార్యకారణ సంబంధాలు చూపకుండా ప్రతిదానికీ గ్లోబలైజేషన్ పేరెత్తడం వలన సాహిత్య వివేచన పెరగదు.
భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు. ఆధునిక కవిత్వంలో అస్పష్టతని వర్ణించడానికి నారికేళ పాకం అన్న పదమే అనుచితం కావచ్చు. వర్తమాన కాలపు కవిత్వంలో అస్పష్టత స్వభావం ఏమిటి? అది ఎన్ని రకాలు? ఏది అనివార్యం? ఏది అవాంఛనీయం? ఇది రావడానికి అసలు కారణాలు ఏమిటి? అని పాపినేని శివశంకర్ [1] తన సిద్ధాంత గ్రంథంలో కాస్త వివరించాడు. మనమాయనతో ఒప్పుకోనవసరం లేదు కాని చర్చలోకి తీసుకోవాలి.
సామాన్య పాఠకులు తెలుగు PhD థీసిస్ లు చదువుతారా? కవిత్వం ఆస్వాదించడానికి సిద్ధాంత గ్రంథాలు చదవాలా? అంటే అక్కర్లేదు. కాని గ్లోబలైజేషన్ ప్రభావంలో తెలుగు ఉనికికే ఆపద ముంచుకొచ్చిన తరుణంలో నారికేళ పాకం ముసుగులో అస్పష్టతని సమర్థించకూడదన్నప్పుడు – దీంట్లో సాహిత్య ప్రభావం గురించి చాలా గంభీరమైన భావాలున్నాయి కనుక – కాస్తో కూస్తో సిద్ధాంతపరమైన విచారణ చెయ్యాలి. PhD థీసిస్ లు కాకపోతే మరేదో, మనదో మరెవరిదో, కాస్త లోతుగా ఆలోచన చేసిన రచన ఆధారంగా.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “సాహిత్యం – మౌలిక భావనలు,” పాపినేని శివశంకర్, 1996. పేజీలు 139-146.
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Sai Brahmanandam అభిప్రాయం:
11/28/2008 11:24 am
రవి గారూ,
తంజావూరులో అప్పుడు చాలా మతాలున్నా,ఇతర మతాల ప్రస్తావనెక్కడా త్యాగరాజు తన కీర్తనల్లో తీసుకురాలేదు. ఒకే ఒక్క కీర్తనలో ఒక్క ముస్లిం పదమూ, మరో కీర్తనలో ఇంగ్లీషు పదమూ వాడాడు. ఆ వివరాలు ముందొస్తాయి. మీరు చెప్పిన కొనియాడు కీర్తన చరణంలో ఉన్న మతం పదానికర్థం ఆలోచనా విధానం. అభిమతం. హిందూ, ముస్లిమ్, క్రిష్టియన్ అనబడే మతాలు మాత్రం కాదు. కాస్త మరోసారి ఈ చరణం చూడండి.
ప: కొనియాడే నాయెడ దయ వెలకు
కొనియాడెదవు సుమీ రామ నిను
అ. అనయము నీ సొగసును గని పొంగుచు-
నంతరంగముననతి ప్రేమతో నిను ( కొని )
చ. వింత వింత మతములలో చొరబడి
వెత జెందగ లేడను నీ మనసున-
కింత తెలిసి త్యాగరాజ సన్నుత-
యే వేళను నీ శుభ చరితమును ( కొని )
– సాయి బ్రహ్మానందం
అసమర్థులు గురించి subash అభిప్రాయం:
11/28/2008 9:44 am
కథ చాలా బాగుంది. కాస్త పెద్దగా రాస్తే బాగుండేది. ఇలాంటి కథలు ఇంకా రాయాలని కోరుకుంటున్నాం.
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి phani అభిప్రాయం:
11/28/2008 9:05 am
పద్య అర్థాన్ని అన్వయించు కొవడానికి కాకపొయినా తల మీద పడ్డ వాన చినుకులు కను రెప్పల మీద పెదవుల మీద నుంచి మూడు ధారలుగా నాభిని చేర వచ్చు కదా?
సార్ గారండీ… సార్ గారండీ… గురించి bharath అభిప్రాయం:
11/28/2008 2:15 am
బాబాగారూ, మీకవిత చాలా బాగుందండీ. ముఖ్యంగా పైన పేర్కొన్న వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది.
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి ravi అభిప్రాయం:
11/28/2008 1:55 am
చాలా బావుంది. కాని, రక రకలా మతాల గురించి కొన్ని కీర్తన ల్లొ ప్రస్తావిస్తారు. ఉ: “కొనియాడె నాయడ” చరణంలో చూడండి.
కుతంత్రం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
11/27/2008 8:29 pm
బావుంది. కథనం చాలా బావుంది. భాష బ్రహ్మాండంగా ఉంది.
“ఈ గొడ్లు. వీరి కన్నా అతడే నయం.” ఏ మగాడికైనా అంతకు మించిన పొగడ్త ఏముంటుంది? 🙂
“లే నగవు చేతను భావముచేత సిగ్గుచే … కలహము చేత … కందువమాటలచే … వలపింతురు కాంతలు పెక్కుభంగులన్.”
కొడవళ్ళ హనుమంతరావు