పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. జమ్మిబంగారం చెట్టు గురించి మనోజ్ అభిప్రాయం:

    09/16/2009 5:13 am

    ఎంచుకున్న మార్గాలలో నిరంతరంగా సాగిపోవాల్సిందే. జయమైన అపజయమైన కాలం నిర్ణయించాల్సిందే. అది విధయిన కాకపోయిన.

  2. జమ్మిబంగారం చెట్టు గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    09/16/2009 12:33 am

    అపూర్వ గారు,
    మీ సూచన నాకు బాగా అన్పించింది. ఇక్కడ చేర్చడం అనేది సంపాదకుల ఇష్టము. కానీ, నేను ఇంకెక్కడైనా ప్రచురించినప్పుడు ఈ పాదాలను తప్పక చేరుస్తాను.
    ధన్యవాదములు
    జాన్ హైడ్ కనుమూరి

  3. తెలుగు నిఘంటువు గురించి… గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/15/2009 5:12 pm

    Use it or lose it అనేది ఎంత నిజమో నాకు తెలుగు విశ్వవిద్యాలయంవారి మాండలిక వృత్తి పదకోశాలు కొని చదివినప్పుడు అర్థమయింది. సంస్కృతంతో సంబంధం లేనటువంటి అచ్చతెలుగు పదాలు ఎన్ని వేలున్నాయో అవి చూస్తేతప్ప తెలియదు. అయితే నిత్యజీవితంలో మనకు తగలని విషయాల, వస్తువుల గురించిన మాటలు ఎన్ని ఉన్నప్పటికీ మనం వాటిని ఉపయోగించే సందర్భం రాకపోవచ్చు. అయినా వాటిని చూసినప్పుడు కొత్తపదాలు ఎలా తయారుచేసుకోవచ్చో కొంత తెలుస్తుంది.

    ఆత్మగౌరవాన్ని ఒక ఉద్యమంగా చేపట్టిన తమిళులు ఎన్నో పదాలను సంస్కృతంపై ఆధారపడకుండా తయారుచేసుకుని ఉపయోగిస్తున్నారు. మనకు ముఖ్యమంత్రి నియామకం దగ్గర్నుంచి ప్రతి విషయమూ ఉత్తరాదిలోనే నిర్ణయం జరగాలి.

  4. తెలుగు నిఘంటువు గురించి… గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    09/15/2009 2:51 pm

    చాలా మంచి అంశం, అవసరమయ్యే విషయంపై వ్యాసం. చాలా కృతజ్ఞతలు.

    తెలుగు నిఘంటువు అంటే ఒకే రకం font, style లో అచ్చేసిన అక్షరాల కుప్ప అనుకునే నాకు, తూమాటి దొణ్ణప్ప గారు పిల్లలకోసమని చేసిన కృషి బాగా నచ్చింది. పదాలకు సరళమైన అర్థాలేకాక, వీలైనన్ని బొమ్మలు ఇవ్వడం వారి నిఘంటువులో మాత్రమేనేమో తెలియదు. ఇంకా మెరుగైన నిఘంటువులు కావాలి, రావాలి. ఏది బాగుందో తేల్చుకోవడం, పోల్చుకోవడం choice ఉంటేనే! చెట్లు లేని కాడ ఆముదం చెట్టే గొప్ప చందాన దొరికిందే భాగ్యం ఇప్పటి స్థితి.

    ఇంగ్లీషు సామెత “Use it or lose it” అన్నది ఒక్క physical abilities, mental abilities కు మాత్రమే కాదనిపిస్తుంది. పదాలు జనాలు వాడితేనే నిలుస్తాయి. సరిగ్గా వాడడానికి మంచి నిఘంటువుకు మించిన సాయం లేదు. తెలుగు భాషాజ్ఞానం ఎక్కువగా ఉన్న తక్కువమంది తోనే ఇది సాధ్యం. సంస్థలు సంఘాలు, ఎకాడమీలు ప్రోత్సాహం, డబ్బు ఇచ్చినా_ అసలు ఇంకే పని చేసినా ఎక్కువ డబ్బులు, పేరు వచ్చే రోజుల్లో_ ఈ పని నెత్తుకెత్తుకునే తెగువ, స్ఫూర్తి, దానికోసం సుధీర్ఘంగా శ్రమించే శక్తి, పూర్తికాకుండా పంచుకోవడానికి వీలుకాని ప్రాజెక్టు వ్రతం_ అంతా నిస్వార్థ భాషాసేవ అని కూడా అనిపిస్తుంది!
    _____
    విధేయుడు
    _Srinivas

  5. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:

    09/15/2009 11:46 am

    భూషణ్ చేసిన సూచనలు నిజంగా చాలా బాగున్నాయి. వేమూరి గారు ఏకిభవిస్తే, వ్యాసంలో కూడా ఈ మర్పులు చేస్తే, తెలుగు మాధ్యమం లో చదివే విద్యార్ధులకు ఉపయోగకరంగా ఉంటుంది.

    గరికపాటి పవన్ కుమార్

  6. కంచి పట్టు కచేరీ గురించి రాఘవ అభిప్రాయం:

    09/15/2009 8:49 am

    శ్రీమతి పట్టమ్మాళ్ గారి గుఱించి చాలా చక్కగా చెప్పారండీ ఈ వ్యాసంలో. అద్భుతం. అలాగే, ఆవిడ తమ్ముడు శ్రీ జయరామన్ గారి గుఱించి కూడా ఒక పంక్తి వ్రాసి ఉంటే మఱింత బాగుండేది. (ఇందులో కొంత స్వార్థం కూడా ఉందనుకోండి, సంగీతంలో ప్రవీణున్ని కాకపోయినా నేను శ్రీ జయరామన్ గార్కి ప్రశిష్యుణ్ణి!)

  7. పెదవి దాటనివి గురించి రవిచంద్ర అభిప్రాయం:

    09/15/2009 8:11 am

    మౌనమే నీ భాష ఓ మూగ మనసా!
    అనే పాట గుర్తొచ్చింది.

  8. జమ్మిబంగారం చెట్టు గురించి అపూర్వ అభిప్రాయం:

    09/15/2009 12:33 am

    “నిర్వీర్యం చేయడానికి
    విభీషణుడో, దెలీలాయో
    పథకాన్ని రచిస్తుంటారు”

    దీని తర్వాత

    “అమ్మివేయాలని
    ఏ ఇస్కరియోతు యూదాయో
    ముద్దివ్వడానికి సిద్ధంగా వుంటాడు”

    చేరిస్తే బాగుంటుందేమో చూడండి.

  9. యథార్థ చక్రం -6 గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:

    09/14/2009 2:13 pm

    వచించువాడు వక్త. ప్ర అన్న ఉపసర్గ చేరితే వచనం ప్రవచనమవుతుంది. అదే విధంగా వక్త ప్రవక్త అవుతాడు.బ్రహ్మానందం గారు సాధించిన క్రియారూపం (ప్రవక్తించడం)శుద్ధ తప్పు.ప్రవచించడం అని ఉండాలి.

    తప్పుల పరంపర ఇక్కడితే ఆగిపోతే బావుండేది.అంతం కాదిది ఆరంభం. క్షమించరాని తప్పు: థేరవాదాన్ని తెరవాదంగా ఉటంకించడం.ఈ రూపాన్ని వీరెలా సాధించారో నాకు అర్థం కాలేదు.థేర పాళీ పదం; అర్హతుల శ్రేణిలో పెద్ద అన్న అర్థంలో వాడతారు.(థేరి, థేరిక అన్న స్త్రీలింగ రూపాలు కూడా ఉన్నాయి.).నవ భిక్కు, థేర భిక్కు అని భిక్కులమధ్య స్థాయీభేదం సూచించడానికి కూడా వాడతారు.ఆంగ్లంలో Thera అనే రాస్తారు. తెరవాదానికి ఎలా తెర తీశారో నాకు అంతుబట్టలేదు.

    “నేను ఈ సౌందర నందం కథ గురించి చదివేక బౌద్ధం గురించి అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న బౌద్ధాన్ని మహాయాన బౌద్ధంగా పరిగణిస్తారు. ఈ మహాయాన బౌద్ధం బుద్ధుని తరువాత కాలక్రమేణా రూపాంతరం చెందిన బౌద్ధం. అసలు బుద్ధుడు ప్రవక్తించిన బౌద్ధాన్ని తెరవాదం అంటారు. ఆ తెరవాదమే కొంతగా కథలో రాయడం జరిగింది. మధ్యలో హీనయాన బుద్ధిజం అనేది ఒకటి పుట్టుకొచ్చింది. కానీ అది ఎంతో కాలం నిలువ లేదు. ఈ మహాయాన బౌద్ధమే ఇప్పుడు శ్రీలంక, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియాల్లో ఉంది. జపనీయులు కొంతమంది తెరవాదాన్ని, కొంతమంది మహాయానాన్ని పాటిస్తారు. బౌద్ధం గురించి చదువుతుంటే అనేక వాస్తవాలు తెలిసాయి”

    ఈ పేరాలోని వాక్యాలన్నీ పరస్పర విరుద్ధాలే.యథార్థచక్రానికి నిరాఘాటంగా అడ్డుపడేవే.

    1.ప్రస్తుతం ఉన్న బౌద్ధాన్ని మహాయాన బౌద్ధంగా పరిగణిస్తారు.
    ఏ దేశంలో ఉన్న బౌద్ధాన్ని అలా పరిగణిస్తారు ?? శ్రీలంక,బర్మా,థాయిలాండ్,కాంబోడియా,లావోస్ లోని బౌద్ధం మహాయానం కాదే. చైనా,జపాన్,వియత్నాం,కొరియాల్లోని బౌద్ధం మాత్రం మహాయానం.

    2.ఈ మహాయాన బౌద్ధం బుద్ధుని తరువాత కాలక్రమేణా రూపాంతరం చెందిన బౌద్ధం.
    అన్ని యానాలు బుద్ధుని తర్వాతే కదా ??

    3. మధ్యలో హీనయాన బుద్ధిజం అనేది ఒకటి పుట్టుకొచ్చింది

    ముందునుంచి ఉన్న నానా వాదాల చేరికే హీనయానం. మహాయానం వచ్చే వరకు ఎక్కడా హీనయాన ప్రసక్తే లేదు.
    మహాయాన గ్రంథాల్లో ఇతః పూర్వం ఉన్న బౌద్ధాన్ని హీనయానం అన్నారు.చాలా మంది పండితులు థేరవాదాన్ని అందులోకి చేరుస్తారు;కారణం మహాయాన సూత్రాలను ఇతర
    పూర్వ బౌద్ధాల్లాగే థేరవాదం కూడా అంగీకరించదు కాబట్టి. ఒకప్పుడు ఐతే మహాయానం లేకపోతే హీనయానం.

    శ్రీలంక తదితర దేశాల్లోని పూర్వ బౌద్ధులు తమ్ము తాము థేరవాదులుగా పిలుచుకుంటారు.హీనయానమన్న పదాన్నే విసర్జించారు;కారణం దాన్ని సృష్టించింది మహాయానులు
    అంతే గాక అలా పిలవటం తమని కించపరచడంగా భావిస్తారు థేరవాదులు.

    4.ఈ మహాయాన బౌద్ధమే ఇప్పుడు శ్రీలంక, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియాల్లో ఉంది
    ఏ మహాయాన బౌద్ధం శ్రీలంక, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియాల్లో ఉన్నది?? అక్కడ శుద్ధంగా విరాజిల్లుతున్నది థేరవాదమైతేను.

    5 .జపనీయులు కొంతమంది తెరవాదాన్ని, కొంతమంది మహాయానాన్ని పాటిస్తారు.
    అధిక సంఖ్యాకులు పాటించేది మహాయాన లక్షణాభేదమైన జెన్ బౌద్ధం. థేరవాదుల సంఖ్య అత్యల్పం.కాబట్టి కొంతమంది అంటే కుదరదు.

    6.బౌద్ధం గురించి చదువుతుంటే అనేక వాస్తవాలు తెలిసాయి
    బుద్ధం శరణం గచ్చామి.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  10. వ్యాసానుబంధం (గుర్రం జాషువా పాపాయి పద్యాలు) గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/14/2009 9:46 am

    రాఘవగారూ,
    సంగీతరావుగారు కర్నాటక సంగీతవిద్వాంసుడు. నేను నేర్చుకున్నది హిందూస్తానీ. అంచేత నేనెప్పుడూ కోమల్‌, తీవ్ర అనే పద్ధతిలో వివరిస్తాను. కీబోర్డు అలవాటున్నవారికి కూడా ఇదే సులువైన పద్ధతి. గందరగోళం కలిగితే క్షమించండి.