పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. తడిస్తే కదా తెలిసేది! గురించి hareesh అభిప్రాయం:

    04/03/2010 10:13 am

    Gana Garu, ( I am unable to type in Telugu, though I love to write in Telugu. Please bear with me).

    On a second reading, I found the “bhavam” in the above verse to be very appealing and anubhooti jallulo tadisinattu feelingni kaliginchindi and hence succeeded in accomplishing the objective of writing poetry. However, my frustration is about many free verses that being published in various Telugu Magazines and passed off as Modern Poetry without there being any essence nor appeal. I think Gurajada too wrote in a particular system, i.e.,Matra Chandassu and Sri Sri popularised free verses. But, the free verses of Sri Sri are so appealing and also pathbreaking. Therefore, in my opinion, there is no bar in writing in free verses as long as they are appealing, but you will agree that most of the free verses are below average. I hope I made myself clear.

    Hareesh

  2. తడిస్తే కదా తెలిసేది! గురించి gana అభిప్రాయం:

    04/03/2010 12:35 am

    హరీష్ గారు,

    గురజాడ గారు ప్రసాదించిన వచన కవిత్వ వరాన్ని వదులుకోమంటారా? అనుభూతి రూపాంతరం చెంది కవిత్వం కావడమే ముఖ్యమని నా ఉద్దెశ్యం. వార్తలు, వ్యాసాలు మరియు కధల తో పోలిక లేకుండా పంచే స్వేచ్చా మాధుర్యపు వచన కవిత్వానికి మళ్ళీ గోడలా?

    దయచేసి ఆలోచించండి.

  3. అసమర్ధుని జీవయాత్రే! గురించి gaddeswarup అభిప్రాయం:

    04/03/2010 12:19 am

    When I read the book in the early fifties, I thought that it was about me and it scared me. Luckily I got interested in mathematics and moved away from that background. Recently I tried to read it again. It is still painful, I could not go on.

  4. రెండు అమెరికన్ రుతాలు గురించి naMdivADa udaya BAskar అభిప్రాయం:

    04/02/2010 10:19 am

    హెచ్చార్కె కవిత అద్భుతంగా ఉంది.

    “భూమికి అటువేపు
    నాకోసం చూసి చూసి
    రాలి ఎండిన కొండ రేగుపళ్ళు
    జేబుకింద
    కదుల్తూ ఒక పద్యం”

    పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడు చెట్టు తొర్ర్ల్లల్లో చిప్‌మన్‌కులు, లాన్ మీద మొలిచిన డాండెలియన్‌లు, మేపుల్ చెట్టుకొమ్మల్లో పక్షులు జరుపుతున్న చర్చాగోష్టులు తన కవి హృదయమ్మీద చేస్తున్న దాడిని తట్టుకుని తన చిన్ననాటి రేగుచెట్టు నీడకి సురక్షితంగా చేరుకుంటానని తనకి తాను భరోసా ఇవ్వడం నిజంగా అభిమన్యుడు వినని కధే.

    Hats off హెచ్చార్కే!

    ఇది నిజమైన diasporic కవిత. Keep it coming!

    ఉదయ్

  5. తడిస్తే కదా తెలిసేది! గురించి hareesh అభిప్రాయం:

    04/02/2010 5:12 am

    ఇది కవిత్వం అంటే నేనొప్పుకోను. నా ఉద్దేశం ప్రకారం కందంలో రాశేవాడే కవి. అంటే వచనం ఎప్పుడూ కవిత్వం కాదు, భావం ఎంత బాగున్నా. This is not to discourage the above poet(?), but I would like people to recognize the need to develop writing in proper chandassu. I hope “Eemaata” would train people who are interested in developing the skill of writing chando badda kavitvam.

  6. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    03/29/2010 3:06 am

    కామేశ్వరి గారూ,

    మీరు చెప్పింది చదివాక వేలూరి గారి వ్యాసం మీరు సరిగా చదవలేదన్న అభిప్రాయం కలిగింది. ఒకవేళ చదివినా పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించడం లేదు. వంగూరి ఫౌండేషన్ వారు ఈ బృహత్కార్యం తలపెట్టారని తెలిసి సంతోషించే కథలూ, వారి సొంత ప్రవరలూ పంపారని ( నాతో సహా ) అనుకుంటున్నాను. అది ప్రోత్సాహం కాక మరేవిటి? ఈ పుస్తకం అచ్చువేయడ వెనుక కష్టం అందరికీ తెలుసు. పడ్డ కష్టం కాస్త చిత్తశుద్ధితో చేసుంటే బావుండేదన్నదే అందరి బాధాను.
    “తెలుగు సాహిత్యంలో విమర్శ లేదు. రావడ లేదు” అన్నది తరచు వింటూ ఉంటాం. తీరా ఎవరైనా బాగోగులు చర్చిస్తే, ఆ చర్చించే వారిమీద విసుర్లూ, విరుచుకు పడడాలూ కూడా చూస్తూనే వున్నాం.
    పొగడ్తల దండలే మాక్కావాలి. తెగడ్తలు మాచెవులకు చేరవనే వారున్నంత వరకూ విమర్శ రాదు. పది తరాలకి పనికొచ్చే గ్రంధాలు పేజీలని బట్టీ, సైజుని బట్టీ నిర్ణయిస్తారా? లేక నాణ్యతని బట్టి విలువిస్తారా? అన్నంలో రాళ్ళూ, పుస్తకాల్లో అచ్చుతప్పులూ ఓ పట్టాన మింగుడు పడవు. రుచి మాట దేవుడెరుగు, అవి అరాయించుకునే శక్తి నాలాంటి అర్భకులకి లేదు. వుండదు కూడా.
    విమర్శకీ, దుయ్యబట్టడానికి తేడా వుంది. వండిన పదార్థం రుచి చూస్తూ చెప్పడం విమర్శ, తినకుండా, చూస్తూనే చీ,- దరిద్రంగా వండారనడం దుయ్యబట్టడం. రెంటికీ భేదం వుంది. గమనించగలరు.

  7. పాఠకులకు సూచనలు గురించి Dr. I.A.P.S. MURTHY అభిప్రాయం:

    03/28/2010 1:20 am

    సంపాదకులకు నమస్కారం!
    ఈ వెబ్ సైట్ నాకు నిన్ననే పరిచయం అయ్యింది. చాలా చాలా నచ్చేసింది. పది సంవత్సరాల సంచికలను చదవాలంటే సమయం పడుతుంది.
    ఈ లోగా ఒక మనవి. మీరు ఎంతో చక్కని సంగీత సాహిత్య సంపదను మాకందిస్తున్నారు. అందులో భాగంగా అష్టావధానాలలో వచ్చే సమస్యా పూరణలూ దత్త పదులూ లాంటివి కూడా చేరిస్తే బాగుంటుంది.
    – ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.
    (మహారాష్ట్ర లో చిప్లూన్ అనే చిన్న పట్టణం నుంచి)

  8. ఛందోధర్మము గురించి Lakshmi Prasad Geddapu అభిప్రాయం:

    03/27/2010 2:04 pm

    రెండేళ్ళు పట్టింది. ఒక విషయాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించిన మిత్రుల మనస్సుల్లోని మూలాలను అవగతం చేస్కోవడానికి. ఒక రోజులో అలవోకగా అభిప్రాయాలను చెప్పేయగల్గడం చాలా మందికి అలవాటయినట్లుగా నాకలవాటుకాకపోవడం నా బలహీనత. దానికి నన్ను క్షమించండి.

  9. బడి పిల్లల అయోమయం గురించి JR.Nagabhusanam అభిప్రాయం:

    03/27/2010 7:06 am

    నామిని కథల మీద విమర్శ చాలా బాగుంది. చిన్న పిల్లల కోసం రాసే కథల్లో కూడా లాజిక్కు వుండడమూ, మూఢనమ్మకాలూ లేకపోవడమూ వుంటే ఎంతో బావుంటుంది.
    నాకు తెలిసినంతవరకూ ఈ విమర్శకి నామినిగారు జవాబిచ్చినట్టు లేదు. నామినిగారికి తన మీద వొచ్చిన ఏ విమర్శలకీ – జెయుబివిగారి విమర్శలనించీ, కొన్నిరోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వొచ్చిన రంగనాయకమ్మగారి విమర్శవరకూ దేనికీ జవాబు చెప్పుకునే అలవాటే లేనట్టుంది. ఏ రచయితైనా తన మీద వొచ్చే విమర్శకి జవాబు చెప్పుకునే కనీస బాధ్యత వుండాలనేది నా అభిప్రాయం. – భూషణ్

  10. తెలగాణెము గురించి e.bhaskaranaidu అభిప్రాయం:

    03/26/2010 10:12 am

    చాల బాగున్నదండి. ఇటువంటివీ ఇంకా చాల రాయాలని కోరుతున్నాము.