పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Kameswara Rao అభిప్రాయం:

    05/07/2010 5:59 am

    “పాడిందే పాడరా…” అన్న శీర్షిక వ్యాసానికే కాకుండా కామెంట్లకి కూడా సరిపోయింది! 🙂 చాలావరకూ అందరూ ఒక్క “పీర్ రివ్యూ” విషయం మీదనే ఎందుకంతగా మల్లగుల్లాలు పడుతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి ఇంటర్నెట్లో ఒకటిరెండు ఇతర తెలుగు పత్రికలు కూడా ఈ పీర్ రివ్యూ పద్ధతిని పాటిస్తున్నాయి. ఇది ఈమాటకే ప్రత్యేకమైన విషయం కాదు.
    ఆలోచించాల్సిన ముఖ్యవిషయాలు మరికొన్ని కూడా ఉన్నాయ్‌. నాకు తోచినవి కొన్ని ఇక్కడ వివరిస్తాను. కిందనంచి మొదలుపెడతాను. వేలూరిగారు చెప్పిన కథ తమాషాగానే ఉన్నా, దానిబట్టి నాకర్థమైనదేమిటంటే, కొత్తదనమంటే వారి దృష్టిలో వాంతి మందులాంటిదని! నిజంగా వారికిలాంటి దృష్టి ఉండకపోవచ్చు. కాని ఆ కథని, దాన్ని చెప్పిన సందర్భాన్ని బట్టి నాకదే అనిపించింది. నాకే కాదు చాలామందికి అలా అనిపించే అవకాశం ఉందని నా బలమైన అనుమానం. ఇందులో సంపాదకుల నిరంకుశ ధోరణి తొంగిచూస్తోంది.
    ఈమాటకి కొత్త రచయితలు కొరవడడానికి ఈ ధోరణి ముఖ్యకారణమని నేననుకుంటున్నాను. దీనికి సహేతుకమైన కారణాలు నేనిక్కడ వివరించలేను. దీనికి ఈ వ్యాసంలోనే మరో ఉదాహరణ, “బొబ్బర్లంకనుంచి ప్రచురించబడుతున్న పత్రికలా ఉన్నదికాని,” అన్న వ్యాఖ్యపై స్పందన. ఈ వ్యాఖ్య ఆంతర్యమేమిటో నాకు స్పష్టంకాలేదు. సంపాదకులకి కూడా లేకపోతే అది చేసిన సదరు వ్యక్తిని అడిగి తెలుసుకుంటే బాగుండేది. అంతేకాని గోదవరి జిల్లాల్లోని వేదపండితుల ప్రసక్తి తెచ్చి వారి ఆదరణగురించి చెప్పడంలో సంపాదకుల ఆంతర్యమేమిటో అసలే బోధపడలేదు. నేనా వ్యాఖ్యని అర్థం చేసుకున్నది పత్రికలో “సమకాలీనత” కొరవడిందని. పత్రికలోని కంటెంట్‌ విషయంలో ఇది నిజమనే నాకూ అనిపిస్తోంది. గత రెండు మూడేళ్ళగా ఈమాటలో వచ్చిన వ్యాసాల్లో ఎంత శాతం ప్రస్తుత తెలుగు సాహిత్యానికి (పోనీ 1980 తర్వాత వచ్చినది) సంబంధించినవి ఉన్నాయో లెక్కకడితే ఈ విషయం స్పష్టమవుతుంది. దీనికి ఏమిటి కారణం? ఈమాట పాఠకులకి సమకాలీన సాహిత్యం మీద అంతగా ఆసక్తి లేకపోవడమా? ఆ సాహిత్యమ్మీద రాయగలిగే రచయితలు ఈమాటకి రచనలు చేయకపోవడమా? ఈ విషయంపై సంపాదకులు దృష్టి పెడితే బాగుంటుంది. నాకు తోచిన మరికొన్ని విషయాలు:

    1. గ్రంధాలయం, శబ్దతరంగాలు ఈమాటకే ప్రత్యేకమైన అంశాలు. వీటిని ఇలాగే కొనసాగించాలి. ఈమాటలో వచ్చే వ్యాసాలలో సాహిత్యంతో పాటు సైన్సు, సంగీతం మొదలైన విషయాలపై కూడా ఉంటున్నాయి. ఇదికూడా తప్పకుండా కొనసాగించాల్సిన అంశమే.
    2. సమకాలీన భారతీయ/విదేశ సాహిత్యాన్ని పరిచయం చేసే వ్యాసాలు, అనువాదాలు రెగ్యులర్ ఫీచర్‌గా ఉంటే బాగుంటుంది.
    3. ఒకటే పత్రిక ఉన్నప్పుడు దాని పరిధి చాలా విసతృతంగా ఉండవచ్చు. కాని ఇప్పుడు ఇంటర్నెట్లో అనేక పత్రికలు వచ్చాయి. ఒకో పత్రికపైనా ఒకో రకమైన రచయిత/పాఠకులు మొగ్గుచూపుతారు . కాబట్టి, ఈమాట ఆశయాలని మరొకసారి సమీక్షించుకొని, ఎలాంటి అంశాలకి ఫోకస్ ఇవ్వాలి, ఎలాంటి పాఠకులకోసం పత్రిక నడపాలి అన్న విషయం పునర్నిర్వచించుకుంటే మంచిదేమో.
    4. పాపులర్ పత్రికగా కాక తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక అంశాలలో ఒక ఉత్తమ స్థాయి పత్రికగా నడపడం ఆశయమైతే, ఇందులో తెలుగు విశ్వవిద్యాలయమూ, ఇతర విశ్వవిద్యాలయాలలో తెలుగుశాఖల వారితో ఈమాట వర్గం ఏమైనా ఇంటరేక్టవ్వగలిసి, ఆదానప్రదానాలు(వారు ఈమాటలో రచనలు చెయ్యడం, వారూ వారి విద్యార్థులు ఈమాట పాఠకులవ్వడం వంటివి) జరిగితే చాలా బాగుంటుంది.
    5. మంచి రచనలని, రచయితలని ప్రోత్సహించడానికి, ఏడాదికొకసారి, ఆ ఏడు ఈమాటలో ప్రచురించిన కవిత, కథ, వ్యాసాలలో ఒకో ఉత్తమమైనదాన్ని ఎంచి బహుమతులు ప్రకటిస్తే బాగుంటుంది. బహుమతి మంచి పుస్తకాల రూపంలో ఉంటే మరీ బాగుంటుంది! దీని ఖర్చు ఈమాట అభిమానులు తప్పక భరించవచ్చు. ఇచ్చే బహుమతి ముఖ్యం కాదు, ఈమాట బహుమతి గెలవడం ఒక గౌరవంగా చెప్పుకొనే స్థాయి దానికి ఉంటే బాగుంటుంది.
    6. ఈమాటలో రచనలపై కామెంట్లు, రచయితలకి ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయో నాకు చాలా అనుమానం. వాటివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోదేమో అని నాకనిపించిన విషయం. ఎలాగో చర్చా వేదికలున్నాయి కాబట్టి, ఇలాంటి విషయాలు ఏమైనా చర్చించ వలసినవి ఉంటే వాటిలో చర్చించ వచ్చు. పాఠకులకి ఏమైనా తీర్చుకోవలసిన సందేహాలు కాని, అవసరమైన సమాచారం కాని కావలసినా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా వ్యాసంపై ప్రత్యేకమైన చర్చ అవసరమనుకున్నా (రచయిత కాని సంపాదకులు కాని) చర్చావేదికనే ఉపయోగించుకోవచ్చు. అంచేత కామెంట్ల సౌకర్యం తీసి వేస్తే బాగుంటుందని నా (చివరి) సలహా.

  2. ఈమాట మే 2010 వసంత ఋతు సంచికకు స్వాగతం గురించి Dr Tatiraju Venugopal అభిప్రాయం:

    05/07/2010 5:45 am

    మే నెల లో వసంతమా? వికృతి ప్రభావమా? ప్రస్తుత మే లో సగం అధిక వైశాఖం, సగం నిజ వైశాఖం ఉన్నాయి. వాన కారుకై ఎదురు చూపులే అంతటా. అయితే మా మహా నగరం లో ఇప్పుడిప్పుడే కోయిల, అదీ మిట్ట మధ్యాహ్న వేళ తెగ కూస్తోంది. ‘కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో?’ అని పింగళి వారన్నట్టు ఆశ్చర్య పోతూ ఆనందించాల్సిందే.
    -తాతిరాజు వేణుగోపాల్

  3. మధ్య వ్యవధిలో నీడలు గురించి Chandra అభిప్రాయం:

    05/06/2010 11:39 pm

    నవీన్ గారూ,
    మీరు నిజంగానే ఎదురు చూస్తున్నారేమోనని –
    ఏమయిందో నాకూ తెలియదు. అయినా మీకు సుఖాంతాలే ఇష్టమని తోస్తుంది కనక ఈ కింది రెండింట్లో ఒకటి ఎన్నుకోవచ్చు.
    1. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుని, వేరెవరినో మళ్ళీ పెళ్ళి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు.
    2. ఎలాగో రాజీ పడి, తమ కాపురాన్ని చక్కదిద్దుకున్నారు.
    ఇది కల్పితమే. కాకపోతే కొంతయినా ఎప్పుడో ఎక్కడో నిజం అయీ ఉండొచ్చు.

  4. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    05/06/2010 4:28 pm

    పీరు రివ్యూలగురించి ఇంతగా చర్చిండం కాబట్టి “ఈ మాట”మిత్రులకొక ప్రశ్న, సహృదయంతోనే. పీర్‌ రివ్యూలను ఎవరు రివ్యూ చేస్తారు?రచనలకు రివ్యూలు లాగా,పీర్‌ రివ్యూలకు feedback పేరుతో అవి ఆ రచయితలకు ఏ విధంగా ఉపకరించాయో లేదో, పేరుతో కాని పేరుచెప్పకుండానైనా అభిప్రాయ సేకరణ, పూర్తిగా కాకపోతే periodical or random గానైనా సేకరిస్తే ఆ పద్దతిలో ఉన్న లోపాలు తెలుసుకోవడానికి మార్చుకోవడానికి సాయపడుతుంది.సాయపడేవి గుర్తించి పెంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాక, దీనితో అపోహలుంటే దిద్దుకోవడానికి అవకాశం కూడా కలుగుతుంది.

    ఏదేమైనా, నిస్వార్థంతో సమయాన్ని శ్రమను కొంత ఖర్చునూ భాషా సేవ కోసం అందిస్తున్నఅందరికీ కృతజ్ఞతలు. అవకాశం,సందర్భం వచ్చింది కాబట్టి, సంపాదక బాధ్యతను,సాంకేతిక బరువునూ ఎంతగానో మోసిన వేలూరి, కొలిచాల గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
    ______
    విధేయుడు
    _Srinivas

  5. కవితావిర్భావం గురించి Phani Dokka అభిప్రాయం:

    05/06/2010 10:34 am

    వైదేహి గారూ,

    చాలా కాలం తరవాత చూస్తున్నాను ఈమాట. మీ కవిత చక్కగా ఉంది. ” తనని తాను ఆవిష్కరించుకునే ఓ అద్భుత క్షణం కోసం వేచిఉండడం ” అన్న మాటలో ఎంతో నిజం ఉంది. కథావిర్భావానికి కూడా ఇంతే.

    నెలరోజులుగా ఒక కథ రాయాలని ప్రయత్నం. మనసులో ఎన్నో సార్లు రాసి చెరిపేసుకున్నాను. ఎంతో సహనంతో వేచి చూడగా చూడగా, నిన్న రాత్రి అనుకోకుండా కథ పూర్తయింది. టైము చూస్తే తెల్లవారుఝామున నాలుగు!!

    చక్కని కవిత రాసినందుకు అభినందనలతో,
    డొక్కా ఫణి.

  6. భవబంధాల సాక్షిగా… గురించి bhavani అభిప్రాయం:

    05/06/2010 4:48 am

    డిప్రెషన్ కి మూలాన్ని చర్చించకపోవడం కధలో లోపమనే ఉద్దేశ్యం తో నేనా మాట అనలేదు. కధ నాకు నచ్చింది. ఒకో సారి చర్చించదలుచుకున్న సమస్య కు పరిష్కారం చూపలేకపోతామన్న న్యూనతతో కధ రాయడమే మానుకున్న నాలాంటి కలం పట్టని రచయితలకు పాఠం లాంటిది ఈ కధ.

  7. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి jagadeeshwar reddy అభిప్రాయం:

    05/06/2010 2:56 am

    రమేష్‌ నాయుడుగారిపై పరుచూరి శ్రీనివాస్‌గారి వ్యాసం బాగుంది. చాలామందికి నాయుడిగారి నేపథ్యం తెలియదు. ఇప్పుడు కొంత మేర తెలుసుకునే అవకాశం కల్పించిన శ్రీనివాస్‌గార్కి కృతజ్ఞతలు. నాయుడిగారి సంగీతాన్ని ఇష్టపడని ‘నిజమైన’ శ్రోత అంటూ ఉంటాడా!? ఏ సంగీత దర్శకుడి బాణీ ఆ సంగీత దర్శకుడిదే అయినా నాయుడిగారిలోని శ్రావ్యత నేనే సంగీత దర్శకుడిలోనూ వినలేదు. ముఖ్యంగా ఆయన రావుబాలసర్వతిదేవిగారితో పాడించిన లలిత గీతాల మాధుర్యం చెప్పనలవికానంత. పిచ్చెక్కించే రణగొణ ధ్వనుల్లోంచి ఇంటికొచ్చాక గదిలో ఒంటరిగా – కళ్లుమూసుకుని ఆయన ‘జోరుమీదున్నావు తుమ్మెదా’, ‘చందమామా రావే’ … లాంటి పాట ఒక్కటి వింటే చాలు… మనసు ప్రశాంతంగా మారిపోతుంది.
    (వి.ఎ.కె. రంగారావుగారు విజయచిత్రలో రాసిన రమేష్‌నాయుడిగారిపైని నివాళి నా కలక్షన్లలో ఉంది)
    – గొరుసు

  8. మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి కామేశ్వర రావు అభిప్రాయం:

    05/06/2010 2:41 am

    మళ్ళీ ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు ఈమాటలో మీ కవిత 🙂 చాలా బాగుంది. అవును, జ్ఞాపకాల మిణుగురులకి వెలుగు తప్ప వేడిమెక్కడిది!

  9. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    05/05/2010 10:49 pm

    ఇంగ్లీషులో పీర్ రెవ్యూ పద్ధతి అనుసరించే పత్రికలు రచయితలకి పారితోషికాలు అందిస్తాయి అన్న మాట కేవలం ఊహా జనితం.

    ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంతో సహా అనేక రంగాలలో ఇంగ్లీషులో పీర్ రెవ్యూ పద్ధతి పాటించే ప్రచురణల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇందులో రచయితలకి పారితోషికం చెల్లించే వాటి సంఖ్య నూటికి ఒకటో రెండో ఉన్నా ఆశ్చర్య పోవలసిందే. వీటిలో జీతాల మీద పనిచేసే వారి సంఖ్య కూడా అతి తక్కువగా ఉంటుంది. ఈ పత్రికల సర్క్యులేషన్ కూడా ఏమంత పెద్దగా ఉండదు. వ్యాపార ప్రకటనలూ చాలా తక్కువగా ఉంటాయి. అవసరమైన కొద్దిపాటి ఆర్ధిక వనరులు ఏదో ట్రస్టు ద్వారానో, యూనివర్సిటీ ద్వారానో సమకూర్చుకుంటారు. సంపాదకులూ, రచయితలూ, రెవ్యూయర్సూ అందరూ కూడా చాలా మట్టుకు స్వచ్ఛందంగానే ఎటువంటి పారితోషికమూ లేకుండానే పని చేస్తారు. పని చేసె వారందరూ అది చేయటం సాహిత్యంతో సహా తమ తమ రంగాల పట్ల తమ కున్న ఒక బాధ్యతగా భావిస్తారు. ఆయా రంగాలలో ప్రభావ శాలులుగా పనిచేయగలగటం, దాని వలన వచ్చే గుర్తింపు ఇవే పెద్ద పారితోషికాలు. ప్రోత్సాహకంగా ఇవ్వగలిగితే ఒకటో రెండో పత్రిక సంచికలు, లేదా కొత్త పుస్తకాలో జ్ఞాపికలుగా ఇస్తారు. ఇదేదో విదేశీ వ్యవహారంగా అనుకోనవసరం లేదు. అట్లాంటి పత్రికలు భారత దేశంలోనూ చాలా ఉన్నాయి. ఈ పత్రికలకీ కొద్దిగా ఆర్ధిక వనరులు సమకూరితే, సంపాదకుల శ్రమ తగ్గించటానికి ఒక సహాయకులని పెట్టుకోవటానికో, కొత్తగా రంగంలోకి వస్తున్న వాళ్ళని ప్రోత్సహించడానికో చిన్న స్కాలర్ షిప్ లు ఇవ్వటానికో, ఏవో చిన్న చిన్న సౌకర్యాలు కల్పించుకోవటానికో వాడుతారు.

    ఇంగ్లీషులో సృజనాత్మక రచనలు చేసే వారికి కూడా పెద్ద మొత్తాలలో పారితోషికాలు అందటం కూడా ఎక్కడా లేదు. ఉపాధ్యాయులుగానో, ఎకౌంటెంట్లుగానో , లాయర్లుగానో, హోటల్ సర్వర్లుగానో , పత్రికాఫీసుల్లో ఏవో ఉద్యోగాలలోనో ఎట్లాగో అట్లా జీవితాలు నెట్టుకొస్తూనే రచనలు చేస్తారు. అప్పుడూ అప్పుడూ వచ్చే అవార్డుల ద్వారానో, సినిమాలకో మరో మీడియాకో , నాటక ప్రదర్శనకో , పత్రికలలో కాలంలు రాసో కొద్ది పాటి డబ్బులు సంపాదించుకుంటారు. అమెరికాలోనైనా , లండన్ లో నైనా , మద్రాసులోనైనా హైదరాబాదులోనైనా … ఎక్కడైనా దాదాపుగా ఇదే పరిస్థితి. సృజనాత్మకమైన పనులు చేసే వారిని సమాజం ఇంతకన్నా గౌరవంగా చూసుకో గలగాలి అన్న దాంట్లో సందెహించాల్సినదేమీ లేదు కానీ , పారితోషికాలుంటే రచనలు చేసే వారి సంఖ్య పెరుగుతుందని కానీ, నాణ్యత పెరుగుతుందని ఎట్లా చెప్పగలమో నాకు తెలియటం లేదు. (ఆనంద బజారు పత్రిక గౌరవించదగిన కొద్దిమంది రచయితలకి సంవత్సరం పొడుగునా గౌరవ వేతనాలు ఇస్తుంది. దానికి బదులుగా సంవత్సరానికొకటో రెండో రచనలు తమకిమ్మని అడుగుతుంది అని విన్నాను. అలాంటి పని తెలుగులో పద్ధతిగా కాక పోయినా అప్పుడప్పుడు కొన్ని పత్రికలు చేశాయని నమ్మ వచ్చును.)

    ఇదెలా ఉన్నా, ‘ఈ మాట’ గిఫ్టు సబ్‌స్క్రిప్షన్లు ఇవ్వ లేదు, అచ్చులో పత్రిక కాపీలు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి, రచన ప్రచురించబడిన తరువాత, రచయితలకి, రెవ్యూయర్స్ కి తెలుగులో నో ఇంగ్లీషులోనో ఒక పుస్తకమో, సీడీనో జ్ఞాపిక గా పంపితే కొంత లాయల్టీ బలపడుతుందేమో చూడవచ్చును. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. అవసరమైతే ఆ డబ్బు ఎట్లా సమకూర్చుకోవచ్చునో ఆలోచించ వచ్చును. కానీ ఎటువంటి జ్ఞాపికలు ఇస్తే బాగుంటుంది అన్నది ఆలోచించడం దగ్గరినించి వాటిని పోస్టు చేసే వరకు — శ్రమ మాత్రం పెరుగుతుంది. సంపాదక వర్గం పైన ఈ భారాన్ని కూడా మోపకుండా ఈ మాట తరఫున మరొకరెవరైనా ఈ పని చేయగలుగుతారేమో ఆలోచించవచ్చును.

    ఇటువంటి విషయాలలో ‘ఈ మాట’ సంపాదకులు ఇంగ్లీషులో చూడదగిన రెండు మోడల్స్ కి లింకులు క్రింద ఇస్తున్నాను
    http://www.katha.org/
    http://www.littlemag.com/security/index.html

  10. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి మోహన రావు అభిప్రాయం:

    05/05/2010 9:32 pm

    అమ్మగారు, అయ్యగారూ, పీర్ రెవ్యూ గురించి రెండు అభిప్రాయాలు అనవసరమని నేను భావిస్తున్నాను. నోబెల్ విజేత రాసినా, అతని పత్రం కూడా పీర్ రెవ్యూకు బద్ధమైనదే. నేచర్‌ వంటి శాస్త్రీయ పత్రికలు ఎవరి పత్రాలను అలాగే వేసికోవు. రచయితలు ఎంత గొప్పవారైనా సమీక్షకు తలవంచవల్సిందే. ఒక్కొక్క వేళలో సంపాదకులు మంచి వ్యాసాలను ఇక్కడ అక్కడ చిన్న మార్పులు చేసి పఠనీయతా సౌలభ్యాన్ని ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నా అనుభవంలో ఇది జరిగింది. మరో విషయం. జ్వాలాముఖికి, ఉగ్రమూర్తికి పడదనుకోండి. అప్పుడు జ్వాలాముఖి తన రచనలను సమీక్షకై ఉగ్రమూర్తికి పంపవద్దని సంపాదకులకు మనవి చేసికోవచ్చును.

    ముఖ్యమైన మరో విషయంపై అభిప్రాయాలను సౌమ్యగారు తప్ప మరెవరూ చెప్పలేదు. పాఠకులకు ఎలాటి రచనలు నచ్చుతాయో అన్నదే ఆ విషయం. కొన్ని వ్యాసాలను అతి శ్రమతో ఎంతో పరిశీలన చేసి రాస్తారు. అలాటి సాహిత్య, సంగీత, విజ్ఞాన రచనలు పాఠకులకు నచ్చినవా లేవా అనే విషయం అందరూ చెప్పాలి. అలాగే ఇంకా ఎలాటి కొత్త రచనలు వారిని ఆకర్షిస్తుందో అనే సంగతిని నిర్మొహమాటంగా చెప్పాలి.

    బహుశా పాఠకులకు కూడా తమ పాత్రను పోషించడానికై పదప్రహేళికల వంటి కొన్ని అంశాలను ప్రవేశ పెట్టవచ్చు. అదే విధంగా సమస్యాపూరణలను ప్రవేశ పెట్టవచ్చు. ఇలాటివి ప్రవేశ పెడితే పాఠకులు చదవడం మాత్రం కాక పాల్గొనేదానికి కూడా అవకాశం ఉంది.

    విధేయుడు – మోహన