మహాప్రస్థాన మరోప్రస్థానాలు భూమ్యాకాశాల సరిహద్దులనుకుంటే, మధ్యనున్న విశాలాకాశంలో మెరుస్తున్న గోళాలు శ్రీశ్రీ సాధించిన కవితా విజయాలు.

శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చేసిన ప్రసంగపు వీడియో ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం

ఇది ఏదో ఒక పతివ్రతా స్త్రీ తన భర్తను గూర్చి పలికే చిలక పలుకుల్లా అనిపించడం లేదు. అతడు కేవలం మానవుడే? అని నిజంగా ఆశ్చర్యపోతున్నది.

నరకం, భూమి. స్వర్గం అనే మూడుకాలాలలో ఆలాపన శ్రీశ్రీ రచన చరమరాత్రి – ఈరాత్రి నా ఆత్మహత్యా మహోత్సవం. ఇది ఆహ్వాన పత్రిక కాదు..

శ్రీశ్రీ భావనలో మరణాన్ని జయించటమన్నది మనిషి సామర్థ్యం మీద ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. మనిషిపై ఈ నమ్మకం మానవుడా! వంటి ఇతర కవితల్లో కూడా వ్యక్తమౌతుంది.

శ్రీశ్రీ కవిత్వం మీద ఇప్పటికి బండ్లకొద్దీ వ్యాసాలు వచ్చాయనడం అతిశయోక్తి కాదు. మరయితే, మరోవ్యాసం ఎందుకూ అన్న ప్రశ్నకి సంపత్ గారి వ్యాస పరంగా సమాధానం చెప్పడం తేలికే!

తీరాలు దాటి దూరాలు చేరిన
సంబరాల్లో
నడిపించిన చేయి విడిచిపోయి

శ్రీశ్రీ చతుర్మాత్రలలో జ-గణాన్ని ఉపయోగించడం మాత్రమే కాక వాటిని మొదట కూడా పెట్టాడు. ఇది శ్రీశ్రీ ఒక ప్రత్యేకమైన సాధన. అన్ని పాదాలు ఎదురు నడకతో ప్రారంభమయితే ఒక గమనము, ఉరుకు వస్తుంది.

అప్పుడు నేను గుర్తించని ఒక విశేష విషయం ఏమిటంటే, ఆనాటి షష్టిపూర్తిలో అన్ని వేలమంది జనం మధ్య వేదిక మీద శ్రీశ్రీ ఒంటరిగా కూర్చున్నాడు. అప్పటి ఉద్వేగపూరిత వివాదాత్మక సంఘటనల మధ్య శ్రీశ్రీ నిజంగా లేడు.

శ్రీశ్రీ అనువాదాలు చదివితే ముందుగా కొట్టొచ్చినట్టు కనిపించేది వాటిలోని వైవిధ్యం – ప్రతీకాత్మకత, అధివాస్తవికత, విప్లవం – ఇలా అనేక కవిత్వ ధోరణులు ఈ అనువాదాలలో కనిపిస్తాయి.

ఈ మాటనే నేను బలంగా నమ్ముతున్నాను. మేధస్సు కాల్పనిక సాహిత్యానికి అడ్డు అని, అనవసరంగా సృజనలో తలదూర్చి పానకంలో పుడకలాగ బాధిస్తుందనీ నాకు అనిపిస్తుంది.

తప్పటడుగులు వేసే తెలుగింటి పిల్లవాడు ఈ రచనలో మన కళ్ళముందు ఎంతో ముద్దుగా సాక్షాత్కరిస్తాడు. చదువుకోడానికే ఎంతో అద్భుతంగా, తెలుగుదనం ఉట్టిపడే ఈ రచనకు శంకరాభరణంలో స్వరరచన జరిగింది.

శ్రీశ్రీ మాటల్లో “వచనగీతం అంటే చేతికి వచ్చిన వ్రాత కాదు. వ్యర్థ పదాలు లేకుండా వచనం రాయటం మరీ కష్టం. వచనగీతానికి ప్రాణప్రదమైన లక్షణం గమన వైవిధ్యం.”

ప్రపంచస్థాయికి ఎదిగి, తెలుగునేల మీద నిలకడగా నిటారుగా నిలబడ్డవాడు శ్రీశ్రీ. అందుకే కాబోలు ఆయన కవిత్వం అనువాదం కాకపోయినా తెలుగు రాని వాళ్ళని కూడా ఆకట్టుకుంది.