మార్నింగ్ వాక్‌లో ఎదురు వచ్చేవాళ్ళకు విషెస్ చెప్పేటప్పుడు అందరిలాగానే అతను కూడా కళ్ళల్లోకి చూస్తాడు గానీ అతనితో కొన్ని రోజులుగా ఆ అలవాటు కొనసాగుతూండడం గూర్చి ఆమె కొద్దిగా సంకోచించి తల దించుకున్న రోజే ఎదురుగా వచ్చిన అతని మాటలు తనని దాటిన తరువాతే చెవిని చేరాయని గ్రహించి తల తిప్పి చూసేసరికి అతను వేగంగా పరుగెత్తుతూ కనిపించాడు. “పోటీలకి తయారయే వయసు మించిపోలేదా?” అనుకుని ఆశ్చర్యపోయింది.
తాడికొండ కె. శివకుమార శర్మ
- పూర్తిపేరు
- తాడికొండ కె. శివకుమార శర్మ
- సొంత ఊరు
- గుంటూరు
- ప్రస్తుత నివాసం
- గ్రేటర్ వాషింగ్టన్ డి.సి.
- వృత్తి
- మెకానికల్ ఇంజనీర్
జీవిత విశేషాలు
తాడికొండ కె. శివకుమార శర్మ సుప్రసిద్ధ రచయిత, నవలాకారుడు. వీరు రాసిన “పగులు” అనే నవల 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఆటా (ATA) నవలల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఈమాటతో సహా అనేక ప్రముఖ తెలుగు సాహిత్య పత్రికలలో ఆయన ఎన్నో కథలు, వ్యాసాలు, మరియు సమీక్షలు రాశారు. వీటిలో “తెలిసీ పలికిన విలువేమో!”, “అజ్ఞాతం” వంటివి కొన్ని ప్రధాన రచనలు. వీరి ప్రతిభకు గుర్తింపుగా వంగూరి ఫౌండేషన్ (ఉగాది ఉత్తమ రచనల పోటీ) వంటి సంస్థలనుండి ప్రశంసా పత్రాలు అందుకున్నారు.