“అవునొరేయ్. బొత్తాల్లో ఉన్న సుకవే సుకం రా. జుప్పు అటిటు ఆడకుండా ఆగిపోయిందనుకో. బాచేయటానికి కాజా గాడింకో ఇరవయ్యో పాతికో దొబ్బుతాడు. రాంబారికో యాభై ఎకరం గొబ్బిరితోటుంది కాబట్టి, ఆళ్ళ మాంగారు ఇంకో యాభై పల్లంకొట్టి పిల్లనిచ్చేరు. నీకూ నాకూ ఏం వుంది? తాడుంటే బొంగరవుండదు. బొంగరవుంటే తాడుండదు.” జిప్ ప్యాంట్ కుట్టించడం విరమించుకున్నాడు సత్తిగాడు.
చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు
- సొంత ఊరు
- కాకినాడ
జీవిత విశేషాలు
మంచి కథానిక లక్షణాలు క్షుణ్ణంగా తెలిసిన బహు చతురుడు చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టి వేంకటపతి రాజు. కథానికల ముగింపులో వీరి నేర్పు ప్రశంసనీయం.