రాత్రంతా ఒక్క కునుకైనా తీస్తే ఒట్టు. టెన్షన్… టెన్షన్. ఎప్పుడూ లేనంత ఉద్వేగం. యామిని నించి ఏ క్షణాన ఏ కబురొస్తుందో అని భయం. గుండె దడ. ఏదో జరగరానిదే జరిగుంటుందని మనసు పదే పదే సూచిస్తోంది. లేకపోతే ఇంటికెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పినా, చేయలేదంటే అర్ధం? రాత్రంతా అది కూడా నాలానే మానసిక క్షోభననుభవించి వుంటుంది. కోపంతో శ్రీధర్ అన్నయ్య యామిని మీద చేయి చేసుకోలేదు కదా?
ఆర్. దమయంతి
- పూర్తిపేరు
- ఆర్. దమయంతి
- సొంత ఊరు
- బందరు
- ప్రస్తుత నివాసం
- బెంగుళూరు
జీవిత విశేషాలు
ఎం.ఏ సోషియాలజీ చదువుకున్న ఆర్. దమయంతి జర్నలిస్ట్ గా పని చేసారు. ఇప్పటి దాకా 25 కవితలు, 50 కి పైగా కథలు రాశారు. ప్రస్తుతం ఒక సీరియల్ రాస్తున్నారు. “చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువగా ఇష్టపడేది మాత్రం మొదటిదే. సాహిత్య విలువల్ని ప్రేమిస్తాను. సంస్కారవంతుల్ని గౌరవిస్తాను,” అంటున్నారు ఈ రచయిత్రి.