నిడదవోలు మాలతి
జీవిత విశేషాలు
నిడదవోలు మాలతి ప్రముఖ రచయిత్రి, కథకురాలు, సాహిత్య విమర్శకురాలు, తెలుగు ఉపాధ్యాయులు. పంథొమ్మిదివందల యాభైల్లో కథలు వ్రాయడం మొదలు పెట్టి ఇప్పడు తన స్వంత వెబ్ పత్రికలు తెలుగు, ఇంగ్లిష్ తూలికలు నిర్వహిస్తూ, దాదాపు వంద తెలుగు కథల్ని ఇంగ్లిష్ లోకి అనువదించి, ఇంగ్లిష్ లో మూడు అనువాద కథా సంకలనాలు. The Spectrum of My People ( జైకో బుక్స్) “From My Front Porch” (సాహిత్య అకాడెమీ ప్రచురణ) All I Wanted Was to Read and Other Stories (e-Book) వెలువరించారు.