పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16391

  1. ఒక వేసవి గురించి విహారి. అభిప్రాయం:

    10/05/2006 12:16 pm

    చాలా చక్కగా చెప్పారు. దీన్ని చదువుతుంటే నా అయిదేళ్ళ కొడుకే గుర్తుకు వస్తున్నాడు. సెంటిమెంట్లెలా ఉంటాయో కళ్ళకి కట్టినట్లుంది.

    కాకపోతే చివర్లో జామ చెట్టుకున్నది పాచి అనడం బాగోలేదు. దాన్ని చిగురుగానే ఉంచేసింటే బావుండేదేమో?
    చెప్పే అంతటి వాడిని కాను కానీ…

    విహారి.

  2. వానలో ఓ జాణ గురించి Sowmya అభిప్రాయం:

    10/04/2006 7:46 pm

    బానే ఉంది కథ. కథనం ఆసక్తికరంగా ఉన్నందుకు అనుకుంటా చివరి దాకా చదివించింది.

  3. రైలు ప్రయాణం లో గురించి Chimata Rajendra prasad అభిప్రాయం:

    10/03/2006 11:41 am

    ఇది ఒక చక్కని వీడియో క్లిప్పింగ్

  4. మొలతాడు గురించి paaThakuDu అభిప్రాయం:

    09/29/2006 7:10 am

    వెతుక్కోండి మీకు కావలిసిన అందాలు అర్థాలు అవే దొరుకుతాయి. మీరు సరిగ్గా వెతికితే మీకు మొలతాడే కాదు, సిగ్గు బిళ్ళలూ కనిపిస్తాయి. అంతా చూసే కళ్ళ మీద అధారపడి ఉంటుంది.
    – ఈ కవిత మీద ఇంత చర్చ అనవసరం.

  5. మొలతాడు గురించి Chilakapati Srinivas అభిప్రాయం:

    09/28/2006 7:58 am

    కథ అర్థమయింది కానీ, పాఠకమిత్రుల వ్యాఖ్యలు అయోమయంలో పడేస్తున్నాయి. దీనికీ నేటికాలపు కవిత్వానికీ, లేదా బుష్ కీ లంకె ఎక్కడుందో ఎంత వెతికినా కనపడలేదు.
    ప్రియురాలి మీద ప్రేమతో ఈత రాకున్నా దూకి ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడి చావులో satire ఏమిటో బొత్తిగా తెలియటం లేదు. అది జాలి గొలపవలసిన విషయమో, అతని ప్రేమకు అబ్బురపడవలసిన సందర్భమో గానీ, అందులో ఎగతాళి స్ఫురిస్తే ఆ లోపం పాఠకుడిదో లేదా రచయితదో అయి ఉండాలి.
    లేదావీరిలో ఎవరయినా ఈ మతలబు ఏమిటో నా బోటి మామూలు పాఠకులకు వివరించి పుణ్యం కట్టుకోవాలి.

  6. ఒక వేసవి గురించి chavakiran అభిప్రాయం:

    09/25/2006 4:53 am

    ఎంత బాగుందో! అర్థం అయినది అనను – అయినా అర్థం కావాలంటే బాగుండాలా?

  7. మొలతాడు గురించి Raghothama Rao C అభిప్రాయం:

    09/24/2006 11:14 pm

    మంచి satire. నెటి తెలుగు సాహిత్యం తీరు కవితలో తేలుతున్న మొలతాడు చందమే మరి.

  8. అతివాదాలు – అర్థసత్యాలు గురించి Vaidehi sasidhar అభిప్రాయం:

    09/22/2006 7:21 am

    Ismail గారి చక్కని వ్యాసాలు, ఇంటర్వ్యూలు ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఏ కవినైనా పూర్తిగా అవగాహన చేసుకొనటానికి కేవలం వారి కవిత్వం సరిపోదు.ఇటువంటి వ్యాసాల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే కవిత్వాన్ని గూర్చిన వైయుక్తిక అభిప్రాయాలు, కవిత్వానికి కవులు ఇచ్చే philosophical extensions వెల్లడి చేసే అవకాశం లభిస్తుంది.ప్రముఖకవులు, రచయితల ఇంటర్వ్యూలు మరెన్నో “ఈమాట” ప్రచురించాలని కోరుకుంటున్నాను.

  9. మీరు కవిత్వం ఎందుకు రాస్తారు? గురించి narasimha moortyh అభిప్రాయం:

    09/22/2006 1:55 am

    నమస్కారాలు.
    కరుణ ముఖ్యం పుస్తకం లోని ఇస్మాయిల్ గారి తో ముఖాముఖి చక్కగా, ఆలోచనాత్మకంగా వుంది. కవి తన మనసు లోని భావాలను నిర్మలంగా తెలిపిన తీరు హర్షణీయం.
    _ వి. చిరంజీవి నటరాజా
    nani_424@yahoo.com

  10. ఒక వేసవి గురించి raju అభిప్రాయం:

    09/21/2006 5:18 am

    చంద్ర గారి ‘శైలి” చాలా బాగుంది. ఆయితే, నాకు పై కథలోని symbolism , message అర్థం కాలేదు. విజ్ఞులు సెలవీయగలరు.