పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16391

  1. చంద్రుణ్ణి చూపించే వేలు గురించి Sowmya అభిప్రాయం:

    09/21/2006 12:49 am

    బాగుంది. చాలా విషయాలు చెప్పింది. హైకు ని పరిచయం చేసినందుకు కృతఙతలు. ఇంకా చాలా ఆలోచించాలి ఇంతకన్నా ఎక్కువ రాసే ముందర నేను.

  2. రైలు ప్రయాణం లో గురించి swathi అభిప్రాయం:

    09/19/2006 3:00 am

    పొరుగూర్లో చదువులు, రైలు ప్రయాణాలు, విషాదానందాలు, మళ్ళీ గుర్తు చేశారు.

  3. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/16/2006 1:01 pm

    “పనికిమాలిన” లెక్కల ప్రాధాన్యత

    తెలుగులో శాస్త్రీయ విషయాల్ని ఇంత తేలిగ్గా తెలియపరిచిన వేమురి వ్యాసం చాలా బావుంది. “పెద్దవాళ్ళు పుస్తకాలు రాస్తారు, యువకులు సిద్ధాంతాలని రుజువు చేస్తారు,” అన్న సూత్రాన్ని భార్గవ మరోసారి రుజువు చేశారు.

    ఇలాంటి లెక్కల సొగసుల్ని చూడాలన్నా,
    “Not all the water in the rough rude sea
    Can wash the balm off from an anointed king;”
    కన్నా
    “After life’s fitful fever he sleeps well; ”
    ఎందుకు గొప్ప కవిత్వమో తెలుసుకోవాలన్నా, తప్పక చదవాల్సిన పుస్తకం, రామానుజన్ ని కనుగొన్న Hardy రాసిన “A Mathematician’s Apology.” అచ్చుప్రతిలో ఉన్న C. P. Snow రాసిన ముందుమాట గూడా చదవదగ్గది.

    కొడవళ్ళ హనుమంతరావు

  4. రైలు ప్రయాణం లో గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    09/15/2006 10:24 am

    లైలా గారూ,
    మీలాంటి ప్రముఖ రచయిత్రి కి నా రచనలు నచ్చటం చాలా సంతోషం.
    ధన్యవాదాలు.
    నా కవిత కంటె అందమైన వర్ణచిత్రాన్ని ఎంపిక చేసిన క్రెడిటంతా కొలిచాల సురేశ్ గారిది. Thanks to him.

  5. రైలు ప్రయాణం లో గురించి Lyla Yerneni అభిప్రాయం:

    09/14/2006 4:11 pm

    మీ రచన నాకెంతో నచ్చింది వైదేహీ! కావాలని మళ్ళీ “ఈమాట” కు వచ్చి చదువుకున్నాను . గుల్మొహారు కవిత కూడా ఎంత చక్కగా వ్రాశారు! కవిత పైని వర్ణ చిత్రం మీరు చిత్రించిందేనా? అదీ బాగుంది. ఆ బొమ్మ చూసి ఆ రంగులు ఇంకా రెటీనా మీద ఉండగానే కవిత చదువుకోగలగటం నాకెంతో ఆనందం కలిగించింది. ధన్యవాదాలు.

  6. పక్షులు గురించి Devarapalli Hari Prasad అభిప్రాయం:

    09/13/2006 7:07 pm

    విన్నకోట రవిశంకర్ గారికి,
    There is duality in nature. It is rare that a person usually gets both the perspective. Seeing other side of the coin is very important for a balanced life. When the Birds flew you could admire the beauty when they sped away, and could also felt that the unity of the group is disturbed.

    I always enjoyed your observation and presentation styles.

    Thanks
    Hari

  7. ఈమాట కొత్త వేషం గురించి దిలీపు మిరియాల అభిప్రాయం:

    09/13/2006 12:24 pm

    ఇది వరకు గ్రంధాలయం లో పుస్తకాలకు లింకు వుండేది . అది ఇప్పుడు కనిపించడం లేదు. దాన్ని మళ్ళీ వుంచితే బాగుంతుంది.

  8. రచయితలకు సూచనలు గురించి Deepak అభిప్రాయం:

    09/12/2006 8:07 am

    ఇవ్వాలే ఈ నైటు చూసాను.. ఫస్ట్ యునికోడ్ తెలుగు నైటు.. తెలుగు వ్రాయటం కొంచం కష్టం అయినా వ్రాయగలిగాను. ముచ్చట వేసింది.. కీప్ అప్ ది గుడ్ వర్క్‌

    వుంటాను
    దీపక్

  9. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    09/11/2006 8:07 pm

    రచయితలకి నమస్కారం.

    మీరు రాద్దామనుకున్న విషయం బాగానే ఉంది. కాని , విషయాలు చెప్పిన విధానంలో స్పష్టత లోపించినట్టనిపించింది. కొన్ని చోట్ల, “చెప్పేసారు” కాని వివరించలేదు. మీ భాషలో చెప్పాలంటే, చెప్పే విషయాలమధ్య బాగా జాగా వదిలేసారు. అలాంటి వాటిలో కొన్నిటిని మాత్రమే ప్రస్తావిస్తాను.

    1. మీ రచనలో 3వ పేరా:
    అ) ఈ పేరాలో చెప్పినవి కేవలం తెలుగువాళ్ళకేనా, లేక భారతీయులందరికీ వర్తిస్తాయా?
    ఆ) చెప్పిన విషయాలకు ఆధారాల్ని జోడించక పోవడం వల్ల, కేవలం అభిప్రాయాల్లా ఉన్నాయి.
    ఇ) వందల ఏళ్ళుగా భారతదేశంలోని ప్రజలు వేరు వేరు రాజ్యాల్లో ఉన్నా అందరిదీ ఒకే ధర్మమని ఎందుకు అనుకున్నారు? మనలో అసంగతంగా ఏదో ఒక సంఘటిత భావం లేకపోతే, అందరం కలసి ఉండాలని 1947లో ఎందుకు నిర్ణయించుకున్నాము. వేరు కాపురం పెట్టిన వాళ్ళని చూసికూడా, మనం ఎందుకలా స్పందించలేదు?
    ఈ) మనకు గొప్ప చరిత్ర ఉందని మనకు తెలియదా? అశ్వఘోషుడు, కల్హణుడు, బాణుడు మొదలైన వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు చెప్పేవరకూ మనకు తెలియరా? మనం చరిత్ర అని నమ్మిన పురాణేతిహాసాల మాటేమిటి? ఇవన్నీ భావాలు కావా? ఆ భావాల్లో నిజమెంత అన్నది వేరే వాదన. మనకి మిగిలిన కళలు, కావ్యాలు, శిల్పాలు మొదలైనవి ఏ భావం లేకుండానే వెలిసాయా?/పోషింపబడ్డాయా?

    2. “ఈ ఊహల ఆధారంగా మనకి ప్రాచీన కాలం నుంచీ జాతీయతా భావం ఉంది అని వాదించడం పొరపాటు”
    అ) బ్రిటిష్ వాళ్ళు మనకి చెప్పిన మన చరిత్ర, మన సంస్కృతులకు గూడ, ఆధారాలు కొంతవరకూ “ఈ ఊహలే”. వాళ్ళు చరిత్రకోసం కొన్ని ఆధారాల్ని తవ్వితీసినా, సంస్కృతికి సంబంధించి కొత్తగా చెప్పిందేమిటి? అప్పటికి, ప్రచారసాధనాలు మెరుగవడం వల్ల వాళ్ళకి అందిందాన్ని ఎక్కువమందికి తెలిపారు.

    ఆ) భావకవిత్వం తెచ్చిన కొత్త ఊహలతో నిర్మించిన భారత జాతీయతని మనం నమ్మవలసివస్తే, మీ 4 వ పేరాలో లాంటి పాత ఊహల్తో పుట్టిన ఒక జాతీయత పూర్వం ఉండేది అని ఎందుకు నమ్మకూడదు?

    ఇ) మన పెళ్ళిళ్ళలో బ్రాహ్మలు అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజాల దగ్గరే ఆగిపోయారెందుకు? పారశీక, మ్లేచ్ఛ, యవన దేశాల్లో అమ్మాయిల్ని ఎందుకు వెతకలేదు. సంస్కృతో, మరేదో అడ్డు వచ్చాయనేనా?

    3) “రాజుల్నీ, రాజభావాన్నీ వదిలించుకున్నాకగాని మనకు జాతీయభావం ఏర్పడలేదు [1]” మీరనుకునే జాతీయభావమేదో నిర్వచించండి. [1] అని వదిలేస్తే అర్ధం అవటల్లేదు.

    ఆఖరిగా, తెలుగునాట, చదువు వచ్చినవాళ్ళెంతమంది? అందులో, కవిత్వం చదివే వాళ్ళెందరు? వాళ్ళలో ప్రభావితులయే వాళ్ళెందరు?

    ఇతరులనుండి గ్రహించిన విషయాల్ని సంగ్రహంగానైనా స్పష్టపరిచి, మరికాస్త లోతైన పరిశోధన చేసి రాస్తే బాగుండేది.

    భాస్కర్ కొంపెల్ల

  10. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Kiran Kumar Chava అభిప్రాయం:

    09/10/2006 9:24 pm

    మంచి వ్యాసం

    నాక్కూడా మరళా పలకా బలపం పట్టుకోని ఈ రుజువులూ, సూత్రాలూ అర్థం చేసుకోవాలనిపిస్తుంది

    తెలుగులో ఇలా ఆధునిక వ్యాసాలు వస్తే మస్త్ ఉత్సాహంగా ఉంటుందనుకుంట