సినిమాపాటలు వింటున్నపుడు -అరె, ఈ పాటలోని ఈ భాగం ఆ పాటను పోలివుందే. ఈ రెటికీ ఆధారం ఏ రాగమో కనుక్కుందాం – అని ఇంటర్నెట్లో వెదకడం వరకే నా సంగీతఙ్ఞానం పరిమితం. నేను పుట్టిపెరిగిన పరిస్థితులు నాకీమాత్రం అభిరుచి కలిగించినందుకు నేనదృష్టవంతుణ్ణే. ఆమీదట మరికొంత తెలుసుకోవాలనే నా కుతూహలానికి రోహిణీప్రసాద్ గారి ఈ వ్యాసంతో ఒక దిశ ఏర్పడింది. వ్యాసం రాసి వూరుకోక ప్రతి అభిప్రాయానికీ తగురీతిన స్పందించడం ఆయనపట్ల గౌరవాన్నిపెంచింది. పాండిత్యాన్ని పక్కనపెట్టి, ప్రాథమికాంశాల్ని చిన్నపిల్లలకు అర్థమయేలా Scientificగా చెప్పగలగడం చాలా గొప్పసంగతి. ధన్యోస్మి. నా తొలి గురుదేవునికి కృతఙ్ఞతాభివందనాలు.
బసంత్ అనే హిందూస్తానీ రాగం పంతువరాళిని పోలినది. దీనిని ఏ మాత్రమూ పోలని బహార్ రాగం కాస్త (కర్ణాటక) కానడలాగా అనిపిస్తుంది. ఈ రెండు పోలికలూ ఉజ్జాయింపువే. ఇవి రెండూ వసంత రుతువుకు సంబంధించినవి కనక రెంటిలోనూ వచ్చే శుద్ధమధ్యమం ఆధారంగా రెంటినీ కలిపి పాడుతూ ఉంటారు. విడిగా రెండూ గొప్ప రాగాలైనప్పటికీ బసంత్ బహార్ అనేది మటుకు అంత ముఖ్యమైనది కాదు. ఇంతకీ ఈ మిశ్రమ రాగం హాయిహాయిగా పాటలో వాడబడనేలేదు.
హాయిహాయిగా పాటలోని రాగాలు ఇవి.
పల్లవి సోహనీ (దీన్ని పోలినది హంసానంది. ఇందులో వేదం అణువణువున అనే పాట ఉన్నమాట నిజమే).
ఏమో తటిల్ల.. అనే చరణం బహార్ రాగం. బసంత్ బహార్ కాదు.
మూడోది చూడుమా..అనేది జౌన్ పురీ.
నాలుగోది యమన్ (కల్యాణి). ఆదినారాయణరావుగారికి హిందూస్తానీ సంగీతమంటే ఎక్కువ ఇష్టమనడానికి ఈ రాగమాలిక గీతం ఒక ఉదాహరణ.
కుమార్ గారు చెప్పింది కొంతవరకు నిజం. “హాయిహాయిగా ఆమనిసాగే” పాట రాగమాలిక! నాలుగు చరణాలున్న ఈ పాట హంసానంది రాగం (హిందూస్థానీలో సోహిని) తో మొదలయి, రెండో చరణంలో (ఎమో తటిల్లతికమేమెరుపు) జోన్ పూరి రాగానికి మారి, మూడో చరణంలో కుమార్ గారు అన్నట్టు (చూడుమా చందమామ) బసంత్ బహార్ రాగానికి మారి, చివరి చరణం (కనుగవా తనియదా ప్రియతమ) యమన్ రాగం (కర్ణాటక సంగీతంలో కల్యాణి) తో పూర్తి అవుతుంది.
కుమార్ గారు హంసానంది రాగానికి ఇచ్చిన ఉదాహరణ “వేదం అణువణువున నాదం” సరైనదే!
I just wanted to point out that “Hayi Hayi ga Aamani sage” is not in Raga Hamsanandi but in Raga Basant Bahar. You can listen to a Tillana composed by Maharajapuram Santhanam in this Raga. Alarmelvalli dances excellently to it.
Basant bahar has a chhaya of Darbari Kanada which you can hear in the lines ” Chooduma Chandamama” of that song.
Coming to Hamsanandi, the song Vedam anuvanuvuna nadam is in Raga Hamsanandi..
హల్లొ అండీ!
సాహితీ లోకానికి మీరు చేస్తున్న కృషి కి ఒక సలామ్! మీ కలానికి ఒక సలామాలేకుం! మీ వ్యాసాలు, శీర్షికలు అదుర్స్ ! కొత్త పాఠకుడిని, నా అభినందనలు!
శ్రీధర్
కథ లో స్పష్టత లోపించింది అనిపించిందండి నాకు.
ఐతే ఈ కథ చదవడం ఓ మంచి అనుభూతి.
Toystory సినిమా లో ఓ చిన్న సన్నివేశం ఉంటుంది. ఓ పాప కి ఓ బొమ్మ తో ఉన్న అనుబంధం గురించి. అది గుర్తు వచ్చింది నాకు. చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర చనువెక్కువ నాకు. కానీ నేను కాలేజీ వయసుకు వచ్చాక ఇప్పుడు అప్పటిలా నేను అమ్మమ్మ వెంట తిరగడం లేదు. మా అమ్మమ్మ ఒకటి రెండు సార్లు ఈ కథలో అమ్మమ్మ లాగే ఎలా మరిచిపోయిందో చూడు అండం నాకు తెలుసు. అది గుర్తు వచ్చింది. 🙂
సంగీతంతో కుస్తీ గురించి రానారె అభిప్రాయం:
10/19/2006 2:41 pm
సినిమాపాటలు వింటున్నపుడు -అరె, ఈ పాటలోని ఈ భాగం ఆ పాటను పోలివుందే. ఈ రెటికీ ఆధారం ఏ రాగమో కనుక్కుందాం – అని ఇంటర్నెట్లో వెదకడం వరకే నా సంగీతఙ్ఞానం పరిమితం. నేను పుట్టిపెరిగిన పరిస్థితులు నాకీమాత్రం అభిరుచి కలిగించినందుకు నేనదృష్టవంతుణ్ణే. ఆమీదట మరికొంత తెలుసుకోవాలనే నా కుతూహలానికి రోహిణీప్రసాద్ గారి ఈ వ్యాసంతో ఒక దిశ ఏర్పడింది. వ్యాసం రాసి వూరుకోక ప్రతి అభిప్రాయానికీ తగురీతిన స్పందించడం ఆయనపట్ల గౌరవాన్నిపెంచింది. పాండిత్యాన్ని పక్కనపెట్టి, ప్రాథమికాంశాల్ని చిన్నపిల్లలకు అర్థమయేలా Scientificగా చెప్పగలగడం చాలా గొప్పసంగతి. ధన్యోస్మి. నా తొలి గురుదేవునికి కృతఙ్ఞతాభివందనాలు.
సంగీతంతో కుస్తీ గురించి Rohiniprasad అభిప్రాయం:
10/19/2006 9:58 am
బసంత్ అనే హిందూస్తానీ రాగం పంతువరాళిని పోలినది. దీనిని ఏ మాత్రమూ పోలని బహార్ రాగం కాస్త (కర్ణాటక) కానడలాగా అనిపిస్తుంది. ఈ రెండు పోలికలూ ఉజ్జాయింపువే. ఇవి రెండూ వసంత రుతువుకు సంబంధించినవి కనక రెంటిలోనూ వచ్చే శుద్ధమధ్యమం ఆధారంగా రెంటినీ కలిపి పాడుతూ ఉంటారు. విడిగా రెండూ గొప్ప రాగాలైనప్పటికీ బసంత్ బహార్ అనేది మటుకు అంత ముఖ్యమైనది కాదు. ఇంతకీ ఈ మిశ్రమ రాగం హాయిహాయిగా పాటలో వాడబడనేలేదు.
సంగీతంతో కుస్తీ గురించి Rohiniprasad అభిప్రాయం:
10/18/2006 9:36 am
కుమార్ గారి రాగాల పేర్లు కొన్ని తప్పు.
హాయిహాయిగా పాటలోని రాగాలు ఇవి.
పల్లవి సోహనీ (దీన్ని పోలినది హంసానంది. ఇందులో వేదం అణువణువున అనే పాట ఉన్నమాట నిజమే).
ఏమో తటిల్ల.. అనే చరణం బహార్ రాగం. బసంత్ బహార్ కాదు.
మూడోది చూడుమా..అనేది జౌన్ పురీ.
నాలుగోది యమన్ (కల్యాణి). ఆదినారాయణరావుగారికి హిందూస్తానీ సంగీతమంటే ఎక్కువ ఇష్టమనడానికి ఈ రాగమాలిక గీతం ఒక ఉదాహరణ.
సంగీతంతో కుస్తీ గురించి Lakshmanna Vishnubhotla అభిప్రాయం:
10/18/2006 7:18 am
కుమార్ గారు చెప్పింది కొంతవరకు నిజం. “హాయిహాయిగా ఆమనిసాగే” పాట రాగమాలిక! నాలుగు చరణాలున్న ఈ పాట హంసానంది రాగం (హిందూస్థానీలో సోహిని) తో మొదలయి, రెండో చరణంలో (ఎమో తటిల్లతికమేమెరుపు) జోన్ పూరి రాగానికి మారి, మూడో చరణంలో కుమార్ గారు అన్నట్టు (చూడుమా చందమామ) బసంత్ బహార్ రాగానికి మారి, చివరి చరణం (కనుగవా తనియదా ప్రియతమ) యమన్ రాగం (కర్ణాటక సంగీతంలో కల్యాణి) తో పూర్తి అవుతుంది.
కుమార్ గారు హంసానంది రాగానికి ఇచ్చిన ఉదాహరణ “వేదం అణువణువున నాదం” సరైనదే!
విష్ణుభొట్ల లక్ష్మన్న
Lark_Vishnubhotla@yahoo.com
సంగీతంతో కుస్తీ గురించి Kumar అభిప్రాయం:
10/17/2006 9:38 am
I just wanted to point out that “Hayi Hayi ga Aamani sage” is not in Raga Hamsanandi but in Raga Basant Bahar. You can listen to a Tillana composed by Maharajapuram Santhanam in this Raga. Alarmelvalli dances excellently to it.
Basant bahar has a chhaya of Darbari Kanada which you can hear in the lines ” Chooduma Chandamama” of that song.
Coming to Hamsanandi, the song Vedam anuvanuvuna nadam is in Raga Hamsanandi..
ఈమాట గురించి గురించి Sridhar Chirravuri అభిప్రాయం:
10/16/2006 11:20 am
హల్లొ అండీ!
సాహితీ లోకానికి మీరు చేస్తున్న కృషి కి ఒక సలామ్! మీ కలానికి ఒక సలామాలేకుం! మీ వ్యాసాలు, శీర్షికలు అదుర్స్ ! కొత్త పాఠకుడిని, నా అభినందనలు!
శ్రీధర్
ఒక వేసవి గురించి Sowmya అభిప్రాయం:
10/14/2006 9:07 pm
కథ లో స్పష్టత లోపించింది అనిపించిందండి నాకు.
ఐతే ఈ కథ చదవడం ఓ మంచి అనుభూతి.
Toystory సినిమా లో ఓ చిన్న సన్నివేశం ఉంటుంది. ఓ పాప కి ఓ బొమ్మ తో ఉన్న అనుబంధం గురించి. అది గుర్తు వచ్చింది నాకు. చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర చనువెక్కువ నాకు. కానీ నేను కాలేజీ వయసుకు వచ్చాక ఇప్పుడు అప్పటిలా నేను అమ్మమ్మ వెంట తిరగడం లేదు. మా అమ్మమ్మ ఒకటి రెండు సార్లు ఈ కథలో అమ్మమ్మ లాగే ఎలా మరిచిపోయిందో చూడు అండం నాకు తెలుసు. అది గుర్తు వచ్చింది. 🙂
రి సైకిల్ గురించి Sowmya అభిప్రాయం:
10/13/2006 9:48 pm
చాలా బాగుందండి కథ. మంచి హాస్యం ఉంది.
ఇలాంటి మంచి కథలు ఇంకా ఎన్నో ప్రచురించమని ఈమాట వారికి నా విన్నపం
రైలు ప్రయాణం లో గురించి Sowmya అభిప్రాయం:
10/13/2006 9:35 pm
బావుందండీ. మీ వర్ణనలు చాలా బాగున్నాయి. మంచి చదివించే గుణం ఉంది ఈ కథలో. Keep writing.
లక్? గురించి Ramesh అభిప్రాయం:
10/12/2006 11:41 pm
Sorry, ఈ కధ లో రచయిత లో స్పష్టత లేదు.