Comment navigation


15578

« 1 ... 1554 1555 1556 1557 1558 »

  1. రాజనందన రాజ రాజాత్మజుల సాటి గురించి Ramanath గారి అభిప్రాయం:

    05/01/2006 10:49 am

    వేలూరి వారికి,
    భావ భవభోగ సత్కళా భావము కి వేరే మరొక అర్ధమున్నట్టు నాకు తోస్తున్నది.
    భావభవుడు అంటే మన్మధుడు. భావజుడని మీకు తెలిసే ఉంటుంది. భావజ
    మద సంహారి అని ఒక పాటలో కూడా ఉన్నది. భావభవ భోగ సత్కళా భావ
    ము అంటే మదన కళా భావమని చెప్పువచ్చేమో..
    రమానాథ

  2. ‘వ్యయ’ ప్రయాస గురించి kiran kumar chava గారి అభిప్రాయం:

    05/01/2006 10:30 am

    మారుతీరావు గారూ,

    ఈ మాటకు సు స్వాగతం

    మీరు ఇలాగే మరిన్ని కవితలు (లాంటివి?) ఇక్కడ ప్రచురించాలని ఆశిస్తున్నాను

    దన్యవాదములు
    కిరణ్ కుమార్ చావా (నామధేయః)

  3. తుది ప్రార్ధన గురించి kiran kumar chava గారి అభిప్రాయం:

    05/01/2006 10:26 am

    ఏమిటండీ లైలా గారు
    మరీ జనాలు అంతగనం ఇబ్బంది పెడుతున్నారా?

    ఓ ప్రభూ!
    నరకమైనా, స్వర్గమైనా
    భూమి అయినా పాతాళమయినా
    అడవి అయినా, జనారణ్యం అయినా
    ఎక్కడికైనా పంపు ఈ దేహాన్ని!
    కానీ,
    దానితో పాటు నీపై ప్రేమను పంపడం మరవకు సుమా

    ఓ ప్రభూ!
    కవితలు వ్రాయనీ, వ్రాయకపోనీ
    కథలు చెప్పనీ, చెప్పకపోనీ
    సంతానము ఇవ్వు, ఇవ్వకపో
    స్వర్ణము ఇవ్వు ఇవ్వకపో
    కానీ
    నీ ప్రేమను మాత్రము ఇవ్వు సుమా!
    ps: పేరడీలాగా వ్రాద్దాము అనుకున్నాను, కానీ ఇంకా చెయ్యి తిరగాలి 🙂

  4. నా మాట: చాటువు – పేరడీ గురించి kiran kumar chava గారి అభిప్రాయం:

    05/01/2006 10:20 am

    RSS FEED కూడా చాలా బాగుంది

  5. నా మాట: చాటువు – పేరడీ గురించి kiran kumar chava గారి అభిప్రాయం:

    05/01/2006 10:19 am

    మీ సైటు చాలా బాగుంది

    ఇలా ఏ వ్యాసానికి ఆవ్యాసం అభిప్రాయాలు వ్రాయడము చక్కని ఇంప్రూవుమెంటు

    ఇప్పుడు ఇది మరో రచ్చబండ అని జనాలు అనరేమో!

    పేరడీలు బాగానే ఉన్నది, కానీ ఇంకొన్ని ఉదాహరణలు ఇస్తే బాగుంది

    పేరడీలు అంటే నాకు కూడా ఓ చిన్న గీతలు గుర్తు వస్తుంది

    పోనీ పోనీ పోతే పోనీ
    కారుల్ బస్సుల్ జీపుల్
    రానీ రానీ వస్తే రానీ
    కోపాల, తాపాల మన హెడ్డుకి
    మనము మాత్రము క్లాసుకి ఎల్లప్పుడూ లెటే

    వంటివి నిజజీవితంలో చాలా విన్నాము వీటినన్నింటినీ గ్రంథస్థము చేయడము కష్టమేమో!

  6. కొత్త కథకుల కష్టాలు గురించి JUBV Prasad గారి అభిప్రాయం:

    05/01/2006 8:00 am

    అక్కిరాజు గారూ,
    ఒక చిన్న విషయం. మీరు ఇలా రాశారు: “ఉదాహరణకి, ఓ పరమ నాస్తికుడి కథ చెప్తున్నామను కుందాం. ఏదో ఓ సీన్ లో తొంభై ఏళ్ళ వాళ్ళమ్మ వాడికి ప్రసాదం పెడితే వాడు కళ్ళకద్దుకుని తిన్నట్టు రాసామనుకోండి. అప్పుడా పాత్ర చెడిపోయినట్టా? నా దృష్టిలో మాత్రం అలా చేయడం ద్వారా ఆ పాత్ర విలువ పెరుగుతుందే గాని తగ్గదు. జీవితపు చరమాంకంలో ఉన్న వాళ్ళమ్మకి అర్జంటుగా నాస్తికత్వాన్ని బోధిస్తే కథ సర్వ నాశనమయిపోతుంది. ”
    ఆ పాత్ర ఆ ప్రసాదం తీసుకోవడం తప్పుగా వుండదు గానీ, “కళ్ళ కద్దుకోవడం” మాత్రం తప్పుగా వుంటుందని నా అభిప్రాయం. పెద్దావిడ పెట్టింది తీసుకుని తినడం బాగానే వుంటుంది గానీ, “కళ్ళ కద్దుకుని” ఆ పెద్దావిడని సంతోషపెట్టాలనుకోవడం మాత్రం తెలివి తక్కువగా వుంటుంది. ఇక వాళ్ళమ్మకి అర్జంటుగా నాస్తికత్వం బోధించక్కరలేదు గానీ, ఆవిడకి ఇతను నాస్తికుడు అని మాత్రం తెలిసితీరాలి. అంతేకాకుండా, అప్పుడొ ముక్కా, ఇప్పుడో ముక్కా అంటూ తన భావాలని కూడా బయట పెడుతూ వుండాలి, ఆవిడ తన భావాలని తన ఆచరణతో బయటపెట్టినట్టు. ఎక్కడికక్కడ లొంగి పోతూ వుంటే, ఆ పాత్రకి విలువుండదు.

    ప్రసాద్

  7. బతుకు గురించి telugu గారి అభిప్రాయం:

    05/01/2006 7:24 am

    ఏవిటిది? స్వప్నించడాలూ, సుస్మితించడాలూ.. ఎందుకీ బలవంతపు ప్రయోగాలు?
    కలలు కనే కవి రాలిపోతాడు అంటే ఏ లోపము జరుగుతుంది?
    అప్పు తచ్చులు చూసుకోవాలి.. నటనానుభూతులు లో నతనానుబూతులు అని
    పడింది. నతన కి సర్దుకున్నా బూతులకి మాత్రము సర్దుకోడము కష్టంగా ఉన్నది.
    కవిత బాగానే ఉంది. బలవంతపు ప్రయోగ పదాలు తప్ప.

  8. ఎంగేజ్మెంట్ గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    05/01/2006 7:16 am

    విప్లవ గారికి
    గత కొంత కాలంగా మీరు రాసిన తెలుగు కథలకి “ఇంగ్లీషు” పేరు ( టైటిలు ) కనిపిస్తోంది. మీ కథలకి తెలుగు పేరు పెడితే బాగుంటుంది. చాలాకాలం క్రితం తెలుగు నాటిక పోటీలు పెట్టారు. గమ్మత్త యిన విషయం ఏమిటంటే, బహుమతి వచ్చిన నాట కాలు పేర్లు – తేరానాం – పేరెంట్ – స్ట్రీట్ లైఫు తెలుగు కథలకి హిందీ, ఇంగ్లీషు పేర్లు పెట్టడం ఎంత సమంజసం గా ఉంటుదో మీరే ఆలోచించుకోవచ్చు. మన భాషని కాపాడుకోవలసిన బాధ్యత మనదే, ముఖ్యంగా రచయితల దని నా నమ్మకం.
    -సాయి బ్రహ్మానందం గొర్తి

  9. గుర్రాలు – గుగ్గిళ్ళు గురించి పాఠకుడు గారి అభిప్రాయం:

    05/01/2006 6:46 am

    ఇట్లాంటిదే ఒక కథ ఆరి సీతారామయ్య గారు రాసినట్లు గుర్తు, కాకపోతే ఆయన కథలో మిరపదేశం లాంటివి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. స్థూలంగా చూస్తే రెండూ ఒకే టైపు అనిపించింది. దగ్గరగా చూస్తే కొద్ది తేడాలుండవచ్చు.

  10. నా మాట: చాటువు – పేరడీ గురించి Sudhakar గారి అభిప్రాయం:

    05/01/2006 5:07 am

    వేలూరి వెంకటేశ్వర రావు గారి పేరడీ చాలా బాగుంది. అవధులు దాటేదే ఆధునిక కవిత్వం అనిపిస్తాయి ఈ పేరడీలు. Modern paintings తో వీటిని పోల్చవచు నేమో ఈ పేరడీ ల ను.

« 1 ... 1554 1555 1556 1557 1558 »