పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. రెండు మౌనాల మధ్య గురించి రాకేశ్వర అభిప్రాయం:

    07/17/2007 10:46 pm

    అందరూ ఆడవారే వ్యాఖ్యానింస్తున్నారు, కాబట్టి మగవానిగా నేను ఒక వ్యాఖ్య రాద్దామని..

    బాగుంది బాగుంది.

  2. ఆ రోజులు గురించి C.S.Rao అభిప్రాయం:

    07/17/2007 7:32 pm

    రఘోత్తమరావు గారూ,
    కవితలో రవంత సంస్కృతం ఉన్నా ఇష్టపడని మీరు,మీరు వ్రాసిన మొదటి అభిప్రాయం లో “శ్రద్ధ” బదులు”పట్టించుకోవలసింది ” అనవచ్చుగా?మీ రెండవ అభిప్రాయం లో”బాదరాయణ సంబంధం” బదులు “ఈ రెంటికీ పోలికేమిటి” అనవచ్చుగా?
    తెలుగు, సంస్కృతం అందంగా పెనవేసికొని పోతే ,తెలుగు భాషలోని సరళమైన సంస్కృత పదాలని అంటరాని పదాలు గా చూడాలా?
    “ప్రాతఃకాలం” బదులు”తొలి పొద్దు” ,”కపోలాలు” బదులు “చెక్కిళ్ళు” అన్నప్పుడు మరొకరు “తెల్లారగట్ల” ,”చెంపలు” అనవచ్చుగా అని
    అడగవచ్చునేమో?
    నేనుదహరించిన కవితలలో కూడా ఇలానే ‘దైనందిన” బదులు “రోజువారీ””కోలాహలం” బదులు “సందడి” వగైరా అనవచ్చుగా?
    తన ఊహకు తగినట్ట్లుగా ఏ పదం వాడి ఎంత సౌందర్యం సాధించగలడో ,తన కవితావేశం పాఠకులకి అందించగలడో , కవిత వ్రాసే వ్యక్తి నిర్ణయించుకుంటాడు.
    పాఠకమహాశయులు తర్కించుకుంటారు,ఆస్వాదిస్తారు.
    పోతే,మాటలకు కొత్తదనం ఏముంటుంది?అవి అనాదిగా వస్తున్నవే.మాటల కూర్పులో ,లయబధ్ధమైన నడక లో,అవగాహనా మాధ్యమాలను వాడటం లో సొగసు,కొత్తదనం ఆవిర్భవిస్తవి.

    Middleton Murry గారి “Mode of Apprehension” కి “అవగాహనా మాధ్యమం” నా అనువాదం.ఇది”metaphor” కి ఆ గొప్పసాహితీ విమర్శకుని
    నిర్వచనం.

  3. ఆ రోజులు గురించి C.S.Rao అభిప్రాయం:

    07/17/2007 6:20 pm

    రవికిరణ్ గారూ,మీ అభిప్రాయం ద్వారా నాకు ఎన్నో సంవత్సరాలుగా సంబంధం ఉన్న ప్రాంతాల్ని ,వాటి ప్రకృతి సౌందర్యాన్ని,గలగల పారే పంట కాలువల్ని,సోయగంగా ఊగే వరి పొలాల్ని,చల్లగా వీచే గాలుల్ని మనసు ఆర్ద్రమయ్యేలా గుర్తు చేసారు.Thanks.
    మరేం లేదు,నా పేరు C.S.Rao

  4. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి raavi subbaa rao అభిప్రాయం:

    07/17/2007 1:42 pm

    నేనూ, జె యు బి వి ప్రసాద్ గారితో ఏకీభవిస్తాను. వేలూరి గారి వ్యాసం ఏమీ కొత్తగా చెప్పలేదు. ప్రసాద్ గారన్నట్లు కొంతమంది ఏం రాసినా మెచ్చుకుంటారు. మరికొంత మంది మారుపేర్లతో తమకు నచ్చినవి కక్కుతారు. వస్తువునీ, వ్య క్తులనీ వేరు వేరుగా చూడలేని కుహనా మనుష్యులకి ఒక్క తెలుగు భాషేం కర్మ, యావత్ ప్రపంచం తప్పుగానే అనిపిస్తుంది. తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలి? మన పిల్లల బొడ్డూడని వయసులో, వాళ్ళ్ ముందు పప్రంచం్ లో ఉన్న భాషలన్నీ ఉంచుదాం. వాళ్ళకి ఏ భాష నచ్చితే అది నేర్చుకుంటారు. ఈ ఐడియా బాగుంది.

    – రావి సుబ్బారావు

  5. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:

    07/17/2007 10:31 am

    వేలూరిగారూ,
    మీ సంపాదకీయం చదివాను. నాకు నచ్చింది. అందులో మీరు తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. అంతర్జాతీయ భాష గురించి కొన్ని చక్కటి ప్రశ్నలు వేశారు. భాషా దురభిమానాన్ని వ్యతిరేకించారు. ఇదంతా వుత్త రాజకీయం అని కూడా తేల్చారు. అంతా బాగుంది. అయితే నాకో ప్రశ్న. మనం మన ఈమాట ముందు పేజీలో, “ఇంటర్నెట్టులో తెలుగుకు మొదటి తరగతి పౌరసత్వం కావాలంటే యూనీకోడ్ వాడకం తప్పనిసరి అని మా నమ్మకం” అని రాసుకున్నాం కదా? యూనీకోడ్‌ని నేను కూడా ఇష్టపడతాను లెండి. కానీ ఈ “మొదటి తరగతి పౌరసత్వం” ఏమిటీ? కొన్ని భాషలకి “రెండవ తరగతి పౌరసత్వం”, ఇంకొన్ని భాషలకి “మూడవ తరగతి పౌరసత్వం” వున్నాయా? మొదటి తరవతి గొప్పదనుకుంటే, మూడవ తరగతి అధమం అనేగా అర్థం? భాషకి సంబంధించి ఈ పౌరసత్వ తరగతుల మీద వ్యతిరేకత మనకు లేదా? ఈ ఇంటర్నెట్టు తరగతి పౌరసత్వానికీ, అంతర్జాతీయ భాషకీ ఏదో రక్త సంబంధం కనబడుతోంది. తప్పంటారా?
    మీరు మీ సంపాదకీయంలో, “మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలు అల్లేశారు, వల్లించేశారు. అది కొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరి కొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది.” అని స్పష్టంగా తెలుగుని ప్రాచేన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. కొంత మందికి ఇది అర్థం కాక, మీ సంపాదకీయాన్ని మెచ్చుకుంటూ, సమర్థిస్తూ, “కనీసం ప్రాచీన భాషా ప్రపత్తే మనం సాధించుకోలేక పోయాం” అని వాపోయారు. మీ సంపాదకీయం ప్రకారం ఈ వివాదాలన్నీ వుత్త రాజకీయాలు మాత్రమే అయినప్పుడు, ఇలా వాపోవడంలో అర్థమే లేదు. తెలుగుకి “ప్రాచీన భాషా ప్రపత్తి” ఎందుకు సాధించుకోవాలి? ఆ ప్రపత్తి వల్ల బోలెడు డబ్బు శాంక్షను అవుతుంది. అందుకోసమేనా? మీ సంపాదకీయంలో ఈ డబ్బు సంగతి మీరెత్తలేదు గానీ, అటువంటి ప్రపత్తి గోలని మీరు వ్యతిరేకించారు. అది జనాలకి అర్థం కాకుండా పోయింది.
    భాషని ఒకరి మీద రుద్దడం ఏమిటీ? పాఠశాలల్లో హిందీని బలవంతంగా రుద్దినప్పుడు వ్యతిరేకించలేదా? “నిజంగా అన్ని రాజకీయ పక్షాలు తలుచుకుంటే, తెలుగు ప్రతీ స్కూలులోనూ తప్పని సరి (కనీసం పదవతరగతి వరకూ) అన్న జీ. వో రావడం అంత కష్టమైన విషయం కాదు” అంటూ తెలుగుని అందరి మిదా రుద్దడం ఎందుకు? ఒక రాష్ట్రంలో వేరే రాష్టాల నించీ వచ్చిన పిల్లలు ఎందరో వుంటారు. అంతేకాదు ఏ విషయమూ ఎవరిమీదా రుద్దకూడదు. వాళ్ళకిష్టం అయితే వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. లేకపోతే లేదు. “మాతృభాషలో విద్యాభోదన”లో వున్న మంచి విషయాలు తెలిస్తే నేర్చుకుంటారు. లేకపోతే లేదు. ఈ బలవంతంగా రుద్దడం అనే అభిప్రాయం మీరు మీ సంపాదకీయంలో ఎక్కడా రాయలేదు.
    భాషాభిమానం వుండొచ్చు గానీ, దురభిమానం వుండకూడదు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని గర్వంగా చెప్పుకోవడం మిగిలిన భాషలని కించపరచడమే.
    ఈ రకరకాల హోదాల వల్ల ధన ప్రాప్తి కూడా వుంటుంది మరి. ప్రాచీన భాష అనే ప్రపత్తి వల్ల అనేక లక్షల రూపాయలొస్తాయంట. వాటికోసం బోలెడు మంది తాపత్రయపడటం సహజమే మరి.
    ఇక రాజకీయనాయకుల సంగతి. మన లాంటి “మేధావులు” ఈ రాజకీయ నాయకులని ఎంత తక్కువగా చూస్తామో, వాళ్ళు కూడా మన లాంటి “మేధావుల్ని” అంతే తక్కువగా చూస్తారుట. ఓట్లు వేసి వాళ్ళని గెలిపించేదీ, వాళ్ళకి అధికారం కట్టపెట్టేదీ మన లాంటి వాళ్ళు కాదుట. అందుకే వారు మనలాంటి వారి ఘోష పట్టించుకోరుట. ఇలా అని తెలుగు సంస్కృతి కోసం ఒక తెలుగు సంస్థలో పని చేసే ఆయన అన్నారు. ఆయన మాటలు వింటుంటే, ఇదంతా కంఠ శోషన్న నిరుత్సాహం కలుగుతుంది. ఆయనే మళ్ళీ, “అరకొరగా చదువుకున్న వారిలోనే ఈ విభేదాలన్నీ, బాగా చదువుకున్న వారికిగ్గానీ, బొత్తిగా చదువుకోని వారికిగ్గానీ విభేదాలుండవు” అని అన్నారు. హతోస్మి అనుకోవాలి మరి.

    మొత్తానికి మీ సంపాదకీయంలో ఏ విషయం తేల్చకుండా వదిలేశారు. ఏం చెయ్యాలో స్పష్టంగా చెప్పలేదు. దాంతో కొంతమంది మీరు సంపాదకీయంలో బాధ పడిపోయారని, బాధ పడిపోయారు. ఒక్కో విషయం ఒక్కక్కరికి ఒకలాగా అర్థం అవడంలో ఆశ్చర్యమేమేమీ లేదు. ముందుగా మనమే భాషని సరిగా వుపయోగించుకోవాలీ అనిపిస్తుంది. దీర్ఘాలూ, ఒత్తులూ, కామాలూ, గట్రా లేని జనాలు రాసే తెలుగు చూస్తే నిరుత్సాహం కాక ఏం కలుగుతుందీ? ఒకరైతే ఏది కర్తో, ఏది కర్మో, ఏది క్రియో బొత్తిగా అర్థం కాని వాక్యాలు రాస్తారు. కొంతమంది అకర్మక క్రియలతో కర్మణి వాక్యాలు రాస్తారు. వాడుకలో లేని కర్మణి వాక్యాలు అప్పుడప్పుడు తెచ్చేసుకుని మురిసిపోతూ వుంటారు. ఇంకొకరైతే, మీరేం రాసినా, వాళ్ళకిష్టమైన అర్థం తీసేసుకుంటారు, మీరు రాసింది మెచ్చుకుంటూ. తెలుగు భాషలోనేనా ఇంత గందరగోళం అని అనిపిస్తుంది.

    ప్రసాద్

  6. Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Dr. Rajeshwar Mittapalli అభిప్రాయం:

    07/17/2007 9:47 am

    This is in response to Mr. CS Rao. The Adlerian theory of ‘Inferiority Complex’ has been frequently referred to in the article only to prove that it is, in the end, inadequate to explain the complexity of the protagonist Subbaiah. It requires much more than a fashionable western psychological theory to make sense of this character. He begins to appear real to us only when he is viewed against the backdrop of his culture, one that seems to be governed by a set of values that are detrimental to hyper-sensitive individuals like himself. He falls far too short of the expectations of this culture, hence the intensity of his suffering. The phrase “something very ‘Indian’” has been used in the article in this context and primarily to mean the ‘discontents,’ such as they are, of this culture. Ra.Vi.Sastri should be complimented for bravely pointing out these shortcomings through Subbaiah, even if he has lost his sympathy for him halfway through. Writers are the conscience keepers of society and they very often provide the necessary corrective when things are not the way they should be. Alpajeevi would mean a lot more when looked at from this angle.

  7. తడిచేతుల సముద్రం గురించి Raghothama Rao C అభిప్రాయం:

    07/17/2007 3:38 am

    చాలా బావుంది

  8. ఆ రోజులు గురించి కొత్త రవికిరణ్ అభిప్రాయం:

    07/17/2007 3:30 am

    భాస్కర్రావు గారూ, జాగర్లమూడి, అంగలకుదురు మధ్య ఊరకే అలా నడుచుకుంటూ వెళ్ళినంత ఆహ్లాదంగా ఉంది మీ కవిత

  9. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి mohan అభిప్రాయం:

    07/17/2007 3:13 am

    This poem ,by any standards, is one of the worst poems ever penned by late Sri Seshendra Sarma.

    It is surprising as to why, of all his great works, this was chosen.. Editor Knows!!
    M

  10. Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Dr Sonba M Salve అభిప్రాయం:

    07/17/2007 2:10 am

    This article is quite interesting as it shows one of the significant aspects of the bourgeois society of India. The style is simple and abundandantly clear. Dr Rajeshwar takes care of the international readesrship. Indeed, this article is creditable addition in his scholarly pursuits.