Comment navigation


15812

« 1 ... 45 46 47 48 49 ... 1582 »

  1. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 7 గురించి Ramesh గారి అభిప్రాయం:

    09/03/2024 12:16 am

    మీ travelogue కళ్ళకు కట్టినట్లుగా వుంది.

    ‘పదండి మీతోబాటు హోటలుదాకా వస్తాం’ అన్నదా జంట.

    ఇది చెబుతుంది మానవులంతా ప్రేమ జీవులని. దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వు గాక.

  2. పాముకాటుకి చెంపదెబ్బ? గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:

    09/02/2024 1:29 pm

    ఈమధ్య కాలంలో వచ్చిన ఒక సైన్సు వ్యాసంలో మూడునాలుగు రకాల పాముల విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాన్ని కనుగొన్నట్లు చదివాను. అది త్వరలో చవుకగా అందుబాటులోనికి వస్తే మనకు చాలా మేలు జరుగుతుంది.

    పాముకాటుకు చెంపదెబ్బ వైద్యం గురించి విన్నాను. మానాన్నగారు ఈపాముమంత్రం నేర్చుకొన్నారట. ఎవరన్నా ఈయన దగ్గరకు వచ్చి ఫలాని ఆసామిని పాముకరిచింది మంత్రం వేయండి మాష్టారూ అనగానే ఆవార్త తెచ్చినవాడిని వెంటనే ఫెడీమని చెంపదెబ్బ కొట్టేవారట. ఈమంత్రం వ్యవహారం మాతాతగారికి నచ్చక ఆమంత్రం వేయటం మానివేయమని అన్నారట. ఈ సంగతిని నాకు మాఅమ్మగారు చెప్పారు.

    మంత్రం వేసినా వేయకున్నా పాముకాటు తిన్నవారిలో చాలామందికి ప్రాణాపాయం తప్పవచ్చును. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది అది విషప్పురుగు కాకపోవచ్చును. రెండవది అది అప్పటికే మరొక జీవిని కొద్దిసేపటి క్రిందటే కాటువేసి ఉండటం వలన కోరల్లో విషం ఉండకపోవచ్చును. ఇంకా ఇతరకారణాలూ ఉండవచ్చును.

    కొందరిలో అరుదుగా పాముకాటును తట్టుకొనే శక్తి ఉండవచ్చును. అటువంటి వ్యక్తి ఒకడిని నేను స్వయంగా ఎరుగుదును. ధనయ్య అని కొత్తపేటలో పాలు సేకరించి అమ్ముకొనే వృత్తిలో ఉండేవా డతను.

  3. ఆమె ఇల్లు గురించి Ramesh గారి అభిప్రాయం:

    09/02/2024 12:50 pm

    ఎంత అద్భుతంగా వుంది కథ. గూటి కోసం జీవుల తపనని చాలా హృద్యంగా మనసుని తట్టి చెప్పింది. రచయితకు మరియు అనువాదకులకు ధన్యవాదాలు.

  4. నాన్న గొంతు గురించి Kiran గారి అభిప్రాయం:

    09/02/2024 11:28 am

    Wonderful story!

  5. ఆమె మొగుడు గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    09/02/2024 10:19 am

    @ప్రసాద్ ధన్యవాదాలు

    చాలా మంది వాళ్ళనడ్డంపెట్టుకునే బతుకుతారు.

    ఇది అక్షర సత్యం. వీళ్ళని వాడుకునేవాడు కూడా ఏమీ మొహమాటం లేకుండా వాడుకోవడం నేను గమనించాను. 🙂

    @శివకుమార్ శర్మ గారు
    మీరు చెప్పినది నిజమే. అంత చిన్న తప్పు నేను చూసుకోలేదు. ధన్యవాదాలు.

    సమర్ధించుకుంటున్నాడు అనుకోకండి కానీ, ముందు ఫోన్ చేసి అడిగితే అత్యవసర పరిస్థితుల్లో ఎటిఎం నుంచి ఇలా ఐదువేలు తీసుకోవడానికి బేంక్/క్రెడిట్ కార్డ్ వారు అనుమతిస్తారు. ఎటిఎంలో ఎక్కువ డబ్బు తీసుకోవడం కోసం బేంక్ కి ఫోన్ చేసాడు అని రాసి ఉండాల్సింది ముందు.

  6. శరీరంబుట్ట గురించి Rajendra Singh Baisthakur గారి అభిప్రాయం:

    09/02/2024 8:49 am

    కాల గమనాన్ని పుట్టిన రోజులతో కొలవడం బాగుంది.

  7. శరీరంబుట్ట గురించి డాక్టర్ బండి సత్యనారాయణ గారి అభిప్రాయం:

    09/01/2024 11:43 pm

    ఎప్పటికీ తేలని జీవన కొలమానాన్ని ‘అనుభూతి పద్ధతిలో’ కొలిచి చూపించారు. కవిగారికి శుభాకాంక్షలు.
    – డాక్టర్ బండి

  8. చదువు అనే ఆరోవేలు గురించి శ్రీహరి అక్కిరాజు గారి అభిప్రాయం:

    09/01/2024 8:32 pm

    ఎంత అందమైన జ్ఞాపకాలు ఇవి! చదువుతున్న కొద్దీ నా చిన్నతనపు ఙ్ఞాపకాలే తరుముకుంటూ వస్తున్నాయి. బజారుఘాటు లోని చిన్న గ్రంథాలయం, ఆబిడ్స్ ఫుట్ పాత్ పైని పాతపుస్తకాలు, నాంపల్లి గాంధిభవన్ స్కూలు కెళ్ళే దారిలో కొనుక్కున్న పల్లీవుండలు, ఇంకా ఎన్ని కతలో… అదో ప్రపంచం. అందులో విహరిస్తూ రోజులు గడిపేయొచ్చు.

    ఇంత చక్కని జ్ఞాపకాలను కురిపించినందుకు ధన్యవాదాలు అన్వర్.

  9. ఆమె మొగుడు గురించి Sivakumara Sarma గారి అభిప్రాయం:

    09/01/2024 7:01 pm

    రంధ్రాన్వేషణ అని అనచ్చు గానీ, “ఎటిఎమ్ దగ్గరికెళ్ళి అయిదువేలు కేష్ తీశాడు” అనేది సత్యదూరం అనిపించడానికి కారణం, నా అనుభవంలో రోజువారీ ఎటిఎం పరిమితి కొన్ని వందలు మాత్రమే.

  10. పాముకాటుకి చెంపదెబ్బ? గురించి రావు వేమూరి గారి అభిప్రాయం:

    09/01/2024 5:49 pm

    శర్మగారూ , చాలా ఉపయోగకరమైన అంతర్జాలపు లంకెలు ఇచ్చినందుకు ధన్యవాదాలు . ఎందువల్లనో ఇటీవల ఇంగ్లీషు పత్రికా ప్రపంచంలో కూడా పాము కాట్ల మీద పెక్కు వ్యాసాలు కనబడ్డాయి .

« 1 ... 45 46 47 48 49 ... 1582 »