Comment navigation


15812

« 1 ... 43 44 45 46 47 ... 1582 »

  1. నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి జొ. శైలజ గారి అభిప్రాయం:

    09/29/2024 10:17 pm

    మా అమ్మ, నాన్నగారు చదువుతుండేవారు ఈ పద్యాలు. ఎంత బాగుంటాయో.‌ ఏనాటి పుణ్యమో ఈ తెలుగు నేలపై జన్మించడం. భాగవతోతోత్తముడైన పోతనగారి పద్యాలు చదవగలగడం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు పద్యములు గుర్తు చేసుకుంటున్నందుకు.

  2. ఆమె మొగుడు గురించి sarma గారి అభిప్రాయం:

    09/29/2024 12:54 am

    ప్రతి తండ్రి కొడుకుని తిడతాడు, పనికిరానివాడివని, కొడుకు బాగుపడాలనే. ఏ తండ్రీ, కొడుకును పెద్దవాడైన తరవాత తిట్టడు, అందునా పెళ్ళయ్యాకా, కోడలు ఎదురుగా. ఇక రచయిత కథాకాలం నేటిదిగా అనిపించదు. నాటికాలంలో కొడుకుకు ఇష్టమైన చదువులు చదివించగల మధ్యతరగతి జీవులు లేరు. కథారచయిత పనికిరానివాడనే ముద్రను కథకోసమే పెద్దది చేసినట్టుంది. ఇక అతను చివరికి జీవితం నుంచి పిరికివాడిలా పారిపోయినట్టు రచయిత తేల్చారు.కథా ప్రయోజనం రచయితకే తెలియాలి.

  3. ఆమె మొగుడు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    09/28/2024 2:00 pm

    తిక్కపుట్టి తాను గడుపుతున్న జీవితం నుండి పారిపోవటం గురించిన కథ.

    నిజానికి నిత్యమూ ఎంతో మందికి ఎన్నో కారణాలవలన తాము గడుపుతున్న జీవితాల నుండి పారిపోవాలన్న గాఢమైన సంకల్పం అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఐతే ఆసంకల్పం ఎంత తీవ్రంగా కలిగినా దానిలో చెప్పుకోదగినంత స్థిరత్వం కుదరక వారు పారిపోకుండా అవేజీవితాల్లో పడుంటున్నారు. ఆకోణంలో జరిగితే చదువరుల్లో కొందరైనా ఈచేతకాని వెధవ తమకంటే కొంచెం నయంగానే ప్రవర్తించి చివరకు తెగించి జీవితాన్నుండి పారిపోయాడు భలే అని ముచ్చటపడతారు. అదలా ఉంచితే పారిపోవటం అనేది ఎన్నటికీ నాయకలక్షణం కాదూ కాలేదూ కాబట్టి పారిపోయిన ఇతగాడి మీద చివరకు ఎక్కువమంది జాలిచూపుతారే కాని ఇతగాణ్ణి మాత్రం స్ఫూర్తిగా తీసుకొనే సాహసం చేయరు లెండి.

    నిజం చెప్పాలంటే నేను మీరు నిజంగానే మీకథనాయకుడికి హఠాత్తుగా నాయకలక్షణాలు ప్రసాదించి తిరస్కరణలను తిరస్కరించి నిలబడే సమున్నతుణ్ణి చేసిపారేస్తారేమో కథాంతంలో అని దురాశపడ్డాను. అలాచేస్తే మరీ సాదాసీదా కథ ఐపోతుందీ రొటీన్ ముగింపు ఐపోతుందీ అనుకున్నారు కాని ఇలాంటి వాడు హీరో ఐపోవటం రొటీన్ కాదు కదా అని ఆలోచించారు కాదు కదా.

    పోనీయండి.
    ఒక జీవితం మనం కోరుకున్నట్లు సాగాలని లేదు.
    ఒక కథ మనం అనుకున్నట్లు ఉండాలని లేదు.

    మీ అసమర్ధుడి జీవితయాత్ర ఇలా ముగిసినందుకు అతగాడికి నాసానుభూతిని తెలియజేయండి మీకు ఎక్కడన్నా ఎప్పుడన్నా తారసపడితే!

  4. ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి B Srinivasa Rao గారి అభిప్రాయం:

    09/22/2024 1:18 pm

    నిజంగా ఔరంగ జేబు, ఒక మత చాందస వాది అయినప్పటికీ, ఆ సమయాల్లో గురువు గారికి ఉత్తరం రాయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక చక్రవర్తి కుమారుడికి ఏమి నేర్పాలి అనే విషయం (పరిపాలన, చారిత్రక,భౌగోళిక,ఆర్థిక అంశాలు) గురువుకి తెలియాలి… Letterతో వదిలి వేయబడినాడు… గురువు అని గౌరవంతో, కానీ ఒక చక్రవర్తి ఏమైనా చెయ్యవచ్చు…

  5. నడిరేయి గురించి విజయ్ గారి అభిప్రాయం:

    09/19/2024 12:49 pm

    ధన్యవాదాలు

  6. నాన్న గొంతు గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:

    09/18/2024 4:59 am

    ఎంత మంది కోసుకోవాలో గదా. సనాతనంగా జీర్ణించుకుపోయిన మాట చాలా కుటుంబాల్లో. చాలా బాగుంది కథ.

  7. మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి సాయికిరణ్ పామంజి గారి అభిప్రాయం:

    09/17/2024 11:43 am

    యాత్రలన్నా, యాత్రా సాహిత్యమన్నా నాకు చాలా ఇష్టం. తెలుగులో చాలామంది యాత్రారచనలు చేస్తున్నారు. కానీ దాసరి అమరేంద్ర గారు రాస్తున్నారంటే చదువుతుంటే కలిగే అనుభూతే వేరు. చదవడం మొదలు పెట్టడమే గానీ ఆపడం మనచేతిలో ఉండదు. ముగింపు వస్తే తప్ప. ఈయన పాపులర్ రచయితగా మారుంటే ఒక యండమూరిలా ఉండేవాడేమో. ప్రపంచం మీద నిజమైన మమకారం ఉంటే తప్ప ఇలా తిరగడం, ఇలా రాయడం సాధ్యం కాదు.

    నిమ్మగడ్డ శేషగిరి గారి మొరాకో శోధనలతో మొదలుపెట్టాను. ఇక్కడిదాక వచ్చాను. శేషగిరిగారి సోలో యాత్రలు సజీవ యాత్రలు. ఆ ప్రాంతాలు తిరగలేని మాలా‍ం‍టివారికి ఆ ప్రదేశాలన్నీ కళ్ళముందు కనిపిస్తున్నాయి. ప్రతిదానిలోను పాజిటివిటీ చూసే శేషగిరి గారి వ్యక్తిత్వం ఈ యాత్రానుభవాల్లో విశేషంగా ఆకర్షిస్తుంది. అంతేగాకుండా భౌగోళిక సమాచారం ఇవ్వడంలో కూడా ఇవి ఎంతో విలువైన రచనలు.

    నిజమైన యాత్రికులయిన మీ ఇద్దరి నుండీ ఇంకా ఎన్నో రచనలు వస్తే అవి తెలుగు సాహిత్యంలో ఒక భాగంగా ఉండి ఎందరినో అలరిస్తాయి.

    మీకు నమస్కారాలు. ధన్యవాదాలు.

  8. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి రమేశ్ బాబు గారి అభిప్రాయం:

    09/16/2024 2:55 pm

    వ్యాసం చాలా బాగుంది. ఇంత క్లిష్ఠమైన కావ్యాన్ని చాలా సులభం చేశారు. ధన్యవాదములు.

  9. చదువు అనే ఆరోవేలు గురించి Suprasanna Penna గారి అభిప్రాయం:

    09/14/2024 12:24 pm

    అందమైన జ్ఞాపకాలు. అన్నీ ఙ్ఞాపకాలే. Down the memory lane; Thank you so much for bringing all the memories.

  10. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3 గురించి Lakshmi Narasimha Rao Sista గారి అభిప్రాయం:

    09/10/2024 1:08 pm

    చాలా పరిశోధనాత్మకమైన, మంచి వ్యాసం. చక్కగా ఉంది. ఆలోచింపచేశే వ్యాసం.

    గణపతి: అంతు చిక్కని వింత దేవుడు- 2 & 3 భాగాలు దొరికాయి. మొదటి భాగం దొరకలేదు.

    [మొదటి భాగం – సెప్టెంబర్ 2017; నాలుగవ భాగం – డిసెంబర్ 2017; ఐదవ భాగం – అక్టోబర్ 2018 – సం. ]

« 1 ... 43 44 45 46 47 ... 1582 »