Comment navigation


15790

« 1 ... 1566 1567 1568 1569 1570 ... 1579 »

  1. నౌషాద్‌ గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    07/02/2006 12:06 pm

    చాలా బాగుంది. రోహిణీ ప్రసాదు సంగీతం మీద రాసిన వ్యాసాలన్నీ అలా మరెవ్వరూ రాయలేరనిపించే విధంగా తనదైన ముద్రని వేసి రాస్తున్నారు. ఇది ముదావహం.

  2. తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ… గురించి K. Vardhani గారి అభిప్రాయం:

    07/02/2006 9:58 am

    I was so pleased to read the editorial. Telugu chair is not only important for teaching the languange but it will tremendously be helpful for our future generations. Since India is becoming a global business center, exposing the language and culture to non telugu speaking people is also crucial, especially for doctors, public health professionals, business people who visit Andhra Predesh . Even American professionals will get a better feel about Telugu culture and a little understaning of our language. It is about time the national Telugu organizations should take the lead.

  3. కోపం గురించి K. Vardhani గారి అభిప్రాయం:

    07/02/2006 9:20 am

    నిడుదవోలు మాలతిగారి “కోపం” కథ చదివాను. ఈ కథ మాలతిగారి పాత కథల స్థాయిలో లేదు. ఈ కథలో నాకు అర్థంకాని విషయాలు చాలా ఉన్నాయి.

    1. జోగిబాబుకీ, జీనీకీ, బిష్ కి ఉన్న బాంధవ్యం ఏమిటో బోధపడలేదు.
    2. కాంతం కి ఇండియన్ల మీద అనవసరపు bias ఉన్నట్టు కనిపించింది
    3. రాధలాంటి వాళ్ళు తెలుగుదేశంలో చాలా అరుదు. సాధారణంగా మనవాళ్ళు ప్రతి చిన్న విషయం పట్టించుకొని అపార్థం చేసుకుంటారు.
    4. కాంతం తనంత తానే గుంటూరు వెళ్ళలేక పోవడం, హైదరాబాద్ నుండి తమ్ముడిని పిలవకపోవడం వింతగా ఉంది. కాంతం దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నదే కదా!

    I regret to say that the editors have not excercised their options properly!

    Vardhani.

  4. నౌషాద్‌ గురించి Lakshmanna vishnubhotla గారి అభిప్రాయం:

    07/02/2006 5:41 am

    అద్భుతంగా రాసారు ఈ వ్యాసాన్ని రోహిణీ ప్రసాద్ గారు. బహుశా తెలుగులో నౌషాద్ గురించి ఇంత వివరంగా రాయగలవారు ఇంకెవరూ వుండరేమో. నౌషాద్ సంగీతపు సాధికారత్వాన్ని ప్రసాద్ గారు చక్కగా విశ్లేషించారు. (ర)సాలూరు రాజేశ్వరరావుతో పోలికలు చక్కగా ఉన్నాయి. రఫీతో పాడించిన పహాడీ రాగంలోని “సుహానీ రాత్ ఢల్ చుకీ .. ” విన్నప్పుడల్లా తెలుగులో “ఆరాధన” సినిమాలో సాలూరు వారు సుశీలతో పాడించిన “నీ చెలిమి నేడె కోరితిని..” అన్న పాట గుర్తొస్తుంది. ఇది కూడా పహాడీ రాగంలోనే కట్టారు సాలూరి వారు.

    మంగళంపల్లి బాలమురళి & భీమ్ సేన్ జోషీ మొదటి జుగల్ బందీ 1982 సంవత్సరంలో (?) బొంబాయిలో షన్ముఖానంద ఆడిటోరియంలో జరిగినపుడు. ప్రసాద్ గారితో పక్కనే నడుస్తున్న నేను, నౌషాద్ ని చూసాను! ప్రసాద్ గారు నౌసాద్ ని చూసి, “సంగీత సామ్రాట్టుకి నమస్కారం” అని విష్ చేస్తే, నౌసాద్ సిగ్గుతో తల వంచుకొని ఒక చిరునవ్వుతో సమాధానం ఇచ్చి వెళ్ళిపోటం నాకు బాగా గుర్తు!

    నౌషాద్ మరణంతో సంగీత ప్రియులు ఒక గొప్ప జీనియస్ ని కోల్పోయారు.

    నా కోరిక మేరకు, ఈమాట సంపాదక వర్గం అనుమతితో, అడగ్గానే ఇంత మంచి వ్యాసం రాసిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

  5. గేటెడ్ కమ్యూనిటీ గురించి bandla madhava rao గారి అభిప్రాయం:

    07/01/2006 10:04 pm

    కధ చాలా బాగా వచ్చింది. కధ నిర్మాణం బాగుంది. సరికొత్త వర్గ విబేధాల్ని చూపించారు. కాకపొతె అర్జున్ పాత్ర టికెట్ కోసం చేసే గొడవ లో కారణం అంత బాగా అనిపించలేదు.
    బండ్ల మాధవరావు
    త్రివేణి టాలెంట్ స్కూల్
    అల్వాల్
    సికింద్రాబాద్ – 10
    ఫోన్ – 98661 82378

  6. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    07/01/2006 12:26 pm

    చాలా మంచి వ్యాసం. రచయితకు అభినందనలు.

  7. ఈమాట కొత్త వేషం గురించి Nagaraja గారి అభిప్రాయం:

    06/24/2006 7:08 am

    సురేష్ గారికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఎంతో దీక్షతో మాత్రమే ఇటువంటివి సాధించగలము అని నా అభిప్రాయము.
    అదే విధంగా మీరు తయారు చేసిన టెక్నాలజీ ఇతరులకు అందుబాటులో వుంచడము వలన మిగతా వారికి కూడా తెలుగు సైట్లు తయారు చేయుటకు ప్రోత్సాహము కలిగించినట్లవును. ఈ విషయమై మీరు ఆలోచించగలరు. అందుకు కావలసిన సహాయము అందచేయడానికి నేను సిద్ధముగా వున్నాను.

  8. అరణ్య కవితలు గురించి reader గారి అభిప్రాయం:

    06/21/2006 11:12 pm

    tender love poems..beautiful expression. wow.

  9. బతుకు గురించి Raghuram గారి అభిప్రాయం:

    06/21/2006 3:19 am

    అద్భుతంగా వుంది. చాలా బాగా నచ్చింది.

  10. గుర్రాలు – గుగ్గిళ్ళు గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    06/20/2006 4:29 am

    ఆరి సీతారామయ్యగారి “ప్రగతి ప్రభ” నిన్ననే చదివాను. ఈ కథకు వేలూరి గారి కథకు పోలికలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. సైనిక తిరుగుబాట్లు, ప్రజా ప్రభుత్వాలు, గ్లోబలైజేషన్, ప్రపంచ బ్యాంకుల రుణాలు, కంజ్యూమరిజం సాధనాలుగా ఒక సంపన్న దేశం మిగిలిన ప్రపంచ దేశాలపై ఎలా ఆధిపత్యాన్ని సాధించిందో చెప్పడం 12 పేజీలుగా సాగే “ప్రగతి ప్రభ” లక్ష్యం. భూషయ్యను Operation Iraqi Liberation (OIL) అంటూ యుద్ధం చేసిన ప్రెసిడెంట్ బుష్ తోనూ, భుజా విజృంభణం చేసి భూమిని చాపలా చుట్టిన హిరణ్యాక్షుడి తోనూ పోలుస్తూ ఉభయాన్వయంగా సాగే విలక్షణ కథ వేలూరి గారిది.

    నేటి పాలకులని పూర్వకాలపు రాజులుగా చిత్రిస్తూ వ్యంగ్య రచనలు చేయటం కొకు నుండి చాలామంది వాడుకున్న పాత టెక్నిక్. అంతమాత్రం చేత ఆ కథలన్నీ ఒకే కథకు కాపీ అని చెప్పడం అన్యాయమేమో?

    రిగార్డులతో
    సురేశ్.
    కొ.మె.: 1946 లో పుట్టి మాటలు సరిగ్గా పలకలేని ఆ యాక్టర్ కిట్టిగాడు కాదు. బండోడు, తొలి నెత్తురు మొదలైన సినిమాలతో ప్రపంచాన్ని వాయగొట్టి, 10 సార్లు నటభీకర అవార్డును, 20వ శతాబ్దపు నటదారుణ అవార్డును కూడా గెలుచుకొన్న ఈ ఘనుడి పుట్టిన రోజు, చినబూషయ్య పుట్టిన రోజు ఒకటే!

« 1 ... 1566 1567 1568 1569 1570 ... 1579 »