Comment navigation


15790

« 1 ... 1565 1566 1567 1568 1569 ... 1579 »

  1. సందుక గురించి vtp గారి అభిప్రాయం:

    07/03/2006 4:06 pm

    అన్నా, గీ కైతల్ మస్తుగ రాసినవన్న. కాని జరంత పొడూగున్నయ్.గదిగిట్ట తక్వజేసి, గీ సదివెటోల్లు ఆలోచించనీకి ఏమన్న ఇడిసిపెడితె ఇంక మస్తుగుండు.నా సందూకను అర్రను యాదికిజేసి నా దిల్ కుష్ జేసినవ్.

  2. ఓ పెన్నీ, నా పెన్నీ! గురించి V. R. Veluri గారి అభిప్రాయం:

    07/03/2006 12:40 pm

    డు, ము, వు, లు ప్రథమా విభక్తి అని చదువుకున్న గుర్తు. చూశారా! “ము” ముందు, “లు” తర్వాత! అందుకే, వేమూరి వేంకటేశ్వర రావు గారు ముందు; ఆయన తరువాతే, నేను!
    ఎంతమంది ఈసడించుకున్నా ఈమాట ఉద్యోగం నేను జలగలా పట్టుకొని ఎందుకు వదలనంటే, — ప్రచురణ కొచ్చిన అన్ని కథలూ, కవితలూ, వ్యాసాలూ (శాపనార్థాలు కూడా!) అందరికన్నా ముందుగా చదివే అవకాశం ఉన్నది కనుక! వేమూరి గారు మాకు రాసినంతకాలం, నన్ను “సంపాదకులు” (అబ్బ! ఇక్కడా “ము” తరువాతే!) గా తీసెయ్యాలంటే, నామీద విశ్వాస రాహిత్య తీర్మానం పెట్టవలసి రావచ్చు.
    మీ పెన్నీ కథ ఎప్పుడో చదివాను. ఈ క్రింది వివరాలు నాకు క్రిందటినెలే దొరికుంటే మీకు పంపేవాణ్ణే! మీరు పెన్నీకథని ఇంకా రసవత్తరం చేసి వుండేవారు.

    * Today it takes 1.2 pennies to mint one penny.
    * Gallop poll has shown that two thirds of the Americans want to retain the penny, for its historical ‘value.’
    * The idea of “penniless” society began to gain currency in the Congress in 1989. (Ever since, they are striving hard to make our society penniless!)
    * 58% of the Americans stash pennies! (For the first time, you and I are in the majority!)
    * A penny of the 1972 vintage was sold for $437,000! ( I don’t have one; do you? )
    * Edmond Knowles of Alabama hoarded pennies for over 4 decades as a hobby! He ended up with 1.3 million of them, weighing 4.5 tons and his bank refused to take them all at once!
    * There is a pro-penny lobby called American for Common Cents! (Both of us should join right away!)

    The information is from Jeff Donn, Associated Press News Release, July 3, 2006!

    And finally, I really enjoyed your article, as usual!

    వేలూరి వేంకటేశ్వర రావు

  3. ప్రాచీన తెలుగు కొలమానం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    07/03/2006 10:45 am

    ఈ వ్యాసంలో విలువైన సమాచారం చాలా ఉంది. మన దేశంలో క్రీ.పూ.6500 ప్రాంతాల నుంచీ వ్యవసాయం మొదలైందని అంటారు. క్రీ.పూ. నాలుగో శతాబ్దంలోనే భూమి విస్తీర్ణతా, పొలాల మీద వచ్చే దిగుబడీ, వాటికి కట్టవలసిన ప్రభుత్వ శిస్తు లెక్కలూ అనీ ఖచ్చితంగా పాటించేవారని తెలుస్తోంది. అందుచేత కొలమానపు పద్ధతులన్నీ ఎప్పటినుంచో అమలులో ఉన్నాయన్న విషయం ఆశ్చర్యకరం కాదు. ఎటొచ్చీ ఇంత వివరంగా వీటి గురించి మనవంటివారికి తెలియజెప్పే వ్యాసాలు అరుదైనవి. రచయితకు ప్రత్యేక అభినందనలు.

  4. మా ఈజిప్ట్ యాత్ర గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    07/03/2006 9:34 am

    మంచి వ్యాసం. ఇంకా వివరంగా రాయగలిగి రచయిత సంకోచించినట్టుగా అనిపించింది.
    1989లో నేను అమెరికాకు మొదటిసారి వచ్చి తిరిగివెళుతూ కైరోలో స్టాపోవర్ తీసుకోవడం, బొంబాయికి సీటు దొరక్క అనుకున్న రెండురోజులకు బదులుగా కైరోలో 9 రోజులు గడపవలిసిరావడం, అన్నీ గుర్తొచ్చాయి.
    అప్పట్లో తీవ్రవాద సమస్య ఉండేదికాదు. పిరమిడ్లను దర్శించడం లక్ష్మన్నగారు చెప్పినట్టు వర్ణనాతీతమైన అనుభవం. కానీ అక్కడి ముస్లిం మతస్థులకు ప్రాచీన “పేగన్” మతమంటే నిర్లక్ష్య భావన ఉన్నట్టుగా అనిపించింది. ప్రాచీన గ్రీకులకే అతి ప్రాచీనమని అనిపించిన పిరమిడ్లను గురించి లక్ష్మన్న రాసినది అక్షరాలా నిజం. రెండో రామిసెస్ సరిగ్గా ఋగ్వేద కాలపువాడు. టెన్ కమాండ్ మెంట్స్ మోసెస్ కథ అప్పటిదే. అప్పటికే ఈజిప్ట్ నాగరికత 2 వేల ఏళ్ళనాటిది. అదంతా తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. తహరీర్ స్క్వేర్ లో మ్యూజియం చాలా బాగుంటుంది. నేను వెళ్ళినప్పుడు టుటన్ ఖామున్ ని చూడనివ్వలేదు. ఆనాటి స్మృతులని మళ్ళీ గుర్తుచేసినందుకు లక్ష్మన్నగారికి ధన్యవాదాలు.
    వివిధ ప్రాంతాలని సందర్శించడం దృక్పథాన్ని విశాలతరం చేస్తుందనడంలో సందేహం లేదు. ఆయన ఫ్రాన్స్ దేశపు అనుభవాలని అమెరికాతో సరిపోలుస్తూ నాకు కొన్ని విషయాలు చెప్పారు. వాటిని కూడా ఆయన పత్రికాముఖంగా వివరిస్తే అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో ఉన్న తెలుగువారికి ఆసక్తికరంగా ఉంటుందని నా ఉద్దేశం.
    ఇలాంటి రచనలవల్ల అస్తమానం ఒకేరకమైన విషయాలతో మొహం మొత్తించకుండా ఈమాటవంటి పత్రికలకు కాస్త అంతర్జాతీయ వైఖరి అబ్బుతుందేమో. ఫోటోలూ, వీలుంటే శబ్ద విశేషాలతో “ఈ” పత్రికలు తమ ప్రత్యేకతను చాటవచ్చు.

  5. ప్రాచీన తెలుగు కొలమానం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    07/03/2006 8:34 am

    నాగార్జున ఇటువంటి వ్యాసాలని ఇంకా రాయాలని కోరుతున్నాను. మన భాష పరిపుష్టం కావాలంటే మన రాతలు ఒక్క కథలకీ, కవితలకీ పరిమితం కాకుండా ఇలా అనేక రంగాలలో అంశాలని తీసుకుని రాయాలి. అప్పుడే పాతబడ్డ మాటలని తిరిగి పలుకుబడిలోకి తీసుకురావచ్చు. కొత్త కొత్త మాటలని పుట్టించనూ వచ్చు.

  6. మా ఈజిప్ట్ యాత్ర గురించి satya rao గారి అభిప్రాయం:

    07/03/2006 6:39 am

    Lakshmana garu,
    thanks for a very informative article. Very well narrated. It can certainly serve as a travel guide for some one iterested in visiting thes places. Keep up the good work.

  7. తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ… గురించి సుధాకర్ గారి అభిప్రాయం:

    07/03/2006 2:15 am

    ఈ మాట తెలుగు యూనికోడ్ లో చాలా బాగుంది. కృతజ్ఞతలు.

  8. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    07/02/2006 11:31 pm

    ఆణిముత్యం

  9. ప్రాచీన తెలుగు కొలమానం గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    07/02/2006 11:10 pm

    Great Essay.

    Perfect essay/essays for Telugu Wikipedia. Can you also take the pain to put this in Telugu wiki? Probably u can add in section తెలుగుదనం.

  10. రాచపుండు గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    07/02/2006 11:00 pm

    స్యానా బాగుంది

« 1 ... 1565 1566 1567 1568 1569 ... 1579 »