Comment navigation


15792

« 1 ... 1564 1565 1566 1567 1568 ... 1580 »

  1. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    07/06/2006 6:12 pm

    పొరబాటు సరిచేసినందుకు సాహితిగారికి కృతజ్ఞతలు. భాషావేత్త గురించిన వ్యాసం కాబట్టి మరికాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకొని రాయాలి అని గుర్తున్నా, తప్పులు దొర్లాయి. ప్రత్యేకంగా ఆయన “ఒత్తక్షరాలను (మహాప్రాణాలను) రాయటంలో ఎంతో జాగ్రత్త అవసరం,” చదువుకోని వారి వాడుకలో ఈ భేదం లేదుగాని, చదువుకున్నవారు ఈ భేదం గుర్తించాలని, కాస్త వాత గూడా పెట్టారు. ఉదాహరణలు ఇచ్చారు: అర్థం, అర్ధం; శోధ, శోథ; పలం, ఫలం; గాతం, ఘాతం; కరం, ఖరం.

    చదివి highlight చేసుకున్నాను గాని రాసేటప్పుడు జాగ్రత్త పడలేదు!

    కొడవళ్ళ హనుమంతరావు

  2. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి sahiti గారి అభిప్రాయం:

    07/06/2006 12:02 pm

    చాలా బాగుంది.బూదరాజు గారి మీద ఉన్న అభిమానానికి మరిన్ని అలంకారాలు వచ్చి చేరాయి. “విలేఖరులు” (నాకు తెలిసి “విలేకరులు” అని బూదరాజు గారే అన్నారు) .. చిన్న ఇబ్బంది.

    వ్యాస కర్త కి కృతజ్ణతలు (ఇది ఇంకెలా రాయాలో తెలీలేదు మన్నించాలి)

  3. నౌషాద్‌ గురించి Mr. D.A.Eswar గారి అభిప్రాయం:

    07/05/2006 8:38 pm

    రాగాల చేత “అందంగా చాకిరీ చేయించి అద్బుతమైన సంగితాన్ని మనకిచిన నౌషాద్ గారి గురించి మనకు తెలియని interesting విషయాలు , పదాలతొ అందంగా చాకిరీ చెయించి రొహినిప్రసాద్ గరూ మంచి వ్యాసం ఇచ్చారు.
    After reading this article, I feel more respect for Sri Naushad.
    Thanks to Prasadgaru & Eemaata for this very good essay and also for the rare photographs of ‘the great people’..

  4. వెల్ల గురించి వాతాపి గారి అభిప్రాయం:

    07/05/2006 11:50 am

    మంచి కవిత. చక్కని భావం.
    చైతన్యం చల్లగా ఉండడం మాత్రం బాగోలేదు. పరికించి చూస్తే కవిత మొదటి తొమ్మిది లైన్లలో పూర్తయింది. మిగిలినదంతా అనవసరం. అలాగే, వెల్ల అన్నపదం కోట్స్ లో పెట్టటం కూడా అనవసరం.

  5. కోపం గురించి Prasad Charasala గారి అభిప్రాయం:

    07/05/2006 11:07 am

    నాకు ఈ కథలో చెప్పదలచుకొన్నదేమిటో అర్థం కాలేదు. చివరికంటా కూడా చదవలేక పోఆను. చదివివుంటే అర్థం అయ్యెదేమొ!!
    __ ప్రసాద్

  6. గేటెడ్ కమ్యూనిటీ గురించి Prasad Charasala గారి అభిప్రాయం:

    07/05/2006 10:38 am

    చాలా చక్కగా ఉంది. ఎవరికి వారు గిరి గీసుకొని బందెల్దొడ్డిలో బర్రెల్లా జీవిస్తూ ఎవరి స్తోమతుకు తగ్గట్లు వాల్లు గేట్లు, వాచ్ మన్ లూ …
    రెండు వర్గాల దృక్కోణాన్నీ రచయిత చాలా బాగా చూపించారు.
    __ ప్రసాద్

  7. గ్రేడింగ్ అమ్మలు గురించి Abhi గారి అభిప్రాయం:

    07/04/2006 8:45 pm

    well written article 🙂 మొదటి వాక్యం చూస్తే చలం యోగ్యతా పత్రం గుర్తువచ్చినది.

  8. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి Abhi గారి అభిప్రాయం:

    07/04/2006 4:18 pm

    చాలా చాలా బాగుంది :).మరిన్ని వ్యాసాలు మీనుంచి ఆశిస్తూ..

  9. నౌషాద్‌ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    07/04/2006 9:52 am

    తండ్రిని మించిన తనయుడు

    సంగీతం గురించి కనీసపు జ్ఞానం లేకపోయినా నేను రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు చదవడానికి కారణం వారి నిరాడంబర భాషా, శైలీ, క్లిష్టమైన విషయాలను విడమరచి సులభంగా చెప్పే నేర్పూ.

    నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇతర రాష్ట్రాలకన్నా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా వున్నా కూడా సంగీతంలో ప్రవేశం మనవాళ్ళకంటే వేరే రాష్ట్రాలవాళ్ళకే ఎక్కువున్నట్లనిపించేది. ముఖ్యంగా మనప్రక్కవాళ్ళే అయిన తమిళయన్లలో, ప్రతివాళ్ళూ గాత్రమో వాయిద్యమో చిన్నప్పుడే నేర్చుకునేవాళ్ళని విన్నాను. మనవాళ్ళకి ట్యూషన్లు, కోచింగ్లతో సంగీతానికి సమయం మిగులుతున్నట్లు లేదు. (పల్లెటూళ్ళలో, చిన్న పట్టణాలలో, రెండు మూడేళ్ళకోసారి వెళ్ళి పదిరోజులుండి చూసి ఏర్పరచుకున్న అభిప్రాయమిది; వాస్తవం కాకపోవచ్చు.)

    చిన్నప్పుడే, 3-7 ఏళ్ళ మధ్య ప్రతిబిడ్డకూ ఏదో ఒక కళమీద గురి కుదురుతుందనీ, ఆ అభినివేశం పెద్దయ్యాక ఏర్పడటం దాదాపు అసంభవమనీ, చిన్నప్పుడే తగిన వాతావరణం కలిగించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకుందనీ కొకు రాశాడు. పాటల్లోపడితే చదువులు పాడవుతాయని తల్లిదండ్రులకి సహజమైన భయం వుండొచ్చుగాని, దానికి కాస్త మందలింపు సరిపోవచ్చు:

    “మా ప్రసాద్ సితార్ తో చదువు పాడు చేసుకోవటం నాకంతగా ఇష్టం లేదు. వాడు పరీక్షలప్పుడు కూడా relax కావటానికి ఓ అరగంట వాయించుకుంటే నేను అభ్యంతరం చెప్పను. కాని social functions లో వాయిస్తే ఇక mind చదువుమీదికి పోదు. ఆమధ్య వాడి స్నేహితులు చిన్న పార్టీ ఏర్పాటు చేసి వాడి చేత రెండున్నర గంటలు సితారు వాయింపించారట. అందులో వున్న ప్రమాదం వాడికీ తెలుసు. అందుకని దాని జోలికిపోక చదువుకోమని రాశాను. డిసెంబరు సెలవుల్లో నెలరోజులూ సితారే వాయిస్తాడు. summer holidays అంతా వాడికి మరోపని వుండదు. వాడికి వ్యక్తిత్వం లేకపోవటమేమిటి? సైన్సులోనూ, సంగీతంలోనూ నాకు వాడు చాలా విషయాలు చెప్పగలడు. నాకున్న వ్యసనాలు కూడా ఆరెండే. అందుచేత వాటిలో నన్ను ఇప్పటికే మించి ముందుకు వెళ్ళాడు.”
    — కృష్ణాబాయికి 11-11-1968 న కొకు రాసిన ఉత్తరం నుండి.

    కొడవళ్ళ హనుమంతరావు

  10. ఈమాట కొత్త వేషం గురించి Malathi గారి అభిప్రాయం:

    07/04/2006 6:49 am

    After opening the file, the screen keeps moving on, slightly different from the problem JUBV Prasad mentioned earlier. I could not stop the page to read. This does not happen with other Telugu sites I have visited.
    I am also curious about unicode. I am using the Unicode, which came with Windows (called Gautami). Your Unicode seem to have a different keyboard.
    I tried your link to Aksharamala, and it returned error msg.
    Otherwise, the site is wonderful. I am particularly glad to see the editorial by Veluri Venkateswara Rao. Very timely appeal.

    Appreciate your help.

« 1 ... 1564 1565 1566 1567 1568 ... 1580 »